నా జీవనయానంలో (ఆత్మ కథ )-66 జ్ఞానోదయం– కె. వరలక్ష్మి

“ ఇంకా లైటు వెలుగుతోంది , మేలుకునే ఉన్నట్టున్నారు , పాపాయిని కాస్సేపు ఎత్తుకుని వెళ్దాం “ అని వచ్చేరట . తిన్నగా నేనున్నా చోటికి వచ్చి నా స్థితిని చూసేరు . అప్పటికే నాకు వికారం , స్పృహ కోల్పోయే స్థితి మొదలైంది .” మోహన్రావు ఇంకా రాలేదా ?” అంటూనే సెంటర్లోకి పరుగెత్తి రిక్షా పిల్చుకొచ్చేరు. దారిలో పాపాయిని మా అమ్మకు ఇచ్చేసి నన్ను డా. జయ గారి హాస్పటల్ లో చేర్పించారు . రోజూ రాత్రి భోజనాల తర్వాత శాంత […]

Read more

నేనెందుకు రాస్తున్నాను?! -మానస ఎండ్లూరి

                                 ‘కథలు ఎందుకు రాస్తున్నాను?’ అనే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ‘ఎందుకు చదువుతున్నాను’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలి. మనకు తెలియని భిన్నమైన జీవిత పార్శ్వాలను తెలుసుకోవడం కోసం, కొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా ఆ కథా వాతావరణంలో ఉండడం కోసం, ఆ కథా పాత్రల్లో లీనమవడం కోసం చదువుతుంటాం. నేనూ అందుకే చదువుతుంటాను.             […]

Read more

వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు కొనుక్కొచ్చేరు . నేనదే మొదటి సారి చెస్ చూడడం . అందరికీ ఆ ఆట గురించి వివరించి ఇద్దరిద్దరికి ఒక పోటీ లాగ పెట్టేరు . సగం […]

Read more

ఒసామా – శివ లక్ష్మి

Director: Siddiq Barmak Country: Afghanistan, Ireland, Japan Language: Dari Farsi with English Subtitles. Duration: 84 minutes Age Group: Above 13 years. ఇతివృత్తం : అమానుషమైన స్త్రీ అణచివేత అమలవుతున్న దేశంలో ఒక బాలిక, బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబాన్ పాలన లోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలనచిత్ర సారాంశం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో […]

Read more

“ పొడిచే పొద్దు”లో కతలన్నీ కరిగిన వేళ

రచయిత్రిగా ఇప్పటి వరకు వందకు పైగా కథలు , అనేక వ్యాసాలూ రాసిన కన్నెగంటి అనసూయ . ఇప్పటి కాలంలో విరివిరిగా రచనలు చేస్తున్న రచయిత్రి . రెండు కథా సంపుటాలు , బాలల కథా సంపుటి , మరొక కథా సంపుటి ప్రచురణలో ఉన్నాయి . సాహిత్యంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న రచయిత్రి ఆమె . “ పొడిచే పొద్దు” ఆమె రెండవ కథా సంపుటి . ఈ కథా సంపుటిలో మొత్తం 13 కథలున్నాయి . మొదటి కథ “ […]

Read more

ఓయినం

మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది. ”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు […]

Read more

ఓయినం

నేను సెయ్యబోతున్నది గూడా గదే జెర నా ఎన్క ఉషారుగుండు ఏడా తేడా రావద్దు పో పోయి రాజుగాని పిల్సుకురా” అన్నాడు. ఎల్లయ్య సేన్లల్లకెని అడ్డంపడిపోయి రాజుని పిల్చుకొచ్చాడు. ”ఏంది పెద్దనాయినా పిల్సినవంటా” అంటూ రాజు వస్తూనే అడిగేసరికి ”ఓరి రాజు మీ కల్లం గియ్యాలనే అయిపోయినట్లుంది” అన్నాడు. ”ఔనే గియ్యాలనే ఒడ్లన్ని యింట్ల ఏసినం ఇగ రేపటినుంచి గడ్డి కట్టుడుంటది” అన్నాడు. ”ఏం లేదురా మా కల్లంల గూడా గియ్యాలనే పనైంది నెల రోజులనుండి పనిసేసి సేసి పెయ్యంతా పులిసినట్లైందిరా గందుకని నువ్వు […]

Read more

మంచిమాట-మంచిబాట

పోయిన నెల సి.ఉమాదేవి గారి పుస్తకాలు ఆరు అవిష్కరించబడ్డాయి అని చెప్పుకున్నాము. వాటిల్లో, కేర్ టేకర్, మటే మంత్రము,సాగర కెరటం గురించి పరిచయం చేసాను. ఈ నెల మిగిలిన మూడు పుస్తకాలను పరిచయం చేస్తాను.అందులో మొదటగా “మంచి మాట-మంచిబాట” గురించి. . . . రెండు విభిన్న కుటుంబాలకు చెందిన యువతీ , యువకులు వివాహబంధంతో ఒకటవుతారు.అప్పటి వరకూ విడి విడిగా ఉద్యోగాలు చేసుకుంటూ తమ తమ జీతాలను ఖర్చు పెట్టుకున్నవారు ఒకేసారిగా ఉమ్మడిగా ఖర్చు చేసుకునేందుకు సిద్దంగా వుండరు.నీకు , నీ స్నేహితులకు […]

Read more

జోగిని

లెక్క మంచిగ మాటాడరు. మంచిగ సూడరు. ఏందేందో అంటరు” కొంత గారాబం పోతున్నట్లు కొంత బాధను దిగమింగుకొని అడిగినట్లు ఉంది ఆమె అడిగిన తీరు. ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది విద్యకి, కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు చూస్తే జాలేసింది విద్యకి. కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు ఆమెను పని మనిషిగా మారుస్తారనడంలో సందేహం లేదు. అయినా వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, ఊర్కొంటారా…? తనకి ఉద్యోగం వస్తే, అప్పుడు తీసుకెళ్ళవచ్చు. చదువు చెప్పించవచ్చు అనుకొంది […]

Read more

మా అమ్మమ్మ గారిల్లు

             మా అమ్మమ్మగారిది కాకినాడ ,జగన్నాధపురం. గొల్లపేటలో ఇల్లు . తాటాకిళ్లు ,పెంకుటిళ్లు పోయి డాబా లొచ్చాయి తప్ప ఆ సందు అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది . ఇంటి బైట గేదెలు ,పేడ ,రొచ్చు . కారులో గాని ,ఆటోలో గాని వెళ్తే వీధి చివర దిగిపోయి నడచి వెళ్ళాల్సిందే. ఆ సందు లోంచి రోడ్డు మీదికొచ్చి ఎడం వైపు చూస్తే చారిటీస్ స్కూలు భవనం కనబడుతుండేది . అది హైస్కూలని నా కప్పటికి తెలీదు అలాంటి స్కూల్లో పెద్ద పెద్ద […]

Read more
1 2