మమకారం (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు

బస్టాండ్ లో దిగగానే
ఎదురు చూసే గుర్రపు బండి కాన రాలేదు
గుర్రమూ లేదు బండి తోలే బక్కోడూ లేడని
తెలిసింది ఆటో కాటుకి

నేలపై
అడుగిడగానే
వీధుల్లో పరచబడిన నాపరాళ్ళు
చుర్రుమంటుంటే అలవాటు తప్పిన పాదాలు
వడివడి గా పడుతున్నాయి

వీధుల్లో మార్పు లేదు
జనాల్లో మార్పు లేదు
అవే నల్ల రేగళ్ళు
అలాగే నీళ్ళు లేక మేఘాల వైపు
ఆశగా నోళ్ళు తెరుచుకుని చూస్తున్నాయి

ఊరి తూర్పున చివర ఊడల మర్రి
కడగండ్లకు తాళలేక ఎండిపోయి
నేలకూలిన తీరు
కళ్ళల్లో నీళ్ళు మెదిలాయి
ఊడల ఉయ్యాల ఊగుతుంటే
చెట్టుకింద దిగిన రామయ్య బాబాయి ముంజల గంప
సేదతీర్చిన యాది మనసుల్లో

దక్షిణాన వాగులో
పారే నీరు లేక జమ్ము కయ్యలు కానరాలేదు
తీయని నీళ్ళందించిన వాగు
కాలుష్యాన్ని భరిస్తూ దీనంగా పలవరిస్తుంది

ఊరి చుట్టూ
నాపరాయి గనులు
ఉత్తరాది మార్బుల్ దెబ్బకి
వైభవాన్ని కోల్పోయి గుంతలతో
వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి

అక్షరం అందరినీ చేరక
అవే పాత కక్షల పాఠ్య పుస్తకాలు
వాడల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయింకా!

చేల గట్ల మీది రేగుచెట్ల కొమ్మలు గీసుకుంటున్నా
ముళ్ళు గుచ్చుకుంటున్నా రేగుపండు కోసం
ఇంకా నా చేతులు ముందుకి పోతూనే వున్నాయి !

నేల మీది గుమ్మడి పాదు
రారమ్మంటుంటే ఎప్పుడో తిన్న గుమ్మడి బెల్లం కూరతో
ఆరగించిన జొన్న రొట్టెలు మదిలో మెదిలాయి!

సజ్జ జొన్నలు వరిగలు శనగలు ధనియాల పంటలు
ఈడేరిన నేల
పత్తి మిర్చి వాణిజ్య పంటల హోరులో
చేవ చచ్చి మొక్క పెరగట్లే కాత కాయట్లే
సొగసైన పెట్టుబడి ఇంపుగా నేలనే కబళించే

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో