మెసేజీ యుగం (కవిత ) -డా.కె.గీత

మా ఇంటి పనమ్మాయికి కాళ్ళూ, చేతులూ ఉండవు
గుండ్రంగా తిరుగుతూ
నేల మీది దుమ్మూ ధూళీ కడుపులో నింపేసుకుంటుంది
మా ఇంట బట్టలుతికే వాడికీ కాళ్ళూ, చేతులూ లేవు
కడుపునే చుట్ట చుట్టి అశుభ్రతని పీల్చేస్తాడు
అయినా వాటికి మెదడు చెడిందంటే
ప్రోగ్రాములో తేడా వచ్చినట్టే
డబ్బు ఎదురిచ్చి మరీ నమస్కారం పెట్టాల్సిందే
కంప్యూటరు యుగంలో ఉన్నాం మరి-
కంప్యూటరు యుగంలో చేతి వేళ్లు రాతని మర్చిపోయాయి
అందమైన ఉత్తరాల్ని క్షణంలో చెవినచేరే మాటలు మింగేసేయి
ఇంట్లో సరుకుల కంటే ఇంటర్నెట్టు ప్రధానమైన చోట
మెసేజీలు పలకరింపుల్నీ హరించేసేయి
ఎవరి గదుల్లో నించైనా పక్కవారి
గోడమీది కెగబ్రాకనిచ్చే ఫేసుబుక్కు
నిమిషానికో క్లిక్కుకు ఉచితంగా రాలే లైకులతో వచ్చే కిక్కు
కంప్యూటరు యుగంలో
ఇంట్లో ఉన్నది నులుగురు మనుషులం కాదు
నాలుగు యంత్రాలం
మేడ మీంచి కిందికి
గది లోంచి గదికి
ప్రేమైక పిలుపుల గొంతుల్ని
మెసేజీల దారాలతో కుట్టేసుకున్నాం మేం
రోజుల తరబడి ముసుగు తన్నిన మా
సంభాషణలన్నీ
మా యంత్ర ప్రపంచాలలో
ఎక్కడో చాట్ విండోలలో దొర్లుతూ ఉంటాయి
ఇప్పుడు
పుట్టినరోజులంటే కేకు బొమ్మలు ఇచ్చిపుచ్చుకోవడం
ఇప్పుడు
పండగలంటే ఫోటోలు సోషల్ నెట్ వర్కు లో ప్రదర్శించుకోవడం
అబ్బాయికి ఆండ్రాయిడ్ ఫోను,
అమ్మాయికి ఐ ఫోను
చంటి దానికి ఐపాడు
చంటాడికో టాబ్లెట్టు
యంత్ర యుగంలో
కూత వేటు దూరమైనా
మీట వేటు దూరంలో
మనందరి మధ్యా నిశ్శబ్దంగా
ప్రవహిస్తున్న శబ్దం
చందమామని యూట్యూబులోనూ
అమ్మమ్మ ఇంటిని గూగుల్లోనూ వెతుక్కుంటున్న వాళ్లం
సెల్ ఫోన్లు శ్వాస గానూ
ఇంటర్నెట్టు ఊపిరిగానూ
బతుకుతున్న వాళ్లం
ఇంటి హీటరు
గరాజు తలుపులు పాక్షికంగానూ
మానవమాత్రులం పరిపూర్తి గానూ
కంప్యూటర్లయిపోయిన వేళ
అత్యాధునిక వాక్యూం క్లీనరు, వాషిం మెషీన్లకే కాదు
మనుషులకూ
చేతులూ, కాళ్లూ లేవు
ఆకలీ, నిద్రా
స్పర్శా, జ్ఞాపకమూ
అనుభూతులూ
ఆత్మీయతలూ
హృదయం ఇంకిపోయిన దిగుడు బావులయ్యేయి
మాటలు పూడుకుపోయిన మెసేజీలయ్యేయి

– డా కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

2 Responses to మెసేజీ యుగం (కవిత ) -డా.కె.గీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో