స్త్రీ మూర్తులు…..(కవిత ) -సుజాత తిమ్మన

యత్ర నార్యంతు పూజ్యంతే “…ఇది ఆర్యోక్తి…
స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో..
అక్కడ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయన్నది … భావం…
మరి ఆ స్త్రీకి.. ఎక్కడ లబిస్తుంది…ఆ గౌరవం…?
ఆడపిల్ల పుట్టింది అని తెలియగానే..
మొట్ట మొదట అనే మాట…’ఆడ…….’ పిల్ల ..
అందులోనే..దూరం మొదలైంది…మరి..

ఆచార వ్యవహారాలు…మూఢ విశ్వాసాలు..
వద్దన్నా మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి..
దానికి తోడూ ప్రకృతి సహజంగా..
పడతికి శారీరక బలహీనతలు…
(కీచక ) మగవాళ్ళకి ఆయువు పట్టులవుతున్నాయి..
ఎక్కడ చూసినా..అత్యాచారాలు…
సాముహిక మానభంగాలు….
పసి కూన దగ్గరి నుంచి..
అరవయ్యేళ్ళ వృద్దురాలయినా కూడా..
తమ కామ దాహాన్ని తీర్చుకోవడానికి…
వెనుకాడక…నరరూప రాక్షసులు గా మారుతున్నారు…
మానం మాతృత్వానికి మారు రూపం
అన్న నిజాన్ని మరచిన నపుంసకులు…
రెండు నిమిషాల సుఖం కోసం..
నిండు జీవితాలని బలిచేసే..రాబందులు..

ఈ ఆగడాలను అరికట్టాలంటే…
తరలి రావాలి…తరుణులంతా..
ఆది శక్తి అంశలో జన్మించిన బలం చేతబూని..
అపర రుద్రమలై..అంతమొందించాలి ‘ఆ’ కలిపురుషుల..

అమ్మ తనం అమ్మాయిలదని చాటుతూ..
జగతిని ప్రేమమయంచేయ..
అవతరించాలి..ఎందరో.. మదర్ తెరిసాలు..
చేతులెత్తి మొక్కాలనిపించే…
సౌశీల్యాన్ని సొంతం చేసుకొన్న స్త్రీ మూర్తులు….!

                                                                – సుజాత తిమ్మన.

               *****                                                ******                                                  ******

కవితలు, , Permalink

5 Responses to స్త్రీ మూర్తులు…..(కవిత ) -సుజాత తిమ్మన

 1. D.Venkateswara Rao says:

  మానం మాతృత్వానికి మారు రూపం
  అన్న నిజాన్ని మరచిన నపుంసకులు…
  రెండు నిమిషాల సుఖం కోసం..
  నిండు జీవితాలని బలిచేసే..రాబందులు.. –

  పై రెండవలైనులో ఆఖరి పదం ‘నపుంసకులు’ కు బదులు ‘కామందులు’ అని ఉండాలనుకుంటాను

  ఎన్నో కవితలు చదివాను కాని
  స్త్రీ ఎలా ఉంటె పురుషుడి నుండి తప్పించుకో గలదో
  స్త్రీ ఎలా ఉంటె పురుషుడ్ని ఆ దృష్టినుంచి మరల్చ గలదో
  స్త్రీ ఎలా ఉంటె పురుషుడ్ని ముప్పుతిప్పలు పెట్ట గలదో
  స్త్రీ ఎలా ఉంటె పురుషుడ్ని ఎదురుదెబ్బ తీయ గలదో
  ఎవరూ చెప్పలేదు

  స్త్రీలు (ఆడువారు) మూడు గుణాలు అదే శారీరకంగా, ఆర్ధికంగా మరియు మానసికంగా ఎదిగి ఉంటె మగవారినుంచి తప్పిన్చుకోగాలుగుతారు

  • sujatha thimmana says:

   ధన్యవాదాలండి…మీ అమూల్య మయిన అభిప్రాయాన్ని తెలియ జేసారు…

   నా భావనలో..
   “మానం మాతృత్వానికి మారు రూపం అన్న నిజాన్ని మరచిన నపుంసకులు… ”

   ఆడతనాన్ని అమ్మగా చూడలేని వాళ్ళు కూడా చేతకాని వాళ్లతో సమానం ..అని..(అనుకున్నా..)…

   మీ సలహా కూడా సరిపోతుంది..

   మీరు చెప్పింది నిజం…శక్తి..యుక్తి..కలిగి….ఆర్ధికంగా నిలబడ గలిగినది అయితే..అమ్మాయి తప్పకుండ మగవారిని ఎదిరంచ గలుగుతుంది…ధన్యవాదాలు మరొకసారి..

 2. Shamili says:

  excellent write up

 3. sujatha thimmana says:

  ధన్యవాదాలు…హేమలత గారు…మిత్రులందరికీ…మహిళా దినోత్సవ శుభాకాంక్షలు….