Author Archives: విహంగ మహిళా పత్రిక

‘అన్వేషణ’ పుస్తక ఆవిష్కరణ

19- 04-2013 న రాజమండ్రి లో అన్వేషణ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది . శ్రీ వెలమాటి సత్యనారాయణ తన భార్య శ్రీమతి సుందరమ్మ స్మృతి లో రచించిన ఈ పుస్తకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.పి. శ్రీ ఎం .రమేష్ (IPS ) ఆవిష్కరించారు . తన భార్య జ్ఞాపకాలను , తమ జీవిత … Continue reading

Posted in సాహిత్య సమావేశాలు | Leave a comment

ఆ’మే’ డే !  (సంపాదకీయం)

సుమారుగా నూట ఇరవైఏడు సంవత్సరాల క్రితం చికాగోలో కార్మిక హక్కుల కోసం దోపిడీ దారులకి వ్యతిరేకంగా శ్రామికులు పోరాడిన రోజున ప్రారంభమైన చైతన్యం , ప్రపంచ కార్మికుల గుండెల్లో చైతన్యాన్ని నింపుతూనే  ఉంది .కార్మిక సమస్యలు , వాదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం  అయి పోయాయేమో అనిపిస్తాయి. అన్ని దేశాలలోను . అన్ని జాతులలోను … Continue reading

Posted in సంపాదకీయం | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 1 Comment

ఎన్న ముద్ద నా బాస

చీలికలు పడ్డనేల  విడివడ్డ ఖండాలం  చూపుకు మాత్రం ఒకలాంటి  మనుషులమే అంతా తెలుగోల్లమే …   వేరు చరిత్రలు భిన్న సంస్కృతులు విభిన్న రాజకీయార్ధిక జీవన ప్రపంచాలు వేరు భాషా  వ్యక్తీకరణలు …   ఇప్పటిదాకా మనమొక అసమ వ్యవస్థ  ఇరు భాగాలం అసమాంతర  వంకర గీతలం మనిషితనపు  హొదాలను భాషలో సమాధి చేసిన అభాగ్యులం … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , | 1 Comment

ఓడిగెలిచిన రాత్రి

యవ్వనాన్ని ధరించిన దేహం కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ పెనవేసుకున్న రెండుదేహాలు రాత్రిని చీల్చుకుంటూ ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు కణం కణం రగిలిన అగ్నికణం చెలరేగే మంటలై అడివంతా దహించే జ్వాలలైనట్లు కన్ను గానని చీకటిలో భయమెరుగనిపోరు పల్నాటి పందెపు కోళ్ళలా రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ … Continue reading

Posted in కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, Uncategorized | Tagged , , , , , , , , , , , , , , , , , , | 4 Comments

హుస్నాబాద అంగడి

సుక్కురారంగోలె  ఎగిలి వారంగ సురువైతది  హుస్నాబాద అంగడి సుట్టుముట్టు  ఇరువై  ఊర్ల పెట్టు రాకడ పోకడకిరాంలేదు పైస పుట్టేది మాయమయ్యేది  మంది గూడేది మర్మందెలిసేది గీన్నే ఊరూరా చెక్కర్లు గొట్టే ఎర్రబస్సు నెత్తిమీన  మూటలతో కాన్పు కొచ్చే ఆడిబిడ్డ నాడు … పెయ్యదుడ్డెనమ్మి పిండి బత్తలు మ్యాకపిల్లలగొట్టి ఇత్తనపు  సంచులు మోటర్లల్ల  మొలుకొచ్చిన  గోదల  మారుబ్యారం పులుకు … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , | 3 Comments

వన్నె తరగని వనిత….. 

వన్నె తరగని వనిత  వెన్ను తానె ఇంటికి  వగరును తాను రుచి చూసి  కమ్మదనమును పంచిపెట్టును  ఆలి అయి మగనికి చేరువై  అనురాగమునిచ్చి  అమ్మ అయి తాను  అమృతమును పంచును  ఆకాశానికెగిరినా… వనిత  ఆత్మ స్థైర్యం వీడదు  అసహనాన్ని దరి  చేరనీయదు …  అభిమానం ఆమె ఆభరణం  దాన్ని జారవిడువని  జాగరతే తను చాచుకున్న ఆయుధం  … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , | 1 Comment

నవలల్లో మనో విశ్లేషణాత్మకత

cheruvu durga prasoona

పరిచయం:           నవలల్లో మనో విశ్లేషణాత్మకత అనేది నవీన యుగములోనే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. క్రీ.శ. 1920-1942 ప్రాంతములోని తెలుగు నవలా వికాసం నందు, క్రీ.శ.1942 నుండి 1960 వరకు మధ్య ప్రాంతం లోని మనో వైజ్ఞానిక యుగము నందు నవలల్లో గల మనో విశ్లేషణాత్మకత మీద విస్తృత చర్చ జరిగిందని చెప్పవచ్చు.           మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మానసిక పరిణతి … Continue reading

Posted in సాహిత్య వ్యాసాలు | 1 Comment

సుప్రసిద్ద తమిళ రచయిత్రి శివశంకరి నవల’ముక్కనాం కయిరు’- రామానుజరావు తెలుగు అనువాదం. 

mukuthaadu

ప్రఖ్యాత తమిళ రచయిత్రి శివశంకరి 2002 వ సంవత్సరంలో రాసిన ” ముక్కనాం కయిరు ” నవలను “బిట్రేయిల్ అండ్ అదర్ స్టోరీస్” గా అమీత అగ్నిహోత్రి, మరియు గీతా రాధాకృష్ణలు ఆంగ్లంలోకి అనువదించగా , ఇప్పుడు టి.వి.యస్ రామానుజరావు విహంగ పాఠకులకోసం తెలుగులోకి తర్జుమా చేస్తున్నారు. ఇది ముకుతాడు పేరిట ధారావాహికంగా రాబోతున్నది. అనువాదకుడు … Continue reading

Posted in అనువాదాలు, ధారావాహికలు | 1 Comment

స్వయంసిద్ధ – అనర్థాల అనలంలో… 

స్త్రీల సమస్యలు స్త్రీలవి మాత్రమే కాదు. సమాజంనుంచి నిందించబడుతూ ,హింసల్నీ ,పీడనల్నీ ఎదుర్కుంటూ మన సమస్యల్ని మనమే చర్చించుకుంటూ వుండటమేనా ? స్త్రీల సమస్యల గురించి ఇటీవలి పరిణామాల పట్ల బాధ్యత కలిగిన పురుషులు ,రచయితలు ఎలా ఆలోచిస్తున్నారు? …. స్త్రీల సమస్యల్ని తమ కోణంనుంచి చర్చిస్తూ , వివిధ అంశాలని స్పృశిస్తూ రచయిత ఆచళ్ళ … Continue reading

Posted in కాలమ్, పురుషుల కోసం ప్రత్యేకం, స్వయంసిద్ధ | Leave a comment

విహంగమహిళా సాహిత్య పత్రిక ఏప్రిల్ సంచికకి స్వాగతం !

  ISSN 2278 – 4780 సంపాదకీయం – పుట్ల హేమలత కథలు వెన్నెల కౌగిలి – వాడ్రేవు వీరలక్ష్మీదేవి అతి చక్కటి వృత్తి – ఇటాలియన్ మూలం:మెటిల్డే సెరావ్ తెలుగు అనువాదం:రాజేంద్ర కుమార్ దేవరపల్లి కవితలు పాపాయి సమాధి దగ్గర – డా . సి . భవానీదేవి ప్రాణహితవై ప్రవహించు – అనిశెట్టి … Continue reading

Posted in సంచికలు | Leave a comment