మల్లాది మలిచిన మందాకిని

తప్పని సరి పరిస్తితులలో చెల్లెలి కోసం,తల్లి , తండ్రి కి ఇష్టం లేకపోయినా అక్క భర్త,ఓ కూతురి కి తండ్రి, పైగా తాగుడు, పేకాట,వ్యభిచారం,నాటకాలు , సిగరెట్టు లాంటి అన్ని వ్యసనాలూ వున్న భానుమూర్తి ని పెళ్ళిచేసుకుంటుంది మందాకిని.ఇసుక అరచేతి లో వుంటే కదల కుండా వుంటుంది, గుప్పెటలో బిగిస్తే వేళ్ళ సందులో నుంచి జారిపోతుంది, భర్తా అంతే అన్న తల్లి మాటలూ , కోపం కలిగించటం ఎలాంటి బాంధవ్యం లోనూ మంచిది కాదు, ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో ఇది అసలు మంచిది కాదు అని తండ్రి మాటలనూ గుర్తుంచుకుంది.

పెళ్ళైన తరువాత అతనిని ఎలా మార్చాలి అన్నదానికి ముందుగా భానుమూర్తి దినచర్యలో ఏది నచ్చకపోయినా తన అసమ్మతిని తెలియనియ్యలేదు.మౌనంగా అతనిని పరిశీలిస్తూ వుండిపోయింది.తను చెక్కబోయే శిల్పాని కి ఈ రాయి పని కి వస్తుందా రాదా అని అన్ని కోణాల నుంచి పరిశీలించింది. రాత్రి  పగలు పని చేస్తున్నా, ఖాళీగా వున్నా,కూతురి కి కథలు చెపుతున్నా సదా ఆ విషయమే ఆలోచించింది .తన ఆలోచనలకు ఓ రూపం ఇచ్చింది .వకొక్క అలవాటును గురించి తెలుసుకొని , రకరకాల పద్దతులలో మానిపించింది.

మందాకిని , భానుమూర్తి అలవాట్లను ఆప్యాయత, అనుబంధాలతో ఎలా మార్చగలిగిందో సైంటిఫిక్ రీజనింగ్స్ తో వ్రాసిన కుటుంబ కథా నవల ఇది.ఎంత గొప్ప ప్రేమికుల వైవాహిక జీవితమైనా నెలలు గడిచే కొద్దీ తాజాతనం పోయి రొటీన్ అవుతుంది.కొత్తల్లో ఎంతో త్రిల్లింగా అనిపించేవి తరువాత మామూలుగా అనిపిస్తాయి.ఏ వివాహమైనా ఆకర్షణీయంగా వుండాలంటే తరచు ఆ వైవాహిక జీవితం లోకి రొటీన్ ని బ్రేక్ చేసే కొత్తదనం కావాలి . అందుకు చాలా ఐడియాలను మల్లాది ఈ నవలలో చెప్పారు. అవి చదువుతున్నప్పుడు మనమూ అవి పాటిస్తే బాగుంటుంది అని పిస్తుంది .భార్యాభర్తల మధ్య వుండే బాందవ్యాన్ని ఎలా నిలుపుకోవాలో చాలా చక్కగా వివరించారు.భార్య కోపం తో అరిచి గోల పెట్టి , పోట్లాడి కాకుండా ప్రేమతో , ఓర్పుతో ఓ చెడ్డ భర్త అనుకున్నవాడి ని , ఓ మంచి భర్తగా ఎలా మార్చవచ్చో సునిశితంగా చెప్పారు.

మల్లాది శైలి గురించి చెప్పేదేముంది . మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకూ చదివించే నేర్పు ఆయనది.ప్రతి నవలలోనూ చిన్న చిన్న ఆటలు , పొడుపుకథలూ , జోక్స్ చొప్పించగల నేర్పరి.ఆయన చెప్పే కబుర్లు సరదాగా వుటాయి.పెళ్ళైనవారికే కాక, పెళ్ళికాని వారికి కూడా ఏంతో ఆసక్తి గా వుండే ఈ నవల “మందాకిని” మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసినది. తప్ప కుండా చదవవలసింది.

-మాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

2 Responses to మల్లాది మలిచిన మందాకిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో