అసామాన్యమైన సామాన్య కథలు

                     సల్వా జుడుం వ్యవస్థాపకుడు కర్మని నక్సలైట్లు అంతం చేశారు. అక్కడితో ఊరుకోలేదు. అతని శరీరాన్ని తూట్లు పొడిచారు. కాళ్ళతో తన్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. వారి విజయోత్సాహం అలాంటిది. ఆనాటి వార్తల్ని చూస్తున్నప్పుడూ చదువుతున్నప్పుడూ లీలగా ఓ కథ గుర్తుకువస్తూనే ఉంది. నిజానికి ఆ కథావస్తువుకీ ఈ సంఘటనకీ మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ కథకి ఉండాల్సిన మౌలిక లక్షణమైన సంభావ్యత ఇందులో పుష్కలంగా ఉండటమే ఆ కథ గుర్తురావడానికి కారణం. ఆ కథలో పోలీసులు చేసిన పనినే ఈ సంఘటనలో నక్సలైట్లు చేశారు. అందులో ఆలం చేసిన పనినే ఇందులో కర్మా చేశాడు. అయితే అది కథ కాబట్టీ ఆలం చుట్టూ కల్పనలున్నాయి. ఇది కథ కాదు కాబట్టీ సంచలనం సృష్టించే వార్తయింది. లక్ష్యాల్లో పరస్పర వైరుధ్యాలున్నా దీన్ని చూడగానే అది గుర్తురావడానికి కారణం కాల్పనిక సాహిత్యంలో కల్పనలు కేవలం కల్పనలు మాత్రమే కావనే వాస్తవం మరోసారి నిరూపించబడటం మాత్రమే. అలాంటి ఒక వాస్తవికతని ఆవిష్కరించిన కథ పేరు,” ఆలం కాందొకార్”. ఇది పాలపిట్టలో వచ్చింది.

                సామాన్య రచించిన “కొత్తగూడెం పోరడికో లవ్ లెటర్” పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టడానికి వెనుక ఇంత కథ ఉంది. ఇందులో మొత్తం పది కథలున్నాయి. పదికి పదీ విభిన్నమైనవి. వస్తువు, సంఘటనా క్రమం, భాష, శైలి శిల్పం ఇలా ఎందులోనూ మరో కథతో పోలికలుండకపోవడం కథ పట్ల ఈ రచయిత్రికున్న గౌరవానికి నిదర్శనం. ఆ గౌరవం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూంటారు.

ఇందులో అమ్మాయిలకి దారిచూపించే “కల్పన”,బెంగాలీ పక్షిపాడిన “పీ…యూ” సీతకష్టాలని పీతపరంగా వర్ణించే ప్రయత్నం చేసిన,” సీత కష్టాలు”, ఎర్ర ఏనుగు పాడె లేపిన ” దొంగల సంత”, ప్రాంతాతీతమైన ప్రేమతో తెలంగాణా పోరడికి ఆంధ్రా అమ్మాయి రాసిన, “కొత్తగూడెం పోరడికో లవ్ లెటర్”,పనికీ పెట్టుబడికీ మధ్యనున్న అగాధాన్ని పూరించే ప్రయత్నంగా సాగిన ” అనితపాడిన పాట”,ప్రయోగాత్మక,”మహిత”, ప్రయోజనాత్మక ” ఆలం కాందొకార్”ఆ పుస్తకం పేరు చెబుతారా ?”, పుష్పవర్ణమాసం అనే పది కథలున్నాయి.

ప్రత్యేకంగా మహిత, పుష్పవర్ణమాసం కథలు రెండూ రెండు విభిన్న ప్రయోగాలు. కొత్తగూడెం పోరడికో లవ్ లెటర్ కథ ముగింపుతో మెరుస్తుంది. కాబట్టీ దాని గురించి చెప్పకూడదు. చదివి ఆనందించాల్సిందే.

ఈ కథలన్నీ చదివింతరవాత పాఠకుడికి రచయిత్రికిగల పర్యటనానుభవాలు, విషయ పరిజ్ఞానం, భాషాపరమైన అవగాహన, వస్తువు ఎంపిక పట్ల వహించే జాగరూకత మొదలైన విషయాలన్నీ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక్కోసారి రచయితకి ఎక్కువ తెలిసిఉండటం వల్ల పాఠకుడికి ఓ సమస్య ఎదురౌతుంది. అదేమిటంటే కథా పరిధిలోకి రాకపోయినా రాసినవారి మేధస్సుని బలవంతంగా మొయ్యాల్సి రావడం. ఆ ప్రమాదంనించీ పాఠకుడిని రక్షించడానికి రచయితదగ్గరున్న బ్రహ్మాస్త్రం పేరే విమర్శనాత్మక పరిశీలన. రాయడం పూర్తయ్యాక దాన్ని ఓసారి విమర్శనాత్మకంగా చదువుకున్నప్పుడు పాఠకుడిపై పడే అదనపు భారాన్ని తగ్గించవచ్చు.

సామాన్య అనేది పుట్టుపేరో పెట్టుపేరో తెలీదుగానీ అసామాన్యమైన సామాన్యతని నింపుకున్న ముచ్చటైన పేరు.

 – రాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~

 

 

పుస్తక సమీక్షలుPermalink

11 Responses to అసామాన్యమైన సామాన్య కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో