ఊబి

 

vinay@g mail .com.—-‘ హై !చకితా!నీకోసంఎదురుచూస్తూ ఈహోటల్లో వంటరిగా ఇంకెన్ని రోజు లుండనూ, త్వరగా వచ్చెయ్, కనీసం ఫోనైనా చేసిమాట్లాడు, ఎన్ని కాల్స్ చేయనూ!ఇంకా  మీ ఫ్రండ్ అమ్మగారి ఆరోగ్యం బాగవలేదా!, టెక్స్ట్ ఐనా పెట్టు ..        నీ, వినయ్ !..’

check [at] yahoo [dot] co [dot] in.. ” హలో! వినయ్! నీవీ వారం నుండీ చాలా మార్లే ఫోన్ చేశావు,  కానీ నేనే లిఫ్ట్ చేయలేదు. అసలు విషయం తెలిస్తే నీ గుండె పగలదుకదా! గట్టి గుండేఇతే మళ్ళా మైల్  పెట్టు నీ ఐప్యాడ్లో.—-చకిత.   

  vinay@g mail.com ‘చకితా! .ఏమంటున్నావ్! నీవు క్షేమమేగా  ! విషయం చెప్పు చంపక ,కంగారుగా ఉంది.—-             -నీవినయ్.      

check [at] yahoo [dot] co [dot] in.’ హలో!వినయ్!అసలువిషయంనీకెలాచెప్పాలానిఆలోచిస్తున్నాను.చెప్పనా ? చెప్పేయనా?చెప్తున్నా….చకిత.                                                                                                                

vinay@g mail.com” చకితా! ఈనాన్చుడేం బావులేదు, త్వరగా చెప్పు,  నీText కోసం ఎదురుచూస్తుంటే, అసలు విషయంమంటావేంటనీవినయ్ .     

check [at] yahoo [dot] co [dot] in.’- ఓకే! విషయానికొస్తున్నాను, నీవు నిజంగానే అమాయకుడివి వినయ్!  నీవసలు అమెరికాలోఎలాఉంటున్నావ్ ! ఎలా ఉద్యోగం చేస్తున్నావ్ !  నేన్నమ్మలేకపోతున్నాను. ఆరోజు నాకు బాగా గుర్తు నీవు మీ అమ్మానాన్నలతో మా ఇంటికి వచ్చావు. పెళ్ళిచూపులకని, మా అమ్మా నాన్నానాకు చెప్పకుండానే మిమ్మల్నిపిలిపించారు,తాత్కాలికంగావాళ్ళ మాటలు మన్నించి మీ ముందు కూర్చు న్నాను. మీవాళ్ళు ఏవేవో అడిగారు, నేనూ ఏవేవో చెప్పేశాను.

   మానాన్నగారు”బాబూ ! నీవేమైనాఅడుగుతావా! ” అని అన్నారు. పాపం నీవు చిన్నగానవ్వి —-“అవసరంలేదండీ!అమ్మానాన్నామాట్లాడారుగా !మీఅమ్మాయే ఏమన్నాఅడగాలనుకుంటే అడగ వచ్చు” అన్నావు, నీనవ్వు మాత్రం నవమోహనంగా చాలా బావుంది, అసలునిన్నుఇష్ట పడని అమ్మాయి లేఉండరు, నీరూపం , నీ చదువు, మంచిడాక్ట రుగా అమెరికాలోనీ ఉద్యోగం, సంపాదన, నీఆస్థి పాస్థులూ, మీఅమ్మా నాన్నలు కూడా చాలా మంచివారు  , కానీ ఏంచేయను నామనస్సులోమరొకరు ఉన్నందున, నాకు ఇంకెంతో సేపు అక్కడ కూర్చోటమే ఇష్టంలేక తలాడించాను.’అవసరంలేదని.’ నిజానికి నిన్ను ఇబ్బందిపెట్టడం.అవమానించడం నా ఉద్దేశ్యంకాదు. కానీమా అమ్మానాన్నలు చాలా మూర్ఖులు, నా మాటకు మనస్సుకూ , విలువే ఇవ్వలేదు.పైగా మా బామ్మ ‘ దరిద్రపు ముం….’  అంటూ ఏమేమో బూతులు తిట్టడం, నాన్న బజార్నుంచీ కొత్త కొబ్బరితా ళ్ళు  కొని తెచ్చిహాల్లో రెండు ఫాన్లకూ కట్టి ముడి వేశాడు, అమ్మానాన్నా ఇద్దరూ ఆరింగుల్లో మెడ పెట్టి ఆత్మహత్య చేసుకుంటామని బెది రించాడు.ఇహ మాతమ్ముడున్నాడే, వాడు మరీ రెబెల్ ,వాడి స్నేహితుని తండ్రి ఒక డి.ఎస్.పి.ఆయనపర్సనల్ పిస్టల్ ఎలాగో సంపాదించి తెచ్చినన్నుపేల్చి,తానూపేల్చు కుంటానని బెదిరించాడు,నన్నింత ఇబ్బంది పెడు తున్న వారిపరువు ఇంకా భయంకరంగా తీయాలని నిశ్ఛయించుకున్నా.ను

         అందుకే ఈగొడవంతా ఎందుకని వారిమాటలు విన్నట్లు నటించాను, నేను’ మారాన’నుకుని వాళ్ళంతా ఎంతో సంతోషించారు, పాపం అదంతా బూటకమని వారికి తెలీదు.తాత్కాలికంగా వారు చెప్పినట్లుచేయాలనిప్లాన్ చేశాను. అందుకే నీతో పెళ్ళికి అంగీకరించాను, నిశ్చితార్ధం ముందు నీతో షాపింగ్ కు  వచ్చినప్పుడల్లా మనవెనక ఒకవ్యక్తి ఉండటాన్నినీవు గమనించలేదు ,కానీ అతడు మనల్ని నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. నేనేంచిన్న పిల్లను కానుగా , ఇరవై ఏళ్ళకాబోయే ఇంజనీర్ను, నాకూ స్వంత ఆలోచనలూ ఇష్టాలు ఉంటాయని మా వాళ్ళు అనుకోక పోడం వల్లే నిన్నుఇబ్బంది పెట్టవలసి వచ్చింది, పాపం అమాయకంగా నీవు మా వాళ్ళ ట్రాప్లో పడ్డావ్. ఐనాఎదిగే పిల్లల మనస్సులు తెల్సుకోకుండా పెద్దలమనీ , అమ్మానాన్నలమనీ నిర్ణయాలు తీసుకోడం ఈపాతకాలపు ముసలాళ్ళ తెలివి తక్కువతనం. అందుకే వారికిబుధ్ధి చెప్పాలనుకున్నాను. కనగానే పిల్లలపై అధికారం చెలాయించే హక్కు వారి కెక్కడిది?

                       మనపెళ్ళి జరిగే సమయం లోనామొబైల్కు  చాలా మార్లు ఫోను వచ్చిన విషయం గమనించే ఉంటావు, అవన్నీనాకు వచ్చింది చంచల్ నుండే! ఎవ్వరూ గుర్తు పట్టలేనట్లు అతడు ముఖాన్నికవర్ చేసే టోపీ పెట్టుకుని నల్ల కళ్ళద్దాలతో వచ్చి మన ముందే మొదటి వరుసలో కూర్చుని నవ్వుతూ, నాకు ఫోన్చేస్తూనే ఉన్నాడు. నీవు దండ వేసేప్పుడూ, తలపై జీలకర్రా బెల్లం పెట్టేప్పుడూ తాళి కట్టే ప్పుడూ, తలంబ్రాలు పోసేప్పుడూ అతడు చిలిపిగా నవ్వుతూ చూస్తూనే ఉన్నాడు,వీటి మీదంతా మాకు నమ్మకం లేదు, అందుకే సినిమాల్లో హీరోయిన్ ఎంతోమంది చేత తాళికట్టించుకున్నట్లే నేను నీతో నూ, అదీ చంచల్ ముందే కట్టించుకున్నాను.

                  పెళ్ళయ్యాక కొంతకాలం నాచదువు పూర్తయ్యాక , ఉద్యోగం చూసు కుని ,నీకు అన్నీచెప్పి, నీవుకోరితే విడాకు లిచ్చి వెళ్ళిపోదా మనుకున్నాను,కానీ  ఇంతలోనే మా,మీ పెద్దల తొందర పాటువల్ల మనల్ని హనీమూన్ కూ, తొలిరాత్రికీ ఏర్పాటు చేయటం వల్లఈ విషయం ఇలా ముగించాల్సి వచ్చింది. ఐతే నీవూ చదువుకున్న సంస్కారివి గనుక తాత్కాలికంగా మొదటి రాత్రిని పోస్ట్పోన్ చేసి , హనీమూన్ కు ఏర్పాటు  చేయటంతో, మేము ఆ అవకాశాన్నిఅందిపుచ్చుకున్నాము. ఆరోజు రైల్వేస్టేషన్లో  నాకు వచ్చిన ఫోన్ మాఫ్రెండ్ నుంచీకాదు.’ వాళ్ళమ్మకు చాల సీరియస్ ‘అనీనన్నువెంటనే వచ్చిసాయం చేయమని పల్లెనుండీ ఎవ్వరి సహాయమూ లేని మా ఫ్రండ్ ఫోన్ లో ఏడుస్తూ,రిక్వెస్ట్చేసిందనినీకుచెప్పి , నీవు వృత్తిరీత్యా డాక్టరువు గనుక వచ్చి సాయంచేస్తానంటే , ఇలా హనీ మూన్ వెళుతూ వెళుతూ వచ్చామని చెప్పడం బావుండదనీ,మావాళ్ళూ మీవాళ్ళూ నన్నుతిడతారనీ చెప్పి నిన్నొక్కడినే పంపగలిగాను, అనుకున్న ప్రదేశానికి నీవుముందు వెళ్ళేట్టూ నేను తర్వాత వచ్చేట్టూ చెప్పి వప్పించి పంపాను.అప్పుడు మీవాళ్ళు పెట్టిన నగలన్నీ నీకే ఇచ్చేశాను, ఆపల్లెలో ఇబ్బందవు తుందనీ,దాచలేననీచెప్పాను .

               మైసూర్ , కొడైలలో నీవున్న హోటల్స్ లోనే మేమూ ఉన్నాం , నీకు తొలిరాత్రి కాలేదు కానీ, మాకు ఎప్పుడో చాలా రాత్రులయ్యాయి, పెళ్ళికి ముందే! ఏమింత బరితెగించిందను కుంటున్నావా! ఏం చేయనూ! చంచల్ చాలా ఫాస్ట్ ! నీవు అమెరికాలో ఉంటున్నా చాలాస్లో! బూజుపట్టిన పాతకాలపు పధ్ధతులకు బానిసవు.చంచల్ అలాకాదు.అందుకే అతని ఇష్టాన్నికాదనలేక అతను కోరినట్లే అంగీకరించాను. నీవు చేసే ఫోన్లన్నీ నాసెల్ కే కనుకనాకు ఇబ్బంది కలగలేదు. అదేమావాళ్ళకైతే వారు వచ్చి నాకోసం వెదికేవారు. చదువుపూర్తయ్యాక వెళ్ళి పోవాల్సినదాన్నిసగం చదువు తోనే చంచల్ వెంట వెళుతున్నాను. నీవు కట్టిన తాళికూడా నీకిచ్చిన నగలతో పాటేఉంది, నీవు చూశావో లేదో! మాఇంటికెళితే నీకింత కంటే ఎక్కువ తెలిసేదేమీ లేదు కానీ నీవల్ల మావాళ్ళకు విషయం తెల్సిగుండెలు పగల వచ్చు. డబ్బుకు డబ్బూ, పేరుకు పేరూ రెండూ చెడ్డాయని బాధ పడవచ్చు. నీవు మరో పెళ్ళిచేసుకో! అందగాడివి, ఆస్థిపాస్తులున్న అమెరికా ఉద్యోగివి, నీకు పిల్లనివ్వనుఎంతో మంది క్యూ లో ఉంటారు, మాపేరెంట్స్ లా!ఓకే!   మాకూ చాలా ఆస్థిపాస్థులున్నాయి,కోట్లు చేసే పొలాలూ, ఇళ్ళూ ఉన్నాయి.కానీ నాకవేవీ వద్దనుకున్నాను.నిన్నువద్దనుకున్నట్లే! ఈమైల్ చూసుకుని బాధపడకు, జరిగిందంతా  చెప్పేశాను.  I pity U,  బై. ఫరెవర్ ….  చకిత   .                                                                                                             ఐప్యాడ్ లోఅంత పెద్ద మైల్ చదివి, విషయం అర్ధమైన వినయ్ కళ్ళుతిరిగిపోయాయి. అలా ఆగార్డన్లో బెంచ్ మీద కూల బడిపోయాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీరు గడగడా తాగేశాడు. ‘ ఇదో వచ్చేస్తుందని ఎదురు చూస్తున్నచంచల ఇలా మైల్ పంపిందేంటి? ఈరోజుఏప్రిల్  ఫస్ట్ ! ఫూల్చేయను కాదుగా! తమాషాకా! లేక నిజమా! నిజమైతే అసలే గుండె జబ్బు తో ఉన్న అమ్మ తట్టుకో గలదా ఇదితెల్సి!  కంట్రోలు కాని హైబీపి తో ఉన్ననాన్న           బ్రతగ్గలడా! తన పెళ్ళిచేసి ఆనందించాలనే వారికోరిక బిడ్డగా కాదనలేక నెలశలవు మీద వచ్చి అమ్మా వా ళ్ళు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటే ఇలా జరిగిందేంటి!ఐనా ఒక్క ప్రయత్నం చేస్తాను ‘—అనుకుని చకితకు ఒక మైల్ పెట్టాడు వినయ్                                                                                                                                            vinay@g mail .com. -.Is It true?! నిజమైతే జరిగిందంతా నేనూ మర్చిపోతాను, వచ్చెయ్ ! —Vinay .                     

కొద్దినిముషాల్లోనే రిప్లయ్  వచ్చింది.

check [at] yahoo [dot] co [dot] in—-‘ హై వినయ్ ! అది అసాధ్యం ! పెళ్ళిచేసుకోకుండానే ఇంకొకరికి భార్యలా ఉంటు న్న నన్నునీవు క్షమించి తిరిగి రమ్మన్నారాను, అసలు నీభార్యగా ఉండాలనే ఉద్దేశ్యమే ఉంటే ఇలా చేయను గాక చేయను .నేనుచంచల్ తోనేఉంటాను, అతడే నాసర్వస్వం, అతడు నీలా అందగాడుకాదు, కులమూ ఒకటికాదు. మా లాగా,మీలాగా ఆస్థిపాస్థులూలేవు.ఐనా  అతడికి నేనూ నాకతనూ కావాలనుకున్నాం.నీవు అనవసరంగా ఆశలు పెంచుకోక నీదారి నీవు చూసుకో! నీవు నన్నేమీ పెద్ద మనస్సుతో క్షమించాల్సిన పనేం లేదు. నీ అమ్మా నాన్నల కోసమో, మా అమ్మానాన్నలకోసమో నాకు ఇష్టమైన నేనెంచుకున్నజీవితాన్నుండీబయటకు వచ్చే ప్రసక్తేలేదు. నీవు అనవసరంగా పోలీస్ రిపోర్టివ్వటం వంటివి చేసేంత తెలివి తక్కువ వాడివనుకోను నేను మేజర్ననిమరువకు!

ఇహ మైల్ చేసినా జవాబివ్వను. పర్మెనెంట్లీ గుడ్బై .  –‘–చకిత.

ఉన్న కాస్తంత ఆశాతీరిపోగానే , తనకర్తవ్యంగా భావించి వినయ్  రూం ఖాళీ చేసి , చకిత పేరెంట్స్ కు స్వయంగా జరిగిన విషయం అందజేయను బయల్దేరి వెళ్ళాడు

        చకిత ఇంటికె ళ్ళివిషయమంతా చెప్పగానే ,” దరిద్రపుపెద్దమ్మ! నికృష్టపుముం.. ఎంతపనిచేసింది! నీ జీవితంతో ఆడుకుంది, మమ్మల్ని అన్యాయం చేసి పోయింది, అదేం సుఖపడుతుందిలే, నానారోగాలతో ఏడ్చి ఏడ్చి దిక్కులేని చావు చస్తుంది.! ” అంటూ శాపనార్ధాలు పెడుతున్న బామ్మగారిని  వారించాడు వినయ్.  

                      “బామ్మగారూ!ఆమెనలా అనకండిఎక్కడో సుఖంగా జీవించ నివ్వండి ,ఆమె ఇష్టాఇష్టాలు, మేజరైన ఆమె మనస్సు తెల్సుకోకుండా ,స్వేఛ్ఛ నివ్వకుండా ఈ వివాహం  జరిపించడమే పొరబాటు,ఇవన్నీతెల్సీ మీరూ, తెలియక మేమూ ఇద్దరం పొరబాటు చేశాం, తప్పుమన దగ్గర పెట్టుకుని ఆమెను శాపనార్ధాలు పెట్టడం సబబు కాదు.ఎంతైనా మీ మనవరాలు, నాకికశలవు” అని ఆమెపాదాలకు నమస్కరించి  , వారు చకితకు పెట్టిన నగలన్నీ వారికి ఇచ్చేసి వచ్చేశాడు

ఆతర్వాత  ఏడాదికి తన పైదిగులుతో కోలుకోలేక పోతున్న తల్లి తండ్రుల కోరిక మీద తండ్రిస్నేహితుని కూతురైన కుసుమను పెళ్ళాడి అమెరికా వెళ్ళి స్థిరపడి తిరిగి తన జీవన  పోరాటంలోమునిగి పోయాడు వినయ్.   

              ***                        ***                      ***                 ***                   ***                  ***

పదేళ్ళ తర్వాత ఆరోజు ఉదయం ఆరు గంటలకుల్యాప్ టాప్  ఓపెన్ చేసి మైల్స్ చూసు కుంటున్న వినయ్  తనకు వచ్చిన ఒకమైల్ చూసి మనస్సుకలకలానికి గురైంది .అతడిలోనిమానవత్వంఅతడిమనస్సును మైనంలా కరిగించింది,ఇహ ఆగలేక పోయాడు,”కుసుమా!మనం అర్జంట్ గా ఇండియా వెళ్ళాలి. ” అన్నాడు. “అదేంటండీ!మామయ్యగారిని, అత్తయ్యగారిని ఊరికే తిప్పకూడదనుకున్నాం  కదా!”అందిఆశ్చర్యంగాకుసుమ.

“లేదుకుసుమా !అమ్మానాన్నలవద్ద ఒక నర్సును అరేంజ్చేద్దాం,వాళ్లతోనూ మాట్లాడ తాను, మన మనోజ్  నుకూడా ఇక్కడే వదలి వెళదాం , ఒక్కరోజులో వచ్చేద్దాం  ” అంటూ హడావిడిగాఆన్ లైన్లో  ఇద్దరికీ ఫ్లయిట్  టికెట్స్ బుక్ చేశాడు వినయ్.

     వినయ్ తనకువచ్చిన మైల్ లోని అడ్రస్ టాక్సీ డ్రైవర్ కిచ్చి వెతుక్కుంటూ ఒక మురికివాడలోని రేకులషెడ్ ముందు నిల్చి, తలుపుపై తట్టాడు. ” ఎవరది!లోనికిరండి తలుపుతెరిచే ఉంది.” నీరసంగా వినిపించిన మాటతో , వినయ్ కుసుమ చేయిపట్టుకుని లోపల అడుగుపెట్టాడు. అది మురిగ్గా,అశుభ్రంగా ఇరుగ్గా ఉన్న ఒకచిన్న గది. లోపలి కెళ్ళగానే గుప్పుమని చెడు వాసన  భరించలేనంతగా వచ్చింది.నేలాంతా తడిగాఉండి దుర్వాసనేస్తున్నది.  ఒకకుక్కి మంచం లో ఒక గుర్తు పట్టను వీలులేని శాల్తీ పడి ఉంది.                                                                                                                ”

ఎవరది!                     

నేను వినయ్! అమెరికానుండీ వచ్చాను.” అన్నాడు. వినయ్ స్వరం వినగానే ఆమంచంలోని ఎముకలపోగు లేనిశక్తి కూడదీసుకునికదిలి , ” వినయ్! వచ్చావా! నీవు వస్తావని నామనస్సుచెప్తూనేఉంది,నీసంస్కారం అలాంటిది! నేనే దురదృష్ట వంతురాలిని, మాబామ్మఅన్నట్లు దరిద్రురాలిని, నష్టాజాతకిని. ఇప్పుడు కష్ట జాతకిని, ఇహ ఎంతోకాలం బ్రతకను. వినయ్ !

          నిన్నుకాదని,మీవాళ్లనూ,మావాళ్ళనూ ఇబ్బంది పెట్టి తెగతెంపులు చేసేసుకుని , అందరి పరువూ మంటకలిపి  చంచల్ మోహంలోపడి సర్వంకొల్పోయాను,నాఅందం,నాకు వస్తుందనుకున్నమానాన్నగారి ఆస్థి, పెళ్ళికి మీరూ, మావాళ్ళూ పెట్టిన నగలూ అన్నీతెస్తానని ఆశపడ్డాడు.అవన్నీనావి కాదనీ అడగ ననీ తెగేసి చెప్పాను. నన్ను నికృష్టంగామోసంచేసి మురికి కూపంలో పడేసి పోయాడు, వాడి కాంక్ష తీర్చుకున్నాక, మాయచేసి  నన్ను ముంబాయ్ బ్రోతల్ హౌస్ కు అమ్మేసి  మాయమయ్యాడు.అక్కడి నుండీ బయట పడట మంటే యమలోకం నుండీ బయట పడటమే!  చదువుకున్ననేనూ ఇలా మోస పోవటం ఆడజాతికే అవమానం , నేను రోగాలపుట్ట నయ్యాక నన్ను బయటికి తరిమేశారు. వినయ్! మోహం ఎంత నాశనంచేస్తుందో కదా! ఎంతో నిర్భయంగా హాయిగా నీ కౌగిలిలో , నీప్రేమలో జీవితాన్నిగడిపేయాల్నిననేను వాడిమోసంలో, మోహంలో పడి సర్వనాశనమయ్యాను.కనిపెంచి పెద్ద చేసిన మావాళ్ళందరినీ కష్టపెట్టాను.వారిపరువుమర్యాదలు మంట కలిపాను,నాకీ శాస్థికావలసిందే!రోజుకు నలుగురు నుండీ ఒక్కోరోజు పదిమంది వరకూ కామాంధులు నాశరీరాన్ని పీల్చిపిప్పిచేశారు.పెద్ద రోగాలవారంతా నాశరీంలోకి వారి రోగా లన్నీ ఎక్కించారు.  

ఆచంచల్ పెద్ద మోసగాడు! నేను నా ఆస్థిపాస్థులకోసం కోర్టుకెక్కి వాటాతెస్తాననుకున్నాడు , కోట్లుకుమ్మరి స్తాననుకున్నాడు.నేను వాటన్నింటికీ ఒప్పుకోకపోడంతో నన్నా ఊబిలోకి తోసిపోయాడు.   వినయ్! క్షమించమని స్వయంగా  కోరనే నిన్ను రమ్మని మైల్ చేయాలని ఎంతో మందిని బ్రతిమాలి చివరకు మొన్నఒకదయామయి ఐన నర్స్ సాయంతో మైల్ చేయించ గలిగాను, నీపాదాలు నాకన్నీళ్ళతో కడిగి క్షమార్పణ చెప్పుకుంటే తప్ప ఈజీవి ఈ కట్టెను వదిలేట్టులేదు. ఆ కోర్కెతోనే ఇంకా ప్రాణంనిల్చిఉంది. ” అంటూ సుదీర్ఘంగా చెప్పి తలపక్కకు వాల్చేసింది ఆమె.  వినయ్ దగ్గరగావెళ్ళి”చకితా!

చకితా!”అనిపిలిచాడు.జవాబులేదు.ఇంతలోబయట నుండీ వచ్చిన ఒకామె “మీరేనావినయ్ బాబు!?!మిమ్మల్నిచూడాలనినెలరోజులుగాఎదురుచూస్తున్నది.ఈవ్యాధితోఈమెప్రాణం నిల్చి ఉందంటే అది మిమ్మల్ని చూడాలనే తీవ్రమైన కోరికతోనే బాబూ!తనచివరి కోర్కెతీరాకే జీవి కట్టెను వదిలింది , నేను ఒక నర్స్ ను ,నాపేరు కరుణ. ఒక సమాజం తరఫున ,ఈమురికివాడలో వైద్య సేవలు అందిస్తున్నాను, నాకు మీ mail.i.d రెండురోజుల క్రితం ఇచ్చింది,మీరు వస్తారనే ఆశ ఆమెకు ఉందికానీ , నేన్నమ్మలేదు.,కేవలం మైల్ చూసి , అమెరికా నుండీఆఘమేఘాలమీద వస్తారనుకోలేదు. ఈమె తమ్ముడికీ, తండ్రికీఎన్నోమార్లు ఫోన్స్ చేసినాఎవ్వరూ రాకపోగా ‘ ఆ ముదనష్టపుదానిగురించీ మళ్ళీఫోన్ చేయకు, అదెన్నడో చచ్చిందని తద్దినం పెట్టేశాం. ” అని కోపంగా చెప్పారు.” అనింది ఆనర్స్ కరుణ.                                                                                                                              

” మీరు ఈమెకు మీ సమాజం తరఫున అంతిమ సంస్కారాలు జరిపించండి, దానికై ఈసొమ్ము ఉంచండి , వస్తాను.” అని చెప్పివినయ్,నర్స్  కరుణకు  కొంత డబ్బిచ్చి కుసుమచేయిపట్టుకుని వెనక్కు బయల్దేరాడు. అన్ని విషయాలూ తెల్సిన కుసుమ తన భర్త సంస్కారానికి  మనస్సులోనే చేతులు జోడించింది. ” భగవాన్! ఏ అమ్మాయీ ఇలా మోస పోయి తననిండు నూరేళ్ళ జీవితాన్ని మంటకలుపుకోకుండా కాపాడు” అనిమనస్సులో భగవంతునిప్రార్థించుకుంటూ భర్త వెంట నడిచింది. చకిత ఆత్మ శాంతికై మౌనంగా ప్రార్ధించింది.   

 – హైమాశ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

కథలుPermalink

2 Responses to ఊబి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో