‘తార’తమ్యం (వచన కవిత) – కళాథర్ పరుచూరు

చదువులు ఉద్యోగాలు బాధ్యతలతో
చిరాకుపడే అతని నిస్సారమైన జీవితంలో
ఓ సినీతార దర్శనమిచ్చింది
ఆమె  సౌందర్యం
అతని గుండెలపై భారమయ్యింది
ఆమె  సోయగం
అతని ఊహలకి మధ్యబిందువయ్యింది
అతడామెని ఆరాధించాడు
సుఖంలో అలసి సుషుప్తి చెందాడు

                ***
మెలకువ వచ్చి చూసేసరికి
అతని చుట్టూ సమాజం,గౌరవం
వార్దక్యపు వేదికను కట్టి ఉంచాయి
ఇప్పుడు ఆమెనే సంప్రదాయమనే మైకులో
ఛీకొట్టాడు లీలగా గుర్తొస్తే లెంపలేసుకున్నాడు
వెరసి ఒకానొక రోజున
ఆ తార మరలా తారసపడింది
ఆమె అభినయంలో
శృంగారం కాదు వెటకారం కనబడింది
అతను భావచిత్రంలో
ఆమెని ముక్కలుగా చింపి పారేసి వెళ్ళిపోయాడు
:
:
ఐతే
ముక్కలన్నీ
కాలాన్ని ఓ ప్రశ్నవేశాయి
తేడా ఆమె నటన లో ఉందా?
లేక అతని నయనంలో ఉందా??

– కళాథర్ పరుచూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో