నువ్వు ప్రకృతి
నిత్యనూతనా
వర్షపు చినుకులా
గలగల పారుతున్నా
సన్నటి వాగు-వంకా..
వర్షమాగినంకా..
తడారనీ సన్నటి ఇసుకలా…
నవోదయానికీ
నిగనిగలాడే
నిన్ను చూసి ప్రకృతియే
సిగ్గు పడుతుందా..!?
ఓ ప్రకృతి నిన్ను చూసినా
ప్రకృతియే
అసూయ పడుతుందా..!?
నేను వాగూ-వంకనూ..
నాలో ప్రవహిస్తూన్నా..
నిర్మలానురాగ నీరు..
-డా.బొంద్యాలు బాణోత్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~