జ్ఞాపకాలు – 7(ఆత్మ కథ )- కె.వరలక్ష్మి

కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది . నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని . పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని . ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని . ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు తనకి వచ్చిందని , సెలవుల నాటికి వేరే ఇల్లు […]

Read more

జ్ఞాపకాలు -5(ఆత్మ కథ )- కె.వరలక్ష్మి

అది 1977 వ సంవత్సరం , ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిభ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి . ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను , మగ పిల్లలకి తీసుకొను ‘ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు . 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది . ఆ డబ్బుల కోసం , పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు . నేను స్కూలు ప్రారంభించి నాలుగేళ్లు […]

Read more

జ్ఞాపకాలు 4(ఆత్మ కథ )- కె .వరలక్ష్మి

M .A తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను . ఎందుకంటె ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి . 1.విజయ విలాసము, 2.సారంగధర చరిత్రము . చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను . ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు . నాకేమో మోహన్ కూడా పి.జి చేసి హెడ్ మాస్టరో , లెక్చరరో అయితే బావుండునని ఉండేది . బుక్స్ కొనేస్తే తానే చదువుతాడులే అని ఒక ఆశ […]

Read more

జ్ఞాపకాలు – 3(ఆత్మ కథ )_కె.వరలక్ష్మి

ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు . వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది . వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా “ అని అడిగేడు .నేనా విషయం మోహన్ తో చెప్పి ,’చేరదామా ‘ అని అడిగేను . ”శాంత , రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి . నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు “ అన్నాడు . లయన్స్ సభలు సాధారణంగా ఆది […]

Read more

జ్ఞాపకాలు – 1- నా ఇంటర్మీడియట్ చదువు – కె. వరలక్ష్మి

అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది . స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది . స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక . మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో గర్ల్స్ హైస్కూల్ ఉండేది . హిందీ పరీక్షలు అక్కడ జరుగుతూండేవి […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ )-67 మళ్లీ కలుద్దాం – కె. వరలక్ష్మి

ఆ సాయంకాలం హైస్కూల్లో నాకు పాఠాలు చెప్పిన హిందీ టీచర్ విమలాదేవి గారింటికి వెళ్లేను . ఎప్పుడూ ఆవిడ దగ్గర హిందీ పరీక్షలకి అటెండయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు . నాక్కూడా ట్యూషన్ చెప్పమని అడిగేను . ఆవిడ ఇది వరకటి సమాధానమే చెప్పేరు . “ నువ్వు ప్రాధమిక మాధ్యమిక రాయక్కర్లేదు . డైరెక్ట్ గా రాష్ట్ర భాషకు వెళ్ళొచ్చు . నీకు ట్యూషన్ అక్కర్లేదు . నువ్వే చదివేసుకోగలవు . నీకు కావాల్సిన బుక్స్ నేనిస్తాలే . పరీక్షకి ఫీజు […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ )-66 జ్ఞానోదయం– కె. వరలక్ష్మి

“ ఇంకా లైటు వెలుగుతోంది , మేలుకునే ఉన్నట్టున్నారు , పాపాయిని కాస్సేపు ఎత్తుకుని వెళ్దాం “ అని వచ్చేరట . తిన్నగా నేనున్నా చోటికి వచ్చి నా స్థితిని చూసేరు . అప్పటికే నాకు వికారం , స్పృహ కోల్పోయే స్థితి మొదలైంది .” మోహన్రావు ఇంకా రాలేదా ?” అంటూనే సెంటర్లోకి పరుగెత్తి రిక్షా పిల్చుకొచ్చేరు. దారిలో పాపాయిని మా అమ్మకు ఇచ్చేసి నన్ను డా. జయ గారి హాస్పటల్ లో చేర్పించారు . రోజూ రాత్రి భోజనాల తర్వాత శాంత […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ )-62- తిరిగి జగ్గంపేటకి – కె. వరలక్ష్మి

అక్కడ సాధారణంగా పాలేర్లు, పని వాళ్ళు లేదా ఇంటి మగవాళ్ళు నీళ్ళు తోడుకొచ్చేవారు. మా ఇంట్లో ఉన్న చిన్న ఇత్తడి కూజా బిందెతో నడుమున పెట్టుకుని నేను నీళ్ళు తెచ్చుకునేదాన్ని. ఆ రోజు మిట్టమధ్యాహ్నం వంట అయ్యాక నీళ్లకి బయలుదేరాను. నూతి దగ్గర ఎవరైనా ఉంటే నీళ్ళు తోడి పొసేవారు. ఎవరూ లేరు. వేవిళ్ల వికారం, తిండి తినని నీరసం కలిసి గొప్ప ఇరిటేషన్ వచ్చేసింది. ఎలాగో నీళ్ళు నింపుకుని నడక మొదలుపెట్టాను. సగం దూరం వచ్చాక కుడివైపు కాలవమీద సన్నని సిమెంటు వంతెన […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ )- 61.. బాలయోగి సందర్శనం – కె వరలక్ష్మి

బట్టలు మార్చుకుంటున్న మోహన్ కాలుతో ఫట్ మని నా మొహం మీద తన్నాడు. బాబు బిత్తరపోయి నవ్వు ఆపేసి కెవ్వుమని ఏడుపు మొదలు పెట్టాడు. మోహన్ కి ఉద్యోగం వచ్చాక నా జీవితంలో గొప్ప మార్పేదో వస్తుందని నేను కన్న కలలు నిజాలు కావని నాకర్థమైంది. ఏ విషయంలోనూ అతన్నెదిరించడానికి గానీ, పోట్లాడ్డానికి గానీ, నాకు ఓపిక ఉండేది కాదు. సంసారాన్ని వీధిలో పెట్టుకోకూడదనే పిచ్చి నమ్మకం ఒకటి, తోడూ నీడా లేని ఒంటరితనం అన్పించేది. నాకు ప్రియమైన నేస్తాలు పుస్తకాలు ఎక్కడా దొరికేవి […]

Read more

నా జీవన యానంలో(ఆత్మ కథ ) … కోనసీమలో-60 – కె .వరలక్ష్మి

అక్కడ మా మావగారు పైకి అంటున్నారు. ఇక్కడ ఎవరూ అనడం లేదు. పైగా బాబు మీద అమితమైన ప్రేమను కురిపిస్తున్నారు. అయినా నన్ను ఏదో ఒక గిల్టీ కుదిపేస్తోంది. ‘మీరెలాగూ విజయవాడలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నారు కదా! మనం అక్కడికి వెళ్ళిపోదామండీ’ అన్నాను మోహన్ తో. ‘ప్రస్తుతం ఆ ఉద్యోగం కూడా ఊడిపోయినట్లే’ అన్నాడు మోహన్. ‘అదేంటి?’ అన్నాను నేను ఆశ్చర్యంగా. నా గొంతులోంచి ఆ పదం ఒక కేకలాగా బయటికి వచ్చింది. ‘అయినా బావగారు (విజయభర్త) నాకేం జీతం బత్తెం ఇవ్వడం […]

Read more
1 2 3 4