జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

గ్రామ అవసరాలు అర్థం చేసుకోవడంలోనూ, వాటి  ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలనుకునే పోశవ్వకి తన సభ్యుల నుండే తీవ్రమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతిఘటన ఎదురవుతోంది. ఆమె కులం, ఆమె జెండర్‌, వర్గం అన్నీ ఆమెను వెనక్కులాగే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా, ఆమె ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా సన్నద్ధమవడం వల్లనే తట్టుకోగలుగుతోంది. ఆమెలో ఆత్మవిశ్వాసం కలగడానికి 7 రోజుల శిక్షణ చాలా ఉపయోగపడింది. అంతే కాదు, ఆమె వేషంలోనూ మాట్లాడే విధానంలోనూ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. ఒక్కోసారి కరుకుదనం, కసితో… ఒక్కోసారి చాలా ధైర్యంగానూ ఉండే పోశవ్వ మాట తీరు మారింది. మర్యాదపూర్వకమైన పలకరింపు, మృదుత్వం చోటు చేసుకున్నాయి. భాషలోనూ ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి రోజు శుభ్రంగా స్నానం చేసి నున్నగాతల దువ్వి ఉన్నంతలో చక్కగా ఉంటోంది.

ఈ మార్పు రాజాగౌడ్‌కి మింగుడు పడడంలేదు. కక్కలేక మింగలేక చస్తున్నాడు. తలచిందేవి! జరుగుతున్నదేమి? కుక్కిన పేనులా చెప్పుకింద తేలులా ఉండాల్సిన పోశవ్వకి ఇంత తెలివి ఎక్కడ నుండి వచ్చింది. ఎవరిచ్చారు…? అతనికి కంటి  మీద కునుకు కరువైంది. పక్కలో బల్లెంలా ఫీలవుతున్నాడు. తనను సంప్రదించకుండానే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది . అయితే అది తన భవిష్యత్తును దెబ్బ తీస్తుందేమోనన్న దురాలోచనతో ఆగిపోయాడు. ఇప్పుడు ఇదివరకటిలా కాదు. ప్రతి వీధిలో దీపాలు వెలుగుతున్నాయి. రోడ్డు సరిగ్గా లేని గూండ్ల వీధిలోనూ, అంబేద్కర్‌ కాలనీలోనూ రోడ్లు చక్కబడ్డాయి. ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతి రోజూ వస్తున్నారు. ‘అక్షర కిరణం’ పేరుతో అక్షరాస్యతా ఉద్యమం ముమ్మరంగా సాగిన ఆ రోజుల్లోనే నడవని రాత్రిబడులు ఇప్పుడు చక్కగా నడుస్తున్నాయి. తనను సంప్రదించకుండానే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేప్టింది. వార్డు మెంబర్లను రెచ్చ గొట్టే  ఆమె తలపెట్టిన  అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనుకున్నాడు.

ఆడవారికి, మగ వారికి వేరువేరుగా, ఆ బడిలో పోశవ్వ, కూతురితో పాటు హాజరవుతోంది క్రమం తప్పకుండా. ఎండాకాలం వచ్చిందంటే అంబేద్కర్‌ కాలనీలో తీవ్ర నీటి  ఎద్దడి ఉండేది. కరెంటు సరిగ్గా లేక, ఉన్నటైంలో మోటర్‌ నడువక, హాండు బోర్లు కానీ, బావి కానీ లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఊళ్ళో ఉన్న పెద్దబావి దగ్గరకు వెళ్దామంటే పెద్దోళ్ళు రానివ్వరు. బావి మైల పడతదంటరు. ఎలా? అనుకునేవాణ్ణి ఇప్పుడా బాధ తీరింది. ఎప్పికప్పుడు కరంటు మోటర్‌ సక్రమంగా నడిచే విధంగా పంచాయితీ శ్రద్ధ చూపుతోంది. చెత్తా చెదారంతోనూ రోడ్డు కిరువైపులా పశువుల, మనుషుల మల, మూత్రాదులతో అసహ్యంగా ఉండే రోడ్ల రూపు మారుతోంది. కాస్త శుభ్రంగా కన్పిస్తున్నాయి.

గ్రామంలో వర్షపు నీరు, మురికి నీరు నిలవకుండా డ్రైనేజి ద్వారా ఊరవతలకు చేరుతోంది. గ్రామ మహిళలు డ్వాక్రా పొదుపు సంఘంలో చేరి చిన్న మొత్తం పొదుపు ప్రారంభించారు. మంచి, చెడు ఒక చోట చేరడం వల్ల చర్చించుకోగల్గుతున్నారు.
గ్రామంలో మొది సారిగా 80 ఏళ్ళ సాలె మల్లు బాయి వృద్ధాప్య పింఛన్‌ అందుకుంది. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి గ్రాంటునీ, ప్రతి పథకాన్నీ సద్వినియోగం చేస్కుంటున్నారు. గ్రామంలో కులం, మతం, వర్గం భేదం లేకుండా అవసరాలను బట్టి  పనులు జరుగుతున్నాయి.

ఇది జరగడానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది . అదీ అంత సులభంగా జరుగుతుందా ఈ నిచ్చెన మెట్ల కుల సమాజంలో.

ఆమె నడిచే బాటలో ఎన్నో ముళ్ళు. ఆ ముళ్ళను ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఏరి వేస్తూ ఉన్నా, కొన్ని ముళ్ళు ఆమెకు గుచ్చుకుంటూనే, ఆమెను బాధ పెడ్తూనే, అయినా ఆమె పయనం ఆగలేదు. ముళ్ళబాటని భయపడలేదు. దారికడ్డు వస్తూన్న ముళ్ళని తొలగిస్తుంటే మరెన్నో ఎదురు దెబ్బలూ… ఎత్తు పల్లాల బాటలు.
పోశవ్వ ఎదుగుదలని సహించలేని రాజాగౌడ్‌ ఆమెను ఎలాగైనా అప్రతిష్టపాలు చేయాలి. లేకపోతే ఎలా…? రోజు రోజుకు అతనిలో అసహనం పెరుగుతోంది. ఆమె ఉనికిని భరించడం చాలా కష్టంగా ఉందతనికి.

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

One Response to జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో