సంపాదకీయం

 

దేశ ప్రజలకి రక్షణ కల్పించటానికి పటిష్టమైన చట్టాలను రూపొందించి అమలు చేయాల్సిన అధికార పక్ష నేతలే మహిళలపై జరిగే ఆగడాలను ఆపలేమని చేతులెత్తేస్తే జిల్లాలో , గ్రామ స్థాయిల్లో ఉద్యోగాలు చేసే రక్షక భటులు ఎంత వరకు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలరు? ప్రజలు సైతం ఏ భరోసాతో చట్టాన్ని ఆశ్రయించడంలోను , దానిపై నమ్మకం పెట్టుకోగలరు ? పాతికేళ్ల క్రితం M.P  రోడా మిస్త్రీ గల్ఫ్ దేశాలకు పెళ్లి పేరుతో ఎగుమతి అవుతున్న పసిబాలికల విషయంలో చేసిన వ్యాఖ్యలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి . “ మన దేశంలో ఉండి పేదరికం అనుభవించే కంటే విదేశాలకు వెళ్లి సుఖపడటం లో తప్పులేదు కదా “ అని వ్యాఖ్యానించింది .ఆ తర్వాత ప్రజా సంఘాలు ఎదుర్కోవటంతో తాను అలా అనలేదని సర్ది చెప్పుకున్నారు.

మన మంత్రులు , అధికారులు ప్రత్యేకించి మహిళా నేతలు ఆడపిల్లల రక్షణ కోసం చేసిన కృషి చెప్పదగినదిగా లేదు .

డిల్లీలో నిర్భయ సంఘటన తర్వాత షీలా దీక్షిత్ మాట్లాడుతూ “ నా కూతురు కూడా అభద్రతా భావానికి గురవుతూనే వుంది “ అని బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడించారు . ముఖ్య మంత్రి స్థాయిలో వుండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకి అతి సాధారణ మైన విషయంగా అనిపించిందేమో కాని తన ఇంటి బిడ్డలకే రక్షణ కల్పించుకోలేని వ్యక్తి దేశ ఆడ బిడ్డలను ఏం రక్షించగలదు ?. కేవలం పోలీసు భద్రత మీదే ఆధారపడలేమని అనడం లో కేలవం నిస్సహాయత మాత్రమే కనిపిస్తుంది .

రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ రాథోడ్ తన 30 ఏళ్ల కూతురుని ఇంట్లో నిర్బంధిచారు. సిద్ధార్థ ముఖర్జీ అనే వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడకుండా జస్టిస్ రాఘవేంద్ర తన కూతుర్ని బంధించటం చూస్తే ఏస్థాయిలో ఉన్న వ్యక్తులైనా ఆడ పిల్లల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారనే అనిపిస్తుంది .

నిన్న గాక మొన్న మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ . ఆర్ పాటిల్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లుబుచ్చాడు . ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రాలో నేరాల సంఖ్య తక్కువగా ఉందని సంతృప్తి పడ్డారు . ఇంటికో పోలీసును కాపలా పెట్టినా కూడా అత్యాచారాలను ఆపలేమని , నైతిక విషయాలు దిగజారితేనే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు .

500 వాహనాల్ని ఏర్పాటు చేసి వాహనానికి ఒక మహిళా పోలీసు అధికారి చొప్పున నియమించి ఒక క్రొత్త పధకాన్ని ప్రవేశ పెట్టబోతున్నారట .ఇక స్త్రీల రక్షణని మహిళా పోలీసులే చూసుకోవాలన్నమాట .

సమాజ్ వాది అధినేత మూలాయింగ్ సింగ్ యాదవ్ కూడా అబ్బాయిలు అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా , తప్పులు చేస్తే ఉరి తీసేస్తారా ? “ అంటూ నేరస్తులకి వంత పాడటం … అలాగే తప్పులు చేయడం అబ్బాయిల హక్కుగా అనే భావ జాలాన్ని అబ్బాయిల మెదళ్ళలో ప్రవేశ పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన విషయం .ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ అదే పార్టీకి చెందిన నేత అబూ అజ్మీ ఇంకా తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు ” ఇస్లాం ప్రకారం వివాహేతర సంబంధాలు కలిగిన మహిళలను , అత్యాచార నిందితులతో బాటు బాధితులను కూడా ఉరి తీయాలని వివాదాస్పద వ్యాఖ్యలను చేసారు .

ఉత్తర ప్రదేశ్ లో ఒక సంఘటనలో ఇద్దరు బాలికలను , మరొక సంఘటనలో 45 ఏళ్ల మహిళ పై సాముహిక అత్యాచారం చేసి చెట్టుకి ఉరి తీయడం అనేది అత్యంత దారుణమైన విషయం . ఇన్ని సంఘటనలు కన్పిస్తున్నా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర ప్రదేశ్ లోని శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది .

ఇవన్నీ ఇలా ఉంటె జరిగే అత్యాచారాలు , మారణ కాండలు జరుగుతూనే ఉన్నాయి . ఎంతో కాలంగా పరిష్కారం కాని అత్యాచార కేసులు , న్యాయం కోసం అంగలారుస్తూనే ఉన్నాయి .

అత్యాచార కేసుల్లో దేశ మంత్రులే ఉండటం , వారు ఇంకా పదవుల్లో కొనసాగటం చూస్తుంటే మహిళల హింస పై అధికారులకు , ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో తెలుస్తుంది .

ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న వరస సంఘటనలలో , మహిళల్ని , బాలికల్ని అత్యాచారం చేసి చంపటం ఒక అలవాటుగా మారింది . ఇటివల మహిళా జడ్జి పైనే అత్యాచారం జరగటం , పురుగుల మందు తాగించి హత్య కూడా చేయడానికి ప్రయత్నిచడం చూస్తే ఇంక జడ్జి పరిస్థితే ఇలా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు .

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~~~~~~~~~~~~“

సంపాదకీయంPermalink

4 Responses to సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో