పూర్వాక్రమణం – క్రిష్ణ వేణి

స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల గురించిన ఎరుక అందరికీ ఉంది.

పురుషులకి ఏ కష్టాలూ, సమస్యలూ లేవనా! వాళ్ళ గురించి ఒక్కసారీ ఆలోచించమేం మనం? లింగబేధాన్ని పక్కనపెడితే, న్యాయం పొందడం అన్నది ప్రతీ మనిషికీ ఉండే హక్కు. ప్రాణం ఉన్న ప్రతీ జీవీ ఏదో ఒక రకమైన కష్టాన్ని ఎదురుకుంటుంది.

పురుషులు పడుతున్న కష్టాలేమిటనా! స్త్రీల రక్షణకోసమని ఏర్పాటు చేయబడిన చట్టాలవల్ల ఇప్పుడు వీరు ఇబ్బందిపడుతున్నారు. అలాగా, ఇలాగా కాదు. బహు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. స్త్రీల రక్షణ చట్టాలు పురుషుల పట్ల ఆయుధాలగా ఉపయోగపడుతున్నాయి.

పెళ్ళయి, వివాహేతర సంబంధాల్లో ఉన్న స్త్రీలు వరకట్న వేధింపులనీ, గృహహింస కేసులనీ భర్తలమీద వేయడం చాలా సామాన్యం. స్త్రీలకి అనుగుణంగా అనేకమైన చట్టాలున్నాయి. కానీ తమ జెండర్ వల్ల పొందిన లాభంతో పురుషుల జీవితాలనీ మరియు కుటుంబాలనీ నాశనం చేసే హక్కు స్త్రీలకుందా?

తన మీద ఒక కేసంటూ పడ్డాక, పోలీసు స్టేషన్లోకి అడుగుపెట్టిన మొదటిసారే, గౌరవనీయుడైతే కనుక- పురుషుడు మరణిస్తాడు. అక్కడ ఎదురయే అవమానం, వేధింపే చాలు దానికి. భారతదేశంలో ఉన్న లింగ పక్షపాత చట్టాల వల్ల అనేకమంది ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ చట్టాలకి బలయే పురుషులు ఎంతమందో! కుటుంబాలెన్నో!
పెళ్ళి అన్నది ఒక విదమైన బంధం, ఒక జీవితకాలపు బంధం అనుకుంటాం మనం. విడాకుల గురించి ఆలోచించేవారం కాదు ముందు. ఇప్పుడు విడాకుల రేట్లు ఇంచుమించు 30-40%. ఈ సందర్భాల్లో, తప్పు ఎప్పుడూ పురుషులమీదే మోపబడుతుంది. వారిని కాపాడే చట్టమేదీ లేదు. స్త్రీలు పోలీసులని ఆశ్రయించినట్టుగా, పురుషులు చేయగలరా?
ఒక జంట గురించి పేపర్లలో వచ్చింది రెండు నెల్ల క్రితం. పెళ్ళయి ఆరేళ్ళయింది. కొడుకు పుట్టాడు. భర్తకేదో అనుమానం వేసి DNA టెస్టు చేయించాడు. మర్నాడే అతన్ని వరకట్న వేధింపుకింద అరెస్టు చేశారు. కారణం ఊహించడం కష్టం కాదు. పుట్టిన బిడ్డకి తండ్రి అతను కాదు.

బెంగళూరులో ఇంకొక కేసులో, పెళ్ళయిన 10 రోజుల తరువాత భార్య తన బాయ్ ఫ్రెండుతో పారిపోయింది. వివాహాన్ని రద్దు చేయమని కోర్టుకెళ్ళాడు భర్త. భర్తమీద వరకట్న వేధింపు కేసు పెట్టింది భార్య.

స్త్రీల రక్షణకని ఏర్పరచబడిన చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎంత సులభమో కదా।
ఐపిసి 498A చాలా మంచి ఉద్దేశ్యంతోనే ఏర్పరచబడింది. స్త్రీల పట్ల జరిగే హింసనీ, క్రూరత్వాన్నీ ఆపడానికి. కానీ 30 సంవత్సరాల తరువాత, ఇది అతి ఎక్కువ దుర్వినియోగపరచబడిన చట్టంగా మారింది. ఈ చట్టం కింద అరెస్టు అయిన వారు 23 లక్షల పైచిలుకు. చివరికి దోషులుగా తేలినవారు 15% మాత్రమే. కానీ వారు అరెస్టు మాత్రం చేయబడ్డారు. దోషులో, నిర్దోషులో- అనవసరం. వారి పేర్లు పేపర్లమీద ఉన్నాయి. అది చాలదూ అవమానభారాన్ని మోయడానికి! స్త్రీలు కేసులు వేయాలంటే సాక్ష్యాల అవసరం అంతగా ఉండదు.

Untitled498A గురించి సుప్రీమ్ కోర్టు చెప్పిన మాటలు. – “ప్రొవిజన్‌ రాజ్యాంగ బద్ధమైనదన్నంత మాత్రాన్న, నీతి నియమాలు లేని మనుష్యులు ఇతరులని క్షోభ పెట్టడానికి గానీ లేక వ్యక్తిగతమైన శత్రుత్వాన్ని వెల్లడిపరచడానికి గానీ ఇది లైసెన్సుని ఇవ్వదు. ఈ ప్రొవిజన్ని దుర్వినియోపరచడంతో ఒక కొత్త, చట్టబద్ధమైన తీవ్రవాదం ప్రారంభం అవుతుంది. ఏ ప్రొవిజన్‌ అయినా సరే, ఒక కవచంలా ఉపయోగపడాలి తప్ప హంతకుడి చేతిలో ఆయుధంగా కాదు.

‘పులి వస్తోంది’ అన్న కేక ఎన్నోసార్లు వేస్తే, నిజంగానే పులి వచ్చినప్పుడు సహాయం మరియు రక్షణ దొరకకపోవచ్చు. “ఈ మాటలు మన అతి ఉన్నత న్యాయస్థానం- ఈ చట్టం దురుపయోగపడుతోందన్న బాధతో చెప్పినవి. అయినా కూడా దీనికి ఏ మార్పులూ చేయబడలేదు. ఈ చట్టాన్ని మార్చవలిసిన అవసరం ఉంది.

మీ మీద కనుక 498A వేస్తే, జరిగేది ఏమిటి? డబ్బు చెల్లించి కేసుని పరిష్కరించుకొమ్మని మీకు చెప్పబడుతుంది. లేకపోతే మీరు నిర్దోషులయినా కానీ సంవత్సరాల కొద్దీ కేసు పోరాడ్డానికి తయారుగా ఉండాలి. దీని ఫలితంగా, జనాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తోంది. పురుషులే కాదు, స్త్రీలు కూడా. కాకపోతే ఇక్కడ పురుషులు దాడికి అనువైనవారు (vulnerable.)

మీరు మీ భార్య మీద కేకలువేసి, లెంపకాయ కొట్టండి. గృహహింస కేసు పడకపోతే అదృష్టవంతులే. మీ భార్య మీమీద అరిస్తే ఏమీ అవదు. పని చేసే చోట్ల కూడా, మంచి ఎప్రైసల్స్ రానప్పుడు స్త్రీలు తమ బాసులమీద లైంగిక వేధింపు కేసులు వేయడం మామూలే.

రొహ్‌తక్ బ్రేవ్ హార్ట్ కేసులో, నిందితుడైన కుల్దీప్‌కి ఆర్మీలో చేరాలన్నప్పుడు ఎడ్మిట్ కార్డు నిరాకరించబడింది. అదీ ఇంకా నిరూపించబడని నేరానికి. కేసు గురించి తెలుసుకోవాలంటే, వీడియో చూడండి.

ఏప్రిల్ 2013కీ మరియు జూలై 2014కీ మధ్య ఫయిల్ అయిన రేప్ కేసుల్లో 53% నిరాధారమైనవే. కిందటి సంవత్సరం హిందూ పత్రిక జరిపిన పరిశోధన ప్రకారం, రేప్ కాపిటల్ అనబడే ఢిల్లీలో ఫయిల్ అయిన కేసుల్లో 40% కేసులు అమ్మాయి అబ్బాయితో ఇష్టపూర్వకంగా పారిపోయి, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తల్లి తండ్రులు ఫయిల్ చేసినవి. 25% పెళ్ళి చేసుకుంటామని వాగ్దానం చేసిన తరువాత జరిగినవి. నిజానికి ఇవి అమ్మాయీ అబ్బాయీ కలిపి తీసుకున్న నిర్ణయాలే. కాకపోతే వాటిని రేపులని పిలుస్తున్నారు.
మీరు చేయని నేరాన్ని మీరు చేశారని ఆరోపిస్తే జరిగేది ఏమిటి?
http://timesofindia.indiatimes.com/india/Return-my-dignity-man-absolved-of-rape-asks-SC/articleshow/18898781.cms

ఈ పై లింకులో పేర్కొనబడిన వ్యక్తి జైల్లో నాలుగేళ్ళు గడిపి, ఆ తరువాత నిర్దోషి అని నిర్ణయించబడిన తరువాత విడుదల చేయబడ్డాడు. ఇలాంటి కేసుల్లో విడుదలని మీడియా రిపోర్టు చేయదు. ఈ కేసులోనీ చేయలేదు. చేస్తే టి ఆర్ పీలు ఉండవు. మనలో చాలామందిమి మీడియా మనకి చూపించినదాన్నే నమ్ముతాం. అతని చుట్టుపక్కల ఉన్న సమాజం అతనింకా రేపిస్టే అన్న అభిప్రాయంతో ఉంది.

గృహహింస కేసుల్లో లింగ బేధం లేదు మిగతా దేశాల్లో. కానీ భారతదేశంలో పురుషుడు గృహహింస కింద కేసు పెట్టలేడు.
పెళ్ళయిన తరువాత ఆత్మహత్య చేసుకునే స్త్రీల సంఖ్యతో పోలిస్తే, పెళ్ళయి ఆత్మహత్య చేసుకున్న పురుషుల సంఖ్య రెండు రెట్లు.
మనకి జంతువుల కోసం ఒక కమిషన్ ఉంది, స్త్రీలకోసం, పిల్లల కోసం కమిషన్లున్నాయి. కానీ పురుషుల కోసం కానీ వాళ్ళెదురుకుంటున్న సమస్యల కోసం కానీ పని చేసే ఏ ప్రభుత్వ సంస్థా లేదు. ఇప్పుడిప్పుడే కొన్ని NGOలు ప్రారంభం అవుతున్నాయి.

SAVE INDIAN FAMILY
దుఃఖంలో మునిగి ఉన్న పురుషుల కోసం నడుపుతున్న సంస్థ ఇది.

రోజుకి 135 ఫోన్లు వస్తాయి ఈ సంస్థకి. దీన్ని నడిపేది వాలంటీర్స్. స్త్రీల రక్షణ కోసమని ఇంకొన్ని చట్టాలు రాబోతున్నాయి. రావాలి కూడా, కానీ దుర్వినియోగింపబడ్డానికి మట్టుకు కాదు.

మనకి లింగ వివక్షత లేని చట్టాల అవసరం చాలా ఉంది.

శిక్షించవలిసినది జెండర్ని కాదు. దోషి అయిన వ్యక్తికి శిక్ష పడాలి.

ప్రేరణ- దీపికా భరద్వాజ్ మాటలు.

-క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, Permalink

44 Responses to పూర్వాక్రమణం – క్రిష్ణ వేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో