తెలుగులో చారిత్రక నవల;నాడు-నేడు

– డా.కె. లావణ్య

తెలంగాణా  విశ్వవిద్యాలయం

దీనిలో నోరి నరసింహ శాస్త్రి గారి ప్రథమ నవల నారాయణ భట్టు. ప్రాచీన భారత ధర్మాన్ని పరిరక్షించిన మహామహుల చరిత్ర ఇందులో కనిపిస్తుంది. 900 సంవత్సరాల క్రితము నాటి ఆంధ్ర  దేశము లోని రాజమహేంద్రవరము లో స్మరించదగిన వారు ముగ్గురు. వారు నారాయణ భట్టూ, నన్నయ భట్టూ, రాజరాజనరేంద్రుడు. వీరి మార్గదర్శకత్వము లోనే ఇతర భాషలకు కూడా ప్రాధాన్యత పెరిగింది. పూర్తిగా ఆంధ్రభాషా సంస్కృతుల  విశిష్టతను గ్రహించినపుడే నేటి స్వతంత్ర భారత దేశములోని వారు తమ బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించగలరు.  అసలు మహా భారతాంధ్రీకరణే తెలుగు వారి చరిత్ర తో పాటు యావత్ భారత దేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. దీని ద్వారా అనేక ప్రాచీన భారతీయ సంస్కృతులు తెలిసినాయి.

భారతీయ సంస్కృతిలో భాగమే స్త్రీని సమ సమాజము లో సమానము గా గౌరవించడము. ఆ గౌరవాలు నేటి స్త్రీ కి లభించాలని కోరుకుంటూ అనేక చారిత్రక అంశాలతో కూడిన నోరి వారి రుద్రమదేవి నవల వెలువడినది.

4 దేశ భక్తి గల వ్యక్తుల నిర్మాణము:

ఆంధ్ర వీరులను. కవులను సాధ్యమైనంతవరకు చారిత్రక భూమికలు గా పరిచయం చేస్తూ వారి చరిత్ర ద్వారా జాతికి ఒక నూతన ఉత్తేజాన్ని, దేశభక్తిని కలిగేటట్లు గా చారిత్రక నవలా కారులు చేశారు.

విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు,ప్రథమాంధ్ర రాజుల చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేయగా నోరి వారు రాజులతో పాటు రాజుల ఫోషణలో ఉన్న ప్రముఖ కవులను కూడా పాఠకులకు తెలియజెప్పాడు.తెలుగులో లిఖిత రూప వాజ్ఞ్మయము   ఏర్పడిన రాజరాజనరేంద్రుని కాలంలోని నన్నయను, నారాయణ  భట్టు ను కథా నాయకులు à°—à°¾ చేసుకుని “నారాయణభట్టు” నవలను పాఠకులకు  అందించారు. తిక్కన కాలము లోనే కాకతీయ రాజ్యాన్ని పాలించిన  “రుద్రమదేవి” ఎర్రా  ప్రగడ కాలంలోని    రెడ్డి రాజ్య వైభవాన్ని పరిస్తితులను చిత్రిస్తూ “మల్లారెడ్డి ” శ్రీనాథుని పేరున కవిసార్వభౌముడు, పోతన పేరున “కవిద్వయము” మహాకవి ధూర్జటిని గురించి తెలుపుతూ “ధూర్జటి” నవలలు రాసారు. ఆంధ్ర దేశములో తెలుగులో సాహిత్యము వచ్చిన కాలము నుండి క్రమముగా సాహిత్యము కొత్తపుంతలు తొక్కుతూ మార్పులకు గురైన విధానము సాహిత్యాభివ్రుద్ధికి ఆయాకాలాల్లో రాజులు పండితులు చేసిన కృషిని తెల్పుతూ పాఠకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నము చేశారు. రుద్రమదేవి లో దేశ భక్తి పూరిత వాక్యాలెన్నో చోటు చేసుకున్నాయి.

వీరితరువాత తరము వారైన బి.యస్.శాస్త్రి గారు, మల్లాది వసుంధర, ముదిగొండ శివ ప్రసాద్, కాకర్ల వేంకట రామ నరసింహం, బిరుదురాజు రామరాజు, కొర్లపాటి శ్రీరామ మూర్తి, తదితరులు దేశభక్తి పూరిత చారిత్రక నవలలు వ్రాసారు. ఒక శివాజీ, ఒక సోమనాద్రి, ఒక సర్వాయి పాపడు, వీరే మన చరిత్ర నిర్మాతలు చారిత్రక పురుషులల్లో కొండల రాయడు ఒకడు. కొండల రాయని పై దండ యాత్ర చేసిన సమయములో కొండల రాయడు వెలిగందల ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. స్వతంత్ర హిందూరాజ్యము స్థాపనకు ప్రయత్నిస్తూ పాలనలో శివాజీని ఆదర్శము గా తీసుకున్నాడు. “అది ఒక వేటగాని ధాటికి భీతిల్లిన కుందేలు మరో వేటగాడి ఇల్లు చొచ్చినట్లు ఉంటుందని” ఏ జమిందారు నవాబును ఆశ్రయించలేదు.

ఇలాంటీ ధైర్య సాహసాలతోకూడిన రాజులను పాఠకులకు పరిచయము చేస్తే వారు చేసే కర్తవ్య నిర్వహణ ఏమిటో వారికి భోధపడుతుంది.

5 సమానతాభావన:

సమసమాజ ఆవశ్యకతను    కోరుతూ తెలంగాణ ప్రాంతము నుండి  వెలువడిన నవల ‘ప్రజల మనిషి’. à°ˆ నవలను ఆథునిక చరిత్ర (1928-38) తో కూడిన కాల్పనిక చరిత్రక నవలగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతములో నిజాం నిరంకుశ పాలనతో పాటు. సంస్థానాధీశుల  పెత్తనము కొన్నివందల సంవత్సరాలు సాగినది. కాని మనిషి ఆత్మగౌరవముకోసము గౌరవప్రదమైన జీవనముకోసము  స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసము పోరాటము సాగిస్తాడు. కాలము అనే చరిత్రలో అలాంటి యధార్ధ కథా ఘట్టములోని పాత్రలకు సంఘటనలకు పోరుబాటకు అద్దము పట్టిన à°°à°šà°¨ ప్రజల మనిషి. అణచివేత, పీడనల నుండి విముక్తిని కోరుతూ కంఠీరవము, విజయదేవు,కొమరయ్య, వెంకటాచారి రఘునాధాచార్యుల వంటి సమరశీల శక్తుల వీరోచిత పోరాటాలు  ప్రజలమనిషిలో చూస్తాడు. సమాజములో సమానతా భావాన్ని కోరుతున్న అనేకసందర్భాలు à°ˆ నవలలో కనిపిస్తాయి.

శాతవాహన కాలానికి చెందిన శ్రీలేఖ, శ్రావణి, వసంతగౌతమి, నాగానిక తదితర చారిత్రక నవలల్లో స్త్రీ ప్రాధాన్యము ఎక్కువగా  కనిపిస్తుంది. “శ్రీలేఖ” నవలలో నాగవరదాయిని శ్రీ శాతకర్ణి భార్య . శ్రీ శాతకర్ణి సమాజములో అల్లకల్లోలాలు చెలరేగకుండా ఉండాలని, కుమారుడైన  పూర్ణోత్సంగునిలో పరివర్తన కలగాలనే ఉద్దేశ్యముతో    విశ్వేశ్వరస్వామి రూపమెత్తి శాంతిభోధ చేస్తాడు. ఆ సమయములో నాగవరదాయిని పరిపాలనా బాధ్యత నిర్వహిస్తుంది. ”శ్రావణి” నవలలో రుద్రదామునికి కుమారుడు లేని కారణముతో రాజ్యములో సామ్రాజ్యసింహాసనానికి ముప్పు వస్తుందని అతని కుమార్తె జయశీలను విషమశీలుని గా పెంచుతాడు. అలాగే గౌతమీ పుత్ర శాతకర్ణి తల్లి ఐన గౌతమీ బాలశ్రీ సూచనల ప్రకారమే సామ్రాజ్య బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలాగే నవకళ్యాణము నవలలో లావణ్యపతి “ ఆవాహన చంద్రకళ” లో రుద్రమదేవి, చంద్రకళలో సమ్మక్క-సారమ్మ తదితర పాత్రలద్వారా సమసమాజములో సమానతభావాల్ని ప్రజలల్లో పెంపొందించాడు శివప్రసాద్ గారు.

స్వాతంత్ర్యము తర్వాత ప్రజలల్లో కుల,వర్ణ,జాతి,మత,లింగ, భేధాలు విడిచి అందరం సమానమే అనే భావన తీసుకుని  రావడానికి సాహిత్యవేత్తలు, దేశభక్తులు, సంస్కర్తలు, సామాజికవేత్తలు, మేధావులు,తదితరులు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వము కొన్ని చట్టాలనే ఏర్పరచినారు. అందులో భాగము గానే చారిత్రకనవలలు రాసేవారు గతచరిత్ర వైభవాన్ని నవలల్లో పునర్దర్శనము చేయిస్తూ సమసమాజ నిర్మాణముకోరుకున్నారు. సమసమాజ నిర్మాణ ఆవశ్యకతను ఆశిస్తూ నవలలు వచ్చాయి.

చరిత్రలో స్త్రీలకున్న ఔన్నత్యాన్ని,గౌరవాన్ని నిరూపించడానికి బి.యన్.శాస్త్రి గారు వాకాటక మహాదేవి అనే చారిత్రక నవల రాసారు. అందులోని పాత్రలైన వాకాటక మహాదేవి మహాదేవి ఇద్దరూ భిన్నధర్మాలకు చెందినవారు అయిఆ విశ్ణుకుండిన రాజ్యము సుస్థిరము కావడానికి బౌద్ధ,వైదిక మతాలద్వారా వారి అసామాన్య ప్రజ్ఞ ను వెలువడించారు. ఆంధ్రదేశములో వైదిక మతము క్షీణిస్తున్న సమయములో వాకాటక మహాదేవి మాధవవర్మను పెండ్లాడి వైదిక మతాన్ని అనుసరించేలా చేసి అతని చేత విష్ణుకుండిన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది.

6 అవినీతి లేని వ్యక్తుల నిర్మాణము:

చారిత్రకనవలల్లో పాత్రచిత్రణా నిర్వహణలో రచయిత,మనుష్యులను వారి ప్రవర్తనా విధానములను వారి జీవన పద్ధతులను జాగ్రత్తగా పరిశీలించి అవగాహన చేసుకోవడం  పై ఆధారపడిఉంటుంది. దీని ఫలితముగా ఆ నవలాకారుడు చిత్రించిన పాత్రలు నిజమైన వ్యక్తులనిపిస్తుంది. ఆ నవలలోని చ్యక్తులు అనుభవించే సుఖ దు:ఖాలు బలహీనతలు ఆలోచనలు నిజమైన వ్యక్తులవిగానే ఉంటాయి. ఒక వ్యక్తిని అనేకరకాలుగా దర్శించి చిత్రించగలడము నవలాకారుడు.ఒక వ్యక్తికి సత్ప్రవర్తనలేదని తెలిసినపుడు ఆ వ్యక్తిని శిక్ష, ప్రవర్తన ద్వారా మార్చవచ్చు. సమాజములో నుండి తాను ఆశించిన ప్రయోజనాన్ని రచయిత పొందుతాడు.

ముదిగొడ శివప్రసాద్ చారిత్రకనవలలైన నాగానిక,శ్రీలేఖ,శ్రావణి,వసంతగౌతమి తదితరనవలల్లో శాతవాహన రాజులు అవినీతిలేని సామ్రాజ్యాన్ని ఆయారాజుల సర్వసైన్యాధ్యక్షుల (సౌర్యము) భౌద్దసన్యాసుల ఆధ్యాత్మికం ద్వారా పటిష్ట పరిచే ప్రయత్నము చేశారు. బుద్దుడు,నాగానిక, గౌతమి బాలశ్రీ, గౌతమీపుత్రశాతకర్ణీ, రుద్రధాముడు, బసవేశ్వరుడు, రాజరాజనరేంద్రుడు, చంఘిజ్ఖాన్, గణపతిదేవుడు,రుద్రమదేవి,సమ్మక్క-సారక్క, శ్రీక్రిష్ణదేవరాయలు, కంపరాయడు, నరసింహారెడ్డీ, అక్కన్న, మాదన్న, తదితర ఆయాకాలాల సమర్ధమైన రాజుల పాలనలోని ప్రజల జీవన విధానము సక్రమముగా సాగింది.అవినీతిగల వ్యక్తులను నిర్మూలించే ప్రయత్నాలు ఈ సమాజాల్లోని రాజులద్వారా చారిత్రకనవలల్లో కనిపిస్తాయి. అవి కొంత కల్పితము,. మరికొంత చారిత్రక నేపథ్యము.

7-జాతీయ దృక్పథము:

దేశభక్తి గల వ్యక్తులను సమాజములో నిర్మాణము చేయాలని చారిత్రక నవలాకర్తలు కోరుకుంటున్నారు. అందులో ముదిగొండ శివప్రసాద్ ఏ కథ రాసినా ఏ నవల రాసినా అందులో అడుగడుగున జాతీయతభావాలు, దేశభక్తి తొణికిసలాడతాయి. “రెసిడెన్సీ” నవల మూడు భిన్నమైన దృక్పథాలు , చిన్న సంస్కృతులు మిళితమై వ్రాయబడినది. అందులోని కథానాయకుడైనా జేమ్స్ అకిలెస్ కిర్క్ పాట్రిక్ పాత్ర ద్వారా భారతదేశము లోని విషయాలను అద్భుతాలను సందర్భోచితముగా చెప్పిస్తాడు ముదిగొండ శివప్రసాద్. ఒక సందర్భములో పాట్రిక్ లండన్ లో ఉన్న తన తండ్రికి ఉత్తరము ఇలా రాసాడు, “ ప్రియమైన నాన్నగారికి, ఇండియా చాలా అందంగా ఉంది. మల్లెపూలపరిమళాలు, ఆపిల్ సౌరభాలు, అప్పుడే అరవిచ్చిన సీతాఫలాల గుభాళింపులు, మథురప్రణయగాథలు,చంద్రకాంత శిలాసౌధాలు తాజ్ మహల్ మొగలాయి రాజు మధుర స్వప్నము, హైదరాలీ గోరీ దక్షిణ భారత పరాక్రమ ప్రతీక, లాల్ బాగ్ పూల దేవాలయము, ఇదొక భూలోక స్వర్గము. అని చెప్తూ మన ప్రాంతాన్ని జాతిని వర్గాన్ని రాష్ట్రాన్ని, దేశాన్ని గౌరవించమని చెప్తాడు.

ఒక సందర్భములో భారతీయులకు దేశభక్తి తక్కువ. రాజుభక్తి, దైవభక్తి ఎక్కువ తమ రచనల ద్వారా ప్రజలల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన బాధ్యత రచయితపై ఉందని గుర్తు చేస్తాడు.

8- పాశ్చాత్య సంస్కృతి నిరసన:

విదేశీ చరిత్రకారులు భారతదేశానికి చరిత్రలేదని విమర్శించిన సందర్భాలున్నాయి. ఒక వేళ చరిత్ర దేశానికి ఉన్నా హీనమైందని నిందించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించిన రోజుల్లో ఉన్న దేశకాల పరిస్తితుల వల్ల వారు అలా మాట్లాడి ఉంటారు. పాశ్చాత్యులు వర్తకము నిమిత్తము మన దేశానికి వచ్చి వారి సంస్కృతిని మనకు అంట గట్టి పోయారు. మనకు చరిత్రలేదన్న బ్రిటిషర్సే మన చరిత్ర రాసారు. కైఫియత్తులు,నిఘంటువులు, సాహిత్యము ) కాని  దేశధర్మము జాతి సంస్కృతుల నిమిత్తము సాహస పరాక్రమాలు ప్రదర్శించిన త్యాగమూర్తుల వీరనారుల చరిత్ర మనందరికీ తెలియడౌ వలన పాశ్చాత్యపోకడలకు మన యువత దూరముగ ఉంటుంది. ఇంకా మనజాతిలో శౌర్య ధైర్యాల నిర్మాణము జరుగుతుంది.

కసిరెడ్డి వెంకటరెడ్డిగారు రాసిన “స్వాతంత్ర్య వీర ఉయాలవాడు నరసింహారెడ్డి” చారిత్రకనవలలో బ్రిటిష్ వాళ్ళ మనోగతముఈ విధముగా ఉన్నది. తాముభరణము ఇస్తే బ్రతుకుతున్న  నోసము,ఉయాలవాడు నల్లమల కోటల అధిపతి అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇదే విధముగా విజ్రుంభించి అందరినీ కూడగట్టుకుని ఉద్యమాన్ని నిర్వహించినట్లయితే మొదట దక్షిణ భారతములో ఆ తర్వాత ఉత్తర భారతములో తమకు నూకలు చెలినట్లే.. ఏ విధముగానైనా సరే నరసింహారెడ్డి ని పట్టుకోవాలి లేదా సంహరించాలి. ఈ విధముగా భరతఖండ దేశభక్తులను వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న (బ్రిటిష్ వాళ్ళు ) మన పాలకుల గురించి మాట్లాడారు కానీ ఎప్పటిదప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలను తిప్పికొట్టే ప్రయత్నము చేశారు మనవాళ్ళు.

అందుకే జి.వి.సుబ్రహ్మణ్యము గారు “నవ్య సంప్రదాయము చారిత్రక నవల “ వ్యాసములో విశ్వనాథ,నోరి, అడవి, ఈ ముగ్గురు నవ్య సంప్రదాయ మార్గ ప్రవర్తకులుగా చారిత్రకనవలను ప్రయోగించిన విధానాన్ని ఇలా చెప్పారు. “ సామాన్యముగా నవ్య సంప్రదాయ యుగ నవలలో మూడు స్వభావాలు గోచరిస్తాయి.వాటిల్లో మొదటిది తెలుగువారి మత తాత్వికాంసాలకు చారిత్రక అంశాలకంటే ఎకువ చోటిచ్చే స్వభావము. రెండవది కథాకాలానికి చెందిన జీవిత విశేషాలను వివరాలను తెల్పుతూ జీవన విధానాలకు సంబందించిన  సమకాలీన భావ సంఘర్షణలనూ గాంధేయ సిద్ధాంతములో వాటి సమాధానాల కోసము చేసే అన్వేషణలనూ చిత్రీకరించే స్వభావము మూడవది. ఆంధ్రకవులనూ వీరులనూ సాధ్యమైనంతవరకూ చారిత్రక భూమికలుగా పరిచయము చేస్తూనే వారి చరిత్ర జాతికొక ఉత్తేజాన్ని కలిగించేటట్లు చెప్పడము చరిత్రలో వివరాలు తెలియని ఖాళీలను కాల్పనిక శక్తితో పూరించి వాటికి వాస్తవ స్పూర్తిని కలిగించే స్వభావము. ఈ మూడు రకాలకూ క్రమముగా విశ్వనాథ వారు, బాపిరాజు గారూ, నోరివారు ప్రాతినిధ్యము వహిస్తారు.

9-మతసామరస్య భావన:

కొర్లపాటి శ్రీరామ మూర్తి “చిత్రశాల” కాకతీయుల ఔన్నత్యాన్ని చెప్పిన చారిత్రక నవల. కాకతీయ రాజులైన గణపతిదేవుడు, రుద్రమదేవి పాలనను వివరించడముతో పాటు హరిహరనాథ తత్వాని ప్రభోధించిన తిక్కన సర్వ మత సమన్వయము చెయ్యడము ఈ నవలలో ఒక విశేషాంశము. హరిహరాదులు ఒక్కటే అని, వారి ఏకత్వాన్ని వివరించారు. తిక్కన నేటి సమాజములో అనేక మతాలున్నాయి. అన్ని మతాల వాళ్ళ సారాంశము ఒక్కటేనని చెప్పడము. ఈ రచనా కాలము అపుడే బ్రిటిష్ పాలనా విముక్తి జరిగినది. కాబట్టి ప్రజలల్లో మతకలహాలు రావొద్దని కోరుతూ గతవైభవాన్ని వివరించారు. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు.

వాకాటకమహాదేవి అనే చారిత్రక నవల ద్వారా వైదిక,బౌద్ద మత సమన్వయాన్ని వాకాటకమహాదేవి కోరుకుంటుంది. ప్రజల అభిలాష ప్రకారము వారికిష్టము వచ్చిన మతాన్ని అవలంబించవచ్చునని వాకాటకమహాదేవి ద్వారా సందేశాన్ని ఇస్తారు ప్రముఖ పరిశోధకులు ఇ.యన్.శాస్త్రి గారు.

ఆధునిక యుగానికి చెందిన “రెసిడెన్సీ” నవలలో  అంతర్జాతీయ మత సంబంధాలు ఉన్నాయి.1790-1804   ప్రాంతములో నిజాం ప్రభువులు హైదరాబాదుని పాలిస్తున్న కాలములో బ్రిటిష్ రెసిడెంట్ గా హైదరాబాదులో విలియమ్ క్లర్క్ పాట్రిక్ నియమింపబడుతాడు. నిజామ్ పాలనలో పాలితులు ఎక్కువగా హిందువులు, పాలకులు ముస్లిమ్ క్రైస్తవమతాలకు చెందినవారు.

10  మానవ సంబంధాలు- మానవీయ మూల్యాలు:

శివప్రసాదు గారి చారిత్రక నవలల్లో మానవ సంబంధాలు మానవీయ మూల్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. వివిధ ప్రాంతాలను పరిపాలించే రాజులు ఒకరికొకరు యుద్ధము దురాక్రమణ వంటి చర్యలకు పాల్పడకుండా వారంతా ఒక్క గొడుగు కిందకి చేరడానికి శాంతియుత వ్యూహ రచనలు చేసినట్లు గా శివప్రసాదు గారి నవలల్లో తెలుస్తుంది.

శాతవాహన చక్రముగా చెప్పబడే అయిదు నవలల్లోనూ ఇదే విధానము కనపడుతుంది. నాగానిక నవలలో చిన్న చిన్న ప్రాంతాలుగా విభజింపబడి పాలించబడుతున్న ఆంధ్ర ప్రాంతాలను ఏకము చేసి ఆంధ్ర సమ్రాజ్య స్థాపన జరుగుతుంది. దీనిలో శాతవాహనుల పరిపాలన ప్రారంభము అవుతుంది. ఇదంతా కేవలము శాంతితో సాగుతుంది. శ్రీ శతకర్ణి మహారఠుని మీద అతని కుమార్తె అయిన నాగానిక మీద కోపముతో యుద్ధానికి వెళ్ళినపుడు రణత్రయాకఋదు భాజా భజంత్రీలు మేళతాళాలతో స్వాగతము చెబుతాడు. కానీ యుద్ధము చెయ్యడు.అంతే కాకుండా రణత్రయీకరుడు తన కూతురైన నాగానికను శ్రీ శాతకర్ణికిచ్చి వివాహము జరిపిస్తాడు. వివాహానికి ముందు కత్తియుద్ధములో శ్రీ శాతకర్ణిని నాగానిక ఓడిస్తుంది. కాని, వివాహనంతరము తలవంచి శ్రీ శాతకర్ణికి నమస్కరిస్తుంది. “ వాస్తవానికి ఆ యుద్ధము చేసినది నేను కాదు. నాతో వింధ్యా వాసినీ దేవి చేయించింది. ఇందులో గెలుపోటముల ప్రసక్తి లేదు. వాస్తవానికి మీరు నన్ను నేను మిమ్మల్ని గెలిచాము. “ అని నాగానిక అంటుంది.

అదే విధముగా మహారఠ యువరాణి ఆంధ్ర   దేశ కోడలిగా వచ్చిన తరవాత్ ఆంధ్ర   దేశములోని ప్రజల జీవన విధానాన్ని చూసి తాదాత్మ్యము చెందుతుంది. అదే విషయము శ్రీ శాతకర్ణి తో చెప్పినపుడు “ జనజీవనము తో పాలకులు కలిసిపోవడము ఉత్తమ లక్షణము. నీలో ఉత్తమ పరిపాలకుని లక్షణాలు కనిపిస్తున్నాయి.” అంటాడు. శ్రీ శాతకర్ణి. తరువాత నవలైన “శ్రీలేఖ” లో శ్రీ శాతకర్ణి విశ్వేశ్వరస్వామి అవతారము ఎత్తినపుడు పరిపాలన బాధ్యత నాగానిక నిర్వహిస్తుంది. రచయిత రెండు నవలలకు ఒకదానికొకటి సంబంధము కుదర్చడానికి ఈ పై మాటలు చెప్పిస్తాడు.

శ్రీలేఖ నవలలో సర్వసైన్యాధ్యక్షుడైన విజయదత్తుడు”ఖారవేలుని దౌర్జన్యము తుదముట్టించేవరకు కష్టసుఖాలు లెక్కజేయనని, కామ,కాంచన వాంచలకు లోబడనని, ఆంధ్ర సామ్రాజ్యపుటెలలు కావేరి నుండి గంగవరకు, గోదావరి నుండి తూర్పు సముద్రము వరకు విస్తరించే వరకు నేను వివాహము చేసుకోనని విజయమో వీరస్వర్గమో ఎన్నుకుంటానని ప్రమాణము చేస్తాడు.

ఖారవేలుని సైనికులు పులవయ్య అనే పెళ్ళి కుమారుడిని చంపినపుడు విజయదత్తుడు ఈ విధముగా అంటాడు.” ఇదిగో పీటలమీద పెళ్ళికొడుకును చంపిన శత్రుసేనల శూలము. ఇది రక్తముతో తడిసి ఇంకా పచ్చి పచ్చిగా ఉంది. నేటి నుండి నేను ఖడ్గాన్ని కాక ఈ శూలాన్ని పట్టుకుంటాను. దీనితో ఖారవేలుని గుండెలను కుమ్మి వాడి రక్తము తాగి అందులో స్నానము చేసి భీమసేనుని వలె సింహగర్జన చేసిన నాడే నాకు విశ్రాంతి. ఖారవేలుడో నేనో ఒకరే మిగలాలి పదండి ఖారవేలుని సేనలను సముద్రపు పొలిమేరలలోనే మట్టుపెట్టండి. ఇదే పునరావాస కార్యక్రమము.”

ఈ విధముగ శ్రీలేఖ నవలలోఅనేక సందర్భాలలో విజయదత్తుని శౌర్యము పరాక్రమము వెల్లడౌతాయి.

శ్రీ శాతకర్ణి భార్యయైన నాగానిక విజయదత్తుడిని కన్న కొడుకు మాదిరిగానే చూసుకుంటుంది. నాగానిక కుమారుడైన పూర్ణోత్సంగుడు శత్రువులతో చేతులు కలుపుతున్నాడని తెల్సినపుడు ఈ విధముగ బాధపడుతుంది. “ నాకు రాజధర్మము ఒకటుంది. ఒక కుటుంబముకోసము ఒక వ్యక్తి కోసము త్యాగము చెయ్యవలసి వస్తే అది తప్పేమీ కాదు. ఒక గ్రామ స్రేయస్సు కోసము సమస్త దేశ శ్రేయస్సు కోసము ధార్మరక్షణ కోసము ఎంతటి పెద్దవ్యక్తి అయినా త్యాగము చెయ్యవలసి వస్తే అతడు సంపూర్ణముగా చెయ్యవలసినదే.” అతడు కన కొడుకు పూర్ణోత్సంగుడైనా సరే పెంపుడు కొడుకు విజయదత్తుడైనా సరే అని నాగవరదాయిని విజయదత్తునితో అంటుంది.

శ్రావణి నవలలో పులోమావి పరాక్రమవంతునిగ కనిపిస్తాడు. ఆంధ్రుల ఉపరాజధానులైన శ్రీకాకుళం, ప్రతిష్టానము గౌతమీ పుత్ర శాతకర్ణి పరిపాలనా కాలము వరకే శత్రువుల వశము అవుతుంది. ఈ రెండింటినీ తిరిగి తమ రాజ్యములో కలుపుకోవాలి అనే పట్టుదలతో పులోమావి పట్టాభిషేకము కూడా వాయిదా వేసుకుంటాడు. ఇక్కడ పులోమావి అన్న మాటలు పరిశీలిద్దాము.

“ శ్రావణిని సాధించిన తరవాతే శ్రీకాకుళానికి పాలౌనిగా పట్టాభిషేకము చేసుకోవడము సముచితము. శ్రీకాకుళం ఏమిటి మన ప్రతిష్టానాన్ని పాటలీ పుత్రాన్ని మళ్ళీ స్వాధీనము చేసుకుంటాము. మన గుర్రములు త్రివేణీ సంగమము లో స్నానము చెయ్యాలు. మన నాగధ్వజము ఇంద్రప్రస్థముపై రెపరెపలాడాలి. ఉజ్జయిని మన పాదాక్రాంతము కావాలి. అప్పుడే నకు విశ్రాంతి. ఈ విధముగ పులో మావి అనగానే గౌతమీ బాలాశ్రీ చిరునవ్వుతో మెల్లగా ఇలా అంటుంది. మహ విష్ణువు మెడలో ఏ గోకులాష్టమికి అలంకరిస్తే ఆనాడే మనలౌ నిజమైన సామ్రాట్టులుగా మొత్తము ప్రపంచము గుర్తిస్తుంది. అందువల్ల శ్రావణి అన్వేషణ సామ్రాజ్య విస్తరణ రెండూ వేర్వేరు అంశాలు కావు. ఒకే నాణేనికి రెండుముఖాలు. పులోమావి కోరికను మన్నించి శ్రావణిని సంపాదించే ప్రయత్నములో అతనికి అందరము సహకరించడమే కర్తవ్యము” ఈ విధముగా పులోమావికి తన కర్తవ్యోపదేశము చేస్తుంది.

అదే విధముగా ఉజ్జయినిని సాధించడానికి పులోమావి ఉజ్జయిని వెళ్ళడానికి ఔజ్న ఇవ్వమని గౌతమీ బాలాశ్రీని కోరతాడు. అపుడు గౌతమీ బాలాశ్రీ” రక్తపు బొట్టుచిందకుండా రుద్రదాముఇ కుమార్తె అయిన జయశీలను తీసుకొని రా. కత్తితో సాధించలేనిది కామముతోను కరుణతోను సాధించవచ్చునని  అంటుంది. అదే విధముగా జయశీలను ధన్యకటకానికి తీసుకొని వచ్చి గౌతమీ బాలాశ్రీ, వాశిష్టి వారి వారి మాటలతో చేష్టలతో శాతవహనుఉ దయార్ద్ర హృదాయులు, శాంతి కాముకులు అని తెలియజెప్తారు. జయశీలలో పరివర్తన కలిగేటట్లు చేస్తారు. మానవతా దృక్పధముతోనే శాతవహనులను అగర్భ శత్రువులుగా భావించుకుంటున్న జయశీలలో పరివర్తన కలిగిస్తారు. జయశీలనే రుద్రదామునికి శాతవాహనుల కీర్తి ప్రతిష్టలను పొగుడుతూ లేఖ రాస్తుంది. గౌతమీ బాలాశ్రీ కూడ జయశీలతో “జయశీలా పులోమవి నిన్ను తీసుకుని వచ్చినపుడు నిన్ను వాశిష్టికి కోడలిగాచేయాలనే భావన నా మనసులో లేకపోలేదు. ఆంధ్ర శకుల సంగమము వలన మానవ చరిత్రయే మరొక మలుపు తిరుగుతున్నదని, ప్రపంచశాంతికి మనమే కరదీపికలుగా నిలిచి గ్రీకు,రోమక,ఐగుప్త దేశాలకు కూడా మానవతా తిలకము దిద్దగలమని ఆశించాను.” అని అంటుంది. ఆ తరువాత జయశీల, యువస్వాతిల వివాహము వల్ల రెండు రాజ్యాలు ఏకము అవుతాయి.

“నవకళ్యాణము” నవలలో బసవేశ్వరుడు వర్ణ వ్యవస్థను నిర్మూలించడముతో పాటు సమాజములోని వారంతా సమానమే, వారంతా మానవులే, పేద గొప్ప అనే తేడాలు లేవని అనుభవ మండప సభ్యులకుచెప్తారు. అనుభవ మండప సభ్యుడైన హరళయ్య తన చర్మముతో బసవేశ్వరునికి చెప్పులు కుట్టి తెచ్చినపుడు “ ఇవి పాదరక్షలు కావు. నా పూజామందిరమును అలంకరించవల్సిన శివ పాదములని బసవేశ్వరుడు చెప్పులను నెత్తిపై పెట్టుకుని బాహ్య స్పృహను కోల్పోతాడు” అనుభవ మంటపములో చేరకముందు అస్పృస్యుని గా చెప్పబడిన హరళయ్య కుట్టిన చెప్పులు సంగమేశ్వరునితో సమానమైన బసవేశ్వరుడు తలపై పెట్టుకోవడము వలన ప్రజలలో మానవతా దృక్పథము పెరుగుతుంది. బేధభావాలు మరచి అందరూ ఒక్కటేననే దృక్పథము  ప్రజల్లో రావాలని బసవేశ్వరుడు కోరుకుంటాడు.

ఆవాహన నవలలో రామచంద్రరావు, మాధవరావు మంచి స్నేహితులు. వీరిద్దరికీ వరంగల్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడి ప్రాచీన కట్టడాలను వీక్షిస్తారు.అందులో భాగముగానే వేయి స్థంబాలగుడిని చూస్తారు.అక్కడ క్రీ.శ. పన్నెండవ శతాబ్దము నాటి కొమసాని మాధ్వరావును ఆవహిస్తుంది. అదే ధ్యాసతో మాధవరావు హిస్టీరియా పేషేంట్ మాదిరిగా తయారవుతాడు. ఆ సమయములో రామచంద్రరావు అనేక చికిత్సలు చేయిస్తాడు. ఒక సందర్భములో రాంచంద్రరావు భార్య కాత్యాయిని మధ్వరవు ఆరోగ్యము క్షీణిస్తున్నదని మీరేమీ శ్రద్ధ తీసుకోవడములేదని అంటుంది. అపుడు రామచంద్రరావు “ ఇదిగో నువ్వు అనవసరముగా ఆడిపోసుకోకు, అమధవ్ మీద లక్ష్మి కున్న దానికన్నా నాకు ఎక్కువ ప్రేమ ఉన్నది. స్వంత అన్నదమ్ములము కాకపోయినా రక్తస్పర్శ కన్నా ఎక్కువ ప్రేమ బాంధవ్యమే మాది” అని అంటాడు. అదే బాంధవ్యముతో గుడిలో జ్వాలాపతిలింగశాస్త్రి గారిని పిలిచి వేయి స్థంభాల గుడిలో కామసానిని ఆవాహన చేయించిఅమె జీవాత్మను శిలనుండి విముక్తము చేయిస్తాడు రాం. తద్వారా మాధవరావు మామూఒలు మనిషి అవుతాడు.

చంద్రకళ విశయములో వనచరుల జీవనవిధానము ప్రధాన ఇతివృత్తము. వనచరులంతా ప్రతాపరుద్రునికి నమ్మకముగ ఉంటూ అవసరమైనప్పుడూ వారి శస్త్రాస్రాలను ప్రయోగిస్తూ ఉంటారు. ఒక సారి ప్రతాపరుద్రుని జన్మదినమహోత్సవము సందర్భముగా ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ప్రభువుకు సమర్పిస్తుంటే వనరాజైన పగిడిద్దరాజు” ఒక బాణాన్ని కానుకగా ఇచ్చాడు. ఇంకా “ మా వన రాజ్యములో ఎన్నో అమూల్యమైన సంపదలున్నాయి.కానుకగా తీసుకుని వచ్చి సమర్పించడము తగని పని. ఎందుకంటే అవన్నీ మీ సంపదలే అని అంటాడు. కాకుంటే మాకంటూ మావద్ద ఉన్నది పరాక్రమము మాత్రమే అందుకు సంకేతముగ ఈ బాణాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇది అజేయమైన బాణము. శత్రువులను చీల్చి చండాడుతుంది.” అంటాడు పడిగిద్దరాజు. ఈ విథముగా వారి పరాక్రమాన్ని నిరూపించుకుంటారు వనచరులు.

11    పూర్ణ మానవుని నిర్మాణము:

ప్రాచీన తెలుసు సాహిత్యము నుండి ఆథునిక తెలుగు సాహిత్యము లోని ప్రక్రియల వరకున్న రచనా వస్తువు భారతీయ ఆంథ్ర సంస్కృతితో ముడిపడిఉంది. ఆ సంస్కృతి ద్వారా పూర్ణ మానవుని నిర్మాణము జరుగుతుంటుంది. ఆథునిక సాహిత్యము అంతా సమానత్వాన్ని, మానవత్వాన్ని, సామాజికన్యాయాన్ని, వ్యక్తి శ్రేయస్సుని, సమాజ శ్రేయస్సును, విశ్వ శ్రేయస్సును ప్రతిపాదించింది. ఈ పని చారిత్రక నవల ద్వారా బాగా జరిగింది. ప్రాచీనకాలము నుండి ఆథునిక చారిత్రక నవల వరకున్న సాంస్కృతిక పాత్రల వల్లనే ఆయాకాలాల్లో పూర్ణ మానవుని నిర్మాణము జరిగిందని చెప్పవచ్చు.

నన్నయ యొక్క కచుడు, యయాతి, శర్మిష్ట,దేవయాని, తిక్కన యొక్క అర్జునుడు, దుర్యోధనుడు,కర్ణుడు, ద్ర్పుపది, శ్రీనాథుని గుణనిథి, పెద్దన వరూధిని, ప్రవరుడు, తిమ్మన సత్యభామ, చేమకూర సుభద్ర, వంటి తదితర పాత్ర్రలు తెలుగువారి మదిలో ఎప్పటికీ మెదలుతుంటాయి. అలాగే చారిత్రక నవలాకారుల పాత్రలు నిత్య చైథన్య మూర్తులు, చిలకమర్తివారి రాణా ప్రతాపసింగ్, విశ్వనాథ వీరభూపతి, సేతుపతి బాపిరాజు(హిమబిందు), శాతవాహనులు,నోరి నారాయణభట్టు, రుద్రమదేవి, బి.యన్.శస్త్రి, వాకాటకమహాదేవి, రామరాజు (తెలుగువీరుడు) సదాశివరెడ్డి, మల్లాది వసుంథర విజయరాఘవనాయకుడు, శివప్రసాద్ గౌతమీపుత్ర శాతకర్ణి, బాలశ్రీ,రుద్రమదేవి, సమ్మక్క- సారక్క, బసవేశ్వరుడు, కసిరెడ్డి ఉయ్యాలవడు నరసింహారెడ్డి, శ్రీనివాసరాజు కంపరాయడు, తదితర పాత్రలల్లో ఈనాటి సమాజములోని మానవుడ్ని సంపూర్ణ అర్హతలు గల ( పైన వ్యాసములో చెప్పిన అంశాలు) వానిగా తీర్చిదిద్దే ప్రయత్నము చేశారు, చేస్తూనే ఉన్నారు.

అలాగే తెన్నేటి సూరి చంఘిజ్ ఖాన్ నవలను ఉదహరిస్తాను. పూర్ణమానవుడు నిర్మాణము కావాలంటే పీడిత జాతులనుండి గోబీ వంటి జాతులు రక్షించబడాలి. చంఘిజ్ ఖాన్ ఒక్కడు నరహంతకుడుగా మారి జాతిని రక్షించే ప్రయత్నము చేశాడు. 12,13 వ శతాబ్దము ఆసియా ఖండపు కుళ్ళు రాజకీయాలనుండీ గోఈ జతిని రక్షించి తిరుగులేని నాయకుడు గా కీర్తించబడిన చంఘిజ్ ఖాన్ ఒక పూర్ణ మానవుడే. అతనొకడు ఆహుతైనా పర్లేదు జాతిమొత్తము పరజాతి నుండి విముక్తులైతే చాలనే భావనను తెన్నేటి సూరి చంఘిజ్ ఖాన్ నవలలో చిత్రీకరించాడు.

 నాడు నేడు చారిత్రక నవల- వ్యక్తి, వ్యక్తిత్వ వికాసము, వ్యక్తి నిర్మాణము, వికాసము:

తెలుగులో మొదటి చారిత్రక నవలైన “ హేమలత “ నుండి నేటీ “ పట్టాభి” వరకు వచ్చిన నవలలన్నీ సమసమాజ నిర్మాణావస్యకతకు తోడ్పడినవే. గత వెయ్యేండ్ల చరిత్రను పాఠకుల ముందుంచి  మనిషిని మనిషిగా గుర్తించాలనే మానవతావాదాన్ని వికసింపజేసారు చారిత్రకనవలాకారులు. స్వాతంత్రానికి ముందు వచ్చిన నవలల్లో గతచరిత్రను పాఠకుడు అవగతము చేసుకుని స్వాతంత్ర్య సముపార్జనకు పాటుపడాలని రచయితలు కోరుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత వచ్చిన నవలలు జాతి పునరుజ్జీవనము, వ్యక్తి వికాసము, కుటుంబవికాసము, సమాజవికాసము, జాతివికాసము, దేశవికాసాన్ని, కోరుకున్నవే. అందుకే పాఠకుడు కాలక్షేపము కోసము వినోదము కోసము విజ్నానము కోసము మాత్రమే చారిత్రక నవలలను చదవకుండా జాతిని సమైక్య పరిచేటట్లు చేయగలిగాడు చారిత్రకనవలాకారుడు.

అడవిబాపిరాజు “హిమబిందు” రాసే నాటికి “ మన జాతిలో పెరుగుతున్న త్యాగనిరతి, శాంతి శూరత, స్వాతంత్ర్యాభిరతి, ఆత్మాభిమానము, స్త్రీ ధర్మము వంటి గుణాలకు ఈ నవల ప్రతినిథి గా వచ్చిందని” ఆంథ్ర నవలా పరిణామములో కుటుంబరావు గారు విశ్లేషించారు. జాతి అభిమానాన్ని పెంచి మన పూర్వుల మీద గౌరవాన్ని పెంపొందింపజేయడమే చారిత్రకనవలలనేపథ్యము. కాబట్టి స్వాతంత్ర్యానికి ముందు వచ్చిన చారిత్రకనవలల్లో జాతి వికాసానికి తోడ్పడిన గొప్ప చారిత్రక నవలగా చెప్పబడుతుంది.

చారిత్రక నవలా చక్రవర్తిఐన శివప్రసాదు గారి చారిత్రక నవలైన “ శ్రీలేఖ” లోని ఈ మాటలను పరిశీలిస్తే మనిషి యొక్క వ్యక్తిత్వము వికాసము పొందే విథానాన్ని అర్ధము చేసుకోవచ్చును. శ్రీశాతకర్ణి యొక్క సర్వసైన్యాధ్యక్షుడైన విజయదత్తుడు కళింగను పాలించే ఖారవేలుని గుండెలల్లో శూలాన్ని కుమ్మి ఆ రక్తముతో ఖారవేలుని సైన్యము వలన మరణించిన పెళ్ళికొడుకు పులవయ్యకు రక్తతర్పణ చేస్తానని ప్రతిఙ్ఞ చేస్తాడు. అయితే ఆ శూలాన్ని భారతదేశ రాజులంతా కలిసి  ఇతర దేశస్థుడైన డెమెట్రియస్ మీద ఉపయోగించాలని పూర్ణోత్సంగుడు కోరుతాడు. ఇది సంభవమా? అని విజయదత్తుడు ప్రశ్నిస్తాడు.” మానవునికి అసంభవము ఏదీ లేదు. ఖారవేలుడు  దేశ భక్తుడే అతనిలోని శక్తులన్నీ దేశ కల్యాణానికే తోడ్పడినపుడు ఖారవేలుని నీవు అంతము చేసినట్లే అవుతుంది కదా..!” ఖారవేలుడు అంటే కర చరణాద్వయవములు కల ఒక మనిషి మాత్రమే కాదు అదొక భావము అదొక శక్తి అని అంటాడు పూర్ణోత్సంగుడు.

విజయదత్తుడు పూర్ణోత్సంగుని మాటలను విచిత్రముగ వింటాడు. “ ఇతను వెనుకటి పూర్ణోత్సంగుడు కాదు పరిణితమైన ఒక ప్రజ్నాశాలి వలె ప్రసంగిస్తున్నాడు. సర్వలక్షణ లక్షితుడైన సౌజన్యమూర్తి వలె ప్రకాశిస్తున్నాడు.” అని అనుకొని తన కర్తవ్యము ఏమిటో సెలవివ్వమని కోరతాడు.

“ నీ కర్తవ్యము కాదు. మన కర్తవ్యము. జాతీయ  రక్షణ కార్యక్రమముగా నీవూ శ్రీలేఖ నేను మనము అంతా కలిసి యుద్దములో పాల్గొనవలసిన తరుణము వచ్చిందని” పూర్నోత్సంగుడు చెబుతాడు.

వాక్యములో పై ఈ నాలుగు అంశాలను పరిశీలించినపుడు , మొదటి వాక్యములో” భారతదేశ పరిరక్షణ” రెండవ వాక్యములో “ అహింసతో కూడిన దేశభక్తి” మూడవవాక్యములో “ భారతీయుల ప్రజ్న అలోచనా సరళి” నాలుగోవాక్యములో దేశపౌరునిగా “ కర్తవ్య నిర్వహణ ద్వారా సమాజములోని ఒక వ్యక్తి వికాసము పొంది దేశరక్షణకు తోడ్పడిన విధానాని చూస్తాము.

1920-47 మధ్య కాలములో చారిత్రకనవల సమాజములోని వ్యక్తులపై బాగా ప్రభావాన్ని చూపినది. కాబట్టి  చారిత్రక నవలా స్వాతంత్ర్యము పొందటములో మిగతా ప్రక్రియలకన్నా, ఉద్యమాలకన్నా విభిన్నమైన పాత్ర పోషించింది. 1947 నుండి నేటి వరకు భారతీయ సంస్కృతిపై అభిమానాన్ని, నవసమాజ నిర్మాణాన్ని సమాజములో పూర్ణ మానవుడ్ని తయారు చేసేందుకు చారిత్రక నవల ఎంతో ఉపయోగపడుతుంది.*

(సమాప్తం)

UncategorizedPermalink

3 Responses to తెలుగులో చారిత్రక నవల;నాడు-నేడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో