జ్ఞాపకం-30 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

Anguluri Anjani devi

‘‘నాకు తెలుసు నాన్నా ! నీ బాధ. ఏం చేద్దాం ? కర్మల్ని తప్పించుకోలేం కదా! నువ్వేంటో నీకు తెలుస్తోంది కాబట్టి దేన్నైనా జీర్ణించుకోటానికి ప్రయత్నించు. అంతర్‌మథనాన్ని తగ్గించుకో… కోడలి సంగతి నీకు తెలియంది ఏముంది ? నిన్నేదో అంటుందని నేను కూడా నోరు చేసుకుంటే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది.’’ అంది.

తల్లి మాటల్ని అర్థం చేసుకుంటున్నాడు రాజారాం.

‘‘నిన్ను గాజు బొమ్మలా చూసుకోవసిన సమయం ఇది. కానీ అందరూ ఒకేలా వుండరుగా! ప్రేమ, అభిమానం, సేవాగుణం

వాటంతట అవి రావాలిగాని అధికారంతోనో, బవంతంగా లాక్కుంటేనో వచ్చేవి కావు.’’ అంది.

అంతలో తిలక్‌ వచ్చాడు. తల్లి అన్నయ్యతో ప్రేమగా మాట్లాడడం చూసి భరించలేకపోయాడు. అక్కడే నిబడ్డాడు. రాజారాం

తమ్ముడిని చూసి సంతోషపడ్డాడు.

‘‘రా తిలక్‌! వదిన ఏదో అన్నదనేగా నిన్నటి నుండి నువ్వు ఇంటికి రానిది. కానీ మీ వదిన పిచ్చిదిరా ! దాని మాటలు

పట్టించుకోకు… నేను చూడు తనేం చేసినా, తనేం మాట్లాడినా ఫీలవుతున్నానా ?’’ అని సర్థిచెప్పబోయాడు.

తిలక్‌ రాజారాంని కాళ్ల నుండి తల వరకు వంకరగా చూసి, ఎగతాళిగా నవ్వి ‘‘నువ్వు ఫీలయి ఏం చెయ్యగవు. నేను ఫీలయి ఒక

రోజంతా బయట వుండి వచ్చాను. రేపటి నుండి అసలు ఇంట్లోనే వుండను. పని చూసుకున్నాను.’’ అన్నాడు.

‘‘పనా ? ఏం పని ?’’ అడిగాడు రాజారాం. తల్లి ముఖంలో కూడా అదే ప్రశ్న.

‘‘గనుల్లో పని…’’

‘‘అంటే ! మట్టి తట్టలు మోస్తావా ? ఇప్పుడు నువ్వు డిగ్రీ చేస్తున్నావురా ! ఇంకొద్ది రోజులు కష్టపడి చదివావంటే డిగ్రీ చేతికి

వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది.’’ అన్నాడు రాజారాం ఎమోషనల్‌గా.

‘’నాకు తెలిసి డిగ్రీలే కాదు. ఎం.ఏ లు చేసినవాళ్లు కూడా ఆటోలు నడుపుతున్నారు. నేను మట్టి తట్టలు మొయ్యటానికే సిద్ధపడి

వెళ్తున్నాను. మీరు ఆపినా నేను ఆగను. నాకు తిండి కావాలి. తింటున్న ప్రతిసారి ఈ ఇంట్లో ఎవరేం అంటారో తెలియడం లేదు.

తెలిసి తెలిసి భరించటానికి నేను నీలాగా కుంటి వాడినో గుడ్డి వాడినో కాదు.’’ అన్నాడు రాత్రి వినీల మాటల్ని గుర్తు

చేసుకుంటూ.

ఆ మాటలు రాజారాంకి చెళ్లున తగిలాయి.

‘‘నిన్నెవరంటారు తిలక్‌ ! ఆ పని వద్దురా ! ఇంకేదైనా చూసుకో !’’ అంది బాధగా సులోచనమ్మ.

అటు వైపు వెళ్తున్న వినీల ఆ మాటలు విని ఆగింది ‘‘అది కాకుండా ఇంకే పని దొరకాలన్నా అంత సులభం కాదు అత్తయ్యా !

వెళ్లనివ్వండి! మీక్కూడా పని దొరకగానే డబ్బు పంపిస్తాడు. ఇంట్లో అందరం ఖాళీగానే వున్నాం !’’ అంది.

రాజారాం భార్యవైపు కోపంగా చూశాడు. అక్కడ నిబడకుండా ఆమె వెళ్లిపోయింది.

‘‘నువ్వెళ్తే నాకు ఇబ్బంది అవుతుంది తిలక్‌ ! నేను నడిచే వరకు కాస్త ఓపిక పట్టు. ఆ పని ఎక్కడికీ పోదు. ఎప్పుడైనా

దొరుకుతుంది.’’ అన్నాడు రాజారాం.

‘‘నువ్వు స్వార్థ పరుడివి అన్నయ్యా ! ఎప్పుడూ నీ గురించే ఆలోచించుకుంటావు. నేను కూడా నీలాగే ఆలోచిస్తానని ఎందుకు

అనుకోవు. నాక్కూడా నీలాగే సౌకర్యంగా వుండాని వుంది. అలా వుండడం కోసమే నా కంటూ ఓ పని చూసుకున్నాను.’’

అన్నాడు. అతని మాటల్లో సెంటిమెంట్స్‌ లేవు. మొహమాటాలు లేవు.

‘‘అన్నయ్య కన్నా ఆ పని ముఖ్యమారా నీకు ?’’ అంది సులోచనమ్మ తిలక్‌ వున్న వైపు తిరిగి కోపంగా.

వినీల తిరిగి వచ్చి అత్తయ్య మాటలు విని ‘‘ఏంటో మీకసలు బొత్తిగా డబ్బు విలువ తెలియడం లేదు. తిలక్‌ని పనికెళ్లనివ్వరు.

సంలేఖకు పెళ్లి చెయ్యరు. అసలు సంలేఖకు పెళ్లయి వెళ్లిపోతేనే మనకి మంచి రోజులొస్తాయట. మనకి పంటలు కూడా బాగా

పండుతాయట. మొన్న మా ఊరి వాళ్లు అంటుంటే విన్నాను. ఎదిగిన ఆడపిల్ల ను ఎక్కువ రోజు ఇంట్లో వుంచుకోకూడదట…’’ అంది.

అప్పుడే గదిలోంచి బయటకొచ్చిన సంలేఖ అమాటలు విని షాక్‌ తిన్నది.

సులోచనమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజారాం బిత్తరపోయాడు.

ఆ షాక్‌లోంచి వాళ్లు తేరుకునే లోపలే తిలక్ బ్యాగ్‌లో కొన్ని డ్రస్‌ లు పెట్టుకొన్నాడు. అప్పుడే పొలం నుండి వచ్చిన తండ్రితో తను

వెళ్తున్నట్లు చెప్పాడు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.