చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే – జ్వలిత

చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేకు హృదయ పూర్వక నమస్కారములతో , నేను రాసే ఈ అక్షరాలు నీవు పెట్టిన భిక్షే తల్లీ….

మనువు చెప్పినవన్నీ నిజం కాదు. వాటిని ఇప్పుడు పాటించనవసరం లేదు. రండి నిస్సందేహంగా చదువుకోండి,చదువుమీకుఆనందాన్ని,ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది అన్న నీభర్త మహాత్మ పూలే పిలుపునందుకొని విద్యార్జన చేసి నీవందించిన అక్షర భిక్ష అందుకున్న వాళ్లమే నేటి మహిళలందరం. మేమంతా చైతన్యశీలురమై కార్యసాధనకు నిలబడాలనే ప్రయత్నంలో ఉన్నాం. కానీ తల్లీ విద్య అంటేఅక్షరజ్ఞానమనేఅపోహలోకొందరుమహిళలున్నారు. పురుషస్వామ్య రాజకీయ వ్యూహాల్లో వారు పావుగా, పరికరాలుగా మారకుండా కాపాడుకోవలిసిన బాధ్యత కూడా మా మీదే ఉన్నదమ్మా.

              మహిళ ఐక్యత పురుషుల ఓటమిగా భావించే సమాజంలో మేము జీవిస్తూన్నమమ్మా. స్త్రీలు తెలివిగా, సంఘటితంగా మెలగాలి అంటే అందరూ చైతన్యమవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ‘మహిళా విహంగ’ అనే అంతర్జాల పత్రికను పుట్ల హేమలత, ‘భూమిక’ పత్రికను కొండవీటి సత్యవతి, ‘మాతృక’ ను రమాసుందరి నడుపుతున్నారమ్మా.

                మరి కొందరు మహిళలు తాము మాట్లాడినదే చైతన్యశీలమైనదనే అపోహలో వ్యవహరిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతున్నపుడు బడగు, బహుజన వర్గాల స్త్రీలందరిని క్షేత్ర స్థాయిలో కలుపుకు పోవలసిన అవసరం ఉన్నదని వారు గుర్తిస్తే బాగుండు తల్లీ.

             చదువుల తల్లీ! నీవు ఆశించినట్టు రాజకీయాల్లో ప్రవేశానికి సిద్ద పడాల్సి ఉన్నది. చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం రిజర్వేషన్ ద్వారా సాధించేందుకు, జనరల్ కోటాల్లో కూడా మహిళను సిద్దపరచాల్సి ఉన్నది. ప్రస్తుతం విశ్వవిద్యాయాల్లో ఉన్న మేధావుల, ఎన్.జీ.ఓ.ల్లో పని చేసే మహిళలు బహుజన మహిళలకు అవగాహన కలిగిస్తూ ముందుకు పోతున్నారు. కానీ, ఒకరిద్దరు మహిళలను ముందు పెట్టి పురుషస్వామ్య రాజకీయం వాళ్లను చూపించి పబ్బం గడుపుకోవాని ప్రయత్నిస్తున్నది. మంత్ర్లుల భార్యలు, ఎమ్యెల్యేల భార్యలు కుటుంబ వారసత్వంగా వచ్చే రాజకీయ మహిళల గురించి ఇక్కడ ప్రస్తావించనవసరం లేదు. కానీ, పాలక పక్షానికి భజన చేసే మహిళలు కూడా స్త్రీ చైతన్యానికి ఉపయోగపడతారన్నది మేము గుర్తించాలిసి వున్నదమ్మా.

          1919 లో జలియన్వాలా బాగ్ మారణకాండకు కారణమైన ” జనరల్ డయ్యర్ ” ను బ్రిటీష్ ప్రభుత్వం బంగారు ఖడ్గాన్నిచ్చి సత్కరించినట్టే. రోహిత్ మారణానికి కారణమైన వారిని అవార్డులతో సన్మానాలతో పాటు గౌరవిస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల వైపు పోరాటానికి నిలిచిన రచన బోల్లు అనే మహిళా న్యాయవాదిని టార్గెట్ చేస్తూన్నారమ్మా. ఆమె పై మరో మహిళ మంత్రి శ్రీదేవిని ఉసిగొల్పారు. ఆ శ్రీదేవి విచక్షణ లేకుండా నోరు పారేసుకోవడం చూస్తే ఇప్పుడు మీరుంటే బాగుండనిపిస్తున్నదమ్మా. మహిళలపై అత్యాచారాలకు, నేరాలకు మహిళల భాగస్వామ్యం వ్యూహాత్మకంగా పురాణకాలం నుండి నేటి వరకు ఇంకా కొనసాగుతూనే వున్నదమ్మా.

          ఒక భజన సంఘం పాలకులను బాపూ అంటూ వారి మెప్పు కోసం పిచ్చి వేషాలు వేస్తూన్నది. నఛ్చితే బాపు అనవచ్చు. తాత అనవచ్చు. కాని విమర్శించిన పాపానికి చీల్చేస్తాం, తోలు తీస్తాం, అంటూ మొదలు పెట్టి ఉత్తర భారతదేశంలో జరిగే సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగవచ్చు అనే సూచనలను అందిస్తున్నారమ్మా. విశ్వవిద్యాయాల్లోనే కాదు అనేక పాఠశాలలో కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి అక్కడే నియమిస్తున్నారు అధికారులు. అటువంటి పాఠశాల సంఘటనలు ఎన్నో ఉన్నాయి తల్లీ.
కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు ఒక కమిటీ ఉండాలని కోర్టు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మధ్య ఒక సర్వే నివేదిక ప్రకారం మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల్లో 70 శాతం పాఠశాల్లోనే జరుగుతున్నాయని తేల్చారు తల్లీ. ఇప్పటికే రాజ్యహింస అనేక రూపాల్లో చూస్తున్నాం. దాని మరో రూపం చూడాలేమో అని భయం కలుగుతున్నది.

             నీవున్న కాలం వలెనే చాలా మంది పురుషులకు మహిళ భాగస్వామయ్యం రుచించట్లేదమ్మా. మహిళలు వాళ్ల వాస్తవిక వాటా భాగాన్ని ఆక్రమించడాన్ని అడ్డుకోవడానికి అనేక రకాలుగా దిగజారుతున్నారు. ఒక్కొక్క సారి మతాన్ని, కులాన్ని ప్రాంతాన్ని, కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల ముసగులేసుకుని స్త్రీ స్వేచ్చను హరిస్తున్నారమ్మా. పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో 2016 జనవరి 17 న ఉరివేసుకున్న వేముల రోహిత్ తల్లి వేముల రాధికమ్మను రోహిత్ స్తూపం దగ్గర నివాళులు తెలపకుండా అరెష్టు చేశారు. అతని తండ్రిని పోలీసు వాహనంలో తీసుకొచ్చి స్తూపం దగ్గర దింపారు. ఎంత విచిత్రమైన వివక్షను ఆ తల్లి ఎదుర్కొంటున్నదో చూసినవా తల్లీ.

                 నేను ఈ సందర్భంగా చాలా మంది పేర్లు ప్రస్తావిస్తాను అమ్మా. ఉదాహరణకు నేను ఒక బహుజన మహిళగా నా సామాజిక వర్గం సభ్యులను సమీకరిస్తున్న సందర్భంగా ఒక మైనారిటీ నాయకునికి అది నచ్చలేదు. ” మేము మా సామాజిక వర్గాల్లో విలన్ గా మారాము. మీరు మీ కుల సంఘాల్లో హీరోలవుతున్నారు ” అని ఉక్రోషాన్ని వ్యక్త పరిచాడు. అంతేకాదు తల్లీ మా సమూహంలో ఉన్న వామపక్ష రచయితను విడదీయగలిగాడమ్మా. వామపక్ష నాయకులు (పార్టీలు) కూడా అడ్డు పడ్డారు. మీరుకుల సంఘాలు పెట్టుకుని మీ పంచాయితీ మీరే తీర్చుకుంటే మా పార్టీ ఉనికి ఏం కావాలన్నారు. మాలో మాకు తగువు పెట్టారు. కుల సంఘమా, రాజకీయ పార్టీనా తేల్చుకొమ్మని మా సామాజిక వర్గ ప్రజలను బెదిరించారు.

              మరొక నాయకుడు ఒక రచయితగా పాత్రికేయునిగా ఒక రాజకీయ పార్టీని సమర్దిస్తూ వ్యాసాలు రాసి, ఆధిపత్యాలకు అంకితాలిచ్చి ‘బుక్ ఫెయిర్ కి ఛైర్మన్ గా ఎదిగాడు. అతనికి మహిళల భాగస్వామ్యం గిట్టట్లేదమ్మా. మరి ముఖ్యంగా బీసీ మహిళలు అంటే అసలు గిట్టదమ్మా. ఆయన టీఎస్ బీసీ కమిషన్ సభ్యుడు. ఈ మధ్య పుస్తక ప్రదర్శన సందర్భంగా ‘సమూహం’ అనే బహుజన యువ కవుల సంకలనం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రవర్తన వెగటు పుట్టించిదమ్మా. సదరు సంపాదకుడిని ఒక బీ.సి. మహిళా కవయిత్రిని ఆహ్వానించినందుకు పిచ్చితిట్లు తిట్టాడు. ఆవేదిక మీద మొత్తం ముప్పయి మందిలో ఇద్దరే మహిళలు. వారికి మాట్లాడే అవకాశమివ్వరు. కవులు రాజకీయాలు చేయవద్దని ఆయనే రాజకీయం చేస్తారు. వారం పది రోజులు జరిగిన పుస్తక ప్రదర్శనలో రోజుకు మూడు, నాలుగు సభల్లో ప్రతి సభలో ఆయనే ముఖ్య అతిధి. ఆయనే ఉపన్యాసమివ్వాలి. గతంలో పుస్తక ప్రదర్శన సందర్భంగా కవి సమ్మేళనాలు జరిగేవి. వాటిని కూడా రద్దు చేశాడీ మహానుభావుడు. మరో నిరంకుశ రెడ్డన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగ విరమణ తరువాత వీరే నాయకులు. రాష్ట్రం రాక ముందు వచ్చిన తర్వాత వీరే ముఖ్య అతిథులు. వీరికసలే మహిళ భాగస్వామ్యం నచ్చదు.అవార్డు, పురస్కారాలు, సన్మానాల సంగతి అందరికీ తెలిసిందే. భజన సంఘాలకే ఇవి అందుతాయి. బతుకమ్మ, ఉగాది, దీపావళి కవి సమ్మేళనాల్లో బహుజన మహిళ లుండరు. వేదికలన్నీ ఒక సామాజిక వర్గం వారే ఉంటారు.రక్తం మసిలి పోతుందమ్మా.

             మాదెంత వింత సమాజమో చూడమ్మా! బీకాంలో ఫిజిక్స్, గణితం చదివిన మేధావులు మా ప్రజా ప్రతినిధులు. (విజయవాడ ఎమ్యెల్యే). టీ.వీ. ఛాన్లలో చర్చలకు కూర్చొనే వారికి చిత్తశుద్దికి కరువు. స్వచ్ఛ భారత్, అవినీతి, విదేశీ పెట్టుబడులు, బాలికా విద్య, ఆరోగ్య భద్రత, మొదలయిన అంశాలతో పాటు మహిళపై అత్యాచారాలు కారణాలు అంటూ అంశాలు నంజుకు తింటారు. మహిళలు అర్ధరాత్రి ఎందుకు బయటకు రావాలి, పొట్టి దుస్తులెందుకు అంటూ టాపిక్స్ తో జీడిపాకం చర్చతో సాగదీస్తారమ్మా. ‘అమ్మడూ, కుమ్ముడూ అంటూ గంతులేస్తాడు బాధ్యత గల మాజీ ఎమ్.పీ. చివరగా ఒక్క విషయమమ్మా Political power is the master key అన్న అంబేద్కర్ సూత్రాన్ని సాధించేందుకు వ్యూహాత్మకంగా, సంఘటితంగా, తెలివిడిగా మహిళలు పోరాడాల్సి ఉన్నదమ్మా. నువ్వు మళ్ళీ రావాలమ్మా. టామ్ మార్కర్ట్ ‘అనే ఆస్ట్రేలియా రచయిత (you cannot win a fight with your boss) నీ యజమానితో పోరాటంలో గెలుపు నీది కాదు ” అంటాడు కదమ్మా. దానిని నమ్మి పోరాటాన్ని మానెయ్యాలా యాజమానిని మార్చాలా అన్నది మా మహిళలు నిర్ణయించుకోవాలిసిన సమయంలో నీవు మాకు స్ఫూర్తి తల్లీ.

భవదీయురాలు,
నీ అక్షరాల భిక్షతో బతుకుతున్న,
జ్వలిత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)