జ్ఞాపకం- 69– అంగులూరి అంజనీదేవి

రిటైర్ అయినవారు కొందరు పోన్ చేసి ‘అద్భుతంగా వుందండి నవల. అందులో మేడమ్ రాసిన ‘జీవితం లేతకొమ్మల్ని పట్టుకొని వేలాడే మంచుబిందువు, తప్పనిసరిగా తెగిపోయేదే. జారిపోయేదే’ అన్న వాక్యాలు బాగున్నాయి. అవి చదివిన ప్రతి ఒక్కరు తమలోకి తాము చూసుకునేలా వున్నాయి. జీవితంలోని అసలు నిజం ఇదీ అని తెలుసుకునేలా వున్నాయి. అంతేకాదు అందులోని ప్రతి వాక్యం మమ్మల్ని ఉత్తేజపరుస్తోంది. ఊహల్లోకి తీసికెళుతోంది. అక్కున చేర్చుకుని అనునయిస్తుంది’ అన్నారు.

ఈ వాక్యాలేంటో ఈ సీరియలేంటో ఇలాంటి ప్రపంచం ఒకటి వుంటుందని కూడా నాకు తెలియదు. అందులోని కొన్ని వాక్యాలు మా జీవితాలనే మార్చేశాయి అన్న పాఠకులు కూడా వున్నారు. ఏదో అలవాటై కాలక్షేపానికి రాస్తున్నావనుకున్నాను కాని నీవల్ల యింత ఉపయోగం వుంటుందనుకోలేదు. ఇలా ఎలా రాయగలుగుతున్నావు లేఖా?” అన్నాడు జయంత్.

సంలేఖకు శరీరం మొత్తం తేలికై మనసు రెక్కలు తొడుక్కొని ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినంత హాయిగా వుంది. పెళ్లికి ముందెప్పుడో సరదాగా దిలీప్ చెబితే ఓ కథ చదివానన్నాడు జయంత్. ఆ తర్వాత తన కథలు కాని నవలలు కాని చదవలేదు. అలాంటి జయంత్ ఇలా మాట్లాడుతుంటే ఉక్కిరిబిక్కిరై అతన్నుండి ఇంకా ఏదో ఆశిస్తూ అతన్ని ఏమాత్రం కదిలించకుండా వింటోంది.

“ఇంతమంది నుండి ఫోన్ కాల్స్ అంటే మాటలా లేఖా! వీళ్లు కేవలం కాల్ చేసి నీతో ఓ మాట చెప్పుకోవాలనుకున్న వాళ్లు మాత్రమే. కాల్ చెయ్యలేని వాళ్లు ఇంకెందరున్నారో కదా! అదే సీరియల్ మీద సింగపూర్, అబుదాబి నుండి చూడు ఎన్ని మెసేజ్ లు వచ్చాయో! ఢిల్లీలో ఫ్లయిట్ ఎక్కుతూ ఆ పత్రిక కొని నీ సీరియల్ చదివి ఫోన్ చేసిన వాళ్లు కూడా వున్నారు. అందరితో చాలా ఓపికగా మాట్లాడాను.

మాట్లాడుతున్నంతసేపు నా స్థానంలో నువ్వుండి వుంటే నీ పాఠకులతో నువ్వు మాట్లాడుకుంటూ నువ్వెలా ఆనందించేదానివో ఇమాజినేషన్ చేసుకుంటూ మాట్లాడాను” అన్నాడు.

వెంటనే అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అతను ఎన్ని మాటలు చెప్పాడో అన్ని ముద్దులు పెట్టింది.
ఆమెలో అలాంటి స్పందనను తొలిసారిగా చూసిన జయంత్ ఎప్పుడూ లేనంత గొప్పగా రిలాక్సయ్యాడు. ఇది కావాలి మనిషికి. ఇదీ స్పందన అంటే! ఇలాంటి ఆనందం, ఈ సంతోషం ఎప్పటికీ దొరికితే ఎంత బావుండు అని మనసులో అనుకుంటూ

“బెంగుళూరు నుండి కాల్ చేసి ఒక పాఠకుడు ఏమన్నాడో తెలుసా?” అన్నాడు జయంత్.

“ఏమన్నాడు?” ఉత్సాహంగా అడిగింది సంలేఖ..

“ఆయనకి తన చిన్నప్పటి నుండి నవలలు, సీరియల్స్ చదివే అలవాటు వుందట. టీచర్ గా రిటైరయి ఇప్పుడు తన కొడుకు ఇంట్లో వుంటున్నాడట. ఈ సీరియల్ కన్నా ముందు నీ రచనలు కొన్ని చదివాడట. నీ రచనల్లో చదివించే శక్తి వుందట. పాఠకుడ్ని వాక్యాలవెంట లాక్కెళ్లే నైపుణ్యం వుందట. వాటిల్లో వుండే విలువలు, జీవితానుభవ పాఠాలు, జీవితానుభవాలు ఏ విశ్వవిద్యాలయంలో, ఏ వ్యక్తిత్వవికాస కేంద్రాల్లోను దొరకవట. అంత గొప్పగా రాస్తున్నావట” అన్నాడు.

సంలేఖ విభ్రమగా చూసింది. రాయకుండా వుండలేక రాయడం. జిజ్ఞాసతో, ఆరాటంతో కాగితాలు ముందేసుకుని కూర్చోవటం. అందులో ఏదో నిషాను వెతుక్కోవటం చేస్తోంది కాని తన రచనల్ని ఇంత విశ్లేషణతో చూస్తారని, లోలోతులకెళ్లి చదువుతారని అనుకోలేదు.

భర్త మౌనంగా వుండడంతో “ఇంకా ఏమన్నాడో చెప్పండి!” అని తనలోని ఉత్సుకతను ప్రకటించింది సంలేఖ.

తమ గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవాలన్న ఆసక్తి మిగతా వ్యక్తులకన్నా రైటర్స్ లోనే ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే ఒక నవల రాయాలంటే ఆ నవలకి డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మాటలు, కథ, మార్పులు, చేర్పులు వాళ్లు ఒక్కరే నిర్వహించుకుంటారు. అందుకే ఎవరి నవల వాళ్లకి బ్రహ్మపదార్థంలా అన్పిస్తుంది. దాని మీద వచ్చే అభిప్రాయాలను కూడా అంతే అమూల్యంగా భావిస్తారు. తాము రాసిన దానిలో తప్పులు, ఒప్పులు తెలియాలంటే వాళ్లకి పాఠకులే ఆధారం. అందుకే పాఠకులంటే రైటర్స్ కి పిచ్చిప్రేమ వుంటుంది. ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యతను పాఠకులకి ఇస్తారు. ఎంతకాదన్నా ఇది అక్షరసత్యం.

లేత ఆకులాంటి ఆమె అరచేతిలో చూపుడువేలును వుంచి అక్షరాలను రాసినట్లు రాస్తూ “లేఖా! నువ్వు చూడటానికి ఇంత సౌమ్యంగా వుంటావ్! ఎక్కువగా మాట్లాడవు. హస్విత తప్ప స్నేహితురాళ్లు లేరు. బంధువులతో కూడా అంతంత మాత్రంగానే కలుస్తావు. అయినా మౌన ప్రేక్షకురాలిలా సమాజాన్ని పరిశీలించి,స్పందింప చేసే రచనలు చేసి బోలెడుమంది పాఠకుల్ని సంపాయించుకున్నావ్! ఇదెలా సాధ్యమైంది నీకు?” అన్నాడు.

వ్వింది సంలేఖ. మల్లెమొగ్గ విచ్చుకున్నట్లు, వెన్నెల కురిసినట్లు. ఇంకా అలా నవ్వుతూనే “నాలో వున్న ఈ రచనా సామర్థ్యం గాడ్ గిఫ్ట్!” అంది సింపుల్ గా.

“ఏది ఏమైనా నీ సెల్ ఫోన్ పుణ్యమా అని నాకు ఈరోజు కలిగిన ఈ అనుభవం కొత్తగా, గొప్పగా వుంది. వాళ్లు నన్ను ఒక రచయిత్రి భర్తగా ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతుంటే కొంచెం గర్వంగా, కొంచెం అహం, కొంచెం తృప్తి కలిగాయి. అసలు నీకీ ఫీల్డ్ లోకి వెళ్లాలన్న ఆలోచన ఎలా వచ్చింది?” అన్నాడు.

మళ్లీ నవ్వింది సంలేఖ “మనం వెళ్లాలంటే వెళ్లటానికి ఇది సాఫ్ట్ వేర్ ఫీల్డో, ఇంకేదో కాదు. నిత్యసాధనతో, అంకితభావంతో చేస్తున్నపని. ఇష్టంగా చేస్తున్న పని. ఇష్టంతో ఏ పని చేసినా అది దేవతార్చనతో సమానం కదా! నేను చేస్తున్నది అదే అని నా భావన. అంతేకాదు. జ్ఞానం కాని, నైపుణ్యం కాని ఒకరు అందజేస్తే అందేవి కావు. ఏమో! జయంత్ దైవికంగానో ఏమో నా సాహితీ జీవితం నువ్వు గర్వపడేలా సాగుతోంది. అందుకు సంతోషంగా వుంది నాకు” అంది.

వాళ్లిద్దరలాగే మాట్లాడుకుంటూ చాలాసేపు కూర్చున్నారు.

జయంత్ ఆత్మీయంగా ఆమెనే చూస్తూ “నువ్వు ఇంట్లో కొన్ని పనులు తగ్గించుకో! సమయాన్ని పొదుపు చేసుకో. ఇంకా మంచి రచనలు చెయ్యి!” అని చెబుతుండగా లేచివెళ్లి కాఫీ తెచ్చి భర్తకి ఇచ్చి, తను కూడా తాగుతూ కూర్చుంది సంలేఖ.

                                                                                  *****
సంలేఖ దగ్గర నుండి రాజారాం సెల్ ఫోన్ కి ఎప్పుడు కాల్ వచ్చినా భరించలేకపోతోంది వినీల. కళ్లలో నిప్పులు పోసుకున్నట్లు చూస్తుంది. దానికి కారణం ఆ ఫోన్ వల్ల తన భర్త, అత్త, మామలు సంబరపడిపోతుంటారు. ఫోన్ పెట్టేశాక కూడా సంలేఖ అత్తగారింట్లో అనుభవిస్తున్న సుఖ, సంతోషాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు. ఆ మాటలు వినలేక, వాళ్ల దగ్గర కూర్చోలేక తెగ అవస్థ పడుతుంది.

అందుకే అప్పుడప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసో, లేక రింగ్ వచ్చినా రాజారాం వెంటనే వెళ్లి లిఫ్ట్ చెయ్యలేనంత దూరంలోనో మొబైల్ తీసికెళ్ళి పెడుతుంది వినీల. అయినా సంలేఖ రాజారాం మాట్లాడేవరకు ఫోన్ చేస్తూనే వుంటుంది.

ఇక ఆ బాధ పడలేక ఉదయం పదిగంటల సమయంలో “అత్తయ్యా! మనకు ఇప్పుడు మీ మామగారి పాత సమాధులు, వాటి పక్కన ఒక మూడు సెంట్లు స్థలం తప్ప పంట పండించుకునేంత పొలం లేదు. ఈ వయసులోనే మీరిలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడుపుతుంటే మన నలుగురి కడుపులెలా నిండుతాయి. మీకన్నా పెద్ద వాళ్లు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళొచ్చుగా. పెద్దవారు మీకిలా చెబుతున్నందుకు నాకే బాధగా వుంది. ఇలాంటి ఆలోచనలు ముందుగా మీకే రావాలి” అంది.

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో