“లోక నింద”(కవిత ) – డేగల అనితాసూరి.

రాజ్య కాంక్ష సత్య ధర్మ ప్రలోభం కీర్తి కండూతుల తపన వంశ ప్రతిష్టల డాంభికం స్వర్గ వాసపు మోక్ష పిపాస తనకుమాలిన శీల పరీక్ష ప్రజాసంక్షేమపు ముసుగుతో నిర్ధాక్షిణ్యంగా వ్రతం చెడిన పాతివ్రత్యానికి వనవాసపు వెలివేసి వేడుక చూసింది! నట్టనడి సభలో వలువలూడ్వ బోయింది! నగర నడిబొడ్డున వేలమేసి అమ్మింది! పాషాణ హృదయంతో కఠిన శిలగ మార్చింది! ఏమార్చి సబలను చేయగ మూడవ కన్ను కాజేసింది! అయినా .. ప్రశ్నించిన నేరానికి పలుకాకులన్న నిందనుమోస్తూ తరతరాలుగా బలౌతోంది మాత్రం.. పా..పం! పిచ్చి దైన ఈ […]

Read more

ఓ రాత్రీ…!(కవిత )- అనితా సూరి డేగల

నా కన్నీళ్ళను నీ తలగడ గుండెలో పొదువుకుని నా దుఃఖాన్ని నీ దుప్పటి ఒడిలో దాచుకుని నా వెక్కిళ్ళకు నీ కీచురాళ్ళ రొదను జతచేసి నా ఓదార్పుకు నీ స్వప్నాలను ఊహగా ఇచ్చేసి నా కష్టాలకు నీ చీకటిని తోడిచ్చి నా సంతోషాలకు నీ వెన్నెలను పంచిచ్చి వెళ్ళిపోయావా.. వేకువ వచ్చేసి మళ్ళిపోయావా.. మెలకువనిచ్చేసి                                        – డేగల […]

Read more

*”మర చెరలో చిక్కిన బాల్యం”*(కవిత )-డేగల అనితాసూరి

ఎప్పుడూ టచ్ స్క్రీన్ తోనే చేతులు కళ్ళు కట్టిపడేసుకున్న అమ్మా నాన్నలకు ఉప్పెక్కించుకునే తీరికెక్కడిది? జీడిపాకం సీరియళ్ళకై అంగలార్చే అమ్మమ్మలు తాతయ్యలకు పేదరాశిపెద్దమ్మ కథలు చెప్పే ఓపికెక్కడిది? ర్యాంకుల రాట్నానికి మెదళ్ళను కట్టే విలువలు మరిచిన చదువులకు ఫీజుల వసూళ్ళపై తప్ప ఆటలు వ్యక్తిత్వ వికాసాలపై శ్రద్ధెక్కడిది? కుంచించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో ఇరుకు ఇళ్ళలో చేరిపలకరింపులు మరిచిన ఇరుగుపొరుగులతో బాల్యస్నేహాల బంధమెక్కడిది? అందుకే… ఆకర్షణమత్తుతో ఆహ్వానించే అంతర్జాల మాంత్రికుని కబంధహస్తాల్లో పొంచివున్న ముఖపుస్తక సందేశాలు అసాంఘిక మాధ్యమాల ఇనుపసంకెళ్ళు బ్లూవేల్ వంటి భ్రష్ఠుపట్టిన ఆటలకు […]

Read more

*గ ‘మ్మత్తు ‘ తెర*(కవిత )-డేగల అనితా సూరి

బలహీనతల బంధనాల్లో రంగుల ప్రపంచం బందీ అయ్యాక జనం మనసులకు వలవేసి వల్లించిన నీతులు సందేశాలు పొగ చూరిపోయి కిక్కిచ్చే మాఫియా బాహుబలికి సాహో అంటూ సాగిలబడుతోంది ఆదర్శాలన్నీ వెండితెరపై  క్రుమ్మరించి  మాయపొరల వేదికపై ప్రక్కదారిలో ప్రదర్శింపబడుతోంది అభినవ ‘నట ‘ వైభవం! అభిమానపు మత్తు తలకెక్కించుకుని తనను తన వాళ్ళను విస్మరించి శ్రమను రక్తాన్ని భవితను అనాలోచితంగా ధారపోసే నేటి యువత మాత్రం వీడలేకుంది పైత్యపు కళ్ళను కమ్మేసిన కెమెరా నీడల నీలి జత  -డేగల అనితా సూరి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more

మనసుకు మరోరూపం (కథ ) -డేగల అనితాసూరి

కొందర్ని చూడగానే మంచి అభిప్రాయం ఇట్టే వచ్చేస్తుంది. అలాగే ఎందుకో తెలియదు గానీ మరి కొందర్ని చూస్తూనే అనవసర చిరాకు మనలో తొంగిచూస్తుంది. అంటే, కళ్ళు రూపాన్ని చూసి మనసును అంచనా వేస్తుందా? అది నిజమేనా?అంటే- నూటికి నూరుపాళ్ళు అవుననే నమ్ముతుంది సుమలత. ఆమె అంచనా ప్రకారం మనిషి నైజమేంటో ఇట్టే పసిగట్టేయడం లో ముఖం మనసుకు అద్దం లాంటిదని తన ప్రగాఢ విశ్వాసం. “అయ్య బాబోయ్! అప్పుడే పదిగంటలు అవుతోందా?” కంగారుగా రిస్ట్ వాచ్ కేసి చూస్కుని ఆఫీసుకు టైమై పోతుండటం తో […]

Read more

“నేటి విద్యార్ధి”(కవిత )- డేగల అనితాసూరి

నిన్నటిరాత్రి చేసిన హోమ్‌వర్కుల తాలూకు చిక్కులకల చెదరకముందే స్పర్శతెరల గంపలోని తొలికోడి బద్దకపు భరతంపడుతూ కూస్తుంది ఉదయపు కిరణాలనే కళ్ళు ఇంకా జీర్ణించుకోలేదేమో అమ్మ చేయి ఆదుర్దాపడుతూ వండిన ఉపాహారం బల్లమీదే మిగిలిపోయి పేలవంగా నవ్వుకుంది క్రమ ‘శిక్ష ‘ ణ కు మారుపేరైన కార్పో’రేట్ ‘ విద్య పాఠాలకోసం ఇంటర్నెట్ హస్తాన్ని వెదుక్కొమ్మని సిగ్గువిడిచి చేతగానితనాన్ని చాటుకొంటోంది ఎన్నో ఆటలాడి సాహసాలుచేసిన కన్నయ్యకే సవాలుచేస్తూ నేటి విద్యార్ధి వెన్నముద్దల్లాంటి నవ్వుల్ని జామెండ్రీ బాక్సుల్లో పరుగెత్తాల్సిన పాదాల్ని బూట్లఖైదులో అనుభూతించాల్సిన బాల్యాన్ని కాలపుకోరల్లో వదిలేసి […]

Read more

చేజారిన వసంతాలు(కవిత )- డేగల అనితా సూరి

బాధ్యతలు బాదరబందీలో పడి ఋతుశోభను విస్మరించా ! నిమిషాల ముల్లుతో పోటీ పడుతూ కాల చక్రం నుంచే వెలివేయబడ్డా ! కోయిల గొంతు విని ఎప్పుడో విన్నట్లుందని బుర్ర గోక్కున్నా 1 అసంకల్పితంగా ఆకాశంవంక చూసి ఎప్పుడో చేజారిన వస్తువు మళ్లీ చేరువైనట్టు అచ్చెరు వొందా! ఏ.సి . గదులకై అర్రులు చాస్తూ ఓ.సి.గా వచ్చే పిల్లతెమ్మెరనైనా ఆస్వాదించలేని అభాగ్యనయ్యా ! మామిడాకుల వాసనకు మరుగున పడిన గతాన్ని అర్ధంగా తడుముకున్నా ఇల్లు – పిల్లలు – ఉద్యోగం అన్న ముప్పేట దాడికి లొంగి […]

Read more