వేగు చుక్క

              -శారద

“ఇప్పుడు శ్రీమతి సరళ గారి గాన కచ్చేరి. మృదంగ సహకారం శ్రీ రవికుమార్, వయొలిన్ పై శ్రీ కిరణ్,” మైకులో ప్రకటన

వినిపించింది. నాకు చేతులు కాళ్ళు వణకటం మొదలు పెట్టాయి.

చరణ్ చటుక్కున నా చేయి పట్టుకున్నాడు. నాకు తెలీకుండానే వింగ్లోంచి

వేదిక పైకి నడిచాను. చరణ్ ఇంకా నా చేయి పట్టుకునే వున్నాడు.

మెల్లిగా వేదిక మీద నన్ను కూర్చోబెట్టాడు. డిస్క్రీట్ గా నా చీర సవరించాడు.

శృతి బాక్సులో నాక్కావల్సిన శృతి పెట్టాడు.

“అమ్మా! ఆల్ ది బెస్ట్,” నా చెవిలో మెల్లిగా చెప్పి నా భుజం నొక్కి వెళ్ళాడు. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన నా

పదహారేళ్ళ బిడ్డ, ఎంతో పెద్దయినట్టనిపించాడు ఆ క్షణంలో.

 నా వైపు సానుభూతిగా ప్రేక్షకులు చూడటం నాకు తెలుస్తూనే వుంది. ఆ చూపులు నా మొహాన్నీ, ప్రపంచాన్ని చూడలేని

నా కళ్ళనీ తడుముతున్నట్టనిపించింది.

“పాపం! కళ్ళు కనిపించవుట! ఎలా పాడుతుందో! పోనీ ఒక్క టిక్కెట్టైనా కొందాం,” అని

చాలామంది పెర్వెర్టెడ్ కుతూహలం తోటో జాలితోటో ఈ ప్రోగ్రాం కొచ్చారని తెలుసు నాకు.

వాళ్ళ జాలినీ, కుతూహలాన్నీ తట్టుకోలేను, పారిపోదాం అనుకున్నాను ఒక్క క్షణం.

అంతలోకే వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం అనుకుని, నాకిష్టమైన బేగడ రాగంలో “వల్లభ నాయకస్య”

అందుకున్నాను.

 జీవితంలో మొదటిసారి కచ్చేరీ చేయటం! అదీ ఈ వయసులో! ఎలా సాగుతుందోనన్న బెంగ మనసుని

తొలిచేస్తున్నట్టుంది. గొంతులో తీయదనం తగ్గు ముఖం పట్టిందేమో! శృతి తప్పుతానేమో! రెండు గంటల పాటు

అలసిపోకుండా పాడగలనా?

అనుమానాలన్నీ రెండే నిమిషాలు.

సరస్వతిలో రాగాలాపన చేసి “సరస్వతీ నమోస్తుతే” ఎత్తుకునేసరికి నేను మిగతా విషయాలన్నీ మరచిపోయాను.

 కచేరీ ముగిసి ప్రేక్షకుల చప్పట్లతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చాననిపించింది. ముందు చరణ్ వేదిక మీదకు నా

దగ్గరకొచ్చాడు. “అమ్మా! యూ ఆర్ గ్రేట్”, అన్నాడు.

వాడి గొంతులో తడి. వింగ్ లోకొచ్చేసరికి భుజం చుట్టూ చేయేసి, “అయాం ప్రౌడ్ ఆఫ్ యూ” అంటూ

గుండెలోని ఉద్వేగాన్ని గొంతులోకి రాకుండా అణచిపెట్టటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ మధు!

వీళ్ళిద్దరూ బాగా టెన్షన్ పడ్డట్టున్నారు, అనుకుంటూ మధు  చేయి పట్టుకుని బయటికొచ్చాను.

వున్న కొద్ది మంది జనం చుట్టు ముట్టారు. “చాలా బాగా పాడేరు, మేడం,” అంటూ అభినందనలు.

రవికుమార్, కిరణ్ కుడా నా దగ్గరి కొచ్చి,

“చాలా బాగా వచ్చింది మేడం! మీరనవసరంగా టెన్షన్ పడ్డారు. ప్రాక్టీసులోనే చెప్పాం, మీరు చాలా బాగా

పాడుతున్నారని,” అంటూ ఏదో అంటున్నారు.

 టేక్సీలోనో, ఆటోలోనో వెళ్ళిపోతామంటే వినకుండా ఆర్గనైజర్లు కారులో ఇంటి దగ్గర దింపారు. ” “మళ్ళీ సారి కార్యక్రమం

ఇంకా పెద్దగా చేద్దాం మేడం.

మీరు మాత్రం ప్రాక్టీసు మానకండి,” చెప్పి వెళ్ళిపోయారు.

ఇంట్లోకొచ్చి కుర్చీలో కూలబడ్డాము. చరణ్ మంచి నీళ్ళిస్తుండగా ఫోన్!

“అమ్మా! నీకే ఫోన్. ఆదిత్య!”

ఫోన్ తీసుకున్నాను.

“హలో మేడం! ఎలా జరిగింది కచ్చేరి?” ఆత్రంగా అడిగాడు.

“ఆదిత్యా!..” నాకు గొంతులోంచి మాట రావటంలేదు. అతి ప్రయత్నం మీద,

“చాలా బాగా జరిగింది ఆదిత్యా! నిన్ను బాగా మిస్సయ్యాము. అసలిదంతా నీవల్లే! నీ ఋణం ఎలా తీర్చుకోను?”

“ఇది బాగుందమ్మోవ్! ఏదేదో పెద్ద మాటలు చెప్పి నన్ను బోల్తా కొట్టించొద్దు. నాకీ మాటలతో పని లేదు. హైదరాబాదు

రాగానే డిన్నర్ పార్టీ ఇవ్వాలి. మళ్ళీ చెప్పలేదనేరు! ఏం ఐ క్లియర్?” అచ్చు క్లాసులో నేనన్నట్టే, నన్ననుకరిస్తూ

అన్నాడు.

చాలా యేళ్ళ తరువాత హాయిగా నవ్వాను,

“అలాగేలే” అంటూ!

“ఎందుకైనా మంచిది. ఒకసారి సార్ కివ్వండి, ఆయనతో కూడా కంఫర్మ్ చేసుకుంటాను పార్టీ గురించి.”

ఫోన్ మధు చేతికిచ్చాను, “ఆదిత్య మాట్లాడతాడంటా!” అంటూ.

 వంటావిడ దగ్గరకొచ్చి, “హమ్మయ్య! అంతా బాగానే జరిగిందటకదా? ఇంక భోజనానికి లేమ్మా!” అంది.

“అవును రాధమ్మ గారూ! చాలా బాగా పాడిందమ్మ ఇవాళ. అమ్మా! మీ గురువుగారు కూడా వచ్చారు తెలుసా? వాళ్ళ

అబ్బాయిని ఏర్ పోర్టులో రిసీవ్ చేసుకోవాలిసి వుందట, అందుకేమధ్యలో వెళ్ళారు.

కానీ తప్పకుండా రేపు ఫోన్ చేస్తానన్నారు.” చరణ్ నా కంచంలో అన్నం వడ్డిస్తూ అన్నాడు.

నా మెదడులోకేమీ ఎక్కటంలేదు.

అన్నం తిని పడుకుందామని లేచాను. మధూ, చరణ్ కచేరీ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే వున్నారు. ఎవరి

సహాయం లేకుండానే నా గదిలోకి వెళ్ళటం, బట్టలు  మార్చుకోవటం నేర్చుకున్నాను.

వెళ్ళి పడుకున్నాను. అలసటగా వుంది కానీ నిద్ర పట్టటం లేదు.

 ఆరు నెలలుగా సాధన చేస్తూనే వున్నా, నిజంగా అనుకున్నది జరిగితే ఏదో ఊహించలేని సంఘటన జరిగినట్టుంది!

అసలు నేనెప్పుడూ అనుకోలేదు, నేనూ వేదిక ఎక్కి కచేరీ చేస్తానని. అది నిజానికి చాలా చిన్న విషయం.

కానీ దాని వెనక దాగిన నా ప్రయాణం, ఆ ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయాలూ, అర్ధం చేసుకున్న జీవితమూ ఎంత

లోతైనవి!

ఆ అనుభవాలతో పోల్చి చూసుకుంటే అంతకు ముందు నేను గడిపిన దాదాపు ముఫ్ఫై అయిదేళ్ళ జీవితమూ వేరే జన్మ

లాగనిపిస్తాయి.

 ***                                   ***                              ***

 దాదాపు ఆరేళ్ళ కిందటి వరకూ నాది చాలా మధ్య తరగతి మామూలు జీవితం. నాన్న గారిది చాలా చిన్న ఉద్యోగం

కావటంతో నన్నొక్కదాన్నీ కని ఇంక చాలనుకున్నారు.

బియెస్సీ ముగిసి బియ్యేడీ చేస్తుండగానే సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

చాలా సంప్రదాయబధ్ధంగా మధుతో నా వివాహం జరిగింది.

 మధుకి బాంకులో ఉద్యోగం. నాకూ మేథ్స్ టీచరుగా మంచి పేరున్న ప్రైవేటూ స్కూల్లో ఉద్యోగం దొరికింది. పెళ్ళయిన

రెండేళ్ళకు ముద్దులు మూటగడుతూ చరణ్!

అదృష్టవశాత్తూ నాకు గానీ మధుకి గానీ కంప్యూటర్ల మీద మోహం, విదేశాల మీద మోజు లేకపోవటం తో అటు

అత్తమామలనీ, మా అమ్మా నాన్నలనీ వీలైనంత కనిపెట్టుకుంటూ వున్నాం.

చిన్న ఉద్యోగాలే అయినా, ఇద్దరిదీ వున్నదాంతో సంతృప్తి పడేమనస్తత్వాలు కావటంతో ఏ దిగులూ వుండేది కాదు.

లెక్కలతో పాటు నాకు సంగీతంలో కూడా కొంచెం ప్రవేశమూ, ఉత్సాహమూ వుండటంతో పిల్లలకి స్కూలు కార్యక్రమాలకి

అప్పుడప్పుడూ చిన్న చిన్న లలిత గీతాలు నేర్పిస్తూ వుండేదాన్ని.

 పండక్కి చీర కొనుక్కోవటానికి బడ్జెట్ సరిపోకపోవటం, ఎప్పుడైనా చరణ్ ఇంటికొచ్చేసరికి నేను ఉండకపోవటం, అమ్మకో

నాన్నకో అనారోగ్యం చేస్తే స్కూల్లో సెలవు దొరకకపోవటం, ఇంతకంటే పెద్ద కష్టాలేమీ లేవు, వుంటాయన్న ఊహ కూడా

రాలేదు.

అలాటి మా జీవితాల్లో పెను తుఫాను వీచింది, సరిగ్గా మా పెళ్ళయిన పదమూడేళ్ళకు!

 చరణ్ కీ, మధుకీ లంచ్ డబ్బాలు కట్టిచ్చి పొద్దున్నే స్కూలు కెళ్ళటానికి బస్సు కోసం గబ గబా రోడ్డు దాటుతున్నాను.

ఎవరూ లేనట్టే అనిపించిన రోడ్డు మీద ఎక్కణ్ణించి వచ్చిందో లారీ! నేను తేరి చూసేలోపే నా మీదకెక్కింది. నాకు స్పృహ

తప్పింది.

 మళ్ళీ స్పృహ తెలిసేసరికి, ఆస్పత్రిలో వున్నట్టున్నాను. కొంచెం సేపటి వరకూ నాకేమైందో అర్ధం కాలేదు, ఙ్ఞాపకమూ

రాలేదు. లీలగా మధు మాటలూ,నాన్న మాటలూ వినిపిస్తున్నాయి. నెమ్మదిగా ఆక్సిడెంటు గుర్తొచ్చింది. తలలో నొప్పి

మొదలయ్యింది.

హమ్మయ్య, ప్రాలైతే పోలేదు అనుకున్నాను. అంతలో అమ్మ నా పక్కనొచ్చి కూర్చుంది, ఎందుకో వెక్కి వెక్కి ఏడుస్తుంది.

“ఏమయిందమ్మ” అని అడగబోయాను. తలుపు తెరిచిన చప్పుడవ్వటంతో ఆగిపోయాను.

 ఆ తరువాత దాదాపు నెలరోజులక్కానీ తెలియలేదు నాకు, నా కంటి చూపు పూర్తిగా పోయిందనీ, ఇక నేను శాశ్వతంగా

చీకట్లోనే గడపాలనీ!

ముందు నేను నమ్మలేదు. à°’à°• రకమైన డినయల్ మూడ్ లోకెళ్ళి పోయాను. “గాఢంగా దేవుణ్ణి విశ్వసించి ప్రార్థిస్తే నా

à°•à°‚à°Ÿà°¿ చూపు తప్పక తిరిగొస్తుంది,” అని పదే పదే అందరితో చెప్పేదాన్ని. నా అమాయకపు మాటలు వినీ, నా చేష్టలు

చూసీ చుట్టు పక్కల వాళ్ళు బాగా నవ్వుకొనివుంటారు.

 ఆ ఆరు నెలలూ నేననుభవించిన నరకం ఎవ్వరూ అనుభవించి వుండరు. అంతా బాగై పోతుందన్న ఆశ ఒకవైపు, ఇక

బ్రతుకంతా ఇంతేనేమోనన్న నిరాశ ఒకవైపు నన్ను నలిపేసాయి. మార్చి మార్చి నేను దేవుణ్ణీ, వైద్య శాస్త్రాన్నీ నమ్మాను.

ఆరు నెలల తరువాత పూర్తిగా ఆశవదిలేసుకున్నాను.

ఇక చేసే ప్రయత్నాల వల్ల డబ్బు ఖర్చూ, వృధా ప్రయాస తప్ప ఇంకేమీ వుండవని తెలిసిపోయింది.

అన్నిటికంటే చరణ్, వాడి భవిష్యత్తుకని మేము కూడబెడుతున్న డబ్బు నా వైద్యానికీ, నన్ను తీర్థ యాత్రలు తిప్పటానికీ

వాడటం నాలోని ప్రాక్టికల్ మనిషికి నచ్చలేదు.

 అన్ని ప్రయత్నాలూ మానేసి ఇక బ్రతుకుతో రాజీ పడటంలోనే శక్తి యుక్తులన్నీ ఉపయోగించుకోవాలని

నిశ్చయించుకున్నాము.

నిశ్చయించుకోవటానికీ, అమలులో పెట్టటానికీ మధ్య ఎంత దూరం వుందో! ఆ దూరాన్ని అధిగమించలేకపోయాను.

 స్కూల్లో మంచి మాటలు చెప్తూనే ఉద్యోగంలోంచి తీసేసారు. ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే కాలక్షేపం. పుస్తకం

చదువుకోవటానికి లేదు, టీవీ చూడటానికి లేదు! తనకి దూరపు బంధువైన రాధమ్మ గారిని ఇంట్లో వంటకీ, నన్ను

చూసుకోవటానికీ పెట్టాడు మధు.

పైకేమీ అనకపోయినాఇదంతా మమ్మల్ని ఆర్ధికంగా కృంగ దీస్తుందని నాకూ తెలుసు.

  నా గురించిన దిగులుతో అమ్మ కన్ను మూస్తే, నాన్న ఓల్డ్-ఏజ్ హోం లోచేరిపోయారు!

 బయటికి వెళ్తే అందరి జాలి చూపులూ, నిట్టూర్పులూ భరించలేక ఇంట్లోనే నాలుగ్గోడల మధ్యే వుండిపోయాను. ముఫ్ఫై

అయిదేళ్ళ వయసులో,

ఇక బ్రతుకంతా ఇంతే అన్న భావన మనసుని ఊహించలేనంత బలహీనం చేస్తుంది. అప్పుడు కమ్ముకుంది నన్ను- నల్లటి

దట్టమైన మేఘంలా-

డిప్రెషన్!

 ఆలోచించీ, బాధ పడీ, సెల్ఫ్-పిటీతో కృంగి పోతున్న మనసూ- నన్నెలా కాపాడుకోవాలో, నన్ను మామూలు మనిషినెలా

చేయాలో తెలియక తల్లడిల్లి పోయే కుటుంబ సభ్యులు-భార్యగా, తల్లిగా కుటుంబానికేమీ చేయలేకపోగా, వాళ్ళకే

భారమౌతున్నానన్న ఆవేదనలో నేను- ఇంకో రెండు నెలలు దుర్భరంగా గడిచాయి.

 ఇక ఈ బాధకి ఒక్కటే మందు- ఆత్మ హత్యే! అన్న ఆలోచన వచ్చిందొక రోజు. పుట్టిన చిన్న ఆలోచన

చిలవలూ-పలవలూ నేసి బలమైన వృక్షంలా మనసులో వేళ్ళునుకుంది.

ఎంత ఆలోచించినా నా బ్రతుకు వల్ల ఎవ్వరికీ- ఆఖరికి నాక్కూడా- ఎటువంటి సుఖమో,

సంతోషమో, ప్రయోజనమో కనిపించలేదు. నేనెందుకు బ్రతుకున్నాను అన్న ప్రశ్నకి ఎంత ఆలోచించినా  సమాధానం

దొరకలేదు- ఇంకా చావు రాలేదు కాబట్టి అన్న జవాబు తప్ప!

 నా ఆక్సిడెంట్ అయిన సంవత్సరానికి సరిగ్గా అదే రోజున నేను మరణించాలని నిర్ణయించుకున్నాను. నిజానికా

ఆక్సిడెంటులోనే పోవాల్సింది!

పరవాలేదు! భగవంతుడు చేసిన చిన్న తప్పుని నేను సరిదిద్దుతాను. అలా అనుకుని ఆ రోజు కోసం ఎదురు

చూస్తున్నాను. సరిగ్గా అంతకు  ముందు రోజు…..

  ***                                     ***                                             ***                                    ***

“అమ్మా! నీకోసం ఎవరో ఆదిత్యట వచ్చారు,” లోపల మంచం మీద పడుకున్న నా దగ్గరికి వచ్చింది రాధమ్మ.

“ఆదిత్యా? ఏ ఆదిత్య?”

“ఏమోనమ్మా! మీ స్కూల్లోనే పనిచేస్తారట,”

గుర్తొచ్చింది. సరిగ్గా నా ఏక్సిడెంటుకి ముందర మా స్కూళ్ళో ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ గా చేరాడు. అప్పుడప్పుడు

పలకరించుకోవటం తప్ప వేరే పరిచయమేమీ లేదు. పాతికేళ్ళ కుర్రాడు. అసలు ఇప్పుడు మొహం కూడా లీలగానే

గుర్తొస్తుంది.

అతనెందుకొచ్చాడిప్పుడు? మా స్కూల్ టీచర్లందరూ మొదట ఒకటి రెండు నెలలూ కొంచెం అప్పుడప్పుడూ వచ్చి

చూసినా, ఇప్పుడెవరూ రారు. ఏదైనా డాక్యుమెంట్ మీద సంతకం కావాలేమో! ఇన్ని రోజులయింతరువాతా? సరే వెళ్ళి

మాట్లాడదాం అనుకుని,

“రాధమ్మా, నా చీరా, జుట్టూ బాగానే వున్నాయా?” అని అడిగాను.

 రోజూ పొద్దున్నే నా బట్టలు మధు తీసి వుంచుతాడు. రాధమ్మ సాయంతో స్నానం చేసి జడ వేసుకుంటాను కానీ అదెలా వుందో నాకెప్పుడూ

తెలియదు.  ఒక్కసారి దగ్గరికొచ్చి చీర కొంగు సవరించింది రాధమ్మ. జుట్టు కూడా కొంచం పైపైన దువ్వింది.

 “నమస్తే మేడం!” హాల్లోకి అడుగు పెట్టగానే మనిషి లేచి నిలబడ్డ సవ్వడి, మూలగా!

“నమస్తే! కూర్చొండి”, అడుగులు లెక్కపెట్టి సోఫాలో కూర్చున్నాను.

“నా పేరు ఆదిత్య! మీకు గుర్తున్నానో లేదో,”

“గుర్తున్నారు! చెప్పండి, ఏమిటిలా వచ్చారు?” విసుగ్గా అన్నాను.

“à°—à°¤ ఏడేనిమిది నెలలుగా నేను వూళ్ళో లేను! “

“అయ్యో పాపం! తమాషా మిస్సయి పోయాననుకుంటున్నారా?”

ఒక్క క్షణం అతను మౌనంగా వున్నాడు. నన్ను పరామర్శించటానికి వచ్చిన వ్యక్తితో సంస్కారం లేకుండా

మాట్లాడుతున్నాననిపించింది!

“అయాం సారీ! మిమ్మల్ని నొప్పించానేమో! ఊరికే అందరూ రావటం, సానుభూతి మాటలు వినటం విసుగొచ్చింది!”

“అయ్ అండర్ స్టాండ్! ఇంతకీ నేనొచ్చిందెందుకంటే మీ పదవతరగతి  క్లాసు పిల్లలు మిమ్మలని చూడాలని బాగా

అనుకుంటున్నారు. “

 ఆశ్చర్య పోయాను. కిందటి సంవత్సరం తొమ్మిదో తరగతికి నేను క్లాసు టీచరుగా వుండేదాన్ని. సరిగ్గా వాళ్ళ

పరీక్షలప్పుడు  ఏప్రిల్ నెల లో నాకు ఆక్సిడెంటు జరిగింది. ఈ సంవత్సరం వాళ్ళు పదో తరగతి లోకొచ్చి వుంటారు.

పరీక్షలు మొదలయ్యి వుంటాయా?

 “సుస్మితా వాళ్ళ బేచీయేనా? పదో తరగతి పరీక్షలేలా రాసారు వాళ్ళంతా?” ఆత్రంగా అడిగాను.

“అవును, వాళ్ళే! పరీక్షలు ఇంకో రెండు వారాల్లో మొదలవుతాయి. అంతకు ముందొక్క సారి మిమ్మలని

కలవానుకుంటున్నారు. వచ్చే వారం ఏ రోజైనా మీరు తీరుబడిగా వుంటారా?”

వచ్చే వారం! నాకు నవ్వొచ్చింది.

 “వుంటాను! à°…à°¹!వుండను!” తడబడ్డాను.

ఒక్క క్షణం నిశ్శబ్దం.

“ఎటైనా వెళ్తున్నారా?”

“లేదు. ఐ మీన్, అవును! వూరు, వూరెళ్తున్నాను.” అనుకోకుండా చెప్పాల్సి రావటంతో à°…à°‚à°¤ సరిగ్గా చెప్ప లేక

పోతున్నాను. మాటల్లో తడబాటు, ఇన్ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది.

“సరే! జాగ్రత్తగా వెళ్ళి à°°à°‚à°¡à°¿. రేపు మళ్ళీ వొచ్చి కలుస్తాను. à°ˆ పక్క ఇంట్లోనే మా అన్నయ్య వుంటాడు.”

“రేపా? రేపు కూడా వుండనేమో, బహుశా!”

“ఎందుకని వూరెళ్ళేది వచ్చే వారం కదా?” నాకెందుకో అతను నా మొహాన్ని గుచ్చి గుచ్చి చూస్తున్న ఫీలింగొచ్చింది.

“అవును, కానీ రేపు మా ఇంటికి బంధువులొస్తున్నారు!”

“ఐ సీ! వుంటానయితే.” లేచి వెళ్ళిన అడుగుల చప్పుడు. రాధమ్మ వచ్చి తలుపేసి వెళ్ళింది.

 ***                                       ***                                    ***

మర్నాడూ పొద్దున్నే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాను. నన్ను వీలైనంత ప్రశాంతంగా తన దగ్గరకి

తీసికెళ్ళమని వేడుకున్నాను.

 మనసంతా ఉద్విగ్నంగా వుంది. ఎంత అణుచుకుందామనుకున్నా ఏడుపొస్తుంది. ఉదయం తొమ్మిదింటికి రాధమ్మ

వంటింట్లో వుంది. కాలింగ్ బెల్ మోగింది. రాధమ్మ మళ్ళీ వచ్చి చెప్పింది, “నిన్న వచ్చిన అబ్బాయి మళ్ళీ వచ్చారమ్మా!”

అంటూ. నాకేమీ  అంతుపట్టలేదు.

 “సారీ మేడం!మీతో చిన్న పనుండి వచ్చాను!”

“నాతోనా?” నవ్వబోయి ఆగాను.

“పక్కనే మా అన్నయ్యా వాళ్ళిల్లు అని చెప్పాగా? వాళ్ళ అబ్బాయి పై సంవత్సరం పదో తరగతిలోకొస్తున్నాడు, కొంచెం

లెక్కల్లో వీకు. అయితే వాడికి కొంచెం ఓపిగ్గా చెప్పే టీచరు కావాలి. కొంచెం పెంకి ఘటం లెండి! ట్యూషను అని పేరు పెట్టి

కూర్చోమంటే కూర్చోడు.

డిసిప్లినూ, నిబంధనలూ అంటే చచ్చినా దొరకడు. స్నేహంగా, ప్రేమగా చెప్పాలి. మా ఇంట్లోనేమో ఎవ్వరికీ లెక్కలు రావు!

కొంచెం మీరు సహాయం చేస్తారేమో నని అడగడానికొచ్చాను!” అతనికంకా ఏదో చెప్తూనే వున్నాడు. ఆపాను!

“ఏమిటి? ఇదేమైనా జోకా?” కొట్టినట్టే అడిగాను!

“జోకా? మీతో జోకులేమిటండీ? ఇందులో à°…à°‚à°¤ నవ్వాల్సిన విషయం ఏముంది?”

 “నేనింకొక మనిషికి చదువు చెప్పగలనా? నా నోటి నించే చెప్పించాలని చూస్తున్నావా? అయితే విను. నాకు కళ్ళు

కనపడవు. పుస్తకం చదవటం అటుంచు, నాకు చుట్టూ వున్న మనుషులు కూడా కనపడరు!”

 ” ఆక్సిడెంటులో కళ్ళు పోయాయి. సరే! చేతులూ, కాళ్ళూ, అన్నిటికంటే ముఖ్యంగా మెదడు బానే పని చేస్తుందిగా?” నా

కోపానికి కౌంటర్  పాయింటులా చాలా మెల్లిగా అన్నాడు.

***                                 ***                                        ***                                                    ***

“ఇంత మాత్రానికే ఇంత సెల్ఫ్-పిటీ తో కుంగి పోయే మీరు సంవత్సరాల తరబడి à°† స్కూలు పిల్లలకేం నేర్పారో మరి! అంతా సజావుగా

వున్నంతవరకే అన్న మాట మీ ధైర్యం, స్మార్ట్నెస్సూ అంతా! కొంచెం దెబ్బ తగిలితే ఇక మళ్ళీ లెవనని చతికిలబడి

పోతారు!” ఈ సారి మాటల్లో నెమ్మది తగ్గి కొంచెం పదును!

“అయితే ఇక జన్మంతా ఇలాగే వుండ దల్చుకున్నారా? à°† గది లో తలుపు బిగించుకుని? మీ సమయాన్నీ, శక్తినీ ఏ

à°°à°•à°‚à°—à°¾ ఎవరికీ పనికి రాకుండా చేస్తారన్నమాట. యూ ఆర్ à°Ž వెరీ గుడ్ రోల్ మోడల్ ఎండ్ à°Ž టీచర్!” వెటకారంగా

అన్నాడు.

“ఆగు! నీకు నా గురించేం తెలుసని నన్ను సాధిస్తున్నావు?” గట్టిగా అడగాలనుకున్నా కానీ, నా గొంతే నాకు బలహీనంగా

అనిపిస్తుంది. అతని వాదన్లో బలం వల్ల కాబోలు!

“సరే! చెప్పండి వింటాను. మీ జీవితానికి పెద్ద దెబ్బే తగిలింది. ఇంత వరకూ మీరేసుకున్న ప్రణాళికలూ, మీరెదురు

చూస్తున్న భవిష్యత్తూ ఒక్క రోజులో మారిపోయాయి. కొత్త పరిస్థితులనెదుర్కోవటానికీ, వాటితో అడ్జస్ట్ కావటానికీ మీరేం

ప్లాను వేసుకున్నారు?”

“ప్లానా?”

“పరిస్థితులు ఉన్నట్టుండి మారినప్పుడు బేంబేలు పడటమో పానిక్ అవటమో కాకుండా, కొత్త పరిస్థితులతో ఎలా

నెగ్గుకురావటం అన్న ప్రశ్న మీద శక్తి యుక్తులన్నీ కేంద్రీకరించి, స్ట్రాటెజీ తయారుచేసుకోవాలి. మీరు చెప్తుంటేనే

విన్నాను!పదో తరగతి పరీక్షలకి ముందు పిల్లలతో. విని అంత బాగా  విడమరచి చెప్పే తెలివైన టీచరు దొరకటం ఆ పిల్లల

అదృష్టం అనుకున్నా కూడా!”

 నేనా? నేనేనా? పూర్వ జన్మలోనేమో!

 రాధమ్మ టీ కప్పులతో రావటంతో మాటలు ఆపేసాడతను. అయిదు నిమిషాల మౌనంలో ఎక్కడో వదిలేసిన

ఆలోచనలూ, ధైర్యమూ అన్నీ లీలగా  మనసులో మళ్ళీ చొరబడే ప్రయత్నం చేస్తున్నాయి.

 “నేనా? ట్యూషనెలా చెప్తాను?” అయోమయంగా అడిగాను కొంచెం ఆలోచన తరువాత.

“ఎందుకు చెప్పలేరు?” నవ్వాడు.

 ***                                       ***                                               ***                                                       **

అలా మొదలైంది నా లెక్కల ట్యూషను.

 మొదట్లో చాలా ఇబ్బంది అయ్యేది. కొంచెం ఆలోచించి, ఇంటర్మీడియేట్ లెక్కల విద్యార్థిని హెల్పరుగా పెట్టుకున్నాను.

ఏడాది తిరిగే సరికి దాదాపు పది మంది విద్యార్థులు! పిల్లలకి కేవలం లెక్కలేకాకుండా చాలా ఇతర విషయాలు,

రాజకీయాలు, సాంఘిక సమస్యలూ, చుట్టూ వున్న మనుషులూ, ప్రవర్తనా, సైన్స్ విషయాలూ చెప్పటం నాకలవాటు.

దాంతో వాళ్ళకి ఎప్పుడూ చదువు అంటూ బోరు కొట్టకుండా స్నేహితులతో సమయం గడుపుతున్నట్టుంటుంది. పిల్లలు

దాంతో లెక్కల పాఠం అయిపోయినా, ఏవేవో విషయాలు చర్చిస్తూ కూర్చునే వాళ్ళు.

 ఆ తర్వాత మా స్కూలు విద్యార్థులు “మేడం! స్కూల్ డే à°•à°¿ పాటలు నేర్పండి”, అంటూ రావటం మొదలు పెట్టారు.

నిజానికి నాది వచ్చీ రాని గాలిపాట. ఎప్పుడూ ఏదో వ్యాపకాల్లో పడి నాకెంతో ఇష్టమైన శాస్త్రీయ సంగీతానికసలు టైమే

లేకుండా పోయింది.

ఉన్నట్టుండి ఒకరోజు మధు ఒక సంగీతం మాస్టారిని వెంటబెట్టుకొచ్చారు!

 ఆయనతో సాధన చేస్తున్నప్పుడు పొందినంత సంతోషం నేనెప్పుడూ పొందలేదేమో! అన్ని రోజులూ నేననుభవించిన

నరకమూ, అశాంతీ, ఎవరో మంత్రం వేసినట్టు మాయమై పోయాయి. దాదాపు నాలుగేళ్ళు సాధన చేసి ఇవాళ చిన్న కచేరీ

చేసాను.

 చెప్పినంత సులువుగా కాలేదీ ప్రయాణం. కానీ అలసటగా లేదు. ఉత్సాహంగా సంతోషంగా, ఇంకా గర్వంగా వుంది.

ఇంతకుముందు నాకున్న ఇండిపెండెన్సు ఇక మళ్ళీ సాధించుకోలేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా నేను

నడుస్తున్న దారి పక్కన చతికిలబడ్డాను. కొన్నిసార్లు ప్రేమగా అనునయించీ, కొన్నిసార్లు కోపంగా తిట్టీ నన్ను మళ్ళీ

మళ్ళీ లేవనెత్తాడు ఆదిత్య!

“ఇతరులు మన మీద జాలి చూపించటం మనకి నచ్చనప్పుడు à°† జాలి నించి పారిపోవటం కాదు చేయవలసింది! నువ్వు

జాలి పాడాల్సిన పరిస్థితిలో నేను లేను, అని చెప్పి ధీమాగా వుండటం!”

పదే పదే నూరిపోసాడు. చూపులకి ఆకతాయిలా ఏదీ పట్టనట్టు వుండే ఈ యువకుడికి ఎంత అవగాహన!

 అడుగడునా నిరాశ పరచే మనుషులూ, మాటి మాటికీ నన్ను నిరుత్సాహ పరచే నా మనసూ, డబ్బు లెక్కలూ,

ఒకటేమిటి బోలెడు అవరోధాలు.

ఆ అవరోధాలని అధిగమించటానికి కావాల్సిన శక్తీ, ధైర్యమూ, వాటిని దాటాలన్న ఆశా, అన్నీ నాలోపలినించే రావాలి

తప్ప బయటి వాళ్ళివ్వలేరు.

ఈ విషయం అర్ధమైన తరువాత నేనిక వెనుదిరిగి చూడలేదు.

 ఇప్పుడు నాకు క్షణం తీరిక లేదు. మళ్ళీ మునుపట్లాగే వుంది.  నా సంగీత సాధన, ఆడియోలో పుస్తకాలు వింటూ బ్రెయిలీలోకి పుస్తకాల

అనువాదం, మా ఇంటి చుట్టు పక్కల వున్న  పిల్లలకి చదువు చెప్పటం, ఒకటేమిటి లక్ష పనులు! నిజం చెప్పాలంటే

ఇప్పుడు పిల్లలకి నేను చెప్పే పాఠాల్లో పరిపూర్ణత్వం వచ్చింది. వాటిల్లో ఇంతకుముంది పుస్తకాల్లోంచి  నేర్చుకున విఙ్ఞానం

మాత్రమే వుండేది. ఇప్పుడు  దానితో నా అనుభవ సారంలోంచి పుట్టిన ఙ్ఞానం కూడా కలిసింది.

 ఆ తర్వాతెప్పుడో మాటల్లో చెప్పాడు ఆదిత్య, తను మళ్ళీ మర్నాడు మా ఇంటికెందుకొచ్చాడో!

“ఎందుకో à°† రోజు మీ వాలకం నాకు సరిగ్గా అనిపించలేదు. చాలా రెస్ట్ లెస్ à°—à°¾, డిస్టర్బ్డ్ à°—à°¾ అనిపించి భయం వేసింది.

దానికి తోడు అందీ పొందకుండా మీ సమాధానాలు చూసి మీ ఆలోచనలు ఎటు వైపు పరిగెడుతున్నాయో కొంత వరకు

అంచనా వేయగలిగాను. ఒక వేళ నా అంచనా తప్పయినా పెద్ద నష్టమేమీ లేదు. అందుకే ధైర్యంగా మర్నాడు మళ్ళీ మీ

ఇంటికొచ్చాను!” అని.

 ఆ రోజు ఆదిత్య రాకపోయి వుంటే! ఆ ఊహకే ఊపిరాడనట్టు అనిపించింది. ఈ పాటికి చరణ్ తల్లి లేని పిల్లాడుగా..లేచి

కూర్చున్నాను.

 తలుపు తెరుచుకుని మధు వచ్చాడు.

“మేడం ఇప్పుడు లెక్కల స్కూలు తో పాటు సంగీతం స్కూలు కూడా తెరుస్తారేమో అంటున్నాడు ఆదిత్య!” నవ్వుతూ

అన్నాడు.

 “నాట్ à°Ž బేడ్ అయిడియా!” నిద్రలోకి జారుతూ అన్నాను.*

కథలుPermalink

4 Responses to వేగు చుక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో