ఎనిమిదో అడుగు –11

సహనం చచ్చినట్లై….‘‘కాలేజి వుండి కూడా వెళ్లలేదా? ఎంత డబ్బు కట్టానురా కాలేజిలో..! అయినా అందరు కాలేజికి వెళ్లి చదువుకుంటుంటే నువ్వు ఇంట్లో వుండి ఏం చేస్తావ్‌?’’ అన్నాడు శేఖరయ్య. అందరితో నన్ను పోల్చకు…. నువ్వు అందరి తండ్రుల్లా వున్నావా?’’  ‘‘ నీకేం తక్కువ చేశానురా?’’ ‘‘ మా ఫ్రెండ్స్‌కి వాళ్ల పేరెంట్స్‌ ఇచ్చినంత పాకెట్‌ మనీ ఇస్తున్నావా? వాళ్లు వేసుకునే డ్రసుల్లాంటివి తీసిస్తున్నావా? బయటకెళ్లి వాళ్లు ఖర్చు పెట్టినట్లు నేను ఖర్చు పెడితే నువ్వొప్పుకుంటావా?’’ ‘‘చదువు ముఖ్యం కదరా! ఏదో వున్నంతలో సర్దుకుపోవాలి’’  ‘‘ నన్ను […]

Read more

కొత్త సంవత్సరం – గొప్ప శుభసూచకం

కాలం ఒడిలో .. అనుభవాల ఒరవడిలో .. ఒక సంవత్సరం కరిగిపోయింది. కాలం అద్దంలాంటిది . అంధ యుగమైనా స్వర్ణ యుగమైనా .. అది మన ప్రతిబింబం .. అన్నారు దేవరకొండ బాల గంగాధర తిలక్ . అది నిజం కూడా . కాలం కౌగిలిలో … మనమందరం బందీలం. మనిషి స్వార్ధంతో చేసే వినాశకర చర్యల వల్ల అంతుచిక్కని వ్యాధులు , నివారణ చిక్కని రోగాలు , పర్యావరణ నాశనం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేకానేక విధాలుగా ఫలితాలని అనుభవిస్తూ కూడా […]

Read more

నా కళ్లతో అమెరికా-27

అమెరికా తూర్పు తీరం-రోజు-1           సెలవుల్లో ఎక్కడికైనా వెళదామని పిల్లలు ఒకటే పేచీ. తలా ఒక ప్లేస్ సజెస్ట్ చేసేరు. వరు హవాయ్ దీవులకు వెళదామని గూగుల్ లో రీసెర్చి చేసి, ఒక కాగితమ్మీద వివరాలు ప్రింట్ చేసుకుని మరీ తెచ్చింది. “కానీ ఇన్ని రోజులైంది, అసలు అమెరికా ఈస్ట్ కోస్ట్ కి వెళ్లలేదన్న” అసంతృప్తి నాలో బలంగా ఉండిపోయింది. అసలు అమెరికా అంటే చిన్నప్పుడు మొదటగా తెలిసినది న్యూయార్క్ మాత్రమే. కానీ ఇంత వరకూ చూడలేదు. “హవాయి తర్వాత, ముందు న్యూయార్క్” అని […]

Read more

క్షమించు నేస్తం

నిలువెల్లా తనని తడిపి  గజ గజా వణికించే హోరు వానని  లేత చిగురాకు క్షమించినట్టు  అరనిమిషానికోసారి అలలెత్తి బాదే కడలి నేస్తాన్ని  విశాలమైన తీరం… తీక్షణమైన కిరణాలతో  తనని గుచ్చివడిల్చి గొడవ చేసే సూర్యుడిని  చిన్ని పుష్పం క్షమించినట్టు  మెరుపు కళ్ళెర్రజేసి ఉరిమే స్వరంతో  తమ నిశ్శబ్దాన్ని చెదరగొట్టే మేఘ రాజాల్ని  దిక్కులన్నీ క్షమించినట్టు  కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా  కన్నీటి తో మాటి మాటికీ తడిపి  చిత్తడి చేసే చారడేసి కళ్ళని, చెంపలు క్షమించినట్టు  మాఘంతో మంతనాలాడుతూ వచ్చి   ఆకులన్నీ త్రుంచి పారబోసే శిశిరాన్ని  మోడుగా మిగిలిన మోవి క్షమించినట్టు వెచ్చని చూపుల్తో లోకాన్ని చూడాలని  కుతూహలంగా వెలిగే […]

Read more

డా.దార్లకు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం ప్రదానం

‘తెలుగు సాహిత్య విమర్శ’ రంగంలో చేసిన విశిష్టమైన కృషి చేసిన వారికి ప్రతి ఏడాదీ ఇచ్చే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తిపురస్కారాన్ని 2012 సంవత్సరానికి గాను ప్రముఖ విమర్శకుడు, కవి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు కి ప్రకటించారు. 2013 నవంబరు 29న హైదరాబాదులోని శ్రీనందమూరి తారకరామారావు కళావేదికపై దుశ్శాలువ, వెయ్యినూటపదహారు రూపాయల నగదుతో డా.దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. , ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ యువకిరణాలు ప్రోగ్రామ్ చైర్మన్ ఆచార్య కె.సి.రెడ్డి ఈ పురస్కారాన్ని […]

Read more

పత్ర చిత్రకారిణి సుహాసినికి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్

ఆమె చిత్రాలలో ఆకులతో కొలాజ్‌ చేయడం ద్వారా పర్యావరణ స్పృహని జోడించగలిగింది. ‘గృహహింస’ ‘‘సాంస్కృతిక రంగంలో స్త్రీలు’’, ‘‘పోరాటాలలో స్త్రీలు’’, ‘‘రాజ్యహింస’’, ‘‘కుటుంబహింస’’, బాల కార్మీక వ్యవస్థకా గుణితం, పనిలో స్త్రీలు, ‘‘ఒంటరిగా లేము’’ లాంటి థీమ్స్‌తో పాత్ర చిత్రాలను రచించింది. 20,000 ఆకులని, వృక్ష బాగాలని సేకరింఛి 1300 గ్రీటింగ్‌ కార్డులు 150 వాల్‌ డెకరేటివ్స్‌ 250 స్త్రీల చిత్రాలు, విభిన్న సైజులలో చిత్రించింది. 2000 మార్చి 8న గూడురులోని డి.ఆర్‌.డబ్ల్యు డిగ్రీ కళాశాల బాటనీ లాబ్‌లో 25 చిత్రాలతో తొలి ప్రదర్సనను […]

Read more

ఇన్ హ్యూమన్ ఇమ్యునో వైరస్

మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా! నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదు ఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు నిగహ్రమూ లేదు విశ్వాసమూ లేదు తొడుగు ఒక్కటే దాంపత్యాన్ని రక్షిస్తుంది ఎంత పేమ్రతో వచ్చావో చెప్పకు ఎన్ని తొడుగులు తెచ్చావో చెప్పు తాళి కడుతున్నది వరుడనుకొని తలవంచుకుంది వైరస్ అని తెలీదు శరీరాలు వేరు పేమ్రలు వేరు రెండిటినీ ఒక కిమ్రి విడదీస్తుంది ఆమె కలియుగ చందమ్రతి చేసిన కాపురానికి కాటి సుంకం […]

Read more

చేయి దాటిపోతే!

చేయి దాటిపోతే!  మరణాన్ని జయించే జీవితేఛ్ఛ  వజ్రాయుధమై నీ చేత నిలవాలి కర్ణుడు సరిగా వాడాడో లేదో కానీ జాగ్రత్త అనే కవచకుండలాలు నిన్ను కాపాడాలి వరాలెన్ని ఉన్నా శాపనార్థాలు లేని జీవితం నీదవ్వాలి నిప్పుని కడిగే సంప్రదాయాలెన్నున్నా మలినాలంటని మెదడు నీదవ్వాలి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వ్యాధి నీ నీడను కూడా తాకకూడదంటే…. ఆ నీడను కూడా భద్రంగా చూసుకోవాలి!  ఎయిడ్స్ ఒక మహమ్మారి నీకు అవగాహన లేకపోతే!! ఎయిడ్స్ ఒక శరాఘాతం నీ వృత్తపరిధి నీ చేయి దాటిపోతే!!  – విజయ భాను […]

Read more

హెచ్ ఐ వి ఎలా మొదలయింది …. !

యున్ (UN)ఎయిడ్స్ తాజా నివేదిక ప్రకారం ,ప్రపంచ దేశాల్లో శరవేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాది ఎలా వచ్చింది అనేది 30ఏళ్ళ తర్వాత కూడా  శేషంగానే ఉండిపోయింది . ఎయిడ్స్ వ్యాది మానవులకు సోకడంలో శాస్త్రవేత్తల పాత్ర ఉందని ,అందుకే ఈ అంశంఫై పరిశోదనలు జరగటం లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి .దాదాపు సంవత్సరముల క్రితం తొలిసారి HIV కేసు నమోదు అయినప్పుడు ఈ వ్యాది  ఎలా వచ్చింది ?అనే ప్రశ్న తలెత్తింది ,అది ఈ నాటికి సమాదానం లేకుండా ఉంది పోయింది .    […]

Read more

నా గీత మాల ఆమనీ …

               ఈ ప్రపంచమంతా ఓ..పక్షి గూడు లాంటిది  కృత్రిమమైన ఎల్లలు,సరిహద్దులూ ఏవి లేని అందమైన వసుదైక కుటుంబంగా ఉండాలని కవి ప్రగాడమైన ఆకాంక్ష ఒక పాటలో నేను గమనించాను.  ఎక్కడ చూసినా ఆకలితో అలమటించి పోతున్నవారు, వర్గజాతి బేధాలతో,,లింగ వివక్షతో , అసమానతలతో వెలివేయబడుతున్నవారే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా అధికార తృష్ణ,అర్ధ పిపాసతో ప్రాకులాడే మానవులనే చూస్తున్నాం,శాంతి,అహింస  కనుమరుగై మానవుడు మానవుడిగా ఉండే లక్షణాలు లోపిస్తున్నాయి. ఇవన్నీ గమనించిన కవి ఈ పాటలో తన ఆవేదనకీ అక్షర రూపం ఇచ్చి హృదయాలని మేల్కొలిపే భాద్యత […]

Read more
1 2 3 6