దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల గురించి తెలుసు కుందాం .

1-కోరియాదేశ ప్రధమ మహిళా న్యాయ మూర్తి – తాయ్ య౦గ్ లీ

ఇప్పుడు నార్త్ కొరియా గా పిలువబడుతున్న సౌత్ కొరియా దేశం లో తాయ్ యంగ్ లీ 1914 లో జన్మించింది .దక్షిణ కొరియాలో 1946 లో సియోల్ నేషనల్ యూని వర్సిటి లో చేరిన మొట్టమొదటి మహిళగా చరిత్ర కెక్కింది .కొరియన్ నేషనల్ జుడీషియల్ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలై రికార్డ్ సృష్టించింది .తర్వాత ఆ దేశ తొలి మహిళా న్యాయమూర్తి గా ,మొదటి న్యాయ సలహా కేంద్రం ఏర్పరచి ప్రసిద్ధి కెక్కింది .ఆ దేశ జాతీయ న్యాయ చట్టాలను సంస్కరించి ,ముఖ్యంగా మహిళలకు అందునా వివాహితులైన స్త్రీలకు అండగా నిలిచింది లీ.కొరియా స్త్రీలు స్వశక్తితో తమకాళ్ళ పై తాము నిలబడేట్లు చేసిన సాహసి తాయ్ యంగ్ లీ.

2-పాప్ సంగీతం తో కీర్తి శిఖరారోహణం చేసిన –సి .ఎల్ .

పాప్ సంగీత గాయనిగా ఆకర్షణీయ ముఖ వర్చస్సుతో అఖండ కీర్తి సాధించిన లీ చేరిన్ అందరికి సి ఎల్ గా పరిచితురాలు .అద్భుతమైన శైలీ విన్యాసంతో అకుంఠిత ఆత్మ విశ్వాసం తో అందరి హృదయాలను గెలిచి సంగీత సామ్రాజ్ని అని పించుకున్నది . పాత లాగుడు, పీకుడు సంగీతాన్ని ఊడ్చి అవతలపారేసి శక్తివంతమైన సంగీతం తో అలరించింది .తన సంగీత గీతాలలో అజేయమైన మహిళా శక్తికి ,వారి ఆత్మ విశ్వాసానికి ,స్వేచ్ఛ కు జేజేలు పలికించింది .టైం మేగజైన్ ప్రకటించిన వంద మంది ప్రతిభా సంపన్నుల జాబితాలో సి ఎల్ పేరు చోటు చేసుకున్నది అంటే ఆమె సంగీత విద్వత్తు ఎంతటిదో తెలుస్తుంది .

3-మొదటి మహిళా పైలట్ –కుంగ్ వాన్ పార్క్

1901 లో డేగన్ లో జన్మించిన కుంగ్ వాన్ పార్క్ దక్షిణ కొరియా ప్రధమ సివిలియన్ మహిళా పైలట్ గా గుర్తింపు పొందింది .ఫీజు కట్టటానికి డబ్బు కోసం నర్స్ గా పని చేసి తర్వాత 1925 లో జపాన్ చేరి,పైలట్ కావాలన్న తన చిరకాల కోరిక ను ఆచరణ లో పెట్టటానికి సంసిద్ధు రాలైంది .రెండేళ్ళ తర్వాత ఏవియేషన్ స్కూల్ లో చదివి గ్రాడ్యు యేట్ అయింది .మరుసటి ఏడాది సెకండ్ క్లాస్ పైలట్ లైసెన్స్ సాధించింది .

1933 లో పార్క్ సాల్మ్స్ సన్ 2 A 2అని పిలువబడిన ‘’బ్లూ స్వాలో ‘’ విమానం లో జపాన్ మంచు వాన్ లమధ్య నడిపే ప్రయత్నం చేసింది .దురదృష్ట వశాత్తు ఆ విమానం నేలమీదనుంచి పైకేగిరిన కొద్ది కాలం లోనే కూలి పోయి 32 ఏళ్ళ యువ పైలట్ కుంగ్ వాన్ పార్క్ ను బలి తీసుకున్నది .

4-స్కేటింగ్ లో తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళ-యూనా కిమ్

‘’క్వీన్ యూనా ‘’గా అందరి చేత పిలువబడే యూనా కిమ్ ఒలింపిక్ పోటీలలో స్కేటింగ్ లో పతకం సాధించిన తొలి మహిళ.ప్రపంచ చాంపియన్ గా ,ఫోర్ కాంటి నెన్ట్స్ చాంపియన్ షిప్ ,గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్ సాధించిన వీర వనితగా ప్రసిద్ధురాలు .దక్షిణ కొరియా ప్రజల స్వీట్ హార్ట్ అని పిలువబడే యూనా కిమ్ ను 2010 టైం మేగజైన్ ప్రపంచ ప్రసిద్ధ ప్రభావవంతమైన మహిళగా ప్రకటించింది .

క్రీడా కారిణి గా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నదో కిమ్,దాన ధర్మాలతోనూ అంతే పేరు ప్రఖ్యాతులు పొందింది .2010 లో యునిసెఫ్ సౌహార్ద యాత్రా ప్రతినిధిగా ఎంపికైంది .అప్పటి నుంచి ప్రపంచం లో ఎక్కడ ఎవరికి ఏ ఆపదా ,అవసరం వచ్చినా ఆమె సహాయ పడేది.హైతి ,జపాన్ లలో పునరావాస కార్యక్రమాలకు కిమ్ చూపిన చొరవ, సేవ చిరస్మరణీయం .ఫిలిప్పీన్స్ లో తుఫాను బాధితుల సహాయార్ధం యూనా కిమ్ ఒక లక్ష డాలర్ల ఆర్ధిక సహాయం చేసి ఆదుకుని తన వితరణను చాటింది .

5-మొదటి అంతరిక్ష యాత్రికురాలు – సోయియాన్ యీ

చిన్నతనం లోనే సోయియాన్ యీ కి సైన్స్ అంటే పిచ్చ అభిమానమేర్పడింది .ఆ కుటుంబం లోమిడిల్ స్కూల్ చదువు దాటి ముందుకు వెళ్ళిన మొట్టమొదటి బాలిక గా పేరు పొందింది .36 వేలమంది అభ్యర్ధులలో 20 08 లో ఎంపిక కాబడిన మొట్టమొదటి మహిళా అంతరిక్ష యాత్రికు రాలుగా చరిత్ర కెక్కింది .అప్పటికి ఆమె వయసు 30 లోపు మాత్రమే.

మగాళ్ళు మాత్రమే అన్నిటా ముందు ఉన్నకాలం లో ఒక మహిళా పైలట్ గా గొప్ప కీర్తి సాధించి ,తన అనుభవాలను నిర్మొహమాటం గా తెలియ బరచిన స్త్రీ యీ .తన అనుభవాలతో వేలాది బాలికలను స్త్రీలను ప్రభావితం చేసి అంతరిక్ష యాత్రలో వారికి అభిరుచి ,అభినివేశం కలిగేట్లు చేయగలిగింది .ఇప్పుడు సియాటిల్ లో ఉంటున్న సోయియాన్ యీ 2015 సీక్రెట్ స్పేస్ ఎస్కేప్స్ అనే అమెరికన్ డాక్యుమెంటరి సిరీస్ లో పని చేస్తోంది .

– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , Permalink

One Response to దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో