గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

కాసులు ఆరోగ్యం అతి సున్నితమైనది. ఆ పసిపిల్ల ఎండవచ్చినా తట్టుకోలేదు. వానవచ్చినా తట్టుకోలేదు. చలికాలం సరేసరి ప్యాంటులు, చొక్కాలు, ఉన్ని టోపీలు తొడిగి వుంచుతారా పిల్లకు. ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ పిల్లకు తరచూ అనారోగ్యాలే. అన్నవరం సత్యనారాయణస్వామి పట్ల ప్రజలలో భక్తి ప్రపత్తులు వ్యాపిస్తున్న రోజులవి. ప్రజలు సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించడం, సత్యదేవుని బొమ్మల వెండి, బంగారు బిళ్లలను మెడలో ధరించడం, సత్యదేవుని సన్నిధిలో శిరోజాలు సమర్పించడం చేస్తూ తరుచుగా అన్నవరంయాత్ర చేస్తున్నారు. ఒకసారి కాసులుకు అనారోగ్యం కలిగినపుడు తల్లీ బిడ్డ క్షేమంగా వుంటే సత్యనారాయణస్వామి దర్శనం చేసుకొంటామని మ్రొక్కుకుంది. బిడ్డకు ఆరోగ్యం చేకూరాక సీతమ్మ గారు ఎన్ని సార్లు అడిగినా శాస్త్రి గారు ఆమె ఆరోగ్యం దృష్ట్యా అన్నవరం యాత్ర వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు తప్పనిసరిగా అన్నవరం వెళ్లడానికి ప్రయాణం అయ్యారు.

60 ఏళ్ల క్రితం ఆనాడు అన్నవరం నేటి అభివృద్ధి అయిన క్షేత్రం కాదు. కొండపై స్వామి కోవెల మాత్రమే వుండేది. వ్రతాలు కూడా చేసుకునే సదుపాయం అప్పుడు లేదు. ఆ ప్రజలు తలనీలాలు సమర్పించుకొని కొండ దిగువనే పంపానదిలో స్నానం చేసి కాలి నడకను కొండ ఎక్కేవారు. అక్కడ స్వామి దర్శనం చేసుకొని కొండ దిగివచ్చి అక్కడ వున్న సత్రవులో వంట చేసుకొని భోజనాలు చేస్తేనే యాత్ర సమగ్రమయ్యేది. సత్రపు వారు అవసరమైన వంట పాత్రలూ, పెరుగు, కట్టెలు సమకూర్చేవారు కొంత రుసుము చెల్లిస్తే, పప్పు మొదలైనవి యాత్రికులు తమ వెంట కూడా తెచ్చుకొనేవారు. 11 గంటలయ్యే సరికల్లా కొండ నిర్మానుష్యామయ్యేది. పూజారి గుడికి తాళం పెట్టి క్రిందకు దిగి వచ్చేవాడు. వివాహాలు చేయాలన్నా కొండ దిగువనే సత్రంలో జరిపించుకొని పసుపు బట్టలతో వధూవరులకు స్వామి దర్శనం చేయించేవారు. ప్రయాణ శ్రమకు జన రద్దీకీ అర్భకపు పిల్ల ఏమవుతుందోనని శాస్త్రి గారి భయం. మ్రొక్కు తీర్చకపోతే ఏం కీడు మూడుతుందోనని శాస్త్రి, సీతమ్మ గారి భయం. ఆఖరికి జనంరద్దీ ఎక్కువగా వుండని ఓ రోజు చూసుకొని శాస్త్రి దంపతులు పిల్లను తీసుకొని అన్నవరం బయలుదేరారు. పంపానదిలో స్నానం చేసి కొండ ఎక్కాలి. ఒళ్లు తుడిచి శాలువా కప్పి కొంత తేరుకున్నాక, ఎలాగో దర్శనం అయ్యింది అనిపించి ఇల్లు చేరారు. నాటినుంచి శాస్త్రిగారు యాత్ర చేయాలంటే పుష్కరిణిలో స్నానం చేయాలి. ఖాళీ కడుపుతో దైవదర్శనం చేయాలి వంటి ఆచారాలకు స్వస్తి చెప్పారు. ఇంటి వద్ద వేడి నీళ్ల స్నానం చేసే దైవదర్శనం. ఆలశ్యమవుతుందంటే కాఫీ, పలహారలు చేసాకనే దైవదర్శనం. అయితే ఆయన శరీరం మాత్రం చాలా ఆరోగ్యమైనది. వార్థక్యం పై బడ్డాక కూడా దైవ పితృ కార్యాలకు ఎన్నడూ కాఫీ సేవించేవారు కాదు. పిల్లలకు మాత్రం ఏ విధమైన ఆంక్షలు లేవు. వారిలోనే ఆయన జీవిత సాఫల్యాన్ని, దైవాన్ని చూచేవారు. అన్ని ఐశ్వార్యాలలోకి గొప్ప ఐశ్వర్యం సంతానమే అనేవారు.

శాస్త్రిగారు కొన్న ఇల్లు దక్షిణాభిముఖంగా వుంది కదా ఆ ఇంటిని చేరి మొదటి సన్నని అరుగుల వెనుక పెద్ద అరుగులు, చిన్న అరుగులపై కూర్చొంటే వెనుక అరుగులు ఆనుకునే బెంచీల్లా వుంటాయి. వెనుక అరుగులపై 10,12 మంది పడుకోవచ్చు రాత్రి వేళ. సాయంత్రం 4 గంటలయ్యే సరికి ఇళ్లలో మగవాళ్ళు కాఫీలు సేవించి వీధుల్లోకి వెళ్ళాక ఆడవారంతా ఆ అరుగులపై చేరతారు. ముచ్చట్లు చెప్పుకుంటూ 5 గంటల వరకూ కాలక్షేపం జరుగుతుంది. వంటలూ, పూజలు, వ్రతాలు ఇరుగు పొరుగు వారి యోగక్షేమాలు అన్ని చర్చకు వస్తాయి. చనువుగా సలహాలు చెప్తారు. విమర్శలు చేస్తారు వారు. ఏ స్త్రీ అయినా కుటుంబ నియంత్రణ పాటిస్తుంటే ఏం మింగావు? అని పరిహాసం చేస్తారు. తమతో కబుర్లు చెప్పడానికిరాక చదువుతో సత్కాలక్షేపం చేద్దామనుకొనే స్త్రీని రంగు రంగుల రాజ్యలక్ష్మీ, అని కంటికి జోడూ కాలికి జోడూ అమ్మో అది మనతో కలుస్తుందా? అని ఎగతాళి చేస్తారు. పావలా కాసంత బొట్టు పెట్టుకొని ఖాళీ సమయాన్ని అమ్మలక్కల ముచ్చట్లతో గడిపే స్త్రీలు వారి మిత్రురాళ్లు, అయితే ఆ స్త్రీలు చాలా స్నేహపాత్రులు, నాటి స్త్రీలకు తమ పరిధిలో తమకు మంచివనితతో చిన్న సలహాలిస్తూ వారి కష్ట సుఖాల్లో చేదోడువాదోడుగాను వుంటారు వారు. రాత్రి వేళలో ఆ అరుగులు మగవారి సమావేశ స్థలాలు. వారు ఆఫీసుల నుండి వచ్చి స్నానాలు, భోజనాలు ముగించుకొని అక్కడ చేరుతారు. రాజకీయాలు ప్రపంచ యుద్ద వార్తల నుండీ, స్థానిక సంస్థల కార్యకాలాపాలు, సామాన్య ప్రజల కష్ట సుఖాలు, అన్ని విషయాలు వారికి చర్చా విషయాలు. ఈ రోజుల్లో టీవీలు, రేడియోలు, టేప్రికార్డర్లు వంటివి వార్తా సాధనాలు, వినోద సాధనాలు. నాటి రోజుల్లో అవి వారి ఊహల్లోకి కూడా రాలేదు. వార్తా పత్రికలు ఒకటే ప్రజలకు వార్తలు చేరవేసే సాధనాలు. ఆంధ్రపత్రిక ఒక్కటే తెలుగులో వార్తా పత్రిక. ఆంగ్ల దినపత్రిక హిందు చదివే వారు ఒకరో, ఇద్దరో వుండేవారేమో. సభ్యులంతా ఎవరి అభిప్రాయాలు వారు చెప్తారు. అందులో కొందరు జస్టిస్ పార్టీ, కొందరు కాంగ్రెస్, మరి కొందరు బ్రిటీష్ వారి భక్తులు, తెల్లదొరలే మనలను పాలించడానికి సమర్థులు. ఒక వేళ వారు వెళ్ళిపోయినా మీరే వారిని బతిమాలి తిరిగి తీసుకొని వచ్చి అధికారం అప్పగిస్తారు అని వారు వాదించేవారు. బ్రిటీష్ కంపెనీలో గుమాస్తాగా చేసే వీరభద్రుడు గారు బ్రిటీష్ వారి పక్షం. లాయర్లు ఇద్దరు, ముగ్గురు వుండేవాళ్లు.

వారు జస్టీస్ కుళాయి నుండి ఒక గొట్టం స్నానాలగది గోడకు తూర్పువైపున వున్న రంధ్రం ద్వారా స్నానాలగదిలోకివున్న గొట్టం ద్వారా నీరు స్నానాలు గదికి చేరుతుంది. అక్కడ ఒక రాతి తొట్టె అమర్చి కుళాయి నీరు అందులోకి పడతారు. స్నానాల గదిలో నీళ్ళ పొయ్యిపై నీరు కాగుతూ వుంటుంది. ఒక బిందె నిండుగా మరుగు నీరు పట్టుకొని రాతి తొట్టిలోని చల్లని నీరు కలుపుకుంటూ ఎంతసేపైనా హాయిగా స్నానం చేయవచ్చు. కాసులు కొంచెం పెద్ద అయ్యాక ఆ తొట్టిలో టచ్బాత్ చేసేది. స్నానాల గది బయట పడమటి ప్రహారిగోడ వెంబడి రామబాణం, లక్ష్మణ బాణం, గోరింట, కొబ్బరి సకలఫలసంపంగి వుండేవి. ఉత్తరపు గోడకు పెరటి గుమ్మం, ఈశాన్య మూల పశువుల శాల, తూర్పువైపు పారిజాతం, సువర్ణగన్నేరు, కాశిరేగు, కరివేప మొక్కలు వుండేవి. పెరడంతా మొక్కలతో నిండి నందనవనంలా వుంటుంది. గోశాల ఎదురుగా వట్టి గడ్డిమేటు. పెరటి మధ్యగా పెద్ద నుయ్యి వున్నాయి. నూతి చుట్టూ అరటి మొక్కలు ఎప్పుడూ ఓ చెట్టు గెల వేస్తూ వుంటుంది.

 – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో