* ‘విహంగ’ మీ రచనలకి ఆహ్వానం పలుకుతోంది. చక్కని శైలితో ,కొత్తదనంతో,విశాల భావాలతో ,
మహిళల మానసిక వికాసానికి,మహిళల సమస్యలపై…వివిధ సాహిత్య ప్రక్రియలపై… రచనలను మీరు మాకు
పంపవచ్చు.
* కథ, కవిత ,గేయం ,వ్యాసం,పాటలు, సమీక్షలు ,కార్టూన్లు,జోక్స్,వింతలు-విశేషాలు,పజిల్స్, జనరల్నాలెడ్జ్,
మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.కొత్తగా రాసేవారికి ప్రోత్సాహం వుంటుంది.
పురుషుల కోసం ప్రత్యేకం:
‘విహంగ’ ప్రారంభ సంచిక నుంచీ పత్రికని ఆదరిస్తున్న అందరికీ కృతఙ్ఞతలు.
ఈ పత్రిక ప్రధానంగా మహిళల సమస్యలు,మనోభావాలు,సృజనాత్మక రచనల కోసం ఏర్పాటు చేసుకున్నది.
అయితే-
‘విహంగ’లో మా రచనలకి తావు లేదా ? అంటూ చాలా మంది పురుషులు ఇ-మెయిల్ పంపారు.’విహంగ’లో
రాయటానికి ఉత్సాహం చూపుతున్నారు.చాలామంది ఇప్పటికే తమ రచనలు పంపారు.
అందుకే మే 2011 నుంచి ‘విహంగ’లో పురుషుల కోసం ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయిస్తున్నాము.ఈ పేజీలో
ప్రచురించబడే రచనలు ‘ స్త్రీల అభ్యున్నతి, మనోవికాసం,స్త్రీల సమస్యలు , ఔన్నత్యాన్ని’వ్యక్తీకరించేవిగా
వుండాలి.స్త్రీలను కించపరిచే భావజాలానికి,ఇతర అంశాలకు చోటు లేదు.
నియమ నిబంధనలు:
* విహంగలో మీ రచనలు ప్రచురించాక 30 రోజుల వరకు మీ సొంత బ్లాగులలో,లేదా సైట్ల లో పెట్టుకో రాదు.
అయితే ప్రచురించిన వెంటనే విహంగ లోని మీ రచనల లింక్ ని పెట్టుకొని ,30 రోజుల తర్వాతే పూర్తి రచనని మీ సైట్ల లో పోస్ట్ చేసుకోవచ్చు.
* మీ రచనలను యునికోడ్ ఉపయోగించి వర్డ్ లో టైప్ చేసి పంపవచ్చు.
*అక్షరమాల,లేఖిని,బరహ వంటి సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి లేదా నేరుగా మీ జి మెయిల్ లో తెలుగు ఎనేబుల్ చేసి అక్కడే టైపు చేసి కూడా పంపవచ్చు.
*అను ఫాంట్లు ఉపయోగించి టైపు చేసిన సి.డి. లేదా పేజ్ మేకర్ ఫైల్ ని ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.
* దయచేసి పి.డి.ఎఫ్ రూపం లో గానీ, చేతిరాతలో కానీ రాయబడిన
తెలుగు రచనలను పంపవద్దు.
వాటిని తిరిగి టైపు చెయ్యాల్సి వస్తుంది కాబట్టి సహకరించండి.
* మీ అమూల్యమైన సలహాలను,సూచనలను తెలియజేయండి.
* మీ రచనలు పంపవలిసిన చిరునామా: editor.vihanga [at] gmail [dot] com
మాతృదినోత్సవ శుభాకాంక్షలతో….
నమస్కారం సంపాదకులకు..కవుత ప్రచురణకు ఎన్నిరోజులవుతుంది ప్రచురణకు…
విహంగలో ప్రచురించిన నెల వరకు కవితలను మరెక్కడా ప్రచరించరాదు అనే నిభందన సరికాదు.
తన కవితపై కూడా కవికి స్వేఛ్చను లేకుండా చేయడం కవుల చేతులు కట్టేయడమే…. పునరాలోచించ ప్రార్ధన.
మీ శ్రేయోభిలాషి
సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న,
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
చరవాణి సంఖ్య 9700007653
మీ స్వేచ్ఛ ని హరించడం లేదండి .మీ కవితలు పోస్ట్ అయిన పేజీ లింక్ మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు.
కానీ రచనలను నేరుగా పెట్టుకో కూడదు .
నిన్నైనా నేడైన
నిజానికి జరిగేది ఇదే ఐనప్పుడు
రేపటి తూర్పు కోసం
కోరే మార్పు కోసం
ఎలా …? ఎలా …? ఎలా …?
ఏం చెద్దాం ? ఏం చేద్దాం?
కోరే మార్పును వెలిగే తూర్పును
ఎలా ఎలా ఎలా …?
ఎలా చుద్దాం? ఎలా చూద్దాం ?
ఏలే వాడు ఏలిన వాన్నే అనుసరిస్తడు
ఐతే ఎన్నటికి మనలను మనుషులుగ
గుర్తిస్తడు
ఎన్ని యుగాల తపస్సు ?
ఎంత కాలం ఈ తమస్సు ?
పాలన మగ జాతి ఆయుధం
ప్రశ్నమన ఆయుధం
ఔను
ప్రశ్నే మన ఆయుధమవ్వాలి …
ఔతది కూడా
పూజింపబడే స్త్రీ లెక్కడ?
ఎక్కడ దేవతలు నాట్యమాడుతున్నారు ?
మాటలు చేతలుగా మారేదెప్పుడు?
ఆంక్షలు తొలగేదెప్పుడు ?
సమతను పంచేదెప్పుడు?
రాజరికమా …?
ప్రజాస్వామ్యమా …?
ప్రశ్నలే కావు …
స్త్రీ కి మాత్రం నియంతృత్వమా ?
అవకాశం అందని పండేనా ?
హక్కులకు హమేషా భంగమేనా?
రామ రాజ్యమా ?
రావణ రాజ్యమా ?
ప్రశ్నలే కావు
స్త్ర్రీ కి ఎందుకు సురక్షితం కాలేవు అన్నదే ప్రశ్న ?
ఏ రాజ్య భాగం లోదైన
ఏ దేశ మూలల్లోదైనా
పిడికెడు మట్టినడుగుదాం
ఔను పిడికెడు మట్టినే అడుగుదాం
స్త్రీ కన్నీటితో తడవని పిడికెడు మట్టినే అడుగుదాం
ఎందుకు దుఃఖం ఉండాలె
ఎందుకు కన్నీళ్ళు ఉండాలె
రామ రాజ్యం నుండి
మోది రాజ్యం వరకు
కాలమేగా కరిగింది?
మనకైతే ఏముంది చెప్పడనికి ఒరిగింది ?
వేద భుమి అని కీర్తించే గానాలు
ఏదీ వేదం ?
ఎవరికి వేదం ?
ఎచరిది వేదం ?
బీటలు వారే వినికిడి
చెవిలో సీసపు మేటలు
ఏది వేదం ?
ఎవరికి వేదం?
ఎవరిది వేదం ?
ఎవరికి వేదం ?
ప్రశ్నే ప్రాణ వాయువు ఉనికికి
ప్రశ్నే మనుగడ మంత్రం భవితకి
అమ్మను గుర్తించడు
ఆలిని గుర్తించడు
ఇక ఏలుబడిలో ఏం గుర్తిస్తడు?
ఆడనెట్లు గుర్తిస్తడు?
ఆంక్షలెట్ల తొలగిస్తడు?
ఒరుగుతడి జరుగుతది అని
ఒట్టి కలలు కంటమెట్ల
భ్రమల మునిగి ఉంటమెట్ల?
వేదం వల్లించినంత తేలికనా ?
మనలను గుర్తించడం
“మన్ కీ బాత్ ” గా నైనా మనలను చట్ట సభల్లోకి పంపరు …
స్వచ్ఛా భారత్ లో చీపుళ్లిచ్చినంత తేలిక కాదు
స్వచ్ఛా పాలన కోరి మనలను పిలవడం పాలు తాగి పెరిగితే మాత్రం
పాలించే హక్కు ఇస్తాడా?
సభలకు సమీకరణ జనం గా
గుడ్లప్పగించే ప్రేక్షకులు గా
చెవులప్పగించే శ్రోతలుగా
చప్పట్లు చరిచే యంత్రాలుగా
ఎన్నాళ్లుందాం ?
ఎన్నేళ్లుందాం ?
ఎందుకు నమ్ముదాం ?
మనకూ ఉంది మార్గం
మనకూ ఉన్నారు ఆ మార్గం చూపినోళ్లు
వీరనారి ఝాన్సీ రాణి ,ఛండీశ్వరి రుద్రమ్మ ,సమ్మక్క సారక్కలు చాకలి ఐలమ్మలు
పోరు తొవ్వను జూపిన భూరి శక్తి సంపన్నులు
స్వచ్ఛా భారత్ మాత్రమే కాదు
మహిళాహోంకే లీయే అచ్ఛాభారత్ చాహియే
మన్ కీ బాత్ వినిపించు
మహిళాహోంకే బీ సునో
హై సో మన్ కీ బాత్
ఆకాశం లో సగం
అవకాశాలెందుకు శూన్యం
పాలించే హక్కు కావాలి
చట్ట సభల్లో స్థానం కావాలి
ప్రతి మహిళా ఇక ప్రశ్న కావాలి
ఎందుకు ఓటివ్వాలని ?
ఏదీ మా ప్రతినిధ్యమని ?
ఓటు అడిగే వాన్ని అడుగుదాం
మన హక్కులకు పట్టిన కిలుమును
కడుగుదాం …
ప్రశ్నలప్రవాహమవుదాం ….
డాక్టర్ హేమలత గార్కి
అభివందనాలు మరియు అభినందనలు
మీ ( మా ) విహంగం ఎంతో…………………ఎత్తున విహరిస్తున్డటం మీ గొప్పతనం , తెలుగు ఆడపడుచులన్దర్కీ గర్వకారణం. మీ సాహిత్య సేవ అనితర సాధ్యం , అమోఘం,. రీడర్స్ అందరి తరపున గొప్ప సన్మానం చేసే అవకాశం, నాకే రావాలని కోరుకుంటున్నాను .
జనవరి 2015 సంచికకు ఒక కవిత పంపించాదలచాను. అనుమతిస్తారా ?
నమస్సుమాంజులతో
మీ వేదవ్యాస్
నా కవిత ప్రచురించినందుకు కృతజ్ఞతలు
పురుషుల పేజి కి స్వాగతం……..
హేమలత పుట్ల గారికి ధన్యవాదాలు.మా కోరికను మన్నించి , స్త్రీ అభ్యున్నతిని ఆసిస్తూ ,వాస్తవ జీవన స్థితిగతులపై స్త్రీ వాద రచనలను పురుషులనుంచీ ఆహ్వానించడం సంతోష దాయకం.యిట్టి విధాన నిర్ణయం తీసుకొన్న మీ ఈ ఉద్యమంలో మా వంతుగా పదం పదం కలుపుతూ సహకారం అందించగలం అని తెలియజేసుకొంటూ
మీ శ్రేయోభిలాషి…నూతక్కి.
పురుషుల కోసం కేటాయించినందుకు,అందులో నా కవిత
ప్రచురించినందుకు ధన్యవాదాలు —చెల్లూరు.సాంబమూర్తి
మీరు మీ పత్రికలో నా కవిత ప్రచురణకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం .అందుకు ధన్యవాదములు .
పురుషులకు ప్రత్యేకమైన పేజి కేటాయించి నందులకు ధన్యవాదములు . త్వరలో వ్యాసం పంపగలవాడను.(స్త్రివాదంపై)