నీరజ(కథ )-లహరి పప్పు

“అమ్మా నీరజా ! తమ్ముడూ, మరదలూ ఇద్దర్నీ అక్షింతలు వేసి ఆశీర్వదించమ్మా” అన్న పురోహితుని మాటలతో ఈ లోకంలోకి వచ్చింది నీరజ. తను మనిషి అయితే అక్కడ వుంది కానీ మనసు మాత్రం పెళ్ళి మీద లేదు. తండ్రి ఙ్ఞాపకాలు, ఈ మధ్యే తెలిసిన చేదు నిజాలు గతంలోకి వెళ్ళకుండా నిలవనివ్వట్లేదు.

పరంధామయ్య గారి పెద్ద కూతురు నీరజ. తరువాత నలుగురు చెల్లెళ్ళు. ప్రతీసారీ మగసంతానం కోసం పరంధామయ్య గారి ఎదురుచూపులు భార్య ఆరవ కాన్పులో రమణ రాకతో ఫలించాయి. నీరజ కంటా పద్ధెనిమిదేళ్ళు చిన్నవాడు. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళి అతనిదే.

ఆరుగురు పిల్లలు, ఎప్పుడూ వచ్చిపోయే బంథు వులతో నిండుగా వుండే గంపెడు సంసారాన్ని పరంధామయ్యగారు తన ఒక్కరి సంపాదనమీదే నెట్టుకొచ్చేవారు. అతను ఆ ఊరి హైస్కూల్ లో లెక్కలు మాస్టారు. లెక్కలు చెప్పడంలో దిట్ట.

నీరజ కాలేజీలో డిగ్రీ చేసే సమయంలో తండ్రి స్కూలు పిల్లలకి లెక్కలు, ఇంగ్లీషు ట్యూషన్లు చెపుతూ, చెల్లెళ్ళకి తమ్ముడికి చదువులో, తల్లికి ఇంటిపనిలో సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండేది.

తండ్రికి వీలైనంత ఇంకా ఆర్ధికంగా సాయపడాలనే ఉద్దేశ్యంతో మ్యాధ్స్ సైన్సు సబ్జెక్టులతో బిఇడి పూర్తి చేసి అదే స్కూల్లో మ్యాధ్స్ టీచర్ గా ఉద్యోగం సంపాదించింది. అన్ని రకాలుగా నీరజ సహాయ సహకారాలతో పరంధామయ్యగారి సంసారనౌక సజావుగా సాగుతోంది.

నీరజ అందం, చదువు, ఓర్పు చూసి చాలా సంబంధాలు రాసాగాయి. కూతురికి పెళ్ళి చెయ్యాల్సిన సమయం ఆసన్నమైందని ఓ రోజు పరంధామయ్య గారి భార్య అతనితో “ ఏవండీ, పెద్దదానికి పెళ్ళీడు వచ్చింది, దీన్ని ఒక అయ్యచేతులో పెడితే, కొంత బరువు తీరుతుంది. తరవాత ఇంకా నలుగురు అమ్మాయిలు ఉన్నారు. వస్తున్న వాటిల్లో ఒక మంచి సంబంధం చూసి వీలయినంత త్వరగా కానిచేద్దాం” అంది.

పరంధామయ్య గారు కూడా భార్య మాటకి వంత పాడుతూ “అవును సరిగ్గా చెప్పావు, నేనూ అదే అలోచిస్తున్నా, మన ఊర్లోనే మూర్తిగారి అబ్బాయి రామక్రిష్ణ LIC లో ఫీల్డ్ ఆఫీసర్, మంచి చదువు ఉద్యోగం, పైగా మంచి కుటుంబం. నీరజని చూసుకోడానికి రమ్మని కబురు చేస్తాను“ అన్నారు.

వారం రోజుల్లో వాళ్ళు రావడం, నీరజ అన్ని విధాలా నచ్చి నిశ్చితార్ధం చేసుకొని సంబంధం ఖాయం చేసుకోవడం జరిగిపోయాయి. నీరజకి కూడా అబ్బాయి నచ్చటంతో పెళ్ళి తరువాత అందమైన జీవితాన్ని ఊహించుకొంటూ సంబరంగా రోజులు గడుపుతోంది. ఇంక పెళ్ళి దగ్గర పడుతోందనగా ఒక రోజు పరంధామయ్య గారు భార్యని పిలిచి “ ఏమోయ్.. మనపిల్ల జాతకం వాళ్ళబ్బాయి జాతకం నప్పలేదట. అందుకని, వాళ్ళు వేరే సంబంధాలు చూసుకుంటున్నారుట. ఇప్పుడే వాళ్ళ నాన్నగారుస్కూలుకి వచ్చి చెప్పి వెళ్ళారు, ..
ఈ విషయం పిల్లలెవరూ లేకుండా చూసి నీకు చెప్తున్నాను, పెద్దది వింటే భాధపడుతుంది. దానికి ఏదో రకంగా నెమ్మదిగా సమయం చూసుకొని నువ్వే చెప్పు, వేరే సంబంధం ఇంతకంటా మంచిది చూసే ప్రయత్నం చేస్తాను“ అని చెప్తుండగా నీరజ రావటం తన చెవిన పడటం జరిగిపోయాయి.

నీరజ కి ఒక్కసారి వింటున్నది కలో నిజమో అర్ధం కాలేదు ” జాతకాలు కలవలేదా? మరి ఆ సంగతి ముందే చూసుకోకుండా నిశ్చితార్ధం ఎలా చేసుకొన్నారు? ఇంత దాకా రానిచ్చి ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి ఉందనగా ఇదేంటి? వేరే ఏమన్నా కారణం ఉండి ఉంటుందా? ఉంటే నిర్మొహమాటంగా అదే చెప్పచు కదా?” వంద ప్రశ్నలు తనని చుట్టుముట్టాయి. ఆ రాత్రి అంతా అలోచనలతో కన్నీళ్ళతో ఎలా తెల్లారిందో తెలీలేదు. తెల్లవారేసరికి ఒక నిశ్చయానికి వచ్చింది నీరజ. అమ్మ తనకి చెప్పినా తను బాధ పడినట్టు కనిపించకూడదు. తను బాధ పడితే అది చూసి తల్లి తండ్రి ఇంకా తల్లడిల్లిపోతారు. జరిగిన దాంట్లో తన ప్రమేయం కాని తప్పు కాని ఏమీ లేదు కాబట్టి తనకి పట్టనట్టే ఉండాలని, ఉండలేకపోయినా తన వాళ్ళ ముందు అలా నటించాలని నిర్ణయించుకొంది.

తరువాత చాలా సంబంధాలు వచ్చాయి కాని వచ్చిన ప్రతీ వాళ్ళూ చూసి వెళ్ళటం, తరువాత ఏదో వంక పెట్టి వద్దు అని రాయటం నీరజకి అలవాటు అయిపోయింది. అమ్మా నాన్న తమ బాధ్యతలు పూర్తి చెయ్యడంలో కారణం తెలీకుండానే తానో అడ్డంకిగా తయారయ్యననే బాధ నీరజని పీడిస్తోంది. ఈ లోపే నీరజ చెల్లి ఒక అబ్బాయిని ప్రేమించటం, ఆ అబ్బాయి వాళ్ళు ఇంటికి ఒచ్చి అభ్యంతరం లేకపోతే రెండో అమ్మాయిని చేసుకొంటామని అడగటం జరిగాయి. పరంధామయ్యగారు అందుకు ఒప్పుకోలేదు. పెద్ద అమ్మాయి పెళ్ళి జరగకుండా చిన్నవాళ్ళ పెళ్ళి ప్రసక్తి తేవద్దని చెప్పి పంపేసారు. ఆ ఉద్వేగంలో మంచాన పడ్డ ఆయన మళ్ళీ కోలుకోలేదు.

కాలచక్రం తనకి ఎటువంటి పరిసిస్థులతో ప్రశ్నలతో సంబంధం లేదనట్టు 25 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. పరంధామయ్యగారు నీరజ సంబంధం తప్పిన రెండేళ్ళలో బాగా కుంగిపోయి గుండెజబ్బుతో ప్రాణాలు వదిలారు. ఆఖరి నిమిషంలో నీరజతో ఏదో చెప్పాలని ఎంతో ప్రయత్నించి వీలు పడకుండానే చనిపోయరు. తండ్రి తరువాత నీరజే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యింది. తల్లిని ఒదార్చి ఒప్పించి చెళ్ళెళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం ఘనంగా జరిపించింది. తమ్ముడు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం వేరే ఊరిలో రావటంతో అక్కడ స్ధిరపడ్డాడు. తల్లి ఏడాది క్రితం అరోగ్యం బాగోలేక నీరజ ఒడిలోనే ప్రాణాలు ఒదిలింది. నీరజ తల్లితండ్రుల జ్ఞాపకంగా ఆ ఇంట్లో ఉంటూ తన ఒంటరితనాన్ని మర్చిపొడానికి పూర్తిగా ఉద్యోగంలో మునిగిపోయి కాలం గడుపుతోంది. తమ్ముడి పెళ్ళి ఒకటే ఇంక తన మీద ఉన్న బాధ్యత. అది కూడ పూర్తి చేసుకొనే సమయం రావడంతో తమ్ముడికి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది.

కొన్ని నెలల క్రితం వచ్చిన ఒక సంబంధం తాలుకా వివరాలు అన్ని నచ్చటంతో అమ్మాయిని చూడటానికి నీరజ, పెద్ద చెల్లి, తమ్ముడు రమణ, అమ్మాయి ఇంటికి హైదరాబాదు వెళ్ళారు. అక్కడ పెళ్ళి చూపుల్లో అమ్మాయి తండ్రిని చూసిన దగ్గర నుండీ నీరజ ద్రుష్తి అంతా అతని మీదే ఉంది. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. అతను కూడ నీరజని తదేకంగా చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకొటానికి ప్రయత్నిస్టున్నటు ఉన్నాడు. పెళ్ళి చూపులు జరిగాయి, అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చారు, ‘జాతకాలు కూడా కలిసాయి ఇంక ముహూర్తాలు పెట్టుకొవటమే తరువాయి’ అన్న పంతులుగారి మాటలతో నీరజకి గుర్తొచ్చింది “ఔను, తనని మొదటి సారి చూడటానికి వచ్చి చివర్లో జాతకలు నప్పలేదు అని చెప్పిన రామక్రిష్ణ ఇతనే. తన జీవితంలో సమాధానం లేని ప్రశ్నకి కారణం అయిన వాడు. వాళ్ళ అమ్మయా ఈ అమ్మయి? ఆ సంబంధం జాతకాల వంక పెట్టి వీళ్ళు ఒద్దన్న పాపానికి ఆ నోట ఈ నోట అది వంద పుకార్లకు తావిచ్చి తను ఇవాళ ఇలా ఉండిపోటనికి కారణం పరోక్షంగా అతనే కదూ? కారణం ఎంటో ఇప్పుడు ఇంచుమించు రిటైర్ అయ్యే వయసులో తనకి తెలుసుకోవడం అవసరమా? ” నీరజ ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక బయటకి వచ్చేసింది. అదే క్షణంలో రామక్రిష్ణ కూడా ఏదో గుర్తొచ్చిన వాడిలా ఇంట్లోకి వెళ్ళి తన తండ్రి ఙ్ఞాపకార్ధం దాచుకొన్న ట్రంకుపెట్టెలో బాగా నలిగిపోయిన ఒక నీలం రంగు కాగితన్ని తీసి బయట నిలబడి ఉన్న నీరజ చేతిలో పెట్టి “తరువాత చదవండి, అంతా తెలుస్తుంది, అప్పట్లో తప్పు అని తెలిసినా తండ్రి మాటకి ఎదురు చెప్పలేని అసమర్ధుడిని నన్ను క్షమించి, దయచేసి లోపలకి వచ్చి ఈ పెళ్ళి జరగనీయండి” అని గబ గబా వెళ్ళిపోయాడు.

నీరజ వణుకుతున్న చేతులతో ఆ కాగితాన్ని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని లోపలకి ఒచ్చింది. సంబంధం ఖాయం చేసుకొని ఒచ్చే ముహూర్తానికే పెళ్ళి చేసెయ్యాలి అని నిర్ణయం తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరారు. ట్రైన్లో అందరూ పడుకొని ఉందగా నీరజ ఆ కాగితం తీసింది. ఉత్తరం రామక్రిష్ణ తండ్రిని ఉద్దేశించబడి ఉంది. సారంశం “నీరజ అనే అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, అప్పటికే ఉద్యోగం నెపంతో తల్లి తండ్రుల కళ్ళుగప్పి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో తిరిగింది . కాబట్టి వేరే సంబంధం చూసుకొంటే మంచిది” అని. అంత కంటా నీరజని నిశ్చేష్టురాలిని చేసిన విషయం – ఆ నీలం రంగు కాగితం తన తండ్రి ఎప్పుడూ అందరికీ ఉత్తరాలు వ్రాయడానికి వాడేది, అలాగే ఆ చేతి వ్రాత తన ప్రాణప్రదమైన తన తండ్రిది.
నీరజకి ఒక్కసారి తల తిరిగినట్టు అయింది.

“కుటుంబ భారానికి భయపడి నన్ను సమిధను చేసావా నాన్నా? నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపొతే మళ్ళీ అర్ధిక ఇబ్బందులు తప్పవని ఈ పని చేసావా? ఇన్నాళ్ళూ కారణం తెలుసుకోవాలి అనుకొన్నాను, ఇప్పుడు తెలిసాక ఇది తట్టుకోవటం నా వల్ల సాధ్యమేనా? ఈ గరళాన్ని జీవితాంతం నాతో పాటే మోయలా నాన్నా? ” తండ్రి ఆఖరి నిముషంలో ఏం చెప్దాం అనుకున్నారో, ఎందుకు అంతలా కుంగిపోయరో అప్పుడు అర్ధం అయింది నీరజ కి. గబగబా వెళ్ళి మొఖం కడుకొని ఒచ్చి కూర్చొందే కాని దుఃఖం ఆపుకోలేకపోతోంది. రాత్రంతా ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచు కుంటూనే ఉంది.

ఊరు చేరాక తమ్ముడి పెళ్ళి పనులన్నీ చక చకా జరిపించి తమ్ముడిని మరదల్ని అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇంక తన అవసరం అక్కడ లేదని చెల్లికి చెప్పి ఊరికి బయలుదేరింది. వెళ్ళే దారిలో ఆటోలో పాట వస్తోంది “ఆటు పోటు ఘటనలివి, ఆట విడుపు నటనలివి, ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి”..

 

–లహరి పప్పు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

5 Responses to నీరజ(కథ )-లహరి పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో