జ్వలిత కౌసల్య లోని సామాజికాంశాలు(సాహిత్య వ్యాసం)- డా.ఏం.పద్మగౌరి

               

ISSN 2278-478

  భారత దేశంలో కుటుంబ జీవితాలలో రామాయణ , మహా భారత కావ్యాలు ఒక భాగం . చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రామాయణం , మాహాభారతం తెలియని వారుండరు . రామాయణం కథ ఒక కుటుంబ జీవనానికి ప్రతీక . రాముడు ఆదర్శ పురుషుడు , పిత్రు వాక్య పరిపాలకుడు , ఏకపత్నీ వ్రతుడు . అంతే కాదు రామాయణంలో ప్రతీ పాత్ర సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది .

దశరధుని మొదటి భార్య కౌసల్య . అయోధ్య నగరపు పట్టపురాణి , శ్రీరామునికి కన్న తల్లి సవతి కైకేయి వలన దశరధుని ప్రేమకు దూరమైన ఆమె జ్వలనం సపత్ని పైనే కాదు మాతృ వాత్సల్యానికి కలిగిన విచ్చిత్తి పైన కూడా . కౌసల్య జ్వలనం ను అనుమాండ్ల భామయ్య గారు రచించారు . కౌసల్య అంతరంగ మధనాన్ని సున్నితంగా స్త్రీ సహజ ప్రకృతిని చిత్రీకరించి సమస్యా పరిష్కారాన్ని ప్రతిపాదించారు . భూమయ్య గారి కౌసల్య సంప్రదాయాన్ని కాదనకుండానే జన్మ సాఫల్యం సాధించుకున్న ఇల్లాలు . కోసల్య జ్వలనం అగ్ని పునీతమైన సంస్కారాన్ని ఏక పత్నీ త్వం అనే సామాజిక అంశాన్ని ఆవిష్కరించారు .

ఇతి వృత్తం ఇదీ అనడానికి ఆస్కారం అంతగా లేకపోయినా ఒక చిన్న సంఘటననే ప్రధానమైన అంశంగా తీసుకున్నారు భూమయ్యగారు . మహా కావ్యంలో ఒక వ్యక్తికి చెందిన విషయం కాబట్టి జ్వలిత కౌసల్య అనే శీర్షికను బట్టి దీనిని మొత్తం ఖండ కావ్యంగా గుర్తించవచ్చు . కౌలస్య చిత్రణ ప్రాచీన గాధే అయినా ఆధునిక భావాలను సాంఘిక భావాలను , సాంఘిక న్యాయాన్ని కవి కౌలస్య పాత్ర చిత్రణ ద్వారా నిరూపించారు .

జ్వలిత కౌలస్యలో దశరధుడు ఇచ్చిన వరాలను కైకేయి కోరిన ఫలితంగా శ్రీరాముడు అడవులకు బయలుదేరే ముందు తన తల్లి కౌసల్య అనుమతి కోసం వచ్చినపుడు కావ్యం ప్రారంభమవుతుంది . శ్రీరాముని మాటలు విని కౌసల్య అచేతను రాలయింది . బాధపడింది . తన మనో వేదనను వెళ్లగక్కింది అని మూలంలో ఉన్న అంశాన్ని తీసుకుని భూమయ్య గారు “జ్వలిత కౌసల్య “అనే కావ్యాన్ని రచించారు .తన మనసులో ఉన్న దుఃఖాన్ని తెలియజేసింది కౌసల్య . తన మనోవేదనకు ప్రధాన కారణాలు రెండు . భర్త వల్ల సుఖం లేకపోవటం , సపత్నుల పరుష వాక్యాలు అని తెలియేసింది .

శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడన్న మాట లోకంలో ఉన్నదే కానీ , వాల్మీకీ రామాయణంలో లేదు . తెలుగు రామాయాణాల్లో కన్పించదు . తన తల్లి దుఃఖ పడటానికి కారణం తండ్రి బహు భార్యత్వం . తాను అదే మార్గంలో పోతే తన సీత కూడా ఇట్లాగే దుఃఖించే పరిస్థితి వస్తుంది కదా ! అనే ఆలోచన వచ్చి , రాముడు ఈ సందర్భంలో తాను ఏకపత్నీ వ్రతుడుగా ఉంటానని తల్లి ముందు ప్రతిజ్ఞ చేసి ఉంటాడనే ఊహ వచ్చింది . ఈ ఊహ రాగానే కౌసల్య వేదన ఇట్లా జాలువారిందని తన ముందు మాటలో ఈ కావ్యం రాయాడానికి గల కారణాన్ని భూమయ్యగారు తెలియజేశారు . “

వాల్మీకీ రామాయణంలో కౌసల్య అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ 20 శ్లోకాలలో వాల్మీకీ వర్ణించాడు .
“సా ని కృత్తేన సాలస్యయష్టి : పరశునావనే
పపాత సహసా దేవీ దేవతేవ దివాశ్చ్యుతా “ (అయోధ్య కాండము – 32 )
కౌసల్య దేవి గొడ్డలితో చేధించిన సాల వృక్ష దండమువలె , స్వర్గము నుండి పడిన దేవతవలె వెంటనే నేలపై పడెను .

“తాము దుఃఖో చితాం దృష్ట్యా పతితం కదళీ మివ
రామ స్తూత్థా పయమాస మాత రంగత చేతనమ్ “(అయోధ్య కాండము – 33)
మూర్చ అరటి చెట్టువలె , నేలపై పడిన దుఃఖమునకు తగని ఆ ఆతల్లి చూచి రాముడు పైకి లేవదీసేను .

ఈ చిన్న సంఘటననే ఆధారంగా చేసుకుని భూమయ్యగారు కౌసల్య వేదనను 109 పద్యాలతో జ్వలిత కౌసల్యను రచించెను .
ఈ పద్య కావ్యంలో భర్త నిరాదరణ , బహు భార్యత్వం , సపత్నుల పోరు , అసంతృప్తుల నుంచి సంసార జీవనం , మాతృ వాత్సల్యం , పితృవాక్య పరిపాలన , ఏక పత్నీ వ్రతం వైపు ప్రస్థానం సాగింది అనే సందేశం జ్వలిత కౌసల్య లో సామాజిక అంశాలు . ఈ సామాజిక పరిణామానికి కౌసల్య తన ఆవేదనను ఏ విధంగా జ్వలింప చేసిందనేది అంశంగా తీసుకుని ఈ కావ్య ఖండికను రచించారు .

భర్త నిరాదారణ :

“పుట్టినింట ఆనాడు నేపొందిన సుఖ
మేము కాని , మీ తండ్రి ఇంట నేను
కాలు మోపిన పిదప సుఖము నెరుంగ
నిన్ను గన్నాను బ్రతుకు కన్నీరు తుడిచె “(పుట – 1 7 )

మీ తండ్రి ఇంటిలో అడుగు పెట్టిన నుంచి సుఖాల మాట ఎలాగున్నా , కనీసం గౌరవ మర్యాదలన్నా దక్కుతాయనుకుంటే నువ్వు అడవులకు వెళ్ళిపోతున్నావని కౌసల్య విలపించింది .

“నాణ్యమౌ ఏడువారాల నగలు కలవు
నను గొలువ దాసదాసీ జనమ్ము కలదు
ఎన్ని ఉండి వీని నను భావింపలేని
భాగ్యహీనను పతి ప్రేమ బయడలేక “ (పుట – 22 )

ఏడువారాల నగలున్నాయి . దాసదాసీజనం ఉంది . ఎన్ని ఉండి వీనినను భావింప లేని భాగ్య హీనను , పతి ఆదరణ లేకపోవటం వలెనే కదా ఈ వ్యధ అని ప్రశ్నించింది .

పేరుకి పట్టా మహిషినే గాని మీ నాన్నగారి నిర్వాకంలో నా బతుకు దాసీకన్నా కనా కష్టం అయిపొయింది . నీవు రాజువైతే నన్నా సుఖ పడదామని అనుకున్నాను . అది కూడా అడియాసే అయ్యింది రామా ! అని భోరున కౌసల్య విలపించింది .

సపత్నుల పోరు :
రాజుకు పెద్ద భార్యను , ప్రజల దృష్టిలో మహారాణిని , సవతుల మాతో అంటూ –

“సవతులిందరిలో నాకు సాటి వచ్చు
వారెవరు లేరు , నా కంటే వయసులోన
చిన్న వారయ్యు వారు నన్నెన్ని మాట
లాడి కష్ట పెట్టెదరో నేననగరాదు “(పుట – 11 )
అని అనడంలో భర్త ప్రేమ లేకపోవడం వలననే తాను సవతుల దగ్గర చులకన పోయానని , వారు మాటలతో నన్నెంతో కష్ట పెట్టారని బాధపడింది కౌసల్య . పట్టపురాణి పదవే తన సవతుల మాత్సర్యానికి కారణమైతే ఆ పదవి తను కోరుకున్నది కాదని రాజు మొదటి భార్య వలననే అది వచ్చింది ఇందులో తన తప్పేముందని కౌసల్య వాపోయింది .

మాతృ వాత్సల్యము :
అడవులకి వెళ్లతాన్న రామునితో –
“నాడు నిన్ను నేగనకున్న నష్ట మేమి
కలిగెడిది ? వంధ్యయను పేరోకటియే తప్ప
సంతులేదన్న ఏకైక చింతతప్ప
వంధ్యకు మరొక చింత రవ్వంత లేదు (పుట – 18 )

అని అనడంలో తాను గొడ్రాలినని పించుకోవడం వల్ల కలిగే బాధ అనుభవించడానికయినా సిద్ధమే కాని శ్రీరాముడు అరణ్యానికి వెళ్లటం సహించ లేనన్నది కౌసల్య . తల్లి ప్రేమ ఒక బిడ్డకి తల్లి అయిన స్త్రీ అంతర్యాన్ని పట్టిస్తుంది . దీనకంతటికి కారణం తండ్రి చేతకాని తనమేనని అంటుంది .

తండ్రి మాటకు ఎదురు తిరగమని పోత్సాహించ లేదు కాని , తండ్రి కంటే తల్లి ముఖ్యం కాబట్టి తన మాట కూడా వినమంది . సుకుమారుడైన తన కొడుకు అడవుల్లో ఎంత బాధకు గురవుతాడోనని భయపడి తను కూడా అడవికి వస్తానని రాముడితో అన్నది కౌసల్య . కుమారుడు దూరమైనా తల్లి బ్రతుకు ఒక బ్రతుకేనా ? అని తనని తాను నిందించు కుంటూ రాముడి పై ఉన్న వాత్సల్యాన్ని చూపించింది కౌసల్య .

పితృవాక్య పరిపాలన :

కైకేయి మొదలైన వారు తన తల్లిని మాటలతో బాధించారో కదా అని అనుకుంటూ తన తండ్రి తన స్వేచ్చను ఎలా కోల్పోయాడో అని బాధపడుతూ , లక్ష్మణుడు తనపై గల అసాధారణ మగు ఏదో ప్రేమ వలననే ఆవేశ పడ్డాడని గ్రహించాడు రాముడు .

“ వృద్ధులైనను తండ్రి పూజింపదగిన
వారే , వారు మహారాజు , వారి మాట
ఎల్లరకు శిరో ధార్యమే , ఇంత తెలిసి
తండ్రి మాటను నే జవదాట లేను “(పుట – 40 )

తల్లి బాధను , తండ్రి అశక్తతను ఏక కాలంలో గుర్తించాడు , ఓర్చుకున్నాడు . తండ్రి ప్రేమ తనకీ , లక్ష్మణునికి తెలుసుకుని , వృద్దత వల్లనే కాక , తండ్రిగా కంటే రాజుగానే దశరధుడు బాధ్యత నెరిగిన వారని గుర్తించి , వారు మహారాజు , వారి మాట ఎల్లరకు శిరోధ్యార్యమే అన్నాడు శ్రీరాముడు .

ఏకపత్నీ వ్రతం :
తండ్రి మాటే కాదు తల్లి బాధ ముఖ్యమేనని గ్రహించిన శ్రీరాముడు –
“గడచినట్టి కాలమ్మేదో గడిచిపోయె
తండ్రి తప్పొప్పు లివియని తలపలేను
ఏ పరిస్థితు లెట్లు రానిమ్ము నాకు
ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య “(పుట – 45 )

చివరికి పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు బహు భార్యత్వం వల్లే తన తల్లి కష్టాలు పడిందని భావించాడు . సీతయే తనకు ఈ జన్మకు భార్య అని ప్రతిజ్ఞ చేయగానే కౌసల్య శాంతిస్తుంది . అంతే కాదు ఎంతో వేదనను వ్యక్తం చేసిన కౌసల్య శ్రీరాముని ఏకపత్నీవ్రత ప్రతిజ్ఞ ను వినగానే సంతోషించింది . తన మనసులో అంతరార్ధాన్ని కుమారుడు గ్రహించాడు ఆనందించింది కౌసల్య .

బహు భార్యత్వం వలన తనలా మరే స్త్రీ దుఃఖించ కూడదని , తన కోడలైన సీతకే దుర్గతి కలుగ కూడదన్నది కౌసల్య అంతర్గత భావం .

శ్రీరాముడు వనవాసానికి తల్లి అనుమతిని కోరినపుడు శ్రీరాముని కంటే కౌసల్యే పరమ దుర్భరమైన బాధననుభవించింది . దీనికి కారణం ఎవరు ?భర్త దశరధుడా ? వరాలను కోరిన కైకేయా ? కోరగానే అడవులను వెళ్లడానికి సిద్ధపడిన రాముడా ? ఏదీకాదు . కౌసల్య కలిగిన బాధ పుత్ర వాత్సల్యానికి సంబంధించింది . అంతే కాదు బహుభార్యత్వం తన భర్త ప్రేమకు నిరాదరణకు గురై ఎంతో వేదనను అనుభవించింది . సవతులు తనకన్నా చిన్న వారైనా వారి హేళనకరమైన మాటలు , నిందలును భరించింది .

శ్రీరాముని ఏకపత్నీ వ్రత ప్రాశస్త్యం కౌసల్య జ్వలనంలోంచి వచ్చిందన్న కవి ఆలోచన ప్రశంసనీయం . బహు భార్యత్వం , స్వపత్నుల పోరు , భర్త నిరాదరణ , మాతృ వాత్సల్యం , పితృవాక్య పరిపాలన , ఏకపత్నీ వ్రతం మొదలైన అంశాల్ని సామాజిక అంశాలే . ఆనాటి కాలానికే కాదు ఈ నాటి కాలానికి పరిగణిస్తూ రచించిన కావ్యం జ్వలిత కౌసల్య .

స్త్రీ మానసిక వ్యధను , ఆనాటి కాలంలోనే కాదు , ఈనాటికి ఒకేలా ఉందనడానికి కౌసల్య వేదన ఒక నిదర్శనమని నిరూపించారు భూమయ్యగారు .

-డా.ఎం.పద్మ గౌరీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)