జ్ఞాపకం-30 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

‘‘నాకు తెలుసు నాన్నా ! నీ బాధ. ఏం చేద్దాం ? కర్మల్ని తప్పించుకోలేం కదా! నువ్వేంటో నీకు తెలుస్తోంది కాబట్టి దేన్నైనా జీర్ణించుకోటానికి ప్రయత్నించు. అంతర్‌మథనాన్ని తగ్గించుకో… కోడలి సంగతి నీకు తెలియంది ఏముంది ? నిన్నేదో అంటుందని నేను కూడా నోరు చేసుకుంటే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది.’’ అంది. తల్లి మాటల్ని అర్థం చేసుకుంటున్నాడు రాజారాం. ‘‘నిన్ను గాజు బొమ్మలా చూసుకోవసిన సమయం ఇది. కానీ అందరూ ఒకేలా వుండరుగా! ప్రేమ, అభిమానం, సేవాగుణం వాటంతట అవి రావాలిగాని […]

Read more

జ్ఞాపకం-29 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఒక్క క్షణం బాధగా చూసి కళ్లు మూసుకున్నాడు రాజారాం. అతనికి హైదరాబాద్‌ హాస్పిటల్లో ఆపరేషన్‌ జరిగాక ఏం జరిగిందో గుర్తొస్తోంది. రాత్రీ, పగలు నొప్పుతో పక్క కుదిరేది కాదు. రాత్రంతా తనకి ఐదుసార్లు పాన్‌ పట్టాల్సి వచ్చేది. మోషన్‌ వచ్చినట్లే అన్పించి వచ్చేది కాదు. ఇటు తిరిగి పడుకుంటే అటు తిరిగి పడుకోవాని, అటు తిరిగి పడుకుంటే ఇటు తిరిగి పడుకోవాని అన్పించేది. శరీరంలో గ్రిప్‌ లేక తనంతటి తను తిరగలేక పోయేవాడు. వార్డ్‌ బాయ్‌ని పిలిస్తే విసుక్కునేవాడు. వినీలను పిలిస్తే నిద్ర నటిస్తూ […]

Read more

జ్ఞాపకం-28 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

సంలేఖను పిలిచి జయంత్‌ గురించి చెప్పి, ‘‘నువ్వెలా చెబితే అలా చెయ్యాలనుకుంటున్నామమ్మా !  పెళ్లి విషయంలో మా బలవంతం ఎప్పుడూ వుండదు. ఏది జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది’’ అన్నారు. కుటుంబ సభ్యులంతా  అక్కడే వున్నారు. సంలేఖ తండ్రి వైపు చూసి ‘‘నాన్నా ! నాకు కొంతకాలం  ఉద్యోగం చేసి మిమ్మల్ని చూసుకోవాలని వుంది. ఇప్పుడే పెళ్లి వద్దు’’ అంది. వాళ్లు సంలేఖ మాటల్ని అర్థం చేసుకొని ‘మమ్మల్ని చూసుకోవటానికి అన్నయ్యలున్నారు కదమ్మా !’. అని అనలేక ‘‘ఆలోచించు సంలేఖా ! ఇలాంటి […]

Read more

జ్ఞాపకం-27 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అయినా ధైర్యం చేసి రాజారాంకి ‘స్పైనల్‌కార్డ్‌ సర్జరీ’ చేయించారు. హాస్పిటల్లో నెల రోజు వున్నారు. ఆ నెల  రోజు బెడ్‌మీద వున్న రాజారాం నరకం అంటే ఎలా వుంటుందో చవి చూశాడు. రాజారాంని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్‌ నుండి ఆదిలాపురి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక అతన్ని గదిలో వుంచకుండా అతని పడకను హాల్లోకి మార్చారు. అలా అయితేనే అతను అందరికి కన్పిస్తాడు. అందరూ అతనికి అందుబాటులో వుంటారు. ఏదైనా అవసరమై పిలిచినప్పుడు ఎవరో ఒకరు వస్తారు. అతన్ని లేపడం, పడుకోబెట్టడం లాంటివి […]

Read more

జ్ఞాపకం-25 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఆ యువకుడు దిలీప్‌ చేయిన తొలగించి ‘‘పెద్దది చెయ్యటానికి ఇదేమైన రాజకీయమా దిలీప్‌ అన్నా ! మేమేదో చూడలేక మాట్లాడుతున్నాం. చూసిపోవటానికి వచ్చిన వాళ్లం. నువ్వు కూడా మాలాగే వచ్చావ్‌ ! నువ్వు దీన్ని పేపర్లో రాయకు. ఒక వేళ రాస్తే డబ్బు కోసం వైద్యం చేయించని నీచులున్నారని అందరికి తెలిసేలా రాయి. ధైర్యంగా రాయి. అప్పుడు మేం నిన్ను చూసి గర్వపడతాం. అంతే కాని శవ రాజకీయాలు  చెయ్యొద్దు. ఇక్కడ జరుగుతున్నది అదే!’’ అన్నాడు. అతను బాగా ఉడికిపోతున్నాడు. దిలీప్‌ వూపిరి తీసివదిలే […]

Read more

జ్ఞాపకం-24 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

‘‘మాకు తెలుసు మీరు ఆ ఉద్దేశ్యంతోనే వున్నారని. అందుకే మేం కల్పించుకోవసి వచ్చింది. వినీల  దగ్గర డబ్బుల్లేవు.’’ అంది వాళ్లలోంచి ఒక నడివయసు స్త్రీ ముందుకి వచ్చి. షాక్‌ తిన్నది సంలేఖ. వదిన దగ్గర డబ్బుల్లేవా ! ఇదేం మిస్టరీ ? అన్నయ్య జీతం డబ్బుల్లో వదిన పొరపాటున కూడా ఇంటి ఖర్చుకి, పొలం  ఖర్చుకి కనీసం వాళ్లిద్దరి తిండికి కూడా ఇవ్వదు. తనకి గాని, తిలక్‌ అన్నయ్యకి గాని ఒక్క రూపాయి ఇవ్వదు. అవన్నీ తండ్రే చూస్తుంటాడు. నిజానికి ఇప్పుడు హాస్పిటల్‌ ఖర్చుకూడా […]

Read more

జ్ఞాపకం-23 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

‘‘ఎక్కడున్నాయి ఆత్మలు ? వాటి గురించి రాసిన గ్రంథాలేమైనా గ్రంథాయాల్లో భధ్రపరిచి వున్నారా? వుంటే ఎవరా రాసిన వైద్యులు ? మానసిక శాస్త్ర వేత్తలు ? లేక భూత వైద్యులు …’’ అంది వ్యంగ్యంగా వినీల. ‘‘దీని గురించి వాదించటం నాకు ఇష్టం లేదు వినీలా ! ఎందుకంటే ఈ మధ్యన బాగా చదువుకున్న వాళ్లు, ఉన్నత హోదాల్లో వున్న వాళ్లూ, హితబోధలు  చేస్తున్న వాళ్లు కూడా కొందరు తమ తల్లి దండ్రుల్ని బ్రతికి వుండగానే ప్రేమగా చూస్తున్నారు. వారి మరణానంతరం వేల  రూపాయు […]

Read more

జ్ఞాపకం-18 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

డబ్బుంటే ఎక్కడైనా ఇల్లు కట్టించేవాళ్లని, పొలాలు కొనే వాళ్లని, పిల్లలకి లగ్జరీలైఫ్‌ని అలవాటు చేసేవాళ్లని, ఇంకా కావాలంటే ఖరీదైన డ్రిoక్‌ తాగి, విపరీతంగా తినేవాళ్లని చూస్తున్నాం. అసలు ఎక్కడ చూసినా వాళ్లే కన్పిస్తున్నారు. వంద ఎకరాలు సంపాయించి చనిపోయిన రైతు శవాలను కూడా వూరికి దూరంగా వుండే శ్మశానంలో వేసి వస్తున్నారు. వాటి మీద గుర్తుగా ఓ చిన్నరాయిని మాత్రమే పెట్టి వస్తుంటారు. కొంతమందినైతే ఎక్కడ వేసి వస్తారో కూడా తెలియదు. స్మశానంలో స్థలంలేక వేసిన చోటే వేస్తున్నారు. అదేం అంటే అలా ప్రతి […]

Read more

జ్ఞాపకం-16 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కళ్లు పెద్దవి చేసి ‘‘నాన్న వల్లనా ?’’ అంది. ‘‘అవును ! నాన్న వల్లనే  !’’ ‘‘నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా తోస్తోందా ? అన్నయ్య యాక్సిడెంట్‌ వార్త విని నీకు నిజంగానే మతిపోయింది. నువ్వింకేం మాట్లాడకు’’ అంటూ కసురుకుంది. [spacer height=”20px”]తిలక్‌ గట్టిగా తలకేసి కొట్టుకొని ‘‘నా కర్మ అనాలో, నా జాతకం అనాలో నేను నిజం చెప్పినా నమ్మరేంటే మీరు? ఇలాంటివి కూడా అబద్దం చెబుతానా ! సరేలే ! ఏం చేద్దాం ! […]

Read more

జ్ఞాపకం-15 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

          ఏదైనా స్నేహితునితోనే కదా చెప్పుకోవాలి అన్నట్లు తన మనసులో మాటను జయంత్‌తో చెప్పుకుంటున్నాడు దిలీప్‌.ఆలోచిస్తున్నాడు జయంత్‌.మళ్లీ మాట్లాడటం మొదలు   పెట్టి ‘‘చిన్న చిన్న ఘర్షణలు  సహజమే అయినా విపరీతంగా గుచ్చుకుంటాయి జయంత్‌ ! అలాంటి సందర్భాలు లేనప్పుడు ఎంత ఆనందంగా వుంటుందో మాటలతో చెప్పలేం ! ఎప్పటికీ ఆ ఆనందమే కావాలనుకోవటం కూడా సబబు కాదేమో ! ఎందుకంటే జీవితం కూడా ముఖ్యం కదా ! జీవితం అన్ని వేళలా ఆనందాన్ని ఇస్తుందని ఎందుకు అనుకోవాలి […]

Read more
1 2 3