తెలుగు సాహిత్యానికి , స్త్రీలకి, స్త్రీ ల మనోభావాలకీ అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే.
మనువు నుంచి మన కాలపు కంప్యూటర్ యుగం దాకా ఎన్నో మార్పులొచ్చాయి. భవిష్యత్తులో ఇంకా వస్తాయి.
ఏ మార్పయినా కాలానికి అనుగుణంగానూ ,సమాజానికి అనుకూలంగానూ వుండాలి.
మనువు స్త్రీలను శాసించినట్టు శాసిస్తే ఇప్పుడెవరూ ఒప్పుకోరు.ఏ జీవికైనా స్వేచ్ఛ అవసరం.
అది దేహానికి, మెదడు కి,మనసుకి,భావజాలానికి సంబంధించి వుంటుంది.
‘విహంగ’ ప్రధాన ఉద్దేశం స్త్రీల స్వాతంత్ర్య భావాల అభివ్యక్తుల్ని ఆదరించటం ,గౌరవించటం.
ఇది మన పత్రిక.మన సమస్యలకి ,ఉద్యమాలకి , హక్కులకి వేదిక .
‘విహంగ’ కుల, మత ,వర్గ,లింగ,దేశ, ఖండాలకు అతీతమైంది.
– పుట్ల హేమలత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to సంపాదకీయం