చాసో కధల్లో స్త్రీ పాత్రలు – కవిని ఆలూరి

చాసో కధల్లో స్త్రీ పాత్రలు

ఆధునిక తెలుగు సాహిత్యం వ్యాసా ,కధా ,నాటక రూపాలతో,అనేక ప్రక్రియలతో కొత్త పుంతలు తొక్కుతోంది . ఐతే ,ఈ రూపాలలో కధానికా ప్రక్రియ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది . కధానికా రూపంలో సాహిత్యాన్ని సృజించటంలో చాసో కృషి చెప్పుకోదగినదే కాకుండా విశిష్టతను కలిగి ఉన్నది .ఏ రచన గురించైనా చర్చించుకునే టప్పుడు ఆ రచనా కాలాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది . చాసో కధల రచనా కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కధలన్నీ దాదాపుగా 1942 నుండి 1979 దాకా వివిధ పత్రికలలో ప్రచురితమైనవే . కధానికలలోని స్త్రీ పాత్రల చిత్రీకరణ విషయ వస్తువుననుసరించి జరిగింది . స్త్రీ పాత్రలే ప్రధానంగాగల కధానికలను గనక గమనిస్తే విభిన్నంగా ఉండటమే కాకుండా వేటికవే సజీవంగా ,సహజత్వంతో నిండి ఉన్నాయి .రెండు ,మూడు పేజీలల్లో పాత్రలను విశ్లేషిస్తూ చెప్పటమే కాకుండా ఆ పాత్రల స్వభావాలనూ ,ఆర్ధిక ,సామాజిక స్థితులను విశదపరిచారు చాసో. పాత్ర లన్నీ వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి . ఇక కధానికల్లో కొసమెరుపులు ఒక అద్భుతం . చాసో కధలలోని స్త్రీ పాత్రలను ప్రధానంగా మూడు విధాలుగా విభజిస్తే ….. 1. మానవ సంబంధాల నేపధ్యంతో ఉన్న స్త్రీ పాత్రలు . 2. సామ్రాజ్యవాద సంస్కృతి ,మార్కెట్ మాయజాల ప్రభావాలకు లోనైన స్త్రీ పాత్రలు . 3. తమ వ్యక్తిత్వాలను నిలుపుకొనే స్త్రీ పాత్రలు ..

మొదటి విషయానికి వస్తే “వాయులీనం” కధలోని రాజ్యం పాత్రను ప్రధానంగా చెప్పుకోవచ్చు . ఈ కధానికలోని విషయ వస్తువు చాలా సాధారణమైనది . సన్నివేశాల చిత్రీకరణ చాలా సహజంగా ఉంటుంది .సంభాషణలు చాలా సరళంగా పాత్రకు తగినట్టుగా ఉంటాయి . ఒకప్పుడు మన సమాజంలో మానవ సంబంధాలు ప్రధానంగా భార్యా ,భర్తల సంబంధాలు ఎంత దగ్గరగా ,ఎంత మమకారంతో కూడుకొని ఉండేవో ఈ కధానిక ద్వారా పాఠకులకు విశదమవుతుంది . “రాజ్యానికి టైఫా యిడ్ జ్వరం వచ్చి మూడు సార్లకు పైగా తిరగ పెడుతుంది . ఆర్ధిక స్థోమత లేక వైద్య ఖర్చుల కోసం రాజ్యం పుట్టింటి నుంచి అపురూపంగా తెచ్చుకున్న ఫిడేలును 250 రూపాయలకు అమ్మేస్తాడు భర్త వెంకటప్పయ్య . భార్యను బాధ పెట్టటం ఇష్టం లేక ఒక నేరస్థుడిలాగా మొహం పెట్టుకుని “నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే .”అని అంటాడు . భర్త మనస్సు బాధ పడుతున్నదని గ్రహించి ‘” ఏ తప్పూ చెయ్యలేదు . ఏ సంసారైనా అదే చేస్తాడు . చెయ్య వలసి వచ్చి చేశారు . మీరేం తినేశారా ?” అని అంటూ “పోనీయండి,నా నోరు ఏనాడో నొక్కుకు పోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా ?…… “అంటూ గుడ్ల నిండా నీళ్ళు నింపుకుంటుంది రాజ్యం .

అలాగే బదిలీ కధ.. ఒక యువతి ఒక యువకునకు రాసిన ఉత్తరాలే బదిలీ కధ . ఆ యువతి భర్త ఆమెను ఎంతో నిర్లక్ష్యం చేస్తాడు . ఆమె ఇం టి ఎదురుగా ఉన్న యువకుని మోహంలో పడిపోతుంది . తర్వాత ఆమె ఆ యువకుని స్వభావాన్ని గ్రహిస్తుంది . తన బావగారితో చెప్పి భర్తను తన వానిగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది . ఆ యువకునికి తన భర్తకు ఆ ఊరి నుండి బదిలీ అయ్యిందని తెలుపుతూ ,అతనిలో ఉన్న స్త్రిలోలత్వాన్ని ఎత్తి చూపుతూ “మీరు మీ భార్యతో సుఖంగా ఉండండి .నన్ను పూర్తిగా మర్చి పోండి .”అంటూ భర్త దగ్గరే తనకు పూర్తి స్వతంత్రము ,హక్కు ఉంటాయన్న విషయాన్ని స్పష్టపరుస్తుంది .ఈ కధ మొత్తం ఉత్తరాలే ఐనా పాఠకులకు ఆ పాత్రలు కళ్ళ ముందే కదులు తున్నట్టు గా అనిపిస్తాయి . ఏలూరెల్లాళి కధ 1943 నాటిది . వారసత్వం లేకపోతే దీనమైన స్థితిని ఎదుర్కోవాలి కాబట్టి వారసత్వం కోసం కధలోని స్త్రీ పాత్ర చిత్రీకరణ ఆనాటి సామాజిక ,ఆర్ధిక కోణంలో జరిగింది.

రెండవ విషయానికి వస్తే సామ్రాజ్యవాద సంస్కృతి మార్కెట్ మాయజాల ప్రభావం మన సమాజం పై పడుతున్న తొలి నాళ్లలో మారుతున్న విలువలు ,సంబంధాలు ,అలాగే ఆర్ధిక అవసరాల కోసం సాంఘికంగా ఉన్నత స్థితిలో ఉండటం కోసం వివాహేతర సంబంధాలను ఏర్పరచుకునే సామ్రాజ్యవాద సంస్కృతి తాలూకు ప్రభావం ఆ పాత్రల మీద స్పష్టంగా కనపడుతుంది . “లేడీ కరుణాకరం”కధలోని శారద పాత్ర అటువంటిదే . ఈ కధ 1945 నాటిది .” ఆరుగురు పిల్లలను పరాయి దేవతలకు కన్న కుంతీదేవి పతివ్రతే ఐతే శారదా పతివ్రతే భర్త అనుమతిస్తే తప్పు లేదన్నారు ధర్మ శాస్త్రజ్ఞులు .” అని సమాధాన పడతాడు శారద భర్త కరుణాకరణ్ . శారద మహా పతివ్రత! అంటూ ముగిస్తారు రచయిత .ఈ కధలలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్ధిక పరిస్థితులు అతలాకుతలమైన కాలంలో మధ్యతరగతి విలువలను కోల్పోయి నైతికంగా దిగజారిన దుస్థితిని చాలా చక్కగా చిత్రించారు చాసో . చొక్కా -బొచ్చు తువ్వాలు లాంటి అనేక కధల్లో ఈ నేపధ్యం కనపడుతుంది . “కవలలు “కధలో రచయిత “అందం స్వాభావికంగా లేక పోయినా డబ్బిచ్చి కొనుకుంటాం . సంస్కారం బజార్లో దొరకదు . అందం అన్ని షాపుల్లో దొరుకుతుంది . సహజమైన దానికన్నా కృత్రిమమైన దానికే గ్లామరు జాస్తి .”అని చెప్పటం ద్వారా మారుతున్న సంస్కృతి పై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు .

మూడవ విషయానికి వస్తే “కుంకుడాకు”కధలోని గరివి పాత్ర అసాధారణ మైనది . మహా మహా వారినే పాతేసిన భుక్త గారిని గరివి బూతులు తిడుతుంది . ఈ పాత్ర చిత్రీకరణ శ్రామిక వర్గ ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉన్నది . “కుక్కుటేశ్వరం “ముసలమ్మ పాత్ర చాలా ప్రభావవంతమైనది .’బుగ్గి బూడిదమ్మ “కధలోని బుగ్గి బూడిదమ్మ పాత్ర తన ఆధిపత్యమే నడవాలన్న స్వభావం కలది .తన పేరు పక్కన భర్త పేరు ఉండటాన్ని ఏ మాత్రం ఇష్ట పడదు . పూర్తి వ్యాపార దృష్టికోణం కలది . ఇంకా మాత్రుధర్మం ,కర్మ సిద్దాంతం ,మొక్కుబడి,లాంటి అనేక కధలలో శ్రామిక వర్గ దృష్టికోణం స్పష్టంగా కనపడుతుంది .

‘ చాసో కధలు మొత్తం 41. ఐతే ఈ కధలలోని స్త్రీ పాత్రలన్నింటిని విశ్లేషించి చూస్తే అన్నింటిలోను వైవిధ్యం కనపడుతుంది .ఏ కధకు ఆ కధే,ఏ పాత్రకు ఆ పాత్రే తన ప్రత్యేకతను చాటుకుంటుంది . పాత్రలకు తగిన భాషా ,మాండలీకం అన్నింటిలోనూ వైవిధ్యం ఉంది . కధ చదువుతున్నప్పుడు పాఠకులు ఆ పాత్రలలో లీనమై పోతారు . ఏవీ అసందర్భంగా ఉండవు . అన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి . ఈనాటి ఆధునిక కాలానికి ,పరుగు పందెపు జీవితాలకూ రెండు ,మూడు పేజీలల్లో జీవితాలను విశ్లేషించి చెప్పే కధానికల అవుసరం ఎంతైనా ఉన్నది . కొత్తగా రచనలు చేస్తున్న రచయితలకు చాసో సాహిత్యం మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తూ ….. !

– కవిని ఆలూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , Permalink

One Response to చాసో కధల్లో స్త్రీ పాత్రలు – కవిని ఆలూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో