జోగిని(ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                                  ఏమనుకున్నారో గానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఆమె ప్రేమించిన అబ్బాయిని అతని తల్లిదండ్రుల్ని పిలిపించారు. కన్న కూతురిని వ్యభిచారిగా మార్చాలనుకుంటే జైల్లో పడేస్తామని హెచ్చరించారు. ఆ అమ్మాయి ముస్లింగా మారితే తమ కోడలిగా చేసుకోవడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు సలీమ్‌ తండ్రి జబ్బార్‌. 

” 18 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే మేమే దగ్గరుండి చేసే వాళ్ళం. కానీ వీళ్ళు మైనర్లు కాబట్టి  గుడిలో ఎక్కడైనా పెళ్ళి చేసుకుని ఫోటోలు తీయించుకోండి. అసలు ఇద్దరి మనసులూ ఒకటిగా కలిశాయి కాబట్టి  మీకు పెళ్ళయిపోయినట్టే గుడిలో పెళ్ళైనా, పోలీసు స్టేషన్‌లో పెళ్ళైనా మీకు సాక్ష్యం కోసమే మీరిద్దరూ సవ్యంగా, సక్రమంగా కాపురం చేసుకుంటుంటే ఏ సాక్ష్యమైనా ఎందుకు? ఆ అవసరం ఏం వస్తుంది. అలాగని  పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయనీ, మనుషులూ మమతలూ, ఒకేలా ఉంటాయని అనుకోలేం. అవసర పరిస్థితుల్లో పెళ్ళయినట్లు రుజువులు అడుగుతూ ఉంటారు . కాబట్టి  పెళ్ళి చేసేస్కోండి. అయితే మైనర్లయిన మీ పెళ్ళి చట్టప్రకారం చెల్లదు.” అని చెప్పి మీ పెళ్ళి ఫోటోలు  నాకు పంపడం మాత్రం మరచిపోకండి అని చెప్పి సలీమ్‌ వైపు చూస్తూ ‘జాగ్రత్త’ అంది ఒత్తి పలుకుతూ. ఆ పిల్లకేమైనా అయిందో చూస్కో… అన్న హెచ్చరింపు ధ్వనించిందా మాటలో.

మహిళలపై ఎన్ని అఘయిత్యాలు…? ఎన్ని రకాల అత్యాచారాలు? అదే దళిత మహిళ అయితే… మరింత దోపిడీ…
మొన్న మహిళా సంఘం మీటింగు లో చెప్పినట్లు మన రాష్ట్రంలోనే కాదు. ఎక్కడికి వెళ్ళినా పై కులాల చేతుల్లో కింద కులాల వాళ్ళు నలిగిపోతున్నారు. గ్రామంలో వర్గ విభేదాలలో వీళ్ళనే పావులుగా వాడుకుంటున్నారు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళపై జరిగే అన్యాయాలకీ, అత్యాచారాలకీ, అఘాయిత్యాలకీ, అవమానాలకీ అంతం లేకుండా పోయింది. రోజు రోజుకీ డబ్బున్నవాళ్ళు, లేనివాళ్ళ మధ్య అంతరం పెరిగిపోతోంది. కానీ ప్రజలను విద్యావంతులను చేయడానికి పై కులాలవాళ్ళు, డబ్బున్నవాళ్ళు పూనుకోవడం లేదు. కూలీలుగా పుట్టి  కూలీలుగానే జీవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకుండా ఉండడం కోసం, తమ అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడం కోసం వారిని తీర్చలేనంత అప్పుల్లో ముంచడం, వారి మహిళలను లైంగికంగా వేధించడం, దోపిడీకి గురిచేయడం జరుగుతోంది. అంతే కాకుండా పేదలకు సహాయం చేస్తున్నట్లు నమ్మ బలుకుతూ, వారికి అవసరమైనప్పుడు వారికి ఉన్న ఇంత మడి చెక్కనో, బర్రెదుడ్డెనో అడ్డం వేస్కోని పైసలివ్వడం లేదంటే అప్పు తీరేవరకు వారి పిల్లల్ని పనిలో  ఉంచుకోవడం సర్వసాధారణం.

అయితే ఇందులో ఉన్న కిటుకు నా వాళ్ళకి అర్థం కావడంలేదు. ఆపద మొక్కుల వాడిలాగ ఆదుకున్నాడు. అవసర సమయాలలో అని పొగుడుతారు తప్ప మాకున్న కొద్దిపాటి  ఆస్తినో, పిల్లల్నో అడ్డం వేసుకుని వడ్డీతో అప్పు ఇవ్వడానికి ఆ షావుకారో, దోరో, పటేల్‌ ఎంతగా తిప్పుకున్నాడో, అతనింటి చుట్టూ తిరగడానికి తాను ఎంత కష్టపడాల్సి వచ్చిందో మరచిపోతాడు. పై వాళ్ళ ఆలోచనంతా పేదవాళ్ళనీ, కులం తక్కువ వాళ్ళనీ, స్త్రీలనీ తమ అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవాలనీ వారిలో తెలివితేటలు, ఆలోచనా పెరగకుండా తమ ఆధీనంలో, తమపై ఎప్పుడూ ఆధారపడి ఉండాలనే ఆశిస్తారు తప్ప వాళ్ళపై జాలితోనో, మానవతా హృదయంతోనో, స్పందించో కానీ వారికి అప్పులివ్వడం లేదని లోకాన్ని చూస్తోంటే ఇప్పటికి  గానీ తెలియలేదు. ఈ పరిస్థితులిలా కొనసాగాల్సిందేనా…? ఎన్నాళ్ళు ఈ దొరతనంలో, అగ్రకులాల ఆధిపత్యంలో మగ్గాలి ? నాకున్న పరిధిలో నా మండల ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతులుగా మార్చాలి అని కొన్నాళ్ళుగా ఆలోచిస్తున్న పోశవ్వకి డ్వాక్రా గ్రూపులు గుర్తొచ్చాయి. గ్రూపులో చేరి సభ్యులు పొదుపు చేస్తున్నారు.

ఆ పొదుపు వల్ల, మదుపు వల్ల ఉన్న ఉపయోగాల్ని ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్నారు. ఈ మహిళా గ్రూపుల్లో వార్ని గనక చైతన్యవంతం చేస్తే… వారిలో కొత్త ఆలోచనలు నింపగలిగితే వారికి అక్షరజ్ఞానంతో పాటు కలిసికట్టుగా నడిపించగలిగితే సంఘిటితం కావడం లోని బలం రుచి చూపిస్తే…. అగ్రవర్ణాల, వర్గాల దోపిడి నుండి, దాస్యం నుండి విముక్తి కోసం తమకు తామే కృషి చేస్తారు. కదా… దళిత సంఘం, మహిళా సంఘం కార్యక్రమాల్ని తన మండలంలో ప్రతి గ్రామానికి విస్తరింపజేయాలి. వాటిలో ప్రజలు పాల్గొనేలాగ చూడాలి. నిన్న లక్ష్మాపురంలో జరిగిన సంఘటన నన్ను ఇప్పటికి  కలచివేస్తోంది. గుండె బరువెక్కుతోంది.

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో