కొండేపూడి నిర్మల కవిత్వం

నేను కవిత్వం గురించి ఎప్పుడు రాసినా ఒక మాట చెప్పుకోకుండా రాయలేదు. నేను సాహిత్య విమర్శకుడ్ని కాదు. కవిత్వమైనా కథలైనా నాకు నచ్చినపుడు ఎందుకు నచ్చాయో చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తుంటాను. నిజమైన విమర్శ రచయితకు దారి చూపిస్తుంది. నేను రాసేది సంతృప్తి కలిగిస్తుంది. కవిత్వ విమర్శకి అనేక ప్రమాణాలుంటాయి.

Tallavajjala అవి మారుతుంటాయి. కానీ కథకీ కవిత్వానికీ శాశ్వతమైన ఒక ప్రమాణం మాత్రం మారదు. మనం రాసేది కవిత్వమో కథో అయి తీరాలి. అది సాహిత్యం కావాలి. కథలాగో కవిత్వం లాగో ఉండడం కాదు. ఏ గొప్ప రచయిత అయినా అతడు/ఆమె రాసినవన్నీ గొప్పగా ఉండవు. విమర్శకుడైతే కవిత్వాన్ని స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్, స్ట్రక్చరల్ మోనోటనీ, టోటల్ క్వాలిటీ, క్రియేటివ్ ఫాటిగ్, వంటి ప్రమాణాలతో ఎరుక పరుస్తాడు. నిర్మలగారు రాసిన మొదటి కవిత నుంచీ నాకు ఆమె కవిత్వంతో ఇష్టమైన పరిచయం ఏర్పడింది. ఉద్యమాలు ధోరణులు మాత్రమే గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తాయని నేననుకోవడం లేదు. కానీ వాటి ప్రేరణ వల్ల గొప్ప రచనలు వచ్చే అవకాశం ఉందనుకుంటాను. సోషల్ ఆర్గానైటిక్స్ ఎప్పుడూ రచయితలకు నేపథ్యంగా ఉంటుంది. దాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.

kondepudi-nirmalaఎటొచ్చీ అదొక ఇనుప కచ్చడం కాకూడదు. అది రచయిత ఎంచుకున్న అనుభవాల పరిమితికి సంబంధించింది. కొండేపూడి నిర్మలగారు తన అయిదు కవితా సంకలనాలనూ దగ్గర చేర్చి ఒక సంపుటంగా తీసుకొచ్చేరు. విడివిడిగా చదివినప్పుడు కలిగే అనుభూతి వేరు. మొత్తంగా చదువుకున్నప్పుడు కవిత్వాన్ని స్పష్టంగా బేరీజు వెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తీరిగ్గా వారం రోజులు చదివిన తరువాత అసంకల్పితంగా మూడు వాక్యాలు చటుక్కున స్ఫురించాయి. Her poetry is a breathless indictment Her poetry is a flaw of angrish ( Anguisht Anger) Her poetry is a monologic conversation మొదటి మాట అనుకోడానిక్కారణం నిర్మలగారి వాక్యనిర్మాణం ఒంపులు తిరుగుతూ ఉంటుంది వాక్యప్రవాహం. It is like typing fast talking fast. ఇది ఆమె అభివ్యక్తి విశేషం. చిన్నవాక్యాలు అర్థవంతంగా వదిలేసిన పాదాలు అరుదుగా కనిపిస్తాయి. ఈ వాక్యాల ప్రవాహశీలత వల్లనే బ్రీత్ లెస్ అన్నాను. దీనివల్ల కవిత అంతటా భావసంబంధమైన తీవ్రత గాఢత వ్యాపిస్తుంది.ప్రతీకలు పదచిత్రాల జోలికి పోదామె.

kondepudi-nirmala-kavitvam-350x193You can almost hear her strong voice. అట్లా పొడవాటి వాక్యాలవల్ల మొత్తం కవిత్వమంతా ఒక దీర్ఘ సంభాషణంలా అనిపిస్తుంది కవిత్వ పరిభాషలో చెప్పాలంటే కళూ తుడుచుకుంటూ తడిగొంతుకతో మాట్లాడుతున్నట్టు ఆగ్రహావేదనల కలనేత. ఈ రకమైన సంభాషణ ఇతరుల కవిత్వంలో నేను చూడలేదు. ఇప్పుడింక నిర్మలగారు రాసే కవిత్వం వేరుగా ఉంటుందనుకుంటున్నాను. నేనంటున్న వాక్యనిర్మాణం పదాల సోహళింపు ఆమె ప్రత్యేకంగా ఎంచుకుని మలచుకున్న శిల్పవిశేషం కాదు, అది ఆమెలో ఎప్పుడూ ఉంది, అట్లా ఉండడం అసాధారణం అసహజం కాదు కానీ అత్యంత సహజంగా వెలువడ్డం అసాధారణం. అందుకే నిర్మాణ సంబంధమైన బాదరబందీ నిర్మలగారికి లేదు. కలిగించుకోలేదు. ఏవో కొన్ని కవితలు తప్ప ఆమె కవితలన్నీ దీర్ఘ ఉచ్వాస నిశ్వాసాల లయననుసరించే వాక్యనిర్మాణంతో ఉంటాయి. అన్ని కవితల్లో చాలా ఆకర్షణీయమైన అభివ్యక్తి స్పష్టమవుతుంది.

నిర్మలగారు తన సంకలనానికి ముందు మాట రాసి మంచిపని చేశారు. నిజానికి చాలా వ్యక్తిగతమైన విషయాలేవీ లేకపోయినా అది ఆమె కవిత్వ నేపధ్యం. ఒక పార్శ్వం. ఆమె కౌటుంబిక సామాజిక ధృక్పధం ఏర్పడడానికీ మధ్యతరగతి పురుషుల నియంతృత్వ ధోరణి స్పష్టంగా చూడ్డానికీ దోహదపడ్డ అనుభవాలవి. అది ఆమె కవిత్వ నుడికారం ఏర్పడ్డానికి కూడా కారణం అయింది. అటువంటి అనుభవాలు ఉద్యోగరీత్యా లోకాన్ని చూసిన అనుభవాలు, 90 వ దశకంలొ వచ్చిన ఉద్యమాలు ఎట్లా ఆమెకు స్ఫూర్తి కలిగించాయో అందులో చెప్పుకున్నారామె. సామాజికాంశాలు బాహితమైనవి.

మధ్యతరగతి ఉమ్మడి కుటుంబజీవనంలో ఇరుకుదనం ఊపిరాడని తనం వీటికి కారణమైన కొన్ని ఆర్థిక పరిస్థితులు సంవేదన కలిగించి నిర్మలగారి కవిత్వానికి తీవ్రతనూ అంతర్లీనమైన ఆర్ద్రతనూ సంతరించాయి. పేదరికం బాధాకరమైంది. కానీ ఒక స్వేచ్చ ఒక తలుపు తీసి ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ వేదన ఆంతరికమైనది కాదు. కానీ వర్తమానంలో మధ్యతరగతిలో ఆశ్చర్యకరమైన మార్పులొచ్చాయని అంగీకరించాలి. అది అనివార్యం. కానీ ఒక సామాజిక సందర్భాన్ని నినాదప్రాయంగా కాకుండా శక్తిమాళంఆ కవిత్వీకరించారు నిర్మలగారు, ఏ వర్గానికి చెందిన స్త్రీ అయినా “పగటి గుహల మీదుగా కొండరాళ్ళు పడి నలుగుతున్న నిశ్శబ్దాల మధ్య

జీవితానికీ జీవిస్తున్న దానికీ పరుచుకున్న్ అవివేకాల రధ్య

రాత్రినీ తెల్లారకట్ట కివతల కట్టియ్యడమొక అవసరం.”

మన దేశంలో సాంస్కృతిక విలువలు, వారసత్వం కౌటింబిక విలువలు వగైరాలు ఒక పెద్ద అదృశ్య శిలారూపంలో స్త్రీల నెత్తిమీద ఉంటుంది. ఉంచబడింది. ఈ శిల దించుకోడానికి అవకాశం ఉండేది కాదు, ఇది కులమతాలకి అతీతమైన వాస్తవం. ప్రస్తుతం ఈ రాయి బరువు కొంచెం తగ్గుతోంది. ఈ మార్పు కూడా అంటే బరువు తగ్గించుకుంటున్న సందర్భంలో కూడా అసౌకర్యం స్త్రీల వంతు అవుతోంది. నిర్మలగారి అసహనం ఆగ్రహం స్పష్టంగా పితృస్వామ్య వ్యవస్థమీద. తత్ఫలితమైన అసమత మీద. ఈ వివక్ష ఒకరకంగా ఉండదు. అనేక రూపాలలో సలపరిస్తూనే ఉంటుంది. చిత్రం ఏమిటంటే దీన్ని మధ్యతరగతి శతాబ్దాలుగా ఒక విలువల చట్రంగా సాంప్రదాయంగా సంస్కారంగా మలచడం. దీనికి అధికభాగం ఉమ్మడి ఆస్తి, దానివల్ల ఏర్పడ్డ ఉమ్మడి కుటుంబ వ్యవస్థాకారణం. విద్యావివాహవిషయాల్లోనే కాదు.

మహిళల కాలక్షేపం కూడా కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండేది. వినయం, అణకువ, సర్దుకుపోవడం, తల్లిదండ్రులకు కూడా తన జీవన విషాదాన్ని చెప్పుకోలేకపోవడం, అట్లాగే శిధిలమైపోవడం గొప్ప సాధ్వీమతల్లి సచ్చీలతగా భావించబడింది. అయితే ఇందులో చాలామంది గమనించని ఐరనీ కూడా ఉంది. అనేకానేక మధ్యతరగతి కుటుంబాల్లో నలభై ఏళ్ళు దాటగానే ఇల్లాలు చండప్రచండమైన గయ్యాళి అవతారం ఎత్తుతుంది. ఆమె ద్వేషం లైంగిక అసంతృప్తి కోడల్ల మీద ముఖ్యంగా భర్తమీద వడ్డీతో సహా తీర్చుకుంటుంది. ఆభర్తల క్షోభ వర్ణనాతీతం. కానీ మహిళలు దహించుకుపోవడం, బాల్య యవ్వన వృద్ధాప్య దశల్లో నిర్మలగారు అనేక కవితల్లో కంట్లో కలికం పడేటట్టు చిత్రించారు. ఒక పిక్టోరియల్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. ప్యూపా దశనుంచీ మొదలైందంటారామె,

“పుట్టకముందే నువ్వున్న చీకటి జోలపాటలోకి

తెల్లటి రబ్బరు చెయ్యి దూసుకువచ్చినప్పుడు

అమ్మకి తెలీకుండా అమ్మ పేగులో వొదిగావే…” (మరణవాంగ్మూలం)

చీకటి జోలపాటలోకి తెల్లటి రబ్బరు చెయ్యి వెళ్ళడం.. ఝల్లుమంటుంది. అంతకంటే ఆధునికమైన అభివ్యక్తి చూడండి.

“కట్టుకున్న గాడిద బట్టల మోత కింద

వెలుతురాడని జననాంగం మాదిరి…”

నాకు తెలిసి తెలుగులో ఎవరూ ఇట్లా అనలేదు. దీన్ని వివరించడం పాఠకుడికి అన్యాయం చెయ్యడం అవుతుందనుకుంటాను. అట్లాగే హృదయానికి బహువచనం అన్న ప్రసిద్ధ కవితలో గొప్ప కవితాత్మకమైఅ వాక్యాల్లో కూడా ఆమే అన్నట్టు బెంగజీర. స్త్రీల గురించి తెలుగులో రాసిన గొప్ప కవితల్లో ఇది ఒకటి, బెంగ ఎందుకంటే చాలా మందికి సౌందర్యం ఖాద్యపదార్థం. కళ్ళఎరదుటే కొమ్మ రెమ్మ పూవు చవిస్తూ ఎదగడం కనిపిస్తుంది.

“……..

కొమ్మ చివర పూల తొడిమలా సాగిన మెడకింద

అరిటాకులాంటి చీలికకు అటూ ఇటూ

ఘనమూ ద్రవమూ కాని మనసుకి

అచ్చమైన బహువచనం

ఓహ్”

గుజరాత్ మారణహోమం బాస్నియో జెర్జియోవినాలో ఒక పథకం ప్రకారం ముస్లిం మహిళలమీద జరిగిన లైంగిక దాడులు అంటే ప్రపంచవ్యాప్తంగా సందర్భం ఏదయినా ఇంట్లో యుద్ధంలో కూడా నిజానికి యుద్ధభూమి స్త్రీ అంటారామె, 

బాస్నియో అత్యాచారాల గురించి రాస్తూ ఒకే ఒక వాక్యం నెత్తుటి గీతలా పెదాల చివర నుంచి కారిన నెత్తురులా

“కడుపులో శత్రువు నవ్వు ఫెటేల్న తన్ని పేగు మెలేస్తుంది.”

అత్యాచారాల వల్ల స్త్రీలు గర్భవతులైనారు. కడుపులో పడ్డ బిడ్డ కదలిక మహిళలందరికీ తెలిసిందే. మామూలుగా అయితే అదో పులకింత. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ కదలికను శత్రువు నవ్వు ఫెటేలు మని తగలడం అనే మానసిక హింసగా చెప్పడం వీపు మీద వాత పెట్టినట్టుంటుంది. ఆ పోలిక అసాధారణం.

గృహహింస దైన్యం మోసం ఒంటరితనం మొదలైనవి స్త్రీవాద కవితావస్తువులు. తప్పని కాదు. వాటిగురించి ఇతఃపూర్వం నిప్పుడూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. ముఖ్యంగా కవిత్వంగా ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ థిస్ డిపెన్డెన్సీ పోస్ట్-90” హాడ్ బికమ్ ఎ మోనోటమీ. కానీ నిర్మల గారి వంటి కొద్ది మంది కవులు మొదటి కవితనుంచే ఒక విలక్షణమైన అభివ్యక్తి వల్ల మోనోటనీ నుంచి తప్పించుకోగలిగారు. కారణం వారి సృజనాత్మక శక్తి. చేతిలో మంత్రదండం ఉంటే ఏదయినా చెయ్యొచ్చు కదా!

ష్ అనే వర్షం మీద నిర్మలగారు రాసిన కవిత ఆమె భావుకతకి వర్షంలో తడిసిన చల్లటిగాలి వంటి నిదర్శనం అందులో కూడా చివరి వాక్యాలు పెద్ద పెద్ద చినుకు ముత్యాలమీద పడ్డంత ఆహ్లాదం కలిగిస్తూనే జీవితం గురించి న ఒక వాస్తవాన్ని సంకేతిస్తున్నాయి. అంటే ఒక స్వేచ్చ ఏదో సంకెళ్ళ బారిన పడబోతున్నదనే ధ్వని.

……

అట్లాస్ లోమ్చి అరేబియా

క్లాస్ రూంలోంచి నేనూ

ఎలా కదుల్తాం చెప్పు

వేయివేల ఆకాశాల జిగజిగల్తో

నువ్వెంత కితకితలు పెడ్తే మాత్రం

పనికిమాలిన గీతలు వదలి

గంటమోగని గదులు వదిలి..”

వేరువేరు ఊళ్ళలో ఉద్యోగిస్తున్న భార్యాభర్తల గురించి రాసిన షరామామూలే కవితలో నిర్మల బ్రాండ్ వచన కవిత్వ అభివ్యక్తికి ఈ వాక్యం మంచి కితాబు.

“….

బస్సుకి వేలాడి రిక్షాకి వేలాడి నడకలో వేలాడి

పటపటా వేళ్ళు కొరుక్కు తింటున్న టైపు మిషనుకి వేలాడి

నల్లటి కార్బనులో పగటిని రాత్రికి మోసుకెడుతూ..”

ఇప్పుడయితే మెత్తగా నముల్తున్న కంప్యూటర్ కేస్ కి వేలాడి అనాలేమో.. మహిళల జీవనం నిస్సారం అవడం అంటే ఏమిటో ఒక జీవం లేని చిరునవ్వుగా మిగలడం అంటే ఏమిటో నిర్మలగారు అనేక కవితల్లో ఎండలో మెరిసే కానుక పూల వంటి కొత్త కొత్త పోలికలతో ఎరుక పరుస్తారు.ఇదంతా ఆమె కళ్ళారా చూసిన వాస్తవం. పెళ్ళిచూప్లు అప్పగింతలు కట్నం సద్దుబాట్లు ముఖం చిట్లించుకోడాలు చివరికి ఇంటికి తోలుకొచ్చిన భయంతో కరుగుతున్న యవ్వనం బొమ్మని తీసుకొని ఆమె చేతులతో మనసులో ఏమాత్రం సంబంధం లేని నిర్దాక్షిణ్య శృంగారానికి బలి చెయ్యడం వంటి అన్ని శతాబ్దాల మధ్య తరగతి మహిళా జీవన చిత్రాన్ని నిర్మల గారు మెరిసిపోయే బ్లేడు ముక్కలవంటి కవితల్లో రచించారు. ఇదొకరకమైన కవితాత్మకమైన డాక్యుమెంట్. ఆమె అసంకల్పితంగా మధ్యతరగతి మహిళల తీవ్రమైన లైంగిక అసంతృప్తిని బహిర్గతం చేశారు. అగరొత్తుల్లా తగలబడిపోయారు వాళ్ళు…

“సందేహం లేదు ఆవిడే

మూసిన తలుపుల వెనుక తచ్చాడుతూ

ఊపిరి గుదిబండల్ని చీకట్లో వేలాడదీసింది.

కునుకుతున్న అగరొత్తులు తప్ప

మరో వెలుగు తాకని ఇరుకుగదిలో

మగ్గిపోయిన శృంగారపు కదలికలు ఆగిపోతాయి.” (సత్యంశివంసుందరం)

“నువ్వు నేనయి పుట్టిగిట్టితే తప్ప

అసలు బాధకు ములుగు ఎక్కడుందో అర్థం కాదు.

అంచేత వృధాగా ఇంకేం మాట్లాడకు.”

అని సమాధానం కూడా చెప్పేరామె, స్వచ్చంద సంస్థలతో పని చెయ్యడం వల్ల అభివృద్ధి పర్యావరణం ప్రపంచీకరణ వమ్టి సమస్యల పట్ల అవగాహన ఏర్పడిందని ఆమె చెప్పుకొన్నారు. చెట్ల గురించి రాసినప్పుడు కూడా గాలాడని నా అద్దె కొంప కుంపటానికి మర్చిపోలేదు నిర్మలగారు,, “చేదు చెట్టు” చాల మంచి కవితల్లో ఒకటి.

“ఎర్రెర్రని ఎండ కొంగు అలవోగ్గా సద్దుకుంటూ

పదిలంగా హరిత పలవిని వెండిపళ్ళెంలో పెట్టి అందిస్తుంది.

చిమా చిమా ఆరి వెలిగే విద్యుత్ బల్బుకు తర్జని చూపిస్తూ

గుప్పెడు నక్షత్రాన్ని గుమ్మానికి కడుతుంది.

అటువంటి చెట్టుని నరికేవాడు

“అమ్మస్పర్శకూ ఆత్మ స్పర్శకూ మర్చిపోయినట్టే లెక్క”

మన దేశంలో అనేక ఆనకట్టలు వంతెనలు రోడ్లు పునాదుల్లో పాలమూరు కార్మికుల చెమట ఉంది. వలసల చిరునామా పాలమూరు. ఇంకా పూర్తిగా మారనే లేదు. వాళ్ళ గురించి రాసిన కవిత పేరు కుట్ర దారుని రచన పేరు నాగరికత.

“ఆనకట్ట పొడవునా

పాలమొరు బాధ వినిపిస్తూనే ఉంటుంది.

కళ్లకడ్డం పెట్టుకున్న చేతుల వెనక కన్నీటి చెమ్మలా

లాకుల కింద నీటి పాయ

బిక్కచచ్చిన చేపలతో పాటు పెనుగులాడుతూనే ఉంటుంది.”

అభివృద్ధి జెడిపి దేశంలో అనేక సంపన్న ద్వీపాల్ని ఏర్పాటు చేశాయి. అందులో ఒకటి ముంఐలో నిట్టనిలువుగా ఒక అంతస్త్జుల్లో పెరిగింది. ప్రపంచీకరణ ఆధునిక పారిశ్రామికీకరణ మన సమాజంలో అనూహ్యమైన మార్పుల్ని తీసుకొస్తున్నాయి. దీని అనివార్యత గురించిన అవగాహన లేకపోవడంతో సామాజికంగా ఏర్పడుతున్న మార్పుల్ని కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే వీసాల కోసం ఉద్యోగాల కోసం వివాహాలు జరిగిపోతున్నాయి. అమెరికా సంబంధం అనే కొత్త ప్రయోగం మన సామజిక నిఘంటువులో చేరింది. అట్లా అతిధిలా వచ్చిపోయే అమెరిండియన్ మొగుడి గురించి నిర్మలగారంటున్నారు.

“వీసాలో మీసాలో తక్కువైన కారణంగా

మూడేళ్ళకొక సీజను లెక్క నువ్వొచ్చి పోతుంటే

చావడిలో ఒక్కటెద్దు చాటుచాటుగా నవ్వుతుంది

ఎంతయినా అవి మనకంటే చాలా నయం

ప్రేమయినా పేడయినా స్వేచ్చామాధుర్యంతో ఇవ్వగలుగుతాయి. (సీజనల్ లవ్)

మల్టీ నేషనల్ ముద్దు నిర్మలగారి ప్రసిద్ధ కవిత. అదే పేర్తో సంకలనం వచ్చింది. ప్రపంచీకరణ మల్టీనేషనల్ ఉద్యోగాన్ని ప్రసవించింది. దానితో పాటు అడవుల్నీ నదుల్నీ స్త్రీనీపిల్లల్నీ కూడా వస్త్వీకరణం చేసింది కమాడిఫికేషన్ సౌందర్యం లావణ్యం చిరునవ్వు మర్చమ్డైస్ గా మారిపోయాయి. మధుబాల అలనాడు నవ్వితే మన మీద చిరువెన్నెల జల్లు వంటి దేదో పడేది. ఇవాళ అటువంటి చిరునవ్వు ఏదో వాణిజ్య వస్తువును గుర్తు చేస్తుంది. ఇది అసహజాఅకర్షణీయమైన వస్త్వీకరణ.,

“పొత్తిళ్ళలో నిద్దరోతున్న

చంటిదాని ఒళ్ళు నిమురుతున్నా సరే

కావలసిన కొలతల బెంగ”

జలపాతమే దూకివచ్చినా

స్ట్రాకోసం వెదుకులాడే లిప్ స్టిక్ బెదురు

అల్లుకున్న మన పెదవుల మధ్య వగరుగా

జీవ భౌతిక రుచులు దోచే మల్టీనేషనల్ ముద్దు

అందులోనే క్యాట్ వాక్ గురించి వాక్యాలున్నాయి.

“సర్జరీ సూదులు పరచిన హింసాతల వేదిక మీద

ఉగ్గబట్టిన సౌందర్యాన్ని అభినయించే స్మృతి గాయమూ

మారకపు నిలువే తప్ప

మరేదీ కాదు.”

ఈ కవిత పాఠాలన్నీ సర్జర్తీ సూదులే, అమ్మాయిని సౌందర్యాన్నభినయించే గాయం అంటున్నారామె.

కొండేపూడి నిర్మలగారి కవిత్వం ఇండిక్టిమెంట్ అన్నాను., దానికి అసలు సిసలైన ఉదాహరణ వలసలరాజ్యం అన్న కవిత. విసర్జన గురించి వచ్చిన అరుదైన మంచికవితల్లో ఒకటి. గ్రామీణ మహిళలు పడే నరకం అందరికీ తెలియదు. సహజ దైహిక క్రియల్ని బలవంతంగా నియంత్రించడం వల్ల స్త్రీల ఆరోగ్యం చెడ్డమే కాదు. అనవసరమైన కోపం చికాకు కలిగి అశాంతికి దారి తీస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన బెట్టి ప్రతి గ్రామీణ గృహానికీ టాయిలెట్ నిర్మించడం అవసరం, చివరికి వాటి నిర్మాణంలో కొఓడా నిజాయితీ లేదు. లేడీస్ ఫ్రెండ్లీ టాయిలెట్ లు లేకపోవడం, మహిళాపోలీసులు, కండక్టర్లు పడే ఇబ్బందులు వంటి అందరికీ అవగాహన లేని బాధాకరమైన వాస్తవాలు నిర్మలగారు చెప్తున్నారు.

“నిరంతరం పంటకరిచే రహస్య ధుఃఖం” అన్నప్పుడూ

రేడియం అంకెల్లాంటి రెండు నిలువు కాళ్ళతో

దారీ తెన్నూ లేక నుంచుండిపోయిన..”

మహిళల్ని కారులైట్లలో చూపించినప్పుడూ మనసుకి ఏదో ముల్లు గుచ్చుకుంటుంది. మనది నాగరికదేశం ఎలా అవుతుంది? అని అడగాలనిపిస్తుంది.

ఒకప్పుడు అబ్బాయికి నచ్చడం ఒకటేముఖ్యం. అమ్మాయి అంగీకారం ఎవరికీ అవసరం ఉండేది కాదు. ఇష్టం లేని వ్యక్తితో ఒక జీవితకాలం సాహచర్యం ఎలా ఉంటుందో అట్లా ఏడుపు దిగమింగుతూ బతకడం సాంప్రదాయంలో భాగం అనిపించినప్పుడూ కలిగే నిశ్శబ్దవేదన నిర్మలగారి కవితల్లో తొణీకిసలాడుతుంది. సాహచర్యంలో బాధాకరమైన సందర్భం ఒకటుంది. పంటి బిగువున అన్న కవిత…

నాచు పట్టిన కన్నీటి ఒడ్డున దమ్ముకుంటున్న సంధ్య

ఆపుకోలేని అసహనాన్ని హింసగా తర్జుమా చేస్తున్న

మొరటు చేతుల రాత్రి నాలుగు కాళ్ల రాత్రి

ఆ మొదటి వాక్యం “నాలుగు కాళ్ళ రాత్రి. అనడం నిర్మలగారి ప్రత్యేక పొయెటిక్ ఇడియమ్. వర్తమాన కాలంలో చదువుల వల్ల పిల్లలు తల్లిదమ్డ్రులకి దూరం అయిపోతున్నారు. నిజానికి దానిక్కారణం కూడా తల్లిదండ్రులే బాడీలు అనే కవితలో ఒక అమ్మ అనేకరకాలుగా అమ్మలుగాకన్పిస్తుంది.

మెత్తటి నీళ్ళ చప్పుడు లాంటి నీ మాటల

చిట్టిచేపపిల్లలా గదినిండా ప్రవహిస్తాయి.

గది అక్వేరియం అవుతుండి

తల్లితో మాట్లాడే మాటలు మెత్తటి నీళ్ళచప్పుడులా సోకి చిట్టిచేపల్లా గదిలో తారట్లాడ్డంతో మనసు అక్వేరియం అయిపోతుంది. నిర్మలగారు చాలా తక్కువ కవిత్వ పరిభాష వాడతారు. శి మేడ్ పోయెట్రీ ఆఫ్ స్మాల్ ఆర్డినరీ వర్డ్స్.

అందరికీ హృద్యంగా అనిపించే మొగలి పువ్వు వంటి కవిత “చేప అయినా పద్యం అయినా

“కవ్వించీ కవ్వించె అంత పెద్ద సూర్యబింబమూ వాడి వల్లోనే పడింది.

కోరికమీదా నాలుగు నల్లమబ్బులూ

వాడివల్లోనే వాలాయి.

సూర్యుడ్నీ మబ్బుల్నీ గుళిక రాళ్ళలా దులిపి

చేపలు తట్టకెత్తేడు వాడు

“కోరిక అంటూ ఉంటే లీనం కావాలి

చేపకైనా పద్యానికైనా

చెప్పాపెట్టకుండా నా పద్యం

అతని గంపలో చిక్కుకుంది.

పేరు తెలీని పన్నెండేళ్ళ కుర్రాడి పాదముద్రలు

ఈ పేజీమీద మిగిలిపోయాయి.

నాకు తెలిసి ఎవరూ చిన్న నటుల మీద కవిత్వం రాయలేదు, ఎక్స్ ట్రాలుగా చులకనపడే ఈ నటులు లేకపోతే సినిమా లేదు. కానీ రోజూ అవమానం పాలౌతుంటారు. అటువంటి ఆడనటుల పరిస్థితి ఊహించుకోవచ్చు,. రంగులవలని వెదుక్కుంటూ వచ్చి చిక్కిపోయిన చేపలు వాళ్ళు పెద్ద నటులెవరూ వారి బాగోగుల గురించి పట్టించుకోరు. వారిని నిర్మలగారు పట్టించుకున్నారు.

మనకి రెండు సివిలైజేషనల్ డిసీజ్ లు వ్యాపించాయి. ఒకటి డయాబెటిస్ రెండు ఎయిడ్స్. మృత్యువు కంటే భయం కలిగించే హెచ్.ఐ.వి గురించి కూడా పదునైన కవితలు రాశారు నిర్మలగారు. అది కూడా ఇన్‍డిక్ట్‍మెంట్‍లో భాగమే, హెచ్.ఐ.వి ఉందని తెలిసి కూడా పెళ్ళి చేసుకుని భార్యనీ పిల్లనీ మనుషుల అమాయకత్వానికి వదిలి చచ్చి ఊరుకుంటాడు. భర్త. సామూహిక ఆత్మహత్య నయం అనిపించే సందర్భం అది.

అతడు పోయాకే తెలిసింది.

నాటి పోయిన విషవృక్షపు నీడ” (మూడోప్రపంచయుద్ధం)

అటువంటి పెళ్ళికొడుకుని వైరస్ అంటారామె. ఫలితం విషపువృక్ష నీడ… మరి దాని ఫలితం!

“శీలం ఒక బలహీనమైన దీపం

తలుపు మూస్తే ఊపిరాడదు. తెలిస్తే గాలాడదు.”

అనేకానేక రూపాలలో పార్శ్వాలలో  స్త్రీలను వెన్నంటి ఉండే ధ్వైదీభావాన్ని కొండేపూడి నిర్మలగారు ప్రతిభావంతంగా అనేక కవితల్లో ఎరుకపరిచారు. డాన్సర్ ని రూపాయిబిళ్ళ టాస్ చేసినట్టుందని అనడంలోనే నిర్మలగారు తెలుగు పాఠకులకు చేరువయ్యేరు. మనకి పరిచితం అయిన మిగతా వాదాల్లాగే స్త్రీ వాదం కూడా నీరసపడింది. వాదాలన్నీ అంతే. అది వైఫల్యం కాదు. జీవితానుభవం సాహిత్యానుభవం నిర్మలగారి ప్రాపంచిక ధృక్పధాన్ని ఈ పాటికి ఇంకా విస్తృతం చేసి ఉండాలి. ఒక అనుభవం నిశ్చల బిందువులాగ అలాగే ఉండిపోదు. అది విత్తనం లాగ బహుశాఖీయంగా విస్తరిల్లుతుంది. అందుకే అది సాహిత్యం అవుతుంది. నిర్మలగారి కథారిసిస్ పూర్తయింది. ఇప్పుడు ఆమె చెట్టుకుని చూడాలనుకుంటున్నాను. ఆమెకి నా శుభాకాంక్షలు.

– తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

కొండేపూడి నిర్మల కవిత్వం

పుటలు. 275

రచన: కొండేపూడి నిర్మల

వెల: రూ.150/-

ప్రచురణ: 28-జులై – 2012

 ప్రతులకు :
 టీవీఎస్ రామానుజరావు
ఫ్లాట్ నెం . 205 
కే.కే హైట్స్.
మాసబ్ ట్యాంక్
హైదరాబాద్.
సెల్ : 9989233749
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

 

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో