డాలర్ కలలు
కూలిపోతున్నాయి
అడుగులన్నీ
ఇప్పుడు నెల మీదనే
***
ఊరు
వృద్ధాశ్రమం అయ్యింది
అక్కడంతా
డాలర్ల పంటే !
****
మానేరు
ఎండిపోయి ఉండొచ్చు
ప్రవాహమంతా
కవుల కవిత్వంలో …
***
భాష
మనిషికి పహె చాన్
అదే కదా
కదిలించి చూడు
మహా సముద్రం
***
సూర్యుని కౌగిట్లో
తామరలు బందీ
రేపే
ఇక విముక్తి
***
– వడ్డేపల్లి సంధ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~