ఈ ప్రేమ జ్వరం కూడా
భలే చిత్రమయింది
ఎలాంటి ఆరోగ్యం
ఎలాంటి స్టితికొచ్చింది
-అక్బర్ ఇలాహాబాదీ
ప్రేమను త్యాగం చేసి కూడా
ఆమె హుందాగా ప్రవర్తిస్తుంది
నన్నెవరైనా ఏడిపిస్తే
తానెంతో పరితపిస్తుంది
-ఇబ్రహీం
నీ కళ్ళని చూసి
నేనెంతో సంబరపడతా
ఆమెని కంటి నిండా చూసి రావయ్యా
ఓ నా తపాలా బంట్రో తా !
-జలీల్ మానక్ పురీ
నీ నయన పుటందాలు
నర్గీస్ పూలకే వన్నె తెచ్చాయి
ఇవాళ తోటలోని పూలన్నీ
కంటినిండుగా విరబూశాయి
-సయీద్ ఆహామీద్ అఖ్తర్
-– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~