జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”ముందుగాల్ల అన్ని పట్టుకోవాలె”

”యాడికి బోతడు..?

”నాల్గు ఎయ్యిన్రి.. బియ్యం రాలె! అని బొంకుతడా..?”
అంటూ తలా ఓ రకంగా వ్యాఖ్యానిస్తూండగనే కొందరు అతన్ని వెంబడించి లాక్కొచ్చారు. ”వాళ్ళ బియ్యం వాళ్ళ కివ్వండి” అని ఆజ్ఞాపించినట్లుగా చెప్పి వెళ్ళిపోయింది పోశవ్వ. వచ్చిన వాళ్ళందరికీ కోటా  బియ్యం పంపిణీ చేయక తప్పలేదు.డీలరు రమణయ్య షావుకారుకి.

”దొంగ ముం… కొడుకు మన కడుపు కొడ్తా మనుకున్నడు… సర్పంచ్‌ సూడకుంటే.. మనం కడుపు మాడ్సుకోవాల్సుంటుండే…”

”మనకు పస్తులు బెట్టె ఆడు పట్నంల మిద్దెమీద మిద్దె ఎయ్య బిట్టెండు .

”ఇంకొంచమైతే అన్ని రెడ్డి గిర్నిల ఉంటుండె”. ”ఇత్తేమన్న పది పదేను మందికి ఇచ్చి అంత దోస్తుండె”

”ఈ ఊరోచ్చినపుడు ఎట్టుండేటోడు! బుడ్డ గోచితోని అచ్చిండు గిప్పుడు సూడు మనం ఏండ్కపోతాంటే మనదంత ఆడు తిని తిని ఆని బోత్త అంగుతనే… లే” జనంలోంచి రకరకాల వ్యాఖ్యానాలు. ఏదో సాధించుకున్నామన్న తృప్తి- పోశవ్వ చూడకపోతే, కలుగ చేసుకోక పోతే తమ కడుపులు మాడేవి అన్న వాస్తవం గుర్తించిన వారిలో ఏదో తెలియని నూతనత్వం, చైతన్యం, ఉత్సాహం.

”సర్పంచు అమ్మ..” అంటూ ఏదో చెప్పబోతున్న పెద్దోల్ల గంగారాం మాటకు మధ్యలోనే అడ్డు తగిలి.

”గా జోగుదాన్ని, మాదిగ దాన్ని సర్పంచమ్మ అని పెద్దోల్లకు పిల్చినట్టు చెప్పబడ్తివేందిరా” కాపోల్ల శంకరయ్య వెటకారం.

”ఏంది..పటేల్‌ గట్ల మాటబడ్తివి?”

”మన సిరిపురం చరిత్రల ఎన్నడన్న ఇంత మంచిగ జరిగిందా..?

అది అప్పుడు జోగుదెగని, మాద్గికులందే గాని సర్పంచు అయింది. గద… ఆ కుర్చీ నెక్కినంక మస్తు తెలివికొచ్చె… అప్పట్లెక్క ఇప్పుడు బీ అంటె నడుత్తదా..? సర్పంచు సర్పంచె… సర్పంచు సాబ్‌ అంటలేమా అట్లనే… సర్పంచ్‌ అమ్మ అన్న అండ్ల ఏమన్న తప్పున్నదా..” పెద్దోల్ల గంగారం వివరణతో కూడిన ప్రశ్న.

”పెద్దగౌడ్‌, ఆయినకు ముందట పెతాపరెడ్డి దొర సర్పంచుగిరి చేసిన్రు గద… అల్లెన్నడన్న మనతో కల్సి మంచి చెబ్బరం మాడిన్రా… ఆల్ల రాజకీయం, ఆల్ల పదవి… ఆల్ల గొప్పదనం శానితనం.. అంత ఆల్లకే ఉండె.”

”మనమంత ఎట్లుంటివి?”

”ఆల్లు సెప్పినట్టు ఇనాలె… ఆల్ల లెక్కనె ఆలోచన సేయాలె… మనం నెత్తితోని మాడద్దు. ఆల్ల కాల్లల్ల ముల్లు ఇరిగితే మన కాలిల ఇరిగినట్లు బాధ పడాలె. పరేశాన్‌ గావాలె. ఆల్లు మంచిగ తింటే మంచి గుంటె మనం తిన్నతినకున్న మనం సంతోషంల కన్పియ్యాలె… మనం మన నెత్తితోని ఏదన్న మాడుతుింమా…! అట్లగాదు ఇట్ల అంటుింమా….? ప్రశ్నించాడు శాలోల్ల భీమయ్య.

”కాలం ఎప్పికి ఒక తీర్గనే ఉంటదా..?

”జమాన మారింది. ఆ జమానల అట్ల నడ్సింది. నడ్పిచ్చుకున్నరు. మనమెన్నడన్న అనుకున్నమా… కలగన్నమా… ఆడికూతురు సర్పంచయితదని…?” గంగారం

”అవ్‌.. ఓట్లప్పుడు ఆడోల్లు ఓట్లల్ల నిల్చుందని విడ్డూరమాయె. విచిత్రమాయె” సాలోల్ల భీమయ్య.

”పెద్దగౌడ్‌ నిలపెట్టిండు అంత ఆయిన చేతిమీన నడుత్తదనుకుంటివి … అట్ల కాకుంట… ఇదే నడువబట్టె… ఎంతైనా ఆడిది… వంగి ఉండాలె… గింత గనం ఎగిరిపడ్తే మంచి గుండదు” వారి సంభాషణ మధ్యలో అందుకున్న కాపోల్ల శంకరయ్య. ఏమన్న అనుకోనే ఆడిపోరైన మంచిగ సేయవట్టె. ఊరు ఒక తీరుకచ్చె. ఆమె సదుకుంట పిల్లలందరకు బడికి పంపాలన్నని ఇండ్లకు బీ తిర్గబట్టె…. పెద్ద గుణం కలది. పెద్ద కులంల పుట్టెది ఉండె…” అభిమానంగా పెద్దోల్ల గంగారం.

జనంలో రోజు రోజుకీ పోశవ్వంటే అభిమానం పెరుగుతోంది. ఆమెను గౌరవంగా సంబోధిస్తున్నారు. నలుగురు ఆమె దగ్గరకు వస్తున్నారు. మంచీ చెడు మాట్లాడుతున్నారు. ఊరి గురించి కాకుండా కొందరు స్వంత విషయాలు, కుటుంబంలో వచ్చే తగవులు తీర్చడానికి కూడ పోశవ్వ దగ్గరకు వస్తున్నారు.

వారికి ఆమె మాటమీద, ఆమె పని మీద మంచి గురి ఏర్పడింది.

ఈ పరిస్థితి అంతా రాజాగౌడ్‌కి వింమీద కారం రాసుకున్నట్లూ, కంట్లో  నలుసు ఉన్నట్లుగాను బాధగా ఉంది. కానీ ఏం చేయలేక పోతున్నాడు. రాజాగౌడ్‌ ఒక్కడే కాదు… వార్డు మెంబర్‌ శివప్ప ఇంకొందరు అగ్రవర్ణాల, ఉన్నత వర్గాల వారి పరిస్థితి ఇంతే. వెనుకబడిన కులాల్లోంచి ఎదిగొస్తున్న కొందరు కూడా తమకంటే పై కెదుగుతున్న ఆ జోగుదాన్ని, మాదిగదాన్ని అణిచివేయాలి. దెబ్బ తీయాలి. ఎలా? ఊర్లో పరిస్థితులు గతంలా లేవు. ఏదో చేసేద్దామంటే…. ఏం చేయాలో ఆలోచించ లేకపోతున్నారు. ఆలోచించినా ధైర్యం చేయలేకపోతున్నారు.

-శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో