జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”ఏందే… మాద్గి ముం..
మాతోని సమానం కూచుంటవానే..లం..జోగు ము…” తారాజువ్వలా లేశాడు శివప్ప.

”ఏందె…” గుడ్లురిమి చూశాడు రాజాగౌడ్‌.
”పోయి ఆడ కూసో…” మశ్నప్ప, రాయనర్సు కూచున్న కేసి చూపిస్తూ ఖాసిం.
చివుక్కుమంది ఆమె మనసు.

చిన్నబోయింది ఆమె ముఖం.
మారుమాటలేకుండా వెళ్ళి మశ్నప్ప… రాయనర్సుల పక్కన చతికిలబడింది.

రాజాగౌడ్‌ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లా డుకుంటున్నారో ఏమీ అర్థం కావడం లేదు. మధ్యమధ్యలో సర్పంచ్‌ సాబ్‌ అంటూ రాజాగౌడ్‌ని సంబోధించడం తెలుస్తోంది. ఓట్లకు ముందు సర్పంచికి నిలబడింది నేనే అన్నారు. పేపర్ల గెలిచింది నేనేనని ఇచ్చారు. ఫొోటో  కూడా ఇచ్చారు. ఇదేమి అంతా రాజాగౌడ్‌నే ఇది వరకి లాగానే సర్పంచ్‌ సాబ్‌ అంటున్నారు. సర్పంచు కూర్చునే చోటులో అతను కూర్చున్నారు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు… మనసులో సందేహం మొదలై తొలుస్తోంది పోశవ్వలో, నిన్న మొన్నటి దాకా అతనే కదా సర్పంచ్‌ అందుకని అలా  పిలుస్తున్నారేమోలే… మాద్గిదాన్నని దూరం కూచోబెట్టారు. తనను తాను సర్ధిజెప్పుకుంటూ వాళ్ళు నిశాని వేయమన్న దగ్గర వేసింది. ఎందుకో వాళ్ళు చెప్పలేదు. పోశవ్వ అడగలేదు. అడిగే తెలివితేటలూ అప్పటికామెకు రాలేదు.

సర్పంచుగా తన పని ఇంతే కావచ్చు. నువు నిశాని ఏయ్‌ అంత నేను జూసుకుంట అన్నడు కద గౌడ్‌ సాబ్‌. అని తనను తాను సర్ది చెప్పుకుంది. కానీ మనసులో ఏదో వెలితి తెలియని భయం. అవ్‌… తనకేం తెల్సని సర్పంచు అయితది. పెద్దగౌడే సర్పంచు అని మళ్ళీ మళ్ళీ మనసులో అనుకుంది.

గడపలో కూర్చొని సబిత తలలో పేలుచూస్తున్న పోశవ్వ ”ఏందే పోరి గింతగనం పేన్లయినయ్‌, ఆనల దడిసినవా…?” ఒక్క మొట్టి కాయ మొట్టి  అడిగింది.

”అబ్బా…” బాధతో తల్లి మొహం కేసి కొరకొర చూస్తూ తల పక్కకు తిప్పిన సబిత అక్కడ నిల్చుని ఉన్న వ్యక్తిని చూసి గబుక్కున లేచి నిలబడింది.

”ఏందే… పేన్లు జూస్తనంటే గిట్ల లేస్తివి ” అంటూ తలెత్తి చూడడం . అమ్మా బడిలసారొస్తుండే” అని సబిత అనడం ఒకేసారి జరిగి పోయాయి… అంతలో. ”నమస్తే మేడమ్‌”… అంటూ లోపలికి వచ్చాడతను.

”నా పేరు రవి మాదిగ. ఇక్కడి బడిలో సార్‌ని కొత్తగ వచ్చాను” మళ్ళీ అతనేతనను తాను పరిచయం చేస్కుంటూ అంతలో లోపల్నించి తుప్పట్టి  ఉన్న ఇనపకుర్చీ తెచ్చి వేసింది సబిత. కొంగుతీసి తుడిచి ”కూచోసారు” అంది పోశవ్వ.

”ఫర్వాలేదు మేడమ్‌”

రవి మాదిగ అంటే ఈ సారు తనకులపోడే, రెడ్డిలెక్క, గౌడులెక్క, దేశాయ్‌ లెక్క ఈ సారు గూడ కులంపేరు పెట్టుకున్నాడు. అట్లంటే గమ్మత్‌ కొడ్తన్నది అనుకుంది. పోశవ్వ మనసులో.

తమ కులం వాడు బడిలో సారు అయ్యాడా…? అనుకుంది. అతనంటే ఆమెకు తెలియని అభిమానం, గౌరవం అప్పికప్పుడే ఏర్పడ్డాయి.

‘ అయ్యో..గట్ల నిలబడ్తివి. కూసో కొడ్కా”… అంది సాయవ్వ. తను వచ్చిన విషయం సూటిగా , స్పష్టంగా చెప్పాడు రవి.

కొత్తగా పంచాయితీలకు ఎన్నికయిన మహిళలకు గవర్నమెంటు శిక్షణ ఇస్తోంది. తన స్నేహితుడి ద్వారా తెల్సిందనీ, పోశవ్వ వెళ్తుందో లేదో తెల్సుకుని, వెళ్ళకపోతే వెళ్ళమని చెప్పాలని వచ్చానన్నాడు.

-శాంతి ప్రబోధ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో