“లోక నింద”(కవిత ) – డేగల అనితాసూరి.

రాజ్య కాంక్ష
సత్య ధర్మ ప్రలోభం
కీర్తి కండూతుల తపన
వంశ ప్రతిష్టల డాంభికం
స్వర్గ వాసపు మోక్ష పిపాస
తనకుమాలిన శీల పరీక్ష
ప్రజాసంక్షేమపు ముసుగుతో
నిర్ధాక్షిణ్యంగా
వ్రతం చెడిన పాతివ్రత్యానికి
వనవాసపు వెలివేసి
వేడుక చూసింది!
నట్టనడి సభలో
వలువలూడ్వ బోయింది!
నగర నడిబొడ్డున
వేలమేసి అమ్మింది!
పాషాణ హృదయంతో
కఠిన శిలగ మార్చింది!
ఏమార్చి సబలను చేయగ
మూడవ కన్ను కాజేసింది!
అయినా ..
ప్రశ్నించిన నేరానికి
పలుకాకులన్న నిందనుమోస్తూ
తరతరాలుగా బలౌతోంది మాత్రం..
పా..పం!
పిచ్చి దైన ఈ లోకం!!

— డేగల అనితాసూరి.
“““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““`

కవితలు, , , , Permalink

Comments are closed.