స్త్రీ యాత్రికులు (8వ భాగం)

     పర్వతాల్లో ప్రయాణాలు చేసిన చిత్రకారిణి నీనా మజుషెల్లీ – 4 

             డార్జిలింగ్ నుండి సిక్కిం వరకు మంచి రోడ్డు ఉంది కాబట్టి అందరూ పొట్టి గుర్రాల మీద బయలుదేరారు.సిక్కిం చేరిన తరవాత అక్కడి రాజాతో మాట్లాడి తమ యాత్రలో సహాయపడవలసినదిగా కోరతారు. తమకి దారిలో రెండు చోట్ల ఆహారపదార్థాలు సరఫరా చేసే విధముగా రాజుతో మాట్లాడగానే ఆయన కాజీ, సుభా అనే ఇద్దరు అధికార్లను నీనా బృందానికి సహాయము చేయవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు.

నీనా బృందానికి ఆనాటి రాజకీయ పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడము వలన కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్రిటిషు గూడచారులు సిక్కిం దాటి టిబెట్ లో ప్రవేశిస్తున్న రోజులవి.

సిక్కిం సరిహద్దు దటగానే  విశాలమైన రోడ్డు క్రమముగా తరిగిపోయి కొండల మధ్యగా ఉన్న కాలిబాటలలో కలసిపోతుంది. నీనా కోసము ఒక పల్లకీ లాంటి కుర్చీ అమర్చి ఆమెను దాంట్లో ఎక్కించి మోసుకుపోతుంటారు. కూలీలు.. అలాంటి కుర్చీలని డాండీ అంటారు. ఎత్తుపల్లాలు రాతి గుట్టలు వచ్చినప్పుడు ఆ డాండీ వుయ్యాల మాదిరిగా ఊగుతూ ఉండేది. ఆమెని ఒక సున్నితమైన గాజుబొమ్మలాగా ఊహించుకుని ఎంతో జాగ్రత్తగా మోసేవారు. బ్రిటిషువారు  ప్రయాణీంచిన ప్రతి చోటా ఇలాంటి కుర్చీలనే ఉపయోగించేవారు ఆ రోజుల్లో..

ఆ యాత్రలో అందరికంటే ముందుగా పొదలు నరికి బాటలు ఏర్పాటు చేసేవారుంటారు. వారి వెనక గుడారాలు వేసేవారు తరువాత కిచెన్, వారి వెనక ఫ్రాన్సిస్ అతని మిలిటరీ మిత్రుడు తుపాకులతో పోతుండే వారు. వారి వెనక డాండీలో నీనా, ఆమె వెనక పది మంది సేవకులు కర్రలు కత్తులు పట్టుకుని నడుస్తుంటారు. ఇదీ వారి ప్రయాణపు వరుస. ప్రతిరోజూఒ సాయంత్రము నీనా బొమ్మలు వేస్తుండేది.

అప్పుడప్పుడు వారి బాట పెద్ద అగాథాల వెంబడి సాగిపోతుండేది. కాలుజారినా కళ్ళు తిరిగినా ప్రమాదమే.  వారి దారిలో ముళ్ళపొదలు అడ్డువస్తూనే ఉండేవి. చెట్లకొమ్మల్లో మేఘాల మాదిరిగా పేరుకునిపోయిన మంచు ఉండేది. ఎండ కాస్తూనే ఉన్నా ఒక రకమైన చలిగాలి ఎముకల్ని కొరికివేస్తుందా అనిపిస్తుండేది. రాత్రిళ్ళు గుడారాల్లో కీటకాలు రొద చేస్తుండేవి.దీపాల దగ్గరికి వచ్చే గండు చీమలు మిడతలు నిప్పు పురుగులకు అంతే లేదు.

ఇలాంటి వాతావరణాన్ని లొంగదీసుకుంటూ సింగాలియా పర్వత సానువుల్లోకి వెళతారు. అవి సముద్రమట్టానికి పన్నెండువేల ఎత్తులో ఉంటాయి. అక్కడ నుండి చల్లగాలి పలుచబడటము మొదలవుతుంది. శ్వాస సరిగ్గా ఆడదు. సెలయేళ్ళు గడ్డకడతాయి. మంచు గుట్టలుగా పేరుకుని పోతుంది. కొన్ని పర్వత శిఖరాల చివర్లు ఆకాశానిని చీలుస్తూ కనిపించేవి. పరిసరాల్లోని దృశ్యాలు ఎంతగొప్పగా ఉన్నా తాము ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్తితి ఏర్పడినది. అలాంటి పరిస్థితులలో కూడా నీనా స్కెచ్ లు బొమ్మలు  వెయ్యడము మానలేదు. గుడారము బయట కూర్చున్నపుడు మంచులో తడుస్తూ అలా ప్రకృతిలో పరవశించిపోతూ ఉండేది. కాంచెన్ జుంగా శిఖరాలు దగ్గరయ్యే కొద్దీ సంతోషము  ఎక్కువ అవుతుండేది.  రాత్రిపూట ఎండిన చెట్లతో నెగడు వేసుకునే వారు.  వారి కూలీలు రకరకాల పాటలతో నాట్యాలతో అందరినీ ఆనందించేవారు. కొన్ని సార్లు ఆకస్మాత్తుగా వడగళ్ళ వాన వచ్చేది.

ఇలాంటి వాతావరణములో సరిగ్గా నెలరోజులు ప్రయాణీంచాక కూలీల్లో ఓపిక తగ్గడము కనిపిస్తుంది. వెంటనే ఇద్దరు కూలీలు జబ్బు పడతారు.అది చాలదన్నట్లు వంట మనిషి ఆరోగ్యము పాడయిపోతుంది. ఆవు పాలు ఇవ్వడము కూడా మానేస్తుంది.

అప్పటి నుండి  సిక్కిం రావలసిన సుభా కోసము ఎదురు చూడటమే పనిగా మారినది అందరికీ అలాగా అతనికోసము నాలుగు రోజులు ఒకేచోట ఉండి పోవాల్సి వచ్చింది.చివరికి ఎలాగో అలా సుభా వంట పదార్థాలు, సేవకులతో రావడముతో నీనా బృందము బతికి బయట పడూతుంది. à°† ముసలి సుభా ఎంతో అందముగా ఉన్నాడని రెంభ్రాట్  చిత్రాలలోని మనిషికి జీవము పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడని వనిస్తుంది నీనా…

అందరూ శక్తి పుంజుకున్నాక మరుసటి రోజు నుండి ఆ పర్వతాల వెన్నెముక మీద నడుచుకుంటూ ఒక సరస్సు వడ్డుకి చేరుకుంటారు. అ ఉత్సాహములో హిమాలయాలకి దక్షిణముగా ఉన్న జున్నో పర్వత శిఖరాన్ని  కూడా అధిరోహిస్తారు. వారు ఆగిన ప్రతిచోటా నీనా బొమ్మలు గీస్తూనే ఉంది.

మంచుగాలి అందరినీ ఎంతో ఇబ్బంది పెట్టేది.  ముఖాన గరుకు రాయి రుద్దుకుంటున్నట్లుగానూ ఇరుకు రాళ్ళ మధ్యన ఒత్తుకుంటూ పోతున్నట్లుగానూ అనిపించేది. అలాంటి క్రూరమైన వాతావరణ పరిస్థితులని తట్టుకొనడానికి ప్రతి  ఆదివరము విశ్రాంతి తీసుకునేవారు. సుభా తెచ్చిన సరుకులన్నీ అయిపోతాయి కాబట్టి ఇప్పుదు ఖాజీ కోసము ఎదురు చూడటము మొదలుపెడతారు. అతడు ముందుగా చెప్పిన ప్రదేశము వద్ద ఎంత ఎదురు చూసినా రాడు. ఇలాగ   రెండవసారి కూడా జరగడముతో అందరూ మరోసారి ఇబ్బందికి గురౌతారు.

“యాంగ్ ఫూంగ్” అనే పర్వతానికి చేరుకోవాలని నీనా తపన సుభాతో వచ్చిన గైడు వరికి తప్పు మార్గాన్ని చూపిస్తున్నట్లుగా పనివాళ్ళు తెలుసుకుంటారు.ఇంతలో ఒకరు వచ్చి వారికి “యాంగ్ ఫూంగ్” వద్ద ఆహార పదార్థాలు అన్నీ సిద్ధముగా ఉన్నాయి అని చెబుతాడు. ఆశతో ఓపిక తెచ్చుకుని ముందుకు సాగిపోతారు అందరూ అవన్నీ నేపాల్ పరిసరాలు . కొంతదూరము వెళ్ళాక గైడు ”నేను దారి మర్చిపోయాను” అంటూ బిక్కముఖము పెడతారు.

ఇలాంటి పరిస్థితులలో పని వాళ్ళందరూ యజమానిపై తిరుగుబాటు చేయడానికి సిద్దమౌతారు. నీనా ‘ఇదంతా నా వలనే జరిగింది’ అంటూ బాధ పడుతుంది. ప్రయాణము వలన చాలామందికి వళ్లంతా గాయాలు అవుతాయి. నీనా డాండీ మోస్తూన్నవారికి భుజాలంతా పుళ్ళు పడతాయి. మరికొంత మందికి అనారోగ్యము వస్తుంది. ఇంతలో వారి గైడు పరారై పోతాడు. అప్పటికి వారికి మిగిలిన ఆహారము అంతా వారు మొదట్లో తెచ్చుకున్న రెండు గొర్రెలు మాత్రమే..

కాజీకి వార్తలు పంపుతారు. ఈలోగా తిండిలేక ఒకడు కళ్ళు తిరిగి పడిపోతాడు. నీనా తనవద్ద సిద్దంగా ఉన్న పోర్ట్ వైన్ ని తెప్పించి  అతడిని కాపాడుతుంది. డాండీ బేరర్స్ కి ఓపిక తగ్గిపోయే సరికి నీనా నడక మొదలుపెట్టక తప్పలేదు. తోడుగా ఫ్రాన్సిస్ ఎలాగూ ఉన్నాడు..  అందరూ తిరుగు ముఖము పట్టారు . ఆకలికి తట్టుకోలేక దారిలో కనిపించిన ప్రతి పల్లెలోనూ ఏది పడితే అది ముందుగా లాగేసుకుని తర్వాతే డబ్బులుఇచ్చేవారు. ఆ పరిస్థితులలో సరుకులతో కాజీ ఎదురౌతాడు. బ్రతుకుజీవుడా అనుకొంటూ తిరుగుప్రయాణము  మరింత వేగముగా చేస్తారు.

సిక్కిం దగ్గరపడగానే వచ్చిన మొదటి  గ్రామము పెమించీ. అక్కడి బుద్దిష్టు ప్రజలు ఈ తెల్ల దొరలను చూడటానికి ఎగబడతారు. ఆ రోజు జరుగుతున్న ఒక   పండగకి వారికి ఆహ్వానము దొరుకుతుంది. వారి పెదలు పలికే ప్రార్థనా గీతాలు అర్థము కాకపోయినా దృశ్యాలు నీనాకి ఎంతో సంతోషమును కలగజేస్తాయి. తన కష్టాలన్నీ మరచిపోతుంది. ఈ పెమించీ ఉత్సవమే అందరికీ ఫేర్ వెల్ మాదిరిగా అవుతుంది..

ఈ లోగా డార్జిలింగ్ నుండి గుర్రాలు వచ్చి సిక్కిం సరిహద్దు రేఖ వద్ద  సిద్ధముగా ఉంటాయి. సిక్కిం సరిహద్దులు రంజిత్ నది దాటుకుని బ్రిటిష్ ఇండియా పరిసరాల్లోకి క్షేమముగా చేరుకుంటారు అందరూ. నీనా ఆనందానికి హద్దుల్లేవు.

1872 వ సంవత్సరములో జరిగిన ఈ యాత్ర రెండు నెలలపాటు పట్టినది. నీనాకి ఇదొక మరపురాని కల . నిజమైనంత సంతోషము ఈ అనుభవాలు అన్నీ “ The Indian Alps and how we crossed them”  అనే పుస్తకములో రాసినది. ఫ్రాన్సిస్ దంపతులు 1876 లో లండన్ వెళతారు. నీనా మాత్రము మరోసారి ఫ్రాన్సిస్ తో ఐరోపాలోని కార్పాతియన్ పర్వతాలలో యాత్రలు చేస్తుంది. ఆ అనుభవాల్ని “Magyar land”  అనే పుస్తకములో రాస్తుంది.

ఎనభై రెండు సంవత్సరాలు జీవించిన నీనా మజుషెల్లీ ప్రకృతిలో ఒక పాపాయి లాగా తిరుగుతూ గడిపింది. మన దేశములోని డార్జిలింగ్ ఆమె కలలకి నిలయము. మన కాంచెస్ జుంగా పర్వతాలు ఆమెలో  సాహసయాత్రా కాంక్షని కలగజేసాయి . నీనా మజుషెల్లీ వాటిని అధిరోహించి తన కలల్ని నిజం  చేసుకొంది.

(ఇంకా వుంది)

– ప్రొ.ఆదినారాయణ

పురుషుల కోసం ప్రత్యేకం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో