తూలిన తక్కెడ- క్రిష్ణ వేణి

‘It is better that ten guilty persons escape than that one innocent suffer’: English jurist William Blackstone.
picture-2It is better to let 100 criminals go free than to imprison one innocent man: Benjamin Franklin.

పైనున్న సూత్రాలన్నిటినీ మన న్యాయవ్యవస్థ నమ్ముతుంది.

ఇప్పుడు మన జైళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ హాస్యాస్పదవైనట్టుగా అనిపించి, వీటిలో ఎంత శాతం నిజమా! అన్న అనుమానం కలుగుతుంది.

ఈ సంవత్సరమే వెలుగులోకి వచ్చి, మీడియాలో సంచలనం సృష్టించిన ఇద్దరి దృష్టాంతాలని చూద్దాం.

ఒకరు నిస్సార్ అహ్మద్.

ఇతను ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ, కారాగారవాసపు నేలమాగిళ్ళ చీకటి అతని యౌవనాన్ని కబళించి వేసింది. ఇప్పటి ఇతని జీవితంలో, గతపు ఛాయలు కూడా లేవు. జైల్లో తనున్న ఆ ఇరవై మూడేళ్ళూ, తన ఉనికినే రూపుమాపాయంటాడితను.

జనవరి 15 న, 1994 లో హైదరాబాదు పోలీసులు వచ్చి కర్నాటకా పోలీసులకి తెలియపరచకుండానే, నిస్సార్ని అతని గుల్బర్గా ఇంటినుంచి పట్టుకుని, అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. అప్పుడతను ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతుండాలి. 15 రోజుల్లో అతని పరీక్షలు. 20 ఏళ్ళు కూడా నిండలేదు. బాబ్రీ మసీదు విధ్వంసపు సమయాన్న డిసెంబరు 6 న, 1993 లో జరిగిన ఏపి ఎక్స్ ప్రెస్ బాంబు బ్లాస్టుల కేసులో నిస్సార్ నేరస్థుడనీ, ఇద్దరు ప్రయాణీకుల మరణానికీ, 11 మంది గాయపడ్డానికీ అతనే కారణం అనీ ఆరోపించారు. రైల్లో బాంబులు పెట్టానని కస్టడీలో ఉన్నప్పుడు అతను ఒప్పుకున్నాడని పోలీసులు పిడివాదం చేస్తూ, తమ మాటలకి చట్టపరమైన అంగీకారం పొందడానికి అతని మీద TADA కూడా వేశారు.

ఇప్పుడతనికి 43 సంవత్సరాలు.

ఈ మధ్యకాలం 8,150 రోజులు అతను జైల్లో గడిపాడు.

అతనికి విరుద్ధంగా ఉన్న సాక్ష్యం చెల్లదని ఇన్నేళ్ళ తరువాత సుప్రీమ్ కోర్టు ప్రకటించి, అతన్ని విడుదల చేసింది. ఆ సంతోషమైన వార్త ఇంకెవరైనా వింటే, సంతోషం పట్టలేకపోయి ఉండేవారు కానీ నిస్సారు మాత్రం తను సజీవంగా ఉన్న శవాన్ని మాత్రమే అనుకున్నాడు. ఏ అపరాధం చేయకుండా జైల్లో గడిపి వచ్చిన మనిషికి ఇంటికి చేరేటంతవరకూ, తనెవరో, ఎక్కడ ఉన్నాడో, బతికే ఉన్నాడో లేదో కూడా తెలియలేదు. నిస్సార్ అన్న బతికే ఉన్నాడు. తండ్రి భూమిమీద లేకుండా పోయాడు. తల్లి కంటపడ్డప్పుడు ఆమె తన తల్లనీ, తను బతికే ఉన్నాడనీ అతను గుర్తించాడు. ఆమెని పట్టుకుని ఏడవడం తప్ప అతనింకేమీ చేయలేకపోయాడు.

అతని మాటల్లో, ‘నా చెల్లెలి వయస్సప్పుడు 12. ఇప్పుడామె కూతురికి పన్నెండేళ్ళు. నా కసిను నాకన్నా రెండేళ్ళు చిన్నది. ఇప్పుడామె నాన్నమ్మ. ఒక పూర్తి తరాన్ని నేను కోల్పోయాను.’

రెండవ వ్యక్తి మొహమద్ అలీ ఖాన్.

ఇతను కటకటాల వెనక 14 సంవత్సరాలున్నాడు. చెప్పనలవిగాని అన్యాయంతో కూడిన వ్యధాభరితమైన కథ ఇతనిది. తన యౌవనాన్ని హరించిన ఆ సంవత్సరాల గురించీ, నందితా హస్కర్‌తో కలిపి ఇతను రాసిన కథలో- ఇతని ఓర్పూ, ప్రేమా, ఆశా కనబడతాయి. ఒక తీవ్రవాదిగా ముద్రించబడ్డాడు.

తనికి 20 సంవత్సరాలుండగా, ఒక శీతాకాలపు సాయంత్రాన్న, 1998 ఫెబ్రవరీలో పాత ఢిల్లీ గల్లీలో ఇంటి దగ్గిరే మందులు కొనడానికి వెళ్ళాడు. సాదా బట్టల్లో ఉన్న పోలీసులు ఖాన్ని పట్టుకుని ఒక టార్చర్ గదికి తీసుకువెళ్ళి, నగ్నంగా వేళ్ళాడదీసి, ఎలెక్ట్రిక్ షాకులిచ్చారు. ముస్లిమ్ వ్యతిరేకపు తిట్లూ, బెదిరింపులూ ఎదురుకున్న తరువాత, ఆఖరికి ఇతను లొంగిపోయి అనేకమైన ఖాళీ పత్రాలమీద సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఫలితం! 19 టెర్రర్ నేరాలు మోపబడ్డాయి. ఒక పీడకల ఇక్కడనుండీ ప్రారంభం అయింది.

తరచూ తీహార్, ఘాజియాబాద్ జైళ్ళల్లో ఉంచబడిన సమయంలో ఖాన్‌కి బయట లోకంతో ఉన్న సంబంధం అసంఖ్యాకమైన కోర్టు విచారణల ద్వారా మాత్రమే. ఒక టెర్రర్ కేసులో నిర్దోషి అని వదిలిపెడితే, మరొకటి మొదలయేది. జైల్లో రాత్రిపూట పోలీసుల బూట్ల చప్పుడూ, కనిపించే టవరు వెలుతురూ తప్ప ఆ గోడల మధ్యే తన జీవితం అంతం అవుతుందనుకున్నాడితను.

నిర్బంధం, ఒంటరితనం, క్రూరమైన/అమానవీయమైన జైలు పరిస్థితికన్నా ఎక్కువగా- బయట తన తల్లితండ్రులు పడుతున్న బాధని నిస్సహాయంగా చూడటం ఖాన్ని ఎక్కువ బాధపెట్టింది.

ఇతన్ని విడిచిపెట్టేటప్పటి కాలానికి, 9/11 సంఘటనా, పార్లమెంటుమీద దాడీ వల్ల జైళ్ళల్లో సంఖ్య ఎక్కువవుతున్న ముస్లిమ్ ఖైదీలని జైలర్లు బాహాటంగా తిట్టడం మొదలుపెట్టారు.

ఒక చలికాలపు సాయంత్రం ఇతన్ని విడుదల చేశారు.

ఇతని పుస్తకం ‘Framed As A Terrorist’ లో ఉన్న కొన్ని హృదయవిదారకమైన భాగాలు- ఈ 14 ఏళ్లల్లో ప్రపంచం ఎంత మారిపోయిందో, అని ఇతను వర్ణిస్తున్నవి. ఇంటర్నెట్ వచ్చిందనీ, మొబైల్ ఫోన్లు ఉన్నాయనీ ఖాన్ నేర్చుకున్నది జైలునుండి బయటపడ్డాకే. గతంలో ఇతనికి దూర్ దర్శన్ తప్ప ఇన్ని ఛానెళ్ళు ఉన్నాయని కూడా తెలియదు.
అప్పటికే ఇతని తల్లి జబ్బుతో మంచంమీద ఉంది. ‘ఆఖరి సంవత్సరాల్లో తన తల్లిని దగ్గర ఉండి చూసుకునే అదృష్టం ఉన్నందుకు అల్లాకి తను ఎంతో కృతజ్ఞుడినని’ ఖాన్ అంటాడు. చిన్ననాటి ప్రియురాలు ఆలియా ఇతనికోసం ఇన్నేళ్ళూ వేచి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక కూతురు.

ఈ వ్యక్తులిద్దరినీ కేసుల్లో ఇరికించిన అధికారులమీద ఇప్పటివరకూ, ఏ కేసూ లేదు. ఆ అంశంమీద అసలొక్క మాటా లేదు.
వందమంది నేరస్థులు తప్పించుకున్నాకానీ, ఒక్క నిర్దోషి కూడా చిక్కుకోకూడదనీ లేకపోతే అది అన్యాయం అనీ, మనం ఇన్నాళ్ళూ వింటూ వస్తున్నవి ఒత్తుత్తి మాటలేనా!

బ్రిటిష్ కాలంలో కనీసం ఒక పదేళ్ళ లోపలైనా ఒక కేసు తీర్పు వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఇంకా కనాకష్టం అయి, ఖైదీలు జైళ్ళల్లో చాలాకాలం గడపడం పరిపాటయిపోయింది. చాలామంది నేరం ఇంకా నిరూపించబడలేదు. వారికి వ్యతిరేకంగా, ఏ సాక్ష్యమూ లేదు.

సంస్థలకి ‘అధికారం/శక్తి’ అన్న వ్యసనం పట్టుకున్నప్పుడు, వారు ఎవరినైనా పట్టుకుని జైల్లో పెట్టి, వారి జీవితాన్ని నాశనం చేయగలరు. రాజకీయ పరిపాలన ప్రకారం, ఆ ఖాదీకెంత ప్రాప్తమో అన్నది, అతను హిందువో, ముస్లిమో లేకపోతే అతని పట్ల, ఆ సమయంలో, ఏ రాజకీయ పార్టీ ఆసక్తి చూపిస్తోందో అన్నదానిమీద ఆధారపడుతుంది.

తీవ్రవాదులంటూ, ముస్లిమ్ కుర్రాళ్ళని పట్టుకుని జైళ్ళలో పెడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తరువాత ఎందరో అబ్బాయిలు అమాయకులని తేలింది.

ఎలాంటి వాతావరణం సృష్టించబడుతోందంటే, భయం వల్ల వారిని ఎవరూ సమీపించరు. సామాజికంగా వారు వెలి వేయబడతారు.

పోలీసులకి తోచినప్పుడల్లా, ఎవరినైనా పట్టుకుని జైల్లో వేసేయగలరా! అది కూడా- 23/14 సుదీర్ఘ సంవత్సరాల పాటు!

పోలీసు కస్టడీలో అపరాధంగీకారమే కేసుకి ప్రారంభమూ. అంతమూ కూడా అంటారు ఎడ్వొకేట్ నిత్యా రామక్రిష్ణన్.

ఎవరినైనా కటకటాల వెనక్కి నెట్టడం ఇంత సులభమా! మన సంస్థల విశ్వసనీయత ఇదే కనుక అయితే, గతంలో ఇలాగే, ఇంకెవరికో కూడా జరిగి ఉండదని మనం ఎలా నమ్మగలం? ఈ అధికారులు ఏ ముస్లిమ్ మీద, ఏ సిక్కు మీద, ఏ క్రైస్తవుని మీద తమ ఈ అధికారాన్ని చూపారో- మనం ఎలా తెలుసుకోగలం!

పోలీసులకి సామర్థ్యత లేకపోతే, రాజకీయ వేత్తలనుండి వచ్చే వత్తిడి తట్టుకునేటందుకు ఎవరినో ఒకరిని పట్టుకోవడం పరిపాటే. దీనికి టెర్రరిస్మ్ ఎక్కువున్న ప్రాంతాలవారు అనువుగా దొరుకుతారు. ఇక్కడ నిస్సార్ అయినా ఒక నీలేశ్ అయినా కూడా తేడా ఉండదంటూ మీడియా వాదించినప్పటికీ, నీలేశ్ అనే వ్యక్తి ఈ పరిస్థితిలో చిక్కుకోవడం అంత సామాన్యం కాదే!
మిగతా దేశాలలా కాకుండా, ఇక్కడ మన పోలీసులు ప్రజల రక్షణకోసం ఉన్నట్టు లేదు- రాజకీయ నేతలకి తప్ప.

అమాయకులని జైల్లో పెట్టి, వారి జీవితాల్లో అతి ముఖ్య భాగం అయిన యౌవనాన్ని హరించిన న్యాయశాస్త్రం, వారు కోల్పోయిన వారి జీవితపు అతి ముఖ్యమైన సంవత్సరాలని తిరిగి అందివ్వగలదా! వారిని సమాజంలో యధాస్థానానికి తేగలదా? వారి పిల్లలు విద్యావంతులు అవగలరా! లేకపోతే, తమకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోడానికో, పేదరికం వల్లో, సమాజ బహిష్కారం వల్లో టెర్రరిస్టులు అవతారా? అనుమానమే.

ఏ విధమైన హింసనైనా ఆరికట్టాలి, నిజమే. కానీ, అమాయకులు వలలో చిక్కుకున్నప్పుడు, ప్రభుత్వం కిరాతకమైన చట్టాలనీ, అనుచితమైన క్రియలనీ అవలంబించినప్పుడు, మానవ గౌరవానికే దెబ్బ తగులుతుంది. మనం శాంతి ప్రేమికులమి కానీ మనమైనా, మన కుటుంబంలో ఎవరైనాకానీ, కటకటాల ఊచలు లెక్కపెట్టడం ఎంతమాత్రం సంతోషం కలిగించదు.

-క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీతPermalink

30 Responses to తూలిన తక్కెడ- క్రిష్ణ వేణి

  1. Pingback: బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో