సహచరీ….(కవిత)- అనువాదం సుధా మురళి

పద…..
ఎల్లలు లేని నేల ఒడ్డుకు చేరుదాం
మోహపారవశ్యమయ వశులమై
ఒకరికొకరంగా
కలిసి సాగుతూ
ఒకరికోసం ఒకరుగా మరణాన్ని జయిస్తూ
అక్కడే జీవిద్దాం

నీలాల నీకళ్ళ మెరుపును
పోలిన సూరీడు
అక్కడి ఆ పొగమంచుపై ప్రకాశిస్తూ వున్నాడు
నాలో రహస్తంత్రులకు ప్రేరణనిస్తూ

అక్కడంతా
సుఖం సంతోషం
అందం శాంతి
ఇంకా చెప్పనలవి కాని భోగం

మనకోసం
ఏళ్ళకేళ్ళుగా తీర్చిదిద్దుకున్న నగిషీల పరదాలు దాటుకుని
రహస్య మంతనాలు జరిపే
శయన మందిర మెరుపులు
పరిమళాల మత్తులో మనల్ని ముంచేసే
అరుదైన పువ్వులు
చమక్కు పైకప్పులు
నిర్మల నిలువుటద్ద దర్పాలు
ముత్యపు శోభలు

అక్కడంతా
సుఖం సంతోషం
అందం శాంతి
ఇంకా చెప్పనలవి కాని భోగం

నీ ఆశలను మదిలో నింపుకున్నట్టు
సాగుతున్న
ఆ నదీ పాయల అంతర్వాహ అలజడి
దిగంతాలు దాటి
పయనిస్తున్నట్టున్న వాటి సాహసోపేత యాత్ర

పడమటి దిక్కుకు వాలుతున్న పొద్దు సాక్షిగా
నిగనిగ లాడుతున్న
చేలగట్లు
పిల్ల కాలువలు
ఆ మెత్తం ప్రదేశం
కెంజాయ మెరుపులో కాంతులీనుతుంటే
ఆ వెచ్చటి వెలుతురులో…
ఈ ప్రపంచం నిద్రకు ఉపక్రమిస్తూ వుంది

అక్కడంతా
సుఖం సంతోషం
అందం శాంతి
ఇంకా చెప్పనలవి కాని భోగం

 

( English translation of Baudelaire’s poem “Mon enfant, ma soeur” )

Invitation to the Voyage కు నా స్వేచ్ఛానువాదం

 

-అనువాదం
సుధా మురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో