ఓ రాత్రీ…!(కవిత )- అనితా సూరి డేగల

నా కన్నీళ్ళను
నీ తలగడ గుండెలో పొదువుకుని
నా దుఃఖాన్ని
నీ దుప్పటి ఒడిలో దాచుకుని
నా వెక్కిళ్ళకు
నీ కీచురాళ్ళ రొదను జతచేసి
నా ఓదార్పుకు
నీ స్వప్నాలను ఊహగా ఇచ్చేసి
నా కష్టాలకు
నీ చీకటిని తోడిచ్చి
నా సంతోషాలకు
నీ వెన్నెలను పంచిచ్చి
వెళ్ళిపోయావా..
వేకువ వచ్చేసి
మళ్ళిపోయావా..
మెలకువనిచ్చేసి

                                       – డేగల ఆనితాసూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

3 Responses to ఓ రాత్రీ…!(కవిత )- అనితా సూరి డేగల

 1. వెంకటేశ్వరరావు says:

  మళ్ళీ
  మళ్ళీ
  వచ్చే
  రాత్రి
  కోసం
  కన్నీళ్లు
  కార్చడం
  న్యాయమా

  నిద్రలో
  మునిగి
  మెలకువ
  వచ్చాక
  వేకువ
  వెలుగును
  చూడలేక
  పోవడం
  ధర్మమా

  అనితర
  సాధ్యమైన
  కార్యాలు
  చేయగల
  మహిళ
  ఎదుటివారి
  కన్నీటిని
  తుడిచే
  ప్రయత్నం
  చేయకుండా
  చీకటినే
  చూడాలని
  అనుకోవడం
  సమంజసమా

  • Anitha says:

   మళ్ళీ మళ్ళీ వచ్చే రాత్రి వెళ్ళిపోయిందనో, చీకటే కావాలనో కాదండి ఈ కవిత. దఃఖ సమయాన్ని చీకటి కూడా ఓదార్చగలదని అర్ధం. వెలుగులోని ధైర్యమే కాదు, చీకటి తెచ్చే నిద్ర, కలలు కూడా స్వాంతన ఇస్తాయని అర్ధం. విమర్శ అర్ధవంతమైతే ఆనందం మరియు ప్రోత్సాహం అవుతుందని గమనించ ప్రార్ధన. వ్యంగ్యం కాదు. ధన్యవాదములు.

   • వెంకటేశ్వరరావు says:

    నా విమర్శకు జవాబు ఇచ్చిన చాలా తక్కువమందిలో మీరొకరు. మొదటిగా దీనికి మీకు నేను మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు.తెలుపుకుంటున్నాను.

    నా విమర్శలో వ్యంగ్యమున్నమాట నిజమే. దీన్ని మార్చుకోవడానికి నేను సిద్దమే.

    మీ ఈ చిన్న మినీ కవితను ఎవరైనా యిట్టే అర్ధం చేసుకుంటారు. మళ్ళీ మళ్ళీ వచ్చే రాత్రి అంటే ఎప్పుడూ అందరికి వచ్చే కష్టాలు అని నా ఉద్దేశ్యము.

    ఈ విహంగ మహిళా పత్రిక ద్వారా ప్రతి స్త్రీ తమకు తామే తన కష్టాల్ని ఎదుర్కొని, ఎదుటివారి కష్టాల్ని కూడా తొలగించగలిగే మనోధైర్యాన్ని అందజేయగలిగే రీతిలో మన కవితలుండాలని నా అభిప్రాయం.

    అతి విలువైన జీవితాన్ని ఓదార్పు ఊరట పేరుతొ రాత్రంతా వినియోగించకుండా సమస్యల్ని, దుఃఖాన్ని పోగొట్టే పరిష్కార మంత్రాన్ని కనిపెట్టే ఆలోచనలకి స్వాగతంపలికే వెలుగును ప్రసాదించే పగటిని ఎందుకు ఆహ్వానించకూడదు అని అనుకుంటున్నాను. దుఃఖం రాకుండా దుఃఖాన్ని పోగొట్టే పరిష్కారమార్గాల్ని విహంగ ద్వారా
    అందరికి చేరవేయమంటున్నాను.

    కష్టాల
    దుఃఖాలు
    జీవితంలో
    చీకటి
    రాత్రిలా
    సహజమైన
    గుణాలు

    ఆనందం
    దైర్యం
    జీవితంలో
    పగటి
    వెలుగులా
    చైతన్య
    గుణాలు

    కష్టాల్ని
    రాత్రి
    నిద్రలో
    మరచి
    ఆనందాల
    పగటి
    కోసం
    ఎదురు
    చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)