కంటి చెమ్మ …(కవిత) – సుజాత తిమ్మన

ఎప్పుడూ అది కావాలి…ఇది కావాలి
అని అడుగుతూ ఉండేదానివే….కదా తల్లీ
అడిగినదే తడవు గా సాధ్యమయినంత వరకు
నీకు అన్నీ ఇచ్చాను రా బంగారు
ఇప్పుడు నన్నే అడుగు తుంటే
నన్ను నేనెలా ఇవ్వను రా పిచ్చి తల్లి
అప్పగింతల వేళ ఆవేదనే అయినా
ఇది ఆనంద సమయమే ప్రతీ తల్లితండ్రులకు
దూరమయినా  దగ్గరితనంలోని మమకారం 
కూతురి కాపురం కోసమే కలవరంరా అమ్మడు
గుండెల మీద పారాడిన నీ పసితనం
గూడుకట్టుకుందమ్మా ఎద లోగిలిలో
నేను గుఱ్ఱం అయి..నిన్ను స్వారి చేయిస్తాను
గుజ్జన గుళ్ళు ..అష్టా చెమ్మలు ఆడుకుంటూ
ఆగూటిలో…నేను నీతోనే ఉంటానురానాన్నా..!

యుగ యుగాలకు తండ్రి కూతుళ్ళ అనుభందం
నిత్య నూతనమే  ఆ అనురాగానికి అవధులు లేవు..
అరమరికలు ఎన్నడూ కానరావు
అదే..నాన్నప్రేమ..కూతురిలో దాగిన కంటి చెమ్మ !!

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

3 Responses to కంటి చెమ్మ …(కవిత) – సుజాత తిమ్మన

 1. సుజాత తిమ్మన says:

  అమ్మలో నాన్న…నాన్నలో అమ్మ ఎప్పుడు ఉంటారు…(అనుకుంటాను..) మనసు అటువంటిది..కన్న ప్రేమ అటువంటిది…ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు..

  • దడాల వెంకటేశ్వరరావు says:

   అమ్మలో నాన్న, నాన్నలో అమ్మ ఉన్నారనుకున్నా కూడా అమ్మ ప్రేమే గొప్పది. నాన్న కంటే అమ్మే కూతుర్ని ప్రేమగా చూస్తుంది. నాన్నకు కూతురిమీదుండే ప్రేమను కూడా అమ్మ ఒక్కతే పూర్తిగా తెలుసుకోగలుగుతుంది. అప్పుడు మీరన్నదే సరిఅవుతుంది. అమ్మ మనసు ప్రేమ అటువంటిది మరి. మీ మంచి జవాబుకు ధన్యవాదాలు.

 2. దడాల వెంకటేశ్వరరావు says:

  ‘నాన్న ప్రేమ’ నాన్నే వ్రాస్తే బాగుంటుంది అనుకుంటాను