విహంగ మే 2012 సంచికకి స్వాగతం ! 

విహంగ  మే  2012 సంచికకి స్వాగతం !

చిత్రం:మమత రెడ్డి

ఈ సంచికలో …

సంపాదకీయం – సామాన్య

కథలు

వెలిగించనా చిన్ని దీపం – స్వాతి శ్రీపాద

కవితలు

జనాజా – మున్వరునీసా  

పరువు హత్యలు చేయడంలో పరువు ఉందా??? – విజయభాను కోటే

కులమతాలు – జాహ్నవి శ్రీధరాల

 అమ్మ – లీల మంత్రి

  తేనె లొలుకు పలుకులు….ఉమాభారతి కోసూరి

ముఖాముఖి

కళల హారతి’ ఉమా భారతి తో ముఖాముఖి-5 – పుట్ల హేమలత

వ్యాసాలు

కాళిదాసు కవిత్వం లో స్త్రీ – కాశీచైనుల వెంకట మహాలక్ష్మి

శీర్షికలు

నా జీవన యానం లో…. కె.వరలక్ష్మి

నా కళ్ళతో అమెరికా-7 – డా. కె.గీత

ప్రవాసాం ధ్ర భాషా జీవ నాడి – తెలుగు నాడి – T.S. లలిత 

మళ్ళీ మాట్లాడుకుందాం (కాలమ్) – వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

సమకాలీనం-జోగినుల పిల్లలకు తల్లిపేరు చాలు- ప్రభుత్వ జీవో 139 – విజయభాను కోటే

పుస్తక సమీక్షలు

ఓ..కాంత ..ఏకాంత గాధ..”తన్హాయి” – వనజ వనమాలి 

చారిత్రక వ్యాసాలు

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు – నసీర్ అహమ్మద్

ధారావాహికలు

విచలిత – ఉమా పోచంపల్లి 

సుకన్య – విజయ బక్ష్

స్త్రీ యాత్రికులు – ప్రొ. ఆదినారాయణ

ఆరోగ్య దీపిక

కౌమార బాలికల ఆరోగ్యం – డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

హలో డాక్టర్ ! – డా. రమాదేవి దేశ్ పాండే , M.S.(Ob./Gy)

 సాహిత్య సమావేశాలు

 ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అలరించిన ‘‘భువన విజయం’’ నాటకం

Vihanga Global Magazine

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం

సుర కత్తుల సూరీడు – శివసాగర్ సందర్భం ఏదైనా సరే శివ సాగర్ కి  మరణాన్ని ఆపాదించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు . ఎందుకంటే    లోక రీతి లో మరణమంటే శాశ్వత నిష్క్రమణం. కాలాన్ని జయించ గలిగిన కవి శివ సాగర్ .ఇప్పుడతను  నింగికేగిన ఉద్యమం నెలబాలుడు .అంతే. శివ సాగర్ గురించి కనీసం … Continue reading

Posted in సంపాదకీయం | Tagged , , , , , , , , , , | 4 Comments

వెలిగించనా చిన్ని దీపం

గబగబా షవర్ కింద స్నానం అయిందనిపించి షవర్ క్యూబికిల్ నుండి అడుగు బయట పెట్టింది సీత. పనికి రాదని డోర్ మ్యాట్లు తొలగించడం వల్ల కాలు జర్రున జారి పడబోయి , షెల్ఫ్ పట్టుకుని ఆగింది. టవల్ తీసి బాత్ టబ్ పైకి విసిరేసి ఓ పక్కన మడిగా పెట్టుకున్న పాత పట్టు చీర చుట్టుకుని, … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , , | 5 Comments

జనాజా

అమ్మ… అమ్మ… అని ఆక్రోశించింది హృదయం కానరాదేమని కలవరించిన కళ్ళు ఇక రాదనీ తెలిసి తెల్లబోయిన మనస్సు చివరిసారిగా తెలిసింది అమ్మ మనసు చెయ్యి చాచిన నేను తెలుసుకోలేదు నన్ను వదిలి వెళ్ళాలని లేదని జన్నత్ కే వెళ్లి తల్లిదండ్రుల వొడిలో వోలలాడేవో చెల్లీ తమ్ముడుతో ముద్దుమురిపాలలో తేలియాడావో ఇక్కడ నీ బిడ్డల కన్నీరు ఎవరు … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , | 1 Comment

పరువు హత్యలు చేయడంలో పరువు ఉందా??? 

నావన్నీ ప్రశ్నలే!  మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే! ఆమెనెందుకు చంపారు?  ఎందుకా హత్య చేసారు? కన్న ప్రేగు ఏ నిర్దాక్షిణ్యతను అద్దెకు తెచ్చుకుంది? కన్న తండ్రి ఏ నరహంతకుడి పిడికిలిని ఆయుధంగా తెచ్చుకున్నాడు? నావన్నీ ప్రశ్నలే!  మానవ నైజాన్ని దిగజార్చే గుణాలపై యుద్ధానికి దిగే మాటలే! మంచానికి అతుక్కుపోయిన చెల్లెలు గొణుగుతోంది! … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , | 4 Comments

కళల హారతి ఉమాభారతి – 5

‘కళల హారతి’ ఉమాభారతి మొదటి,రెండవ,మూడవ, నాలుగవ భాగాలని చూడండి *మరి వివాహానంతరం మీ నాట్య జీవితం మీరు కోరుకున్నట్టే గడిచిందా? వివాహమయ్యాక నేను అమెరికా వచ్చాను. హుస్టన్ నగరంలో స్థిర పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు, గత పాతికేళ్ళకి పైగా హుస్టన్ లోనే ఉన్నాను. ఇండియా నుంచి వచ్చిన యేడు అసలు డాన్సు విషయం … Continue reading

Posted in ముఖాముఖి(ఇంటర్వ్యూలు) | Tagged , , , , , , , , , , | 2 Comments

కాళిదాసు కవిత్వం లో స్త్రీ

కుమార్తె నిశ్చయం సక్రమమైంది కనుక సంతోషంగా అంగీకరించాడు తండ్రి.  కఠోర తపస్సు చేత శివుని మెప్పించి తపోధనంతో ప్రేమదాసుడిగా కొనుక్కొంది.  ”అద్య ప్రభృత్య వనతాంగి తవాస్మిదాస: క్రీతస్త పోభిరితివాదిని చంద్రమేళా” శివుడు చేయి పట్టుకోగానే ఆమె కరిగిపోయిందా ?  మార్గా చలిల వ్యతికరాకులితేవ సింధు:  శైలాధిరాజ తనయా నయయేనస్థే తసే ” కొండ అడ్డం వచ్చిన … Continue reading

Posted in సాహిత్య వ్యాసాలు | Tagged , , , , , , , | Leave a comment

నా జీవన యానంలో… 

అప్పటికి మా ఇంటి బైట పుంత వైపు కొట్లు నాలుగూ కట్టలేదు. ఆ చివర ఈశాన్యం మూలలో నూతికి ఆనుకుని ఒక కొట్టు గది ఉండేది . సీసాల్లో బిళ్ళలూ వగైరాలు చుట్టలు, బీడీలు లాంటివి పెట్టుకుని మానాన్నమ్మ తీరికైనప్పుడు ఆకొట్లో కూచుని అమ్ముతుండేది .కొట్టు మెట్లు దిగితే కిందంతా పుంత దారి.ఒకరోజు ఆ పుంత … Continue reading

Posted in ఆత్మ కథలు, ధారావాహికలు | Tagged , , , , , , , | 2 Comments

నా కళ్లతో అమెరికా-7

                                                      లేక్ తాహో జీవితంలో మొదటిసారి మంచును చూడడం ఒక అందమైన స్వప్నం. ఒక గొప్ప అనుభూతి. ఎడతెరిపిలేని సంబరం. ఇవన్నీ కలగలిసిన ప్రదేశం  లేక్ తాహో(Lake Tahoe).  మా ఊరి నుంచి ఈశాన్య దిక్కుగా దాదాపు 220 మైళ్లు దూరం లో ఉంది.  తాహో అనే పదానికి ఇక్కడి స్థానిక వాషో  భాషలో  సరస్సు … Continue reading

Posted in ధారావాహికలు, నా కళ్ళతో అమెరికా, యాత్రా సాహిత్యం | Leave a comment

సమకాలీనం-జోగినుల పిల్లలకు తల్లిపేరు చాలు- ప్రభుత్వ జీవో 139

జోగిని పిల్లలకు తల్లి పేరు చాలట. సర్టిఫికేట్లలో తండ్రిపేరు అవసరంలేదట. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ వార్త తండ్రి పేరు లేనందువల్ల పరీక్షలురాయడానికీ, పాఠశాలలో లేదా కాలేజీలో చేరడానికి అర్హత కోల్పోయిన ఎందరో జోగినుల పిల్లలకు ఊరట కలిగిస్తుంది. అనాదిగా జోగినుల కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యకు దూరమౌతూనే ఉన్నారు. అధికారిక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ … Continue reading

Posted in సమకాలీనం...., essays | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

విచలిత

ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి రావడ౦ ఒకటికి పదిసార్లు ఆడపిల్లలకే మార్పులు తెస్తు౦ది. భర్త పరదేశ౦ వెళ్ళల్సి వచ్చి పుట్టి౦ట్లో ఉ౦డటమో, లేదా భర్త ఇతరదేశాలకో ప్రదేశాలకో వెళ్ళడమో జరిగినపుడు, తోడు వెళ్ళగలిగితే మ౦చిదే, కాని, ఉద్యోగాన్ని కూడా వె౦ట రమ్మనగలదా? ఎవరికో కొ౦దరు అదృష్టవ౦తులకు, ఉన్న ఊళ్ళో ఉద్యోగాల వ౦టివే వేరే ఊళ్ళల్లో కూడా దొరుకుతాయి, … Continue reading

Posted in విచలిత | Tagged , , , , | Leave a comment