శ్రీ నరసింహక్షేత్రాలు(పుస్తక సమీక్ష ) -మాలా కుమార్

శ్రీ నరసింహక్షేత్రాలు
(ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలు)
రచన;శ్రీమతి.పి.యస్.యం. లక్ష్మి

20151220_115625 (2)శ్రీమతి.పి.యస్.యం లక్ష్మిగారు బి.కాం చదివి హైదరాబాద్ లోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీస్ లో ఉద్యోగము చేసి . సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్గా పదవీవిరమణ చేసారు.లక్ష్మిగారికి ముందునుంచీ వివిధ ప్రదేశాలు చూడాలంటే చాలా ఆసక్తి.అందులోనూ పుణ్యక్షేత్రాలంటే మరీనూ. అందరిలాగా అక్కడికి వెళ్ళాము, గుడిని దేవునుని చూసాము , ప్రసాదం తిని కోరిక కోరుకొని వచ్చేసాము అన్నట్లు కాకుండా ఆ దేవాలయము యొక్క చరిత్ర,అది ఎవరు ఎప్పుడు కట్టించారు, అక్కడ భగవంతుడు ఎప్పుడు వెలిసాడు లాంటి స్తలపురాణము తెలుసుకోవటము కూడా చాలా ఇష్టము.తను తెలుసుకోవటమే కాక పదిమందికీ తెలియాలని “యాత్ర”అనే పేరు తో బ్లాగ్ మొదలుపెట్టారు. అందులో ఆ దేవాలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడి కి వెళ్ళే రూట్, అక్కడి వసతులు, ఆ స్తల పురాణము , ఆ దేవుని మహిమల గురించి వివరంగా వ్రాసారు.అది చదివితే అక్కడికి సులువుగా వెళ్ళవచ్చు. అంత వివరంగా ఉందన్నమాట. ఆ బ్లాగ్ చదివి, చాలా మంది ఆ పోస్ట్ ప్రింట్ చేసుకొని, అక్కడికి వెళ్ళి వచ్చాము అని ఆవిడకు కాల్ చేసి చెబుతున్నారట. అందుకని వాటిని పుస్తక రూపంలో కూడా దశలవారిగా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు, ఆరు ఈబుక్స్ తెచ్చారు.అంతే కాకుండా ఇప్పటివరకు 230 పైననే వ్యాసాలు వివిధ పత్రికలల్లో, వెబ్ మాగ్జిన్ లల్లో ప్రచురించబడ్డాయి.ప్రస్తుతము , కౌముది వెబ్ మాగ్జిన్ లో , తెలుగు వన్ డాట్కాం లో, గో తెలుగు డాట్ కాం లో వారి వ్యాసాలు వస్తున్నాయి.యాత్రల గురించిన వ్యాసాలే కాకుండా , వివిధ అంశాలపైన పదిహేను వ్యాసాలు,నాలుగు నాటికలు ,(ఇవి వారి వారి ఆఫీసు లో ప్రదర్శించబడ్డాయి)పదిహేను కథలు వ్రాసారు. లక్ష్మి గారి కృషి, ఆసక్తి వెనకాల అండదండగా నిలబడి ప్రొత్సహిస్తున్న వారి శ్రీవారు శ్రీ యం. వెంకటేశ్వర్లు గారు అభినందనీయులు.

లోకంలో అధర్మం పెరిగిపోయి , రాక్షసులా ఆగడాలు పెచ్చుపెరిగిపోయి, రాక్షసుల బాధలకు ప్రజలు తల్లడిల్లుతున్నప్పుడు భగవంతుడు జీవ సమ్రక్షణార్ధం వివిధ రూపాలల్లో, వివిధ్ నామాలతో అవిర్భవించి ,దుర్మార్గులను మట్టుబెట్టి సన్మార్గులను రక్షిస్తూవుంటాడు. అలా శ్రీమన్నారాయణమూర్తి అనేక అవతారాలు ఎత్తారు.అందులో ప్రముఖమైనవి

దశావతారాలు.పండితులు ఈ అవతారాలను మూడు తరగతులుగా విభజించారు.అవి, 1.పూర్ణావతారాలు. అవి, రామావతారము , కృష్ణావతారము.2.ఆవేశావతారాలు .అవి పరుశురామావతారము,నరసింహావతారము.3.అంశావతారములు.అవి విష్ణువు శక్తి లో కొంతాభాగముతో అవిష్కరించినవి.అవి మత్య, కూర్మ, వరాహ మొదలైన అవతారములు.వీటిలో ఆవేశావతారమైన నరసింహావతారము చాలా ఉన్నతమైనది.ఎందుకంటే ఉన్నతమైన మానవుడు, మృగశ్రేష్ఠమైన సింహము సమ్మేళనముతో రూపొందినది ఈ అవతారము. చాలా శక్తి వంతమైనది.నరసింహుని తలుస్తే ఎట్టి పీడలైనా,భయాలూ, కష్టాలూ తొలిగిపోతాయి.అంతటి శక్తివంతమైన నరసింహస్వామి పలుచోట్ల అవిర్భవించాడు.ఆ నరసింహస్వామి వెలిసిన క్షేత్రాల గురించి వ్రాసినదే “శ్రీనరసింహ క్షేత్రాలు” పుస్తకము.

ఈ పుస్తకములో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న నరసింహస్వామి ఆలయాల గురించి చెప్పబడినది.మామూలుగా నరసింహస్వామి ఆలయాలు అనగానే మంగళగిరి, సింహాచలము,యాదగిరిగుట్ట, అహోబలము గుర్తొస్తాయి. కాని ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలల్లో ఇరవైఏడు నరసింహ క్షేత్రాల గురించి ఈ పుస్తకంలో చూడగానే ఆశ్చర్యపోయాను.అందులోనూ హైదరాబాద్ లో మా ఇంటికి దగ్గరలోనే బంజారా హిల్స్ లో అతి పురాతనమైన క్షేత్రము ఉందంటే మరీ ఆశ్చర్యపోయాను.ఈ ఆలయము చాలా చిన్నదిట.దీనిని 100 కోట్ల రూపాయల తో పునరుద్ధరిస్తున్నారట. ఇది చాలా పురాతనమైనది,యాదగిరిగుట్టకన్నా ముందు నుంచీ ఉన్నదిట.శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారు యాదగిరి వెళుతూ ఇక్కడ కాసేపు ఆగారట. అందుకు గుర్తుగా ఆయన పాదముద్రలు ఉన్నాయిట.

ఈ విధముగా ,1.అగిరిపల్లి,
2.అహోబిలం,
3.అంతర్వేది,
4.కదిరి,
5.కేతవరం,
6.తెనాలి,
7.ధర్మపురి,
8.నాచారం,
9.పాలకుర్తి,
10.పుల్లూరు,
11.పెంచలకోన,
12.పెన్నహోబలం,
13.ఫణిగిరి,
14.బంజారాహిల్స్,
15.బెజ్జంకి,
16.మంగళగిరి,
17.మట్టపల్లి,
18.మల్లూరు,
19.మాల్యాద్రి,
20.యాదాద్రి(యాదగిరిగుట్ట),
21.వజ్రగిరి,
22.వాడపల్లి,
23,వేదగిరి,
24.వేదాద్రి,
25.సింగరాయకొండ,
26.సింగోటం
మరియు 27.సింహాచలం లో ఉన్నటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల గురించి వివరముగా వ్రాసారు లక్ష్మిగారు.ఆ ఆలయాల స్థలపురాణము, ప్రసిద్ధి వివరంగా పొందుపరిచారు. ఆయా ఆలయాలకు ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయవచ్చు, ఆలయము తెరిచి ఉంచే సమయాలు అన్నీ విపులంగా వ్రాశారు.ఈ పుస్తకము చేతిలో ఉంటే చాలా సులువుగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలను దర్శించుకొని , ఆ స్వామివారి పొందవచ్చు.

ప్రతులు రచయిత్రి దగ్గరనూ , అన్ని ముఖ్యషాపులల్లోనూ లభ్యమవుతాయి.

ఇంకా ఏమైనా వివరాలు కావంటే రచయిత్రి ని సంప్రదించవచ్చు.పి.యస్.యం లక్ష్మిగారి సెల్.నంబర్;9866001629.

-మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , , , Permalink

2 Responses to శ్రీ నరసింహక్షేత్రాలు(పుస్తక సమీక్ష ) -మాలా కుమార్

  1. mala` says:

    మీ వాఖ్యకు థాంక్ యు ఉమాదేవి గారు.

  2. సమీక్ష పుస్తకానికి ప్రాణవాయువు.పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభూతి.అయితే విషయవివరణ ఇవ్వగల పుస్తకం మన మేధకే కాదు మన మనసుకు మార్గదర్శనం చేయగల దిక్సూచి.ఒడిదుడుకుల జీవనంలో సేదనివ్వగల భగవంతుని దర్శించుకోగలగడం మనిషి పొందిన అపురూపవరం.
    అయితే ఎన్నోరూపాలలో దర్శనమిచ్చే ఆ దైవానికి నిలయాలు ఆలయాలు.ఎక్కడికెళ్లాలి?ఎలావెళ్లాలి?ఇదిగో అందుకోండి అక్షయపాత్ర అంటూ దేవాలయాల సమాచారాన్నిమొత్తం మనముందుంచడంలో పి.యస్.యం.లక్ష్మిగారు సిద్ధహస్తులు.ఆమె అందించిన శ్రీ నరసింహక్షేత్రాలు పుస్తకాన్ని మాలా కుమార్ గారు, లక్ష్మిగారి రచనల నేపథ్యాన్ని,పుస్తకంలో లక్ష్మిగారిచ్చిన వివరణలన్నీ చక్కని సమీక్షరూపేణా మన విహంగలో అందించి మనసులోనే ఆ దేవుడి రూపాలను విహంగవీక్షణం చేయించారు.ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)