దీపం ఆరకముందే చక్కదిద్దుకో…

మొబైల్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతోంది.  ఆ చప్పుడికి మెలకువ వచ్చిన సులేఖ అబ్బ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ మూసుకుపోతున్న కళ్ళని విప్పార్చే ప్రయత్నం చేస్తోంది.  ఆమె కళ్ళు విడివడడంలేదు.  కళ్ళు బరువుగా మూసుకుపోతున్నాయి.  రాత్రి ఒంటి గంట వరకూ కంప్యూటర్ లో పనిచేసుకుంటూ ఉంది.  నిద్ర  మధ్యలో లేచిన అత్తగారు రేపు ఆదివారమే కదా!   పడుకోమ్మా సులేఖా అంటూ కేకేసేవరకు సమయమే చూసుకోలేదు.   పూనాలో ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన ఆమె కొడుకు సుబోధ్  వీకెండ్ అని నిన్న ఉదయం వచ్చాడు. […]

Read more

అక్షరాల ‘అగ్నిశిఖ’ లు

      స్త్రీ అంటే శరీరం అని పర్యాయ పదమైన చోట ఎప్పుడైనా ఆమె తనువుపై నిరంతరం దాడులు కొనసాగుతూనే వుంటాయి .పితృస్వామ్య  వ్యవస్థ లో మహిళా అంటే ఒక భోగ్య వస్తువు . ఒక మార్కెట్ సరుకు అని రూడి  అయిన వేళ నగరంలోనైనా అరణ్యం లోనైనా వీధి లోనైనా , ఇంట్లో నైనా , లిప్ట్ లోనైనా స్త్రీల దేహాల మీద దాడి జరుగుతూనే వుంటుంది .                        ఈనాడు సినిమాల్లో , టి .వి ల్లో , నెట్ […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

                                       శ్రీమతి డా . పెళ్లకూరి జయప్రద సోమిరెడ్డి 1975 లో రాసిన ” బాయ్ ఫ్రెండ్” నవల వాస్తవికతలో ఈ తరానికి కూడా అద్దంపడుతుంది . సామాజిక సందేశం ఉన్న ఏ రచన అయినా చదువరులకి అవసరమే కాబట్టి దీనిని విహంగ మహిళా సాహిత్య పత్రికలో పునర్ముదిస్తున్నాం . చదువరులు మీ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం […]

Read more

జోగిని

లెక్క మంచిగ మాటాడరు. మంచిగ సూడరు. ఏందేందో అంటరు” కొంత గారాబం పోతున్నట్లు కొంత బాధను దిగమింగుకొని అడిగినట్లు ఉంది ఆమె అడిగిన తీరు. ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది విద్యకి, కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు చూస్తే జాలేసింది విద్యకి. కానీ తీసుకెళ్ళి తాను ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు ఆమెను పని మనిషిగా మారుస్తారనడంలో సందేహం లేదు. అయినా వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, ఊర్కొంటారా…? తనకి ఉద్యోగం వస్తే, అప్పుడు తీసుకెళ్ళవచ్చు. చదువు చెప్పించవచ్చు అనుకొంది […]

Read more

నల్ల జాతి చరిత్ర లో నిలిచిపోయే నక్షత్రం

ఎనిమిదేళ్ళ ఆడ పిల్ల అత్యాచారానికి గురైతే,ఆమె మానసిక స్థితి ఎలా వుంటుంది?ఏమి తెలియని వయసులో తనపై ఆ దారుణం ఎందుకు జరిగిందో అర్ధం కాక తల్లడిల్లుతుంది.తల్లి దండ్రులతో సహా ఎవరికీ చెప్పుకోలేక, వొంటరితనాన్ని కోరుకుని క్రుంగి పోతుంది.అనుదినం ఆ దుర్ఘటన గుర్తు చేసుకుంటూ మానసిక సంఘర్షణకు గురవుతుంది.కొందరు పెద్ద వాళ్ళే అలాంటి సంఘటనల ప్రభావంతో తమ జీవితాలనే చీకటి మయం చేసుకుంటే, మరికొందరు వాటిని త్రోవలో ఎదురయ్యే అడ్డంకులుగా భావించి, తప్పుకుని ముందుకు సాగుతారు.మాయా ఎంజేలో ప్రసిద్ది చెందిన ఆఫ్రో అమెరికన్ రచయిత్రి. ఎనిమిదేళ్ళ […]

Read more

గౌతమీగంగ

1923లో కాంగ్రెస్‌ మహాసభలు కాకినాడలో జరిగాయి. ఆ సభల ప్రధాన నిర్వాహకుడు బులుసు సాంబమూర్తి గారు, వారు ప్రముఖ వేద పండితుని కుమారులు. వారి గ్రామం మండపేట సమీపాన గల దుళ్ల గ్రామం తండ్రి గారు మంచి భూవసతి గల కామందు. నాటి సంప్రదాయానుగుణంగా సాంబమూర్తి గారు లా చదివి ప్రముఖ న్యాయవాదిగా కాకినాడ చుట్టు పట్ల మంచిపేరు, పుష్కలంగా ధనం ఆర్జిస్తున్నారు. గాంధీ మహాత్ముని స్వరాజ్య శంఖారావం విని సర్వస్వాన్ని త్యజించి స్వరాజ్యసమరంలో దుమికారు. నాటి వరకు ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి […]

Read more

మహాలక్ష్మి లో మార్పు

రిటైర్మెంట్ తరువాత భర్త సొంతవూరు ఐన అగ్రహారానికి వెళ్లి పోదామంటే తెగ ముచ్చట పడింది మహాలక్ష్మి. పచ్చటి పొలాలు, పొల్యూషన్ లేని గాలి, రాత్రిపూట పెరట్లో ఆరుబయట, నీలాకాశం కింద మంచాల మీద పడుకొని నక్షత్రాలను చూడటం, పెరట్లో విరగాపూసే గన్నేరు, నందివర్ధనాలు పూజ కైతే, మల్లెపందిరి విరగ పూసి జడలో అలంకరించుకోవడానికి నాలుగు మూరల పూలూ, సంక్రాంతి సమయాల్లో ఇంటిముందర రంగులద్దిన ముగ్గుల్లో ముచ్చటగా కూర్చునే గొబ్బెమ్మలు…..ఇలా వుహల్లో పల్లె వాతావరణం అందంగా కనిపించ సాగింది. పుట్టి పెరిగిందే కాక, ముప్పై ఏళ్ళ […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

1909 లో ఆరాధన చాలా బాగాజరగడంతో ఇదే ప్రణాళిక రానున్న కాలంలో కూడా అమలు జరగాలని తిలైలస్థానం సోదరులు నిర్ణయించారు. జనాదరణతోపాటు మలై క్కోటై గోవిందస్వామి పిళ్ళైలాంటి విద్వాంసుల సహకారం వుండడంతో 1910 ఆరాధన ఘనంగా జరిగింది.23 సోదరులిద్దరూ ఒకే మాటగా పనిచెయ్యడం చూసి ఓర్వలేనివారూ వున్నారు. వాళ్ళ కుతంత్రాల వల్ల ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆర్థిక విషయాల గురించి పరస్పరం అనుమానాలు మొదలై 1910 చివరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోని స్థితికి చేరారు. 1911లో ఆరాధన నాటికి నరసింహ భాగవతార్‌ తాను […]

Read more

నా కళ్లతో అమెరికా- 37 ఎల్లోస్టోన్

జూలై నెల మొదటి వారపు ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకేండ్ సెలవులు లో ఎటైనా వెళ్లొద్దామని అనుకున్నాం. ఇప్పటికే ఒక సారి చూసిన ప్రదేశాల్ని రెండో సారి మరో సీజన్ లో చూడడం లో భాగంగా యూసోమిటీ, గ్రాండ్ కెన్యన్ లకు మళ్ళీ వెళ్లొచ్చాం. ఈ సారి ఇంత వరకూ చూడని ప్రదేశమైతే బావుణ్ణని అనుకోగానే మా వరు “ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్” అంది. “ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్” వ్యోమింగ్ రాష్ట్రం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేషనల్ పార్క్ లలో ఒకటి. […]

Read more
1 2