మసాన్-క్రిష్ణ వేణి

krishna veniయుపి రాష్ట్రంలో శ్మశానానికి స్థానికమైన వాడుక మాట.
కాశీలో ఆత్మలు రుణవిముక్తులవుతాయంటారు. శతాబ్దాలుగా జీవితాలతో మరియు మరణాలతో తంటాలు పడుతున్న ఈ ఊరి అనన్యమైన లక్షణాన్ని ఈ సినిమా అద్భుతంగా కనపరుస్తుంది. వారణాసిలో సామాన్యంగా చూపే ఆలయాలూ, సాధువులూ, సైకిల్ రిక్షాలూ కాక, అక్కడ గడుపుతున్న జీవితాలని ప్రతిబింబిస్తుందీ సినిమా.
బెనారస్ సారాన్నీ, అచలమయినదయినా కానీ మార్పు చెందగల ఊరినీ- దృశ్యాలద్వారానే వర్ణిస్తుందీ చిత్రం.
ఇప్పటి బెనారస్ నేపధ్యంలో చిత్రీకరించబడిన మసాన్‌లో రెండు భిన్నమైన, సమానాంతరంగా సాగే కథలు ఆఖరున కలుస్తాయి. మొదటి కథ దేవి గురించినది. ఆమె పియూష్ అనే అబ్బాయితోపాటు ఒక హోటెల్ రూములో చెక్- ఇన్ చేస్తుంది. పోలీసులు రెయిడ్ చేస్తారు. రెండో వృత్తాంతం అంటరాని కులానికి చెందిన కాటికాపరి అయిన దీపక్ (వికీ కౌశల్)ది. ఇంజినీరింగ్ చదువుతూ తండ్రికీ, అన్నకీ కులవృత్తిలో సహాయం చేస్తూ ఉంటాడు. అతనికి తన వెనుకబాటుతనాన్ని తప్పించుకోవాలనే తపన ఉంటుంది. అగ్ర కులానికి చెందిన షాలూ( శ్వేతా తివారీ) తో ప్రేమలో పడతాడు. ఈ కులాల భిన్నత్వం కుటుంబపరమైన మరియు సామాజిక సంఘర్షణలకీ దారి తీస్తుంది.
తన కంపూటర్లో దేవీ (రిచా చడ్డా) పార్న్ చూడటంతో సినిమా ప్రారంభం అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఏ హీరోయిన్నీ ఈ విధంగా చూపే ధైర్యం చేయరు. అనేకమైన స్త్రీలు పోర్న్‌ చూడ్డానికి అలవాటు పడ్డామని ఒప్పుకుంటారని అధ్యయనాలలో తేలిందని దీని డైరెక్టర్ చెప్తారు. అందువల్లే ఇది ఈ సినిమాలో చాలా సహజమైన, పరిపాటైన చర్యగా పరిచయం చేయబడింది. హోటెల్ రెయిడ్లో ఒక పోలీసు దేవీని “హోటెలుకి ఎందుకు వచ్చావు అబ్బాయితో?” అని అడిగినప్పుడు, అది తనకి సెక్స్ పట్ల ఉన్న “జిజ్ఞాస” వల్ల అని సమాధానం చెప్తుందామె.

564046924-masaan

పెద్ద సిటీల్లో ఉన్నవారికి ప్రపంచం ఇక్కడే మొదలయి అక్కడే ముగుస్తుంది. కానీ చిన్న ఊళ్ళల్లో ఉంటున్న, కొత్తగా బయల్పడుతున్న భారతదేశం చాలా ఉంది. ఈ సంఘటన తరువాత ఆమెకి అపరాధభావం అయితే కలుగుతుంది కానీ సిగ్గు కాదు. దేవీ తన మనసులో ఉన్న మాట బయటకి చెప్పడానికి సంకోచపడదు. ప్రేక్షకులు ఆమెని తీర్పు తీర్చే అవకాశాన్ని ఆమె ఇవ్వదు. సినిమా ఆ పాత్రని జడ్జ్ చేయదు. ఆ పని చేసినది ఆమె చుట్టుపక్కల ఉన్న సమాజం.
వీరందరి జీవితాలూ కలవవు కానీ వారణాసిలో చిక్కుకున్నవారిమన్న పరస్పర అనుభూతి వల్ల వారికొక విధమయిన సంబంధం ఉంటుంది. సౌండ్ ట్రాకులో ఒక అద్భుతమైన ద్విపది వినిపిస్తుంది. “నీవు ఏదో రైల్లాగా వెళుతుంటే, నేను ఏదో వంతెనలా కంపిస్తాను.”(తూ కిసీ రైల్‌సీ గుజరతీహై, మై కిసీ పుల్ సా థర్ థరాతాహూం ) పాట వినండి. “నేను నీటి బుడగలాంటి వాడిని. నిన్ను తలచుకుంటేనే పగిలిపోతాను” (“మై హూ పానీ కే బుల్‌బులే జైసా, తుఝే సోచూ తో ఫూట్ జాతా హూ.)- ఈ మాటలే చాలు.
వేదననీ, కవిత్వాన్నీ బొట్లు బొట్లుగా కారుస్తూ- వారణాసి దహనసంస్కారాల ఘాట్ల నేపధ్యంలో- అణచివేత, తిరుగుబాటు మరియు ప్రాయశ్చిత్తం యొక్క కథలని ఒకదానితో ఇంకొకటి కలుపుతుందీ ఫిల్మ్.
కులం, లింగం గురించిన ప్రబలమైన భావోద్వేగాలు- పశ్చాత్తాపం మరియు వేదన అయినప్పటికీ కూడా, ఏ పాత్రా పోరాడకుండానే ఓటమినంగీకరించే రకం కాదు దీనిలో.
ఈ సినిమా ముంబయి independent ఫిల్మ్స్ యొక్క అరిగిపోయున్న పద్ధతిని వర్జించింది. ఏ హిందీ సినిమానుంచీ- పాతవి కానీ, కొత్తవి కానీ- ఏదీ అరువు తెచ్చుకోలేదు. అధిక ప్రేరణ హిందీ లేక ఉర్దూ కవిత్వం కనుక మిగతా సినిమాలతో పోలికే కనిపించదు.
సినిమా నిరాడంబరమైనదైనా కానీ ప్రభావవంతమైనది. ఫ్లో ఎక్కడ సడలనియ్యకుండా, రెండు పారలెల్ కథలనీ కట్టి ఉంచుతుంది. భౌతికంగా, నైతికంగా కూడా క్షీణిస్తున్న ఊరిని ఘయివాన్ చిత్రిస్తాడు.
ఎక్కువ రోల్ లేని పంకజ్ త్రిపాఠీ, శ్వేతా త్రిపాఠీ కూడా తమ జాడలని వదిలిపెడతారు.
‘వారణాసిలో ఆగే ట్రైన్లు 28.. కానీ ఆగనివి 68’ అని రైల్వే స్టేషన్లో పని చేసే త్రిపాఠీ తన కొలీగ్ అయిన దేవీతో చెప్తాడు. అర్థం- వారణాసికి రావడం సులభమే కానీ విడిచిపెట్టడం కాదు. కాకపోతే ఆమె ఆ మాట పాటించదనుకోండి.
ఒక నెగెటివ్ పాయింటు మాత్రం ఉంది. ప్రధాన పాత్ర అయిన రిచా చడ్డా ముఖంలో పూర్తి రెండు గంటల సినిమాలో కూడా మొహంలో భావాల మార్పుండదు. తన డైలోగులని ఒకే టోన్లో చెప్తుంది. తన పాత్ర అనుభవిస్తున్న సంఘర్షణని తన మొహంలో చూపించలేకపోయింది.
వరుణ్ గ్రోవర్‌ రాసిన డైలోగులు అమోఘం.
ఆఖరికి ఈ సినిమా ముగిసేది అలహాబాదు సంగం వద్ద…. జీవితం గుర్తు పెట్టుకోతగ్గే ప్రయాణంలా మారినప్పుడు.
మసాన్‌ని ఎందుకు చూడాలన్న ప్రశ్నకి కారణాలు- జ్ఞాపకం పెట్టుకోతగ్గ ఒక ఫిల్మ్ కాబట్టి. ఇది శూన్యవాదం నుంచి ఆశావాదానికి మారుతుంది కనుక. ‘స్వేచ్ఛ’ అన్న భావాన్ని కనపరిచినందువలన.
కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మసాన్ రెండు అవార్డులు గెలుచుకుంది. ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్’ మరియు FIPRESCI అవార్డూ.
డైరెక్టర్ –నీరజ్ ఘయివాన్
లిరిక్స్ – వరుణ్ గ్రోవర్

ఈ సినిమా జూలైలో విడుదలయింది. ఇంకా చూడనివారికి వివరాలన్నీ చెప్పేయకుండా ఇక్కడే ముగిస్తాను.

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, సినిమా సమీక్షలుPermalink

14 Responses to మసాన్-క్రిష్ణ వేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో