నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

అయ్యో! బోడి గుండుకీ, మోకాలికీ ముడిపెట్టినట్లుందిది!
నా ఒక రోజు జీతాన్ని వరద బాధితులకూ,

యాత్రలో ప్రాణాలతో బయటపడిన వాళ్ళకూ

విరాళంగా ఇచ్చేస్తున్నాను కదా!

అన్నీ పోగుట్టుకున్న వాళ్ళను

చూసి అయ్యోఅంటూ

నేనుకూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను కదా!

టీ.వీ చూసి, వార్తాపత్రికల్లో వాళ్ళు అనుభవించిన నరకయాతనను గూర్చి చదివి

బాధ పడుతున్నాను కదా!ఇంకేం కావాలి?
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

అక్కడి పరిస్థితికి నన్ను కారణమంటావేమిటి?
ప్రక్కింట్లోనో, చుట్టు ప్రక్కలో

ఉత్తరాఖండ్ నుండి సురక్షితంగా చేరిన వారిని పలకరిస్తున్నాను కదా!
పండో, ఫలమో నాకు తోచింది పట్టుకెళ్తున్నాను కదా!
అక్కడ చిక్కుపడిపోయిన వాళ్ళ గురించి

నా ప్రార్థనల్లో రోజూ దేవునికి నివేదిస్తున్నాను కదా!
సైనికుల నిస్వార్థ సేవకు అచ్చెరువొందుతూనే ఉన్నాను కదా!
ఇంకేమి కావాలి?
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

పొంగుకొచ్చిన గంగను నేనే పంపానంటావేమిటి? నేనేమైన భగీరధుడ్నా?
రాజకీయ పార్టీలు చేసే హడావుడి చూస్తున్నాను కదా!
ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నాను కదా!
ఎన్నికల హడావుడి సంవత్సరం ముందే వచ్చేసిందే అని ఆశ్చర్యపోతున్నాను కదా!
ఇంకేమి కావాలి?
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

నా వల్ల పర్యావరణం పాడయ్యిందా? పర్యావరణమా?
నా ఇల్లు, ఇంటి చుట్టు ప్రక్కల ప్రదేశాలే గా!
నేను చాలా శుభ్రంగానే ఉంచుకుంటానే!
వీధి గురించి పట్టించుకోవడానికి పంచాయితీనో, మున్సిపాలిటీనో ఉంది కదా!
దేశం గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వముందిగా!

ఎన్నుకున్నదెందుకు మరి?
ఇంకేమి కావాలి?
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

ప్లాస్టిక్ కవర్లు లేకపోతే నా రోజు గడవదు
పరిశ్రమల్లోని కాలుష్యాన్ని వదిలి తీరుతారు మరి! వారికి నదులే గతి!
ఏవో గ్రీన్ హౌస్ వాయులని క్లాసు పీకుతావు గానీ,

అవి వదిలే పరికరలాతోనే నేను కంఫర్టబుల్గా జీవిస్తున్నా!
ఏవేవో నివేదికలనీ,,,,,ఎవరెవరో హెచ్చరించారనీ చెబుతావు!
వీటిన్నింటినీ బేరీజు వేసుకోవడానికీ,

తగిన చర్యలు తీసుకోవడానికీ తగిన శాఖలున్నాయి కదా!
ఇంకేమి కావాలి?
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

ఎక్కడో గనులు తవ్వేస్తే తప్పునాదా?
ఎప్పటికప్పుడు అడవులను అభివృద్ధి పేరుతో నరికేస్తే తప్పు నాదా?
పారిశ్రామికీకరణ జాడ్యం అంటే ఎలా? వేల ఉద్యోగాలెలా పుట్టుకొస్తాయి మరి?
పవర్ లేదని ఏడుస్తాం! పవర్ ప్లాంటులు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయంటే ఎలా?
అయినా వీటన్నింటికీ, నాకూ సంబంధం ఎక్కడుంది?
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

ప్రజాస్వామ్యమంటే నేనేనా? ఇదేమి వింత మాట!
ఎన్నికలప్పుడు నేను నోటునే చూసాను….

ఐదేళ్ళ పరిపాలనను వాళ్ళ ఇష్టారాజ్యానికొదిలేసాను!
ఇప్పుడు ఓటు విలువ అంటే సిగ్గేస్తుంది!
అయినా ఎవరి స్వార్థం వారిది! అందులో నేనూ ఒకడిని!
దీనికే నేను దేశ భవిష్యత్తునూ, పర్యావరణాన్ని,ప్రజల సంక్షేమాన్ని తాకట్టు పెట్టానంటే ఎలా?

నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

నీకు కాస్త చాదస్తం ఎక్కువలా ఉంది….
అందరూ నా లాంటి వాళ్ళే!
సగటు పౌరులే!
నన్ను బాధ్యునిగా చేస్తే ఎలా?
నాకు బుద్ధి రావాలని నీ బుర్ర బ్రద్దలుకొట్టుకుంటే ఎలా?
ఎన్నికలొస్తున్నాయి!
ఈ సారి ఎరలు ఎక్కువే ఉండొచ్చు…
వాటి గురించి ఆలోచించనీ ముందు!

పార్టీ ఏజెంట్లతో బేరాలు కుదుర్చుకోనీ ముందు!

నువ్వు మరీనూ…
ఉత్తరాఖండ్ వరద……చెన్నై సునామీ….ఉధృతమైన భూకంపాలు….

ఇలాంటివి నేనున్న ప్రదేశంలోనే మున్ముందు జరుగుతాయా?
హ…హ…హ…
బెదిరిస్తున్నావా?
నేనొప్పుకోను గాక ఒప్పుకోను!
నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం???

– విజయ భాను కోటే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Uncategorized, Permalink

4 Responses to నేనేమి చేసాను నేరం? నాకెక్కడంటింది పాపం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో