“ పొడిచే పొద్దు”లో కతలన్నీ కరిగిన వేళ

1545078_410237195745711_621320810_nరచయిత్రిగా ఇప్పటి వరకు వందకు పైగా కథలు , అనేక వ్యాసాలూ రాసిన కన్నెగంటి అనసూయ . ఇప్పటి కాలంలో విరివిరిగా రచనలు చేస్తున్న రచయిత్రి . రెండు కథా సంపుటాలు , బాలల కథా సంపుటి , మరొక కథా సంపుటి ప్రచురణలో ఉన్నాయి . సాహిత్యంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న రచయిత్రి ఆమె .

“ పొడిచే పొద్దు” ఆమె రెండవ కథా సంపుటి . ఈ కథా సంపుటిలో మొత్తం 13 కథలున్నాయి . మొదటి కథ “ పొడిచే పొద్దు “ లో సుబ్బు పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది . వాడి వయసుకి పుస్తకాలతో బడికి వెళ్లవలిసిన వాడు , తెల్లవారక ముందే భుజాన సంచి వేసుకుని కూరగాయలు ఏరుకుని , వాటిని అమ్మి వచ్చే డబ్బుతో అక్క జబ్బు నయం చేయించాలని ఆరాట పడుతుంటాడు . కూరగాయలను చవకగా తీసుకుని వాడి కష్టాన్ని దోచుకుంటుంది పోశవ్వ . మరి సుబ్బు పోశవ్వ బారి నుండి తప్పించుకోగలిగాడ , తన అక్క జబ్బును నయం చేయగలిగాడ అనేది కథ చదివి తెసుకుకోవాల్సిందే . సుబ్బు పాత్ర బడుగు వర్గాల జీవితానికి ప్రతీకగా కన్పిస్తుంది .

మధ్యతరగతి కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే కాని సంసారం నడవని రోజులివి . ఇల్లును చక్కదిద్దుకుంటూ , బయట వ్యాపారం చేసే గృహిణి గౌరీ . ఆమె డబ్బుతో జల్సా చేసే భర్త , తనకి సహాయం చేయడానికి మాత్రం నామోసిగా భావిస్తాడు . కొద్దిపాటి వ్యత్యాసం ఉన్న పని మనిషి లక్ష్మిదీ కూడా ఇదే సమస్య . లక్ష్మి చూపిన చొరవ కూడా గౌరీ చేయలేకపోతుంది . చివరకి విసిగిపోయిన గౌరీ ఏ లాంటి “ నిర్ణయం “ తీసుకుందో అనేదే ఈ కథ ఇతివృత్తం .విశ్వం ,పార్వతి భార్యాభర్తలు . చేతనైనంతలో ఇతరులకు సాయం చేసే మనస్తత్వం పార్వతిది . మన దారి మనది . ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వ్యక్తిత్వం విశ్వానిది . పైగా భార్య కి కొన్ని హద్దులు ఉండాలి అనే ఆలోచన ధోరణి కలావాడు కూడా. భార్య చేసే చిన్ని చిన్ని సహాయాలను భూతద్దంలో ఆలోచిస్తూ భార్యకీ , తనకి కూడా మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్న విశ్వంతో ఎలా జీవించాలో అనేది పార్వతి” కర్తవ్యం”గా మారుతుంది . అది ఏమిటో అనేదే ఈ కథలో ని విషయం .

“ మార్పు మంచిదే కాని ” కథలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఎంతో మంది ఉద్యోగులకి సాక్ష్యంగా నిలుస్తాడు భుజంగం . స్వార్ధం , అవినీతితో నిండిపోయిన రాజకీయ నేతల మనస్తత్వాలకు ఈ కథ అడ్డం పడుతుంది . ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న భుజంగం , తరవాత రాజకీయ నాయకుడిగా మారాలనుకోవడానికి కారణం ఏమిటి ? దాని కోసం భుజంగం ఎలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టాడు . చివరకి తన కోరిక నెరవేరిందా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే . బయట మనకు నిత్యం కూరగాయల బజార్లులో కన్పించే సంఘటనే అయినా ఆలోచింపజేసే విధంగా కథనం సాగుతుంది . విజయ , కరుణల మధ్య సాగే ఈ సంభాషణల్లోకి సుదీర్ రావాడానికి కారణం ఏమిటి ? “ ఎదుటి వాళ్ల గురించి కూడా కొంచెం” అన్నది ఎవరికి వర్తిస్తుంది అనేదే కథ . అలాగే సమాజంలో నిత్యం జరుగుతున్న సమస్యలకు , కన్పిస్తున్న హృదయ విదారక దృశ్యాల సమాహారమే ” చిక్కుముడి “ .

తన వైపు నుంచి మాత్రమే ఆలోచించి , అసలు జరిగిన విషయం ఏమిటి అనేదానిని తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయని సగటు మనిషి కథే “ నిజాయితీ “ . ఆలస్యంగా తెలుసుకున్న ఆ తప్పుని సరిద్దుకునే అతి కొద్ది మంది మనుషులకి నీరజ పాత్ర ఆదర్శంగా నిలుస్తుంది . అసలు జరిగిన కథ ఏమిటో . నిజాయితిలో ఏం తెలిందో కథ చదవాల్సిందే .

మధ్యతరగతి బ్రతుకుల్లో కనిపించే తాగుడు . దానికి బానిసై వారి బ్రతుకుల్నే కాదు , కుటుంబాన్ని కూడా ఏవిధంగా కష్టాలపాలు చేస్తున్నారో “కతలన్నికరిగిన వేళలో” …. చెబుతాయి . అలాంటి ఇళ్ళల్లో స్త్రీలు పడే మనో వేదన , అవస్థలకు , కుటుంబాన్ని పోషిం చుకోవదాని పడే పాట్లుకు రంగి పాత్రే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది . చిన్నపిల్లలకి ఇంట్లో సరదాగా అలవాటైన చిన్ని చిన్ని విషయాలు , వాళ్లని బడిలో చేరాక అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది బంధం కథలోని ఇతివృత్తం . అలాగే ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే ఏ విధంగా ఉంటుంది . అమ్మమ్మ , నాయనమ్మల ఆప్యాయతలు , వారి ప్రేమలు , వాళ్ల పనుల తాలుకు అర్ధాలు శీతాంశుముఖి , కనిపించే దేవుడు కథలో మనసును తాకుతాయి . వీధి బాలల దైన్య స్థితి , వాళ్లు పడే అవస్థాల్ని చెప్పడం వర్ణనాతీతం . అటువంటి వాటికి మరొక అనాధ పిల్లలే చేయూత , అండ అనేది కనుచూపు మేర కథ నిజం చేస్తుంది .

ఈ సంపుటిలో చిన్న పిల్లల మనస్తత్వాలకి , వాళ్ల చుట్టూ నడిచే కథలున్నాయి . మొదటి కథ “ పొడిచే పొద్దు “ లో ‘సుబ్బు’ జీవన స్థితి . కనిపించే దేవుడు కథలో ’బుల్లి’ అయినా , కనుచూపు మేరలో ‘పోరిగాడు’ , బంధంలో ‘సాకేత్’ భిన్న కోణాల్లో చిన్న పిల్లల పరిస్థితుల్ని , వాళ్ల పెరుగుతున్న ఆర్ధిక ,సాంఘిక వ్యత్యాసాలను విభిన్నంగా ఆవిష్కరించారు . సంపుటిలోని కథలన్నీ మనకు ప్రతి నిత్యం ఎదురయ్యే సంఘటనల సమాహారమే. ఈ కథలను బట్టి రచయిత్రి సమాజంపై గల దృష్టి , పరిశీలన ఎటువంటివో తెలుస్తాయి .

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to “ పొడిచే పొద్దు”లో కతలన్నీ కరిగిన వేళ

  1. Sammeta Umadevi says:

    ప్రాణ మిత్ర పేరు చాలా బాగున్నది .. ఇక మనం హేమ గారికి ఇదే .. బిరుదు శాశ్వతం .. చేద్దాం ..
    పోతే సమీక్ష కు ఇంకొంచెం పరిశీలన అవసరమేమో అనిపించింది .. కథ చదివి తెలుసు కోవాల్సిందే.. లాంటిమాటలు కాకా కథ కథలో రచయిత్రి శైలి ఆమె ఎన్నుకున్న కథాంశాలు .. ఎత్తుగడలు , ముగింపులు..మానవీయ కోణాలు సామాజికాంశాలు వీటి గురించి మరి కొంత ముచ్చటించాల్సింది అనిపించింది …

  2. కన్నెగంటి అనసూయ says:

    నా “పొడిచే పొద్దు ” కదల సంకలనం మీద చక్కటి సమీక్ష వ్రాసిన అరసి గారికి ధన్యవాదములు. అందుకు కారకులైన నా ప్రాణమిత్ర , పత్రిక సంపాదకులు శ్రీమతి పుట్ల హేమలత గారికి ధన్యవాదములు..