హృదయ స్పందనలు కావా..!(కవిత)-సుజాత తిమ్మన

గున్నమావి చిగురులను ప్రీతిగా ఆరగిస్తూ..
కుహు కుహు అంటూ కమ్మగా రాగాలు తీసేటి కోయిల పాట విన్నా..
నిశబ్ద నిశీధిలో స్వార్ధం మరచి నిండు చంద్రుడు
పున్నమి వెన్నెలను.. మంచు వలె కురిపిస్తూ ఉన్నా..
చల్లనిగాలి పిల్ల తెమ్మెరలై..మెత్తగా స్పృశిస్తూ.
వికసించిన మల్లెల పరిమళాన్ని మేనంతా పామేస్తూ ఉన్నా….
ఎదలోతులలో..ఏమరపాటు కదలికలే..హృదయ స్పందనలు కావా..!

వదిలేసినపసితనంలోనికి ..కొత్తగాచేరిన ప్రాయాన్ని..
వయసుచేసే చిలిపి అల్లరులతో వేగలేక కన్నె మనసు..
నీవేనేనంటూ …వలపు పలుకుల ఆసరా ఇచ్చువాడు..
ఎవరని..ఎచట ఉన్నాడని..కలవరింతల కలవరంలో…
ప్రతి చూపును కంటికొస బిగించి మరీ .. వెతుకుతున్నపుడు..
వెనుకగా మెచ్చిన వాడు వచ్చి వెచ్చని కౌగిలిచ్చినపుడు..
మదిగదిలో చెలరేగే పులకింతలే…హృదయ స్పందనలు కావా..!

ముక్కోటి దేవతల దివేనలతో ముడిపడిన బంధంలో ..పెనవేసుకున్న జీవితాలు
ఏకమై..పంచుకున్న మధురామృతాల సాక్షిగా..
మొలక నవ్వుల చిరుదీపం తమ ప్రేమకి చిహ్నమై …
బోసినవ్వుల ఉశోధయాన్ని తెస్తుందని తెలిసినపుడు..
ఆకాశం అంటిన ఆ ఆనందపు మెరుపులే ..హృదయ స్పందనలు కావా..!

-సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

5 Responses to హృదయ స్పందనలు కావా..!(కవిత)-సుజాత తిమ్మన

 1. D.Venkateswara Rao says:

  ఎదలోతులలో..ఏమరపాటు కదలికల దగ్గర మొదలుపెట్టి
  మదిగదిలో చెలరేగే పులకింతలదాకావచ్చి
  బోసినవ్వుల ఉశోదయం వస్తుందని తెలిసాక
  హృదయస్పందనలను ఆపేసారు

  • sujatha thimmana says:

   ధన్యవాదాలు…వెంకటేశ్వర రావు గారు…నిజం..ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటె..హృదయస్పందనల గురించి..ఇక ఈ పేజీలు సరిపోవు కదా..మరి…హృదయం ఉన్నదే..స్పందించటానికి….కదండీ…

   • D.Venkateswara Rao says:

    ఈ శరీరం ఆత్మను విడిచిపెట్టినా ఆ హృదయస్పందనలు అలానే కొనసాగుతూ ఉండవా?

 2. rajeswari.n says:

  చాలా బాగుంది సుజాత గారు

  • sujatha thimmana says:

   ధన్యవాదాలు…రాజేశ్వరి గారు……..