సాయం

                నేనింకా నమ్మలేకున్నాను. à°† అమ్మాయేనా à°ˆ అమ్మాయి? అప్పుడెప్పుడో మేము పాత వీధి లో ఉన్నప్పుడు మా ఇంట్లో పనిచేయడానికి వచ్చే రాజమ్మ కూతురు దేవి… తనేనా ఇప్పుడు à°’à°• సంస్థ  పెట్టి అందులో చదువుకోవాలనుకున్న పేద విద్యార్దినులకి పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులైనవారికి చదువు చెప్పించి, ఆసక్తి ఉన్న వారికి  వృత్తి విద్యలను నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది à°† దేవేనా??
అప్పుడెప్పుడో పేపర్లో ఒకసారి వచ్చింది ఈ సరస్వతీ మందిర్ గురించి . అప్పుడు దేవి అంటే ఎవరో అనుకున్నా. కానీ ఇప్పుడు మా వీధిలో ఒక రాజకీయ నాయకుడి  ఇంట్లో బాల కార్మికులు ఉన్నారని వారిని విడుదల చేయించి వృత్తి విద్యలలో చేర్పించడానికి టి.వి వారితో సహా వచ్చింది దేవి ఇక్కడకి. ఏదో గొడవ అవుతుందని ఇంటి నుండి బయటకి వచ్చిన నేను వీరందరినీ చూచి అమ్మో!  కార్ బయట ఉంటే ఏమవుతుందో అని లోపల షెడ్ లో పెడదామని కార్ డోర్ తెరుస్తుంటే అక్కడకి మంచినీళ్లు తాగడానికి వచ్చిన దేవి నన్ను గుర్తు పట్టి అన్నయ్యా.. బాగున్నారా అని అడిగింది. నేనైతే అస్సలు గుర్తు పట్టలేదు. తనే అన్నీ గుర్తు చేసింది.

ఒక రెండు నిమిషాలు నాతో మాటలాడి వెంటనే వెళ్లి మళ్లీ ఆ పోరాటంలో తన గొంతు కలిపింది. కార్ షెడ్ లో పెట్టి ఇంట్లోకి వెళ్లా. దేవే గుర్తు వస్తుంది. భలే చలాకీ అమ్మాయి. వాళ్ల అమ్మ రాజమ్మ మాఇంట్లో పనిచేసేది. రాజమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు దేవే వచ్చి పని చేసేది. ఏదో గవర్నమెంట్ బళ్లో చదువుకునేది. లెక్కల్లో ఎమైనా డౌట్స్ వుంటే నా దగ్గరకి వచ్చేది. తనకి పెద్ద ఆఫీసరు అవ్వాలని కారులో తిరగాలని కోరిక ఉండేదని చెప్పేది. అలా పెద్ద హోదా రావాలంటే ఏమి చదవాలని అడిగేది. నేను నవ్వేసి, ఇప్పుడు ఈ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకో అని చెప్పేవాడిని. ఒక ఏబయ్యి, అరవయ్యి మార్కులు వచ్చేవి. అవి రావడం నిజంగా నాకైతే వింతే అని అనిపించేది. గవర్నమెంట్ బడి  ఎలాంటిదో, అక్కడ ఏమేమి చెప్తారో మనకి తెలుసు. ప్రైవేట్ లేదు. నాన్న తాగుబోతు. ఇంట్లో చదివేందుకు వీలు లేదు. ఇంక మార్కులెలా వస్తాయి? అయినా అరవై మార్కులు తెచ్చుకుందంటే నాకెందుకో గొప్పగా అనిపించేది. ఆ తర్వాత మా నాన్న గారికి ట్రాన్స్ఫర్
అయ్యి మేము మరో ఊరికి వెళ్లాము. ఆ తర్వాత ఇప్పుడే చూడటం  దేవిని.

హమ్మయ్య బయట గొడవ సద్దుమణిగి నట్టుంది. ఈ రాజకీయనాయకుల పక్క ఇళ్లళ్లో వుంటే ఇదే గొడవ. ఎప్పుడూ ఏవో అరుపులు..అంటూ నా భార్య లలిత అసహనం వ్యక్తం చేయడంతో ఈ లోకం లోనికి వచ్చా నేను. ఓసారి ఎప్పుడైనా సరస్వతి మందిర్ కి వెళ్లాలని అనుకున్నా..
***                           ***                                       ***                          ***                     ***
అదేదో ఏరియాలో తక్కువ రేటుకి ఇంట్లోనే బట్టలు అమ్ముతున్నారని నా భార్య ఈ పండక్కి బట్టలు కొనే ప్రోగ్రాం ని ఆ ఏరియాకి మార్చింది. ఆడాళ్ల బట్టల ఎంపుళ్ల సంగతి తెలిసిన నేను రానంటే కనీసం డ్రాప్ అయినా చేయండని తను అడిగితే ఇప్పుడు కూడా మొరాయిస్తే మొదటికే మోసం అని ఒప్పుకున్నా. మొత్తనికి ఎలాగోలా అడ్రస్ కనుక్కొని అక్కడకి చేరుకున్నాము. నేను రిటర్న్ రావడానికి కార్ యు టర్న్ కి స్థలం లేక కొంచెం ముందుకు పోనిచ్చి సందు మొదట్లో  తిప్పుదామనుకున్నా. అక్కడే కనిపించింది సరస్వతి మందిర్. దేవి గుర్తు వచ్చింది. ఇంట్లో కూడా పెద్దగా పని లేదని ఒకసారిని దేవిని చూద్దామని లోనికి వెళ్లా.
కొంత మంది పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి భోదిస్తున్నారు. మరి కొంత మంది కుట్లు, అల్లికలు, మరికొంత మంది బట్టల మీద బొమ్మలు వేస్తున్నారు. కొంత మంది వడియాలు, అప్పడాలు చేస్తున్నారు. ఇలా అందరూ ఏదో  à°’à°• పని చేస్తున్నారు. à°’à°• అమ్మాయి నా దగ్గరకి వచ్చి ఎవరు కావాలి సార్? అని అడిగింది. à°† ప్రశ్నతో à°ˆ లోకం లోకి వచ్చిన నేను “దేవి” అని చెప్పగానే నాతో à°°à°‚à°¡à°¿ సార్ అని అంటూ à°’à°• గది లోనికి తీసుకెళ్ళింది . à°’à°• బల్ల, దానికిరువైపులా రెండు ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి.బల్ల పై ఏవో రెండు పెద్ద పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడే దేవక్కని పిలుస్తాను ఇక్కడే కూర్చోండి సార్ అంటూ à°† అమ్మాయి వెళ్లింది. ఇది ఆఫీసు రూమా? ఇలా ఉందేమిటి అని అనుకునేలోపు దేవి వచ్చింది.
నన్ను చూచి అన్నయ్యా! అంటూ ఆశ్చర్యపోయి ఎలా వున్నారని అడిగింది. నేను బాగున్నా  అని చెప్పేలోపే ఒక గ్లాసు మజ్జిగ తీసుకురామ్మా లక్ష్మీ అని ఆ అమ్మాయితో చెప్పింది.
అలాగే అక్కా!  అంటూ ఆ అమ్మాయి అక్కడ నుండి  వెళ్లింది.
“నువ్వెలా వున్నావ్ దేవి?” అని à°…à°¡à°¿à°—à°¾.
“నాకేమి అన్నయ్యా… నేను బాగున్నాను”  అంది.
“అమ్మ, నాన్న ఎలా ఉన్నారు” అని à°…à°¡à°¿à°—à°¾..
“ఇద్దరూ పోయారు” అని చెప్పింది ఏదో శూన్యంలోకి చూస్తూ..
అవునా!! అని అన్నా.. ఎలా పోయారు అని ఎలా అడగాలో అర్దమవ్వలేదు. వాళ్ల నాన్నకి తాగుడలవాటు. వాళ్ల అమ్మకి ఆరోగ్యం అప్పట్లోనే అంతంత మాత్రం. ఇంకేమి అడగాలో అర్దమవ్వలేదు.
“మీరిక్కడే ఉంటున్నారా అన్నయ్యా ?” అని దేవే అడిగింది.
“అవును” అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఎందుకు వచ్చానా అని ఆలోచించుకునే లోగానే à°† అమ్మాయి మజ్జిగ గ్లాసుతో వచ్చింది. దేవికిచ్చేసి వెళ్లిపోయింది.
“తీసుకోండి అన్నయ్యా..” అంది .
అది తాగబోయిన నేను “అబ్బ ఏంటి  ఇంత పల్చగా ఉంది అని అనుకుంటూ పక్కన పెట్టేశాను.
“నువ్వేనా à°ˆ సంస్థ ను స్థాపించింది?” అని à°…à°¡à°¿à°—à°¾.
“అవును అన్నయ్యా. అప్పుడు ఒకసారి మీరు చెప్పిన మాటలు అలా గుర్తు వుంచుకున్నా  అన్నయ్యా . ఆఫీసరు అంటే ఎక్కడో గదిలో కూర్చుని ప్రజల గురించి తెలుసుకోకుండా ప్రజల పని చేయాలి. దానికన్న మంచిగా ప్రజా సేవ చేయవచ్చు. ఇంకా ఎంతో మంది మహాత్ముల గురించి  నాకు చెప్పారు ఒకరోజు మీరు. మీకు గుర్తు ఉందా అన్నయా ?” అని అడిగింది దేవి.
నేను చెప్పానా అలాగ? చెప్పానేమో చదువుకునేటప్పుడు దేశాన్ని ఉద్దరించాలని కోరిక ఉండేది. చదువయ్యాక సంపాదించాలనే యావ పెరిగి దేశం కోసం పని అనేది పక్కన పెట్టా.
ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన నన్ను చూచి…
“à°† మాటలు చెప్పి మీరు వెళ్లిపోయారు. కాని నాకు మాత్రం అవి గుర్తు ఉండి పోయాయి. ప్రజలకి ఏదో చేద్దాం  అనుకున్నా. పదో తరగతి అయ్యాక కాలేజీకి వెళ్లడానికి డబ్బులు లేవు. మా వీధి లోనే నాలా చదువుకోవాలని కోరిక ఉండి ప్రయివేటుకి వెళ్లలేని పిల్లలకి రోజుకో à°—à°‚à°Ÿ పాఠాలు చెప్పేదాన్ని.  వాళ్ళు  కూడ పదో తరగతి చదివే వాళ్ళు. à°’à°• అయిదుగురు అమ్మాయిలం కలిసి à°’à°• బట్టల షాపు ఓనర్ ని కలిసి మాకు చదవాలని ఉంది. సాయం చేయమని అడిగాము. అతను చేయలేదు. అలా కొన్ని కొన్ని సంస్థల దగ్గరకి వెళ్లి అడిగాము. కొంత మంది సాయం చేశారు. అయిదుగురుతో మొదలయ్యింది. ఇప్పుడు అయిదు వందల మంది దాకా అయ్యింది.
ఇప్పుడు నేను అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నా. నాకు తెలిసింది నేను చెప్తాను. ఇక్కడకి వచ్చేవారికి వారి అవసరాల మేర ఏదో ఒక కోర్సు నేర్పిస్తాము. అది చదువు మాత్రమే కాదు. వారి జీవితాన్ని నిలబెట్టేది ఏదైనా నేర్పిస్తాము. వారు నేర్చుకున్న తర్వాత వారే మరికొంత  మందికి నేర్పిస్తారు.
ఎవరైనా పిల్లలు కానీ ఆడవాళ్లు కానీ  కష్టాల్లో వున్నారని వారి బంధువులు ఎవరైనా వచ్చి మా దగ్గర భాధ పడితే పోలీసుల మరియు ఇంకా కొన్ని సంఘాల ప్రతినిధుల సహాయంతో వారిని ఆదుకోవడానికి మా వంతు కృషి చేస్తాము. నిన్న మిమ్మల్ని కలిసింది కూడా అప్పుడే. వాళ్ల అక్క కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి. వారేమీ చర్య తీసుకోలేదు. మా దగ్గరకి వచ్చి మొర పెట్టుకుంది. ఇక్కడ మరో సంఘం ఉంది.. బాల కార్మిక వ్యవస్థ ని రూపుమాపడానికి చర్యలు చేపడతారు వాళ్లు, వాళ్లని వెంట తీసుకుని బయలుదేరాము. ఆ తర్వాత టి.వి. వాళ్ళు  కూడా వచ్చారు. ఆ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా కూడా వాళ్లు హింసిస్తున్నారంట. వాళ్ల అక్క చెప్పింది. మొత్తనికి విడిపించాము మేము.
“అంటే మీరు వృత్తి విద్యలతో పాటు ఇవి కూడా చేస్తారా?” అని à°…à°¡à°¿à°—à°¾ నేను. “ఇవి మాత్రమే చేస్తాము అని ఏమీ లేదు  . మా దగ్గరకి వచ్చిన వారి కష్టాలు తీరడానికి మాకి ఏది వీలయితే అది చేస్తాం అన్నయ్యా “  అంది దేవి.
నాకు దేవి దేవతలా కనిపించింది ఎందుకో.
“మరి వీటికి డబ్బులో” అని à°…à°¡à°¿à°—à°¾. ” నా జీతం మొత్తం ఇక్కడే  ఖర్చు పెడతాను. ఇక్కడనుండి లాభపడినవారు కూడా ధనసహాయం చేస్తారు. ఇంకా అవసరమైతే స్పాన్సర్ల కోసం మేమే వెళ్తాం. ఎవరో ఒకరు సాయం చేస్తారు” అంది.
పెళ్లి చేసుకున్నావా అని అడుగుదామనుకున్నా. ఇంకా ఏవో నీతి సూత్రాలు చెప్తుందేమో అని అడగలేదు. కష్టాల్లో ఉన్నవారి కోసం ఏదైనా చేయవచ్చు. కానీ వారి కోసం మన జీవితాన్నే కష్టాల మయం చేసుకోవడం అంటే ఎందుకో నాకు నచ్చదు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఈ అమ్మాయి మారదు కదా అని లేవబోయా  నేను.
“అప్పుడు మీరు చెప్పిన మాటలు నిజంగా నా జీవిత గమనాన్ని మార్చాయి అన్నయ్యా!.” అంది.
కుర్చీ లోనుండి లేవబోయిన నేను ఒక్కసారిగా తూలబోయి మళ్లీ కూర్చుండిపోయా కుర్చీలోనే. శూన్యం లోకి చూస్తూ మాటలాడుతున్న దేవి ఇది గమనించలేదు. ఇంతకీ నన్ను తిడుతుందో, పొగుడుతుందో కూడా నాకు అర్దం కాలేదు.
“ఏంటీ” అని సంశయిస్తూ అడిగాను.
“అవును.పేదరికంలో ఉన్నందుకో ఏమో..నాకు ఎప్పుడూ కారుల్లో తిరిగే ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ ఒకసారి మీరు చెప్పారు కదా… కారుల్లో తిరిగామా?? మిద్దెల్లో ఉన్నామా అని కాదు ముఖ్యం . మన వలన à°Žà°‚à°¤ మంది లబ్ధి  పొందారు. à°Žà°‚à°¤ మందికి మనం సాయం చేయగలిగాం అనేది ముఖ్యం అని .మదర్ థెరిస్సా గురించి  ఇంగ్లీష్ లో ఉన్న పాఠాన్ని మీరు నాకు బోధపరిచారు గుర్తు ఉందా అన్నయ్యా ” అని అడిగింది నా వైపు చూస్తూ.
ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ “à°Š” అన్నా.
ఆ మాటలు అలా నాకు గుర్తు ఉండిపోయాయి అన్నయ్యా..
నాకు ఒక్కసారిగా ఏమీ అర్దం కాలేదు. నేను చెప్పిన మాటలకు ఇంతలా స్ఫూర్తి  పొందడమేంటో అర్దం కాలేదు.
నా ఫోన్ మ్రోగింది. మా ఆవిడ షాపింగ్ అయ్యింది అని చెప్పింది. బిల్ పే కి అయిదు నిమిషాల్లో అక్కడ ఉండాలని పురమాయించింది.
“సరే దేవి మరి నేను మళ్లీ వస్తాను. నాకు కొంచెం పని వుంది” అన్నాను. “అలాగే అన్నయ్యా.మీకు వీలున్నప్పుడు తప్పకుండా à°°à°‚à°¡à°¿. ఇక్కడున్నవారికి మీకు తెల్సిన విషయాలుఏమైనా భోదించండి మీకు వీలైతే”  అంది దేవి.

“తప్పకుండా” అని బయటకి వచ్చా నేను. నా మాటల వలన స్ఫూర్తి పొందిందని  తను అనుకుంటుంది. కానీ చిన్నప్పటి నుండి తను పడిన కష్టాలే తనని ఇంత ఉన్నతంగా మార్చాయి అని తను గ్రహించలేదేమో మరి. మదర్ థెరెస్సా గురించి  నేను చెప్పానేమో  గానీ… తను పడిన కష్టాలు మరొకరు పడకూడదని, తను నేర్చుకుంది కొంత మందికి నేర్పి వారి జీవితాలలో వెలుగుని నింపాలని దేవి చేసే à°ˆ ప్రయత్నం ఎంతో మంది జీవితాలలో నిజంగా చిరుదివ్వెలను వెలిగించడమే. నేను ఇంతలా చేయకపోయినా నాకు తెల్సిన నాలుగు ఇంగ్లీష్ ముక్కలు ఆదివారాల్లో ఇక్కడకు వచ్చి చెప్పాలి అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేశా.. ప్రతీ పని లానే à°ˆ పని కూడా పని అని కాకుండా భాద్యత అని అనుకునేలా చేయాలని, ఎప్పుడూ మర్చిపోకూడదని నా కార్లో ఉన్న విఘ్నేశ్వరుడిని  చూస్తూ దణ్ణం పెట్టుకుని కార్ ని ముందుకు నడిపా…

– జాహ్నవి శ్రీధరాల

కథలుPermalink

3 Responses to సాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో