“నేటి విద్యార్ధి”(కవిత )- డేగల అనితాసూరి

నిన్నటిరాత్రి చేసిన
హోమ్‌వర్కుల తాలూకు చిక్కులకల
చెదరకముందే
స్పర్శతెరల గంపలోని తొలికోడి
బద్దకపు భరతంపడుతూ కూస్తుంది
ఉదయపు కిరణాలనే కళ్ళు
ఇంకా జీర్ణించుకోలేదేమో
అమ్మ చేయి ఆదుర్దాపడుతూ వండిన ఉపాహారం
బల్లమీదే మిగిలిపోయి పేలవంగా నవ్వుకుంది
క్రమ ‘శిక్ష ‘ ణ కు మారుపేరైన కార్పో’రేట్ ‘ విద్య
పాఠాలకోసం ఇంటర్నెట్ హస్తాన్ని వెదుక్కొమ్మని
సిగ్గువిడిచి చేతగానితనాన్ని చాటుకొంటోంది
ఎన్నో ఆటలాడి సాహసాలుచేసిన కన్నయ్యకే
సవాలుచేస్తూ నేటి విద్యార్ధి
వెన్నముద్దల్లాంటి నవ్వుల్ని జామెండ్రీ బాక్సుల్లో
పరుగెత్తాల్సిన పాదాల్ని బూట్లఖైదులో
అనుభూతించాల్సిన బాల్యాన్ని
కాలపుకోరల్లో వదిలేసి
కలాన్ని మురళిగా కాగితాన్ని నెమలిఫించంగా ధరించి
భవిష్యత్తనే పుస్తకాల బ్యాగుని
గోవర్ధనగిరిలా నిత్యం మోస్తూనే
యాజమాన్యమనే ప్రజలను కావగా
తిరుగాడుతున్నారు ఎందరెందరో
మన కలియుగ చిన్నికృష్ణులు!

                                 -డేగల అనితాసూరి

కవితలుPermalink

One Response to “నేటి విద్యార్ధి”(కవిత )- డేగల అనితాసూరి

  1. వెంకటేశ్వరరావు says:

    కవిత బాగుంది కానీ మీరనుకుంటే దీన్ని ఇంకా బాగా వ్రాయొచ్చు అని నేననుకుంటున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)